కేసీఆర్ తీరును ఎండగడతాం●
● డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి
● గజ్వేల్‌కు చేరుకున్న పాదయాత్ర
గజ్వేల్: ఓట్లేసి గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా వ్యవహరిస్తున్న కేసీఆర్ తీరును ఎండగట్టేందుకే పోరుబాట పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి రాజ్‌భవన్ వరకు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం సాయంత్రం గజ్వేల్ మండలం కొడకండ్లకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలోని కేఎన్‌ఆర్ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండాలని, లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో గజ్వేల్ ప్రాంతంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలను సైతం వెలికితీస్తామన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల గజ్వేల్‌లో ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. మరీ ముఖ్యంగా మల్లన్నసాగర్ నిర్వాసితుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయన్నారు. పాదయాత్రగా గవర్నర్ వద్దకు వెళ్లి కేసీఆర్‌ను భర్తరఫ్ చేయాలని ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో గృహనిర్మాణ సంస్థ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, నాయకులు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
కొండపాకమీదుగా సాగిన పాదయాత్ర
కొండపాక(గజ్వేల్): నర్సారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రెండో రోజు కొండపాక, కుకునూరుపల్లి మండలాల మీదుగా సాగింది. పాదయాత్రకు కాంగ్రెస్ నాయకులు, రైతులు, ప్రలు ఘన స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ తీరును ఎండగడతాం●