కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు
తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తు హార్డ్ కాపీలను (దరఖాస్తు ఫారం, రేషన్ కార్డు, ఆధార్ కార్డుల జీరాక్స్‌లను, అప్లికేషన్ ఐడీ నంబర్) స్వీకరిస్తున్నారు. ఇలా కార్యాలయానికి తీసుకవచ్చిన వారివే అప్రూవల్ చేస్తున్నారు. హార్డ్ కాపీలను అందజేయని వారివి పెండింగ్‌లో పెడుతున్నారు. ప్రభుత్వం ఆన్‌లైన్ వ్యవస్థను తీసుకువచ్చినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు దారులకు కష్టాలు తప్పడం లేదు. పలువురు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సర్టిఫికెట్ల కోసం డబ్బులు సైతం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.