ఆర్యవైశ్యులు రాజకీయంగా రాణించాలి
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఆర్యవైశ్యులు రాజకీయంగా రాణించాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. బుధవారం జగదేవ్‌పూర్ మండల ఆర్యవైశ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్థానిక ఎస్‌వీ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి సుజాతతో పాటు డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుజాత మాట్లాడుతూ సమాజ సేవలో ఆర్యవైశ్యులు ముందుంటారని, నూతన మండల కమిటీ సభ్యులు సైతం సామాజిక కార్యక్రమాల్లో ముందుండాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీనివాసరావు, వెంకటేశం, నాగజ్యోతి, రామకృష్ణ, లక్ష్మణ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


