పాడుబడ్డ బావులు.. రోడ్లపైనే చెత్త
కోట్ల రూపాయలు వెచ్చించి మున్సిపాలిటీలోని లచ్చపేట వార్డులో డంపుయార్డు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికి పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. దీంతో పట్టణంలోని దుంపలపల్లి రోడ్డులోని టీటీడీ కల్యాణమండపం ముందర, అలాగే ఆ ప్రక్కనే ఉన్న పాడుబడ్డ బావిప్రాంతాన్ని, చీకోడ్ శివారులో ఎల్లమ్మ టెంపుల్, ధర్మాజీపేట రోడ్డుతో పాటు ఇలా చాల ప్రాంతాలు చెత్తతో నిండిపోతున్నాయి. దీంతో ప్రజలు నిత్యం కుక్కలు, దోమలు, దుర్వాసనతో నరకయాతన పడుతున్నారు. నివాస ప్రాంతాల్లోనే చెత్త పోసి నిప్పు పెడుతుండటం గమనార్హం. ఇక డబుల్ బెడ్రూం కాలనీల్లో చూస్తే పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఇళ్ల పక్కనే చెత్త కుప్పలు పేరుకపోయినా పట్టించుకున్న నాథుడే లేరు. రూ.73 లక్షలతో కొత్తగా నిర్మించిన ఎఫ్‌ఎస్‌టీపీ కేంద్రం కూడా ఇంకా మనుగడలోకి రాలేదు.