రిజర్వాయర్ పంప్‌హౌస్ వద్ద ధర్నా
మద్దూరు(హుస్నాబాద్): లద్నూరు రిజర్వాయర్‌లోకి సాగునీరు విడుదల చేయాలని రైతులు బొమ్మకూరు రిజర్వాయర్ పంప్‌హౌస్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ మేరకు గ్రామ మాజీ ఎంపీటీసీ గుజ్జుక సమ్మయ్య మాజీ సర్పంచ్ జీడికంటి సుదర్శన్‌లు రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న రిజర్వాయర్‌లోకి సాగునీరు విడుదల చేయకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బావులు, బోర్లు వట్టిపోవడంతో పంటలకు నీరు అందడంలేదన్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ఇప్పటికై నా రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment