
దెబ్బతిన్న పంటల పరిశీలన
గజ్వేల్: మండల పరిధి ధర్మారెడ్డిపల్లి, సంగుపల్లి, కోమటిబండ, జాలిగామ, గజ్వేల్ పట్టణ శివార్లలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను గజ్వేల్ ఏడీఏ బాబునాయక్, వ్యవసాయాధికారి నాగరాజులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ప్రాథమిక అంచనాల ప్రకారం మొక్కజొన్న 54, వరి 126 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు.
వర్గల్ మండలంలో..
వర్గల్(గజ్వేల్): అకాల వర్షాలు, గాలివాన, వడగళ్ల కారణంగా వర్గల్ మండలంలో దెబ్బతిన్న పంటలను, ఉద్యాన తోటలను శుక్రవారం వ్యవసాయ, ఉద్యాన అధికారులు పరిశీలించారు. మండల వ్యవసాయాధికారి శేషశయన, ఉద్యాన అధికారి రమేష్, ఏఈఓలతో కలిసి నెంటూరు, జబ్బాపూర్, మైలారం, చౌదరిపల్లిలో మొక్కజొన్న పైర్లు, కూరగాయలు, పండ్ల తోటలు పరిశీలించారు. మైలారంలో గాలివాన తాకిడికి శేఖర్‌కు చెందిన మొక్కజొన్న చేలు నేలకొరిగింది. చౌదరిపల్లి సమీప మామిడి తోటలో కాయలు రాలిపోయాయి. పంట నష్టం 33 శాతం లోపే ఉందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.