
సమస్యల మోత..
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీఅభివృద్ధి ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’లా మారింది. కేసీఆర్ ప్రాతినిథ్య నియోజకవర్గంలోని ఈ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్‌గా కీర్తించారు. అంతేకాదు.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు నమూనాగా మార్చాలని గత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు భారీ ప్రాజెక్టులు సైతం వచ్చాయి. కానీ ప్రధాన పనులన్నీ పెండింగ్‌లో ఉండటం ఆదర్శ పట్టణం స్ఫూర్తికి గండిపడుతోంది. ఫలితంగాసమస్యలు తీరక మున్సిపాలిటీ ప్రజలు అష్టకష్టాలుపడుతున్నారు. – గజ్వేల్
నాచగిరి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈఓ విశ్వనాథశర్మ పలువురు.. ప్రముఖులకు బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిలను వేర్వేరుగా కలిసి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు.
యువత ఉపాధికి కృషి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాకలో మహిళా జాబ్‌మేళా
దుబ్బాక: యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో మహిళా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎన్నో కంపెనీలు హైదరాబాద్‌కు తీసుకురావడం జరిగిందన్నారు. ఫాక్స్‌కాన్ మల్టినేషనల్ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కంపెనీలో సెల్‌ఫోన్ విడిభాగాలు తయారు అవతాయన్నారు. కంపెనీకి సెలక్ట్ అయినవారికి మంచి భవిష్యత్త్ ఉంటుందన్నారు.
అభివృద్ధిపై దృష్టి సారించండి
దుబ్బాక మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆదివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులతో సమీక్షించారు. సందర్భంగా కలెక్టర్‌కు ఫోన్ చేసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. అనంతరం పంచాయతీ రాజ్ అధికారులతో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించారు. నియోజకవర్గంలోని పలు బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందించారు.
చెక్కుల అందజేత
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని పెద్దతండా, జనగామ గ్రామాల్లో లబ్ధిదారులకు ఆదివారం ఆయా గ్రామాల నాయకులు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. పెద్దతండా గ్రామ పరిధిలోని పంజాగుట్టతండాకు చెందిన గుగులోతు లకపతికి మంజూరైన రూ.60వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాంబాబునాయక్, భాస్కర్‌నాయక్, జమిలాల్‌నాయక్, నరసింహనాయక్, తిరుపతినాయక్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న గజ్వేల్ మున్సిపాలిటీ స్థిరనివాసమేర్పరుచుకోవడానికి అనువైన పట్టణం. ఇప్పటికే గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్ కల్చర్ పెరుగుతోంది. కానీ పాలకుల నిర్లక్ష్యం పట్టణానికి శాపంగా మారుతోంది. పెండింగ్‌లో ఉన్న ప్రధాన పనులను పూర్తి చేయగలిగితే పట్టణ ప్రతిష్ట మరింతగా పెరగనుంది. పట్టణంలో రూ.156కోట్ల వ్యయంతో చేపట్టిన యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) పనులు లోపభూయిష్టంగా చేపట్టడం సమస్యగా పరిణమించింది. పనుల్లో నాణ్యతాలోపం బయటపడుతోంది. రూ.45కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో సదరు కాంట్రాక్టర్ పనులను వందశాతం పూర్తిచేయకుండానే చేతులేత్తేశారు. ఫలితంగా వర్షం కురిసిన సందర్భంలో, పైప్‌లైన్లు లీకేజీతో మురుగునీరు చాంబర్ల నుంచి బయటకు ఉబికి వస్తోంది. దీంతో దుర్గంధం వ్యాపిస్తోంది.
పెండింగ్‌లో బస్టాండ్ల నిర్మాణం
పట్టణంలో తూప్రాన్ రోడ్డువైపు రూ.10కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో బస్టాండ్ నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. కానీ రింగు రోడ్డు అనుసంధానం పూర్తికాకపోవడంతో ఈ బస్టాండ్‌కు బస్సులు రాక నిరుపయోగంగా మారింది. మరో రూ.7కోట్లకుపైగా వ్యయంతో పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన నిర్మిస్తున్న మూవింగ్ బస్టాండ్, ప్రజ్ఞాపూర్‌లో రాజీవ్‌రహదారిపై నిర్మిస్తున్న మరో బస్టాండ్ పెండింగ్‌లో ఉండటం ప్రయాణికులకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.
నత్తనడకన రోడ్డు విస్తరణ
మున్సిపాలిటీలోని కోటమైసమ్మ గుడి వైపు వెళ్లే రోడ్డును 1.3 కిలోమీటర్ల మేర 70ఫీట్లుగా విస్తరించాలని నిర్ణయించారు. ఈ పనులకు రూ.12కోట్లు వెచ్చిస్తున్నారు. కొన్నేళ్లుగా పనులు సాగు...తూనే ఉన్నాయి. ప్రత్యేకించి ఎంపీడీఓ కార్యాలయం నుంచి కోటమైసమ్మ గుడి వరకు పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేదు. బీటీ కొంత వేసి, కొంత పెండింగ్‌లో ఉంచారు. రోడ్డుకు ఇరు పక్కలా డ్రైనేజీ పనులు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి. రోడ్డు విస్తరణ సందర్భంలో ఎంతోమంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వీరిలో కొందరికీ మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. ఇంకా చాలా మందికి ఇళ్లు అందాల్సి ఉంది.
డబుల్ ఇళ్లపై తరుచూ ఆందోళనలు
మున్సిపాలిటీకి మొత్తం 1,250 ఇళ్ల మోడల్ కాలనీని మంజూరు చేశారు. ఈ కాలనీ 156 బ్లాకులుగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కో బ్లాకులో కింద నాలుగు, పైన నాలుగు(మొత్తం 8 ఇళ్లు) రెండు ఫ్లోర్లుగా నిర్మాణం జరిగింది. ఒక్కో ఇల్లు 570 చదరపు గజాల విస్తీర్ణంలో కాలనీలో అన్ని రకాల వసతులను కల్పించారు. కానీ పంపిణీ వ్యవహారం ఏళ్ల తరబడి నానుతూ వస్తోంది. వివిధ రకాల ఆందోళనల తర్వాత 2023 మార్చి 21న తుది డ్రా నిర్వహించి 1100మందిని ఎంపిక చేశారు. వివిధ కారణాల వల్ల గృహప్రవేశాలు నిలిచిపోగా ఈ అంశంపై తరుచూ రచ్చ కొనసాగుతోంది.
డంపింగ్ యార్డు భద్రత గాలికి
మున్సిపాలీటీలోని డంపింగ్ యార్డులో ఏటా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మున్సిపాలీటీ పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీలతో కలుపుకొని 15వేలకుపైగా ఇళ్లు ఉన్నాయి. జనాభా 80వేల పైచిలుకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్త 20మెట్రిక్ టన్నుల పైనే. చెత్తలోని వివిధ రకాల పదార్థాల వల్ల మంటలు వ్యాపించి డంపింగ్ యార్డులో తరుచూ వందలాది టన్నుల చెత్త దగ్ధమవుతోంది. ఈ పొగ పట్టణంలో వ్యాపిస్తూ ప్రజారోగ్యానికి శాపంగా మారుతోంది.
కాలనీల్లో రోడ్లు అధ్వానం
మున్సిపాలిటీ పరిధిలో 80కిలోమీటర్ల పొడవునా అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడానికి సుమారుగా రూ.120 కోట్ల నిధులు అవసరమని గత బీఆర్‌ఎస్ హయాంలో ప్రతిపాదించారు. కానీ రెండేళ్ల క్రితం ఇందులో కేవలం రూ. 22.87కోట్లు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. దీంతో అరకొరగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి వదిలేశారు. అంతర్గత రోడ్లు సక్రమంగా లేని లక్ష్మీప్రసన్ననగర్ కాలనీ, భారత్ నగర్, ప్రజ్ఞాపూర్‌లోని పలు వార్డులు, అదేవిధంగా విలీన గ్రామాలైన క్యాసారం, ముట్రాజ్‌పల్లి గ్రామాల్లోని ప్రజలు నరకం చవిచూస్తున్నారు.
ప్రత్యేక కార్యాచరణ
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నాం. ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రాధాన్యత క్రమంలో, దశల వారీగా పరిష్కరించడానికి కృషి చేస్తాం.
– గొల్కొండ నర్సయ్య,
మున్సిపల్ కమిషనర్
ప్రమాదాలకు చెక్ పెట్టాలి
గజ్వేల్ పట్టణంలో రింగు రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో భారీ వాహనాలు పట్టణంలోకి వస్తున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రమాదాలు జరుగుతున్నాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై ప్రయాణమంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది. రింగు రోడ్డు అనుసంధానం పూర్తి చేసి ప్రమాదాలకు చెక్ పెట్టాలి. – బారు అరవింద్, మున్సిపాలిటీ
మున్సిపాలిటీలో అంతర్భాగం కాదా?
మున్సిపాలిటీలో విలీన గ్రామాలైన క్యాసారం, ముట్రాజ్‌పల్లి, రాజిరెడ్డిపల్లి, సంగుపల్లి, సంగాపూర్‌లలో యూజీడీ నిర్మించాలని ఏళ్లతరబడి కోరుతున్నాం. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మేము మున్సిపాలిటీలో అంతర్భాగం కాదా? మాపై ఎందుకు ఈ నిర్లక్ష్యం.
– ప్రవీణ్, క్యాసారం గ్రామస్తుడు
తగ్గిన భగీరఽథ నీటి సరఫరా..
మున్సిపాలిటీకి నిత్యం 7.5 ఎంఎల్‌డీ(మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీరు అవసరం. ప్రస్తుతం 5ఎంఎల్‌డీ నీటి సరఫరా మాత్రమే జరుగుతోంది. దీనివల్ల భవిష్యత్తులో నీటి గండం తలెత్తే ప్రమాదం ఉంది. పట్టణంలో కొత్త కాలనీలకు ఇంకా మిషన్ భగీరథ కనెక్షన్లు వందల సంఖ్యలో ఇవ్వాల్సి ఉంది. దీనిపై అధికారుల కార్యాచరణ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.
న్యూస్‌రీల్
యూజీడీ నిర్మాణం లోపభూయిష్టం కాలనీల్లో తరుచూ మురుగు ప్రవాహం పారిశుద్ధ్య లోపంతో సతమతం రింగు రోడ్డు పూర్తి కాక.. ట్రాఫిక్ ఇక్కట్లు ఇళ్లు పంపిణీకి నోచుకోక తరుచూ ‘డబుల్’ రచ్చ కాలనీల్లో అంతర్గత రోడ్లు కచ్చ వానొస్తే లోతట్టు కాలనీల్లో వణుకే గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీవాసుల కష్టాలు వర్ణనాతీతం
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ స్వరూపం
సుందరీకరణ పనులకు బ్రేక్
మూడేళ్ల క్రితం మున్సిపల్ పాలకవర్గం పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి సంకల్పించింది. ఈ క్రమంలోనే పట్టణంలోని మహనీయుల విగ్రహాల జంక్షన్లను అందంగా తీర్చిదిద్ది, వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయాలని, ‘లవ్ జీపీపీ’ పేరిట స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం రూ.2కోట్లు నిధులు కూడా విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఈపనులు అరకొరగా సాగి బ్రేక్ పడ్డాయి.
పూర్తికానీ రింగు రోడ్డు అనుసంధానం
రూ.230కోట్లతో చేపట్టిన రింగు రోడ్డు అనుసంధానం పూర్తికాకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ధర్మారెడ్డిపల్లి–జాలిగామ గ్రామాల మధ్య 1.5కిలోమీటర్ల పొడువున పెండింగ్‌లో ఉన్న పనులను ప్రస్తుతం చేపడుతున్నారు. సిటిజన్స్ క్లబ్ భవనం వద్ద సుమారు 250మీటర్ల మేర పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మొత్తం 24కిలోమీటర్లకు ఇప్పటివరకు 22కిలోమీటర్ల మేర పూర్తయినా ఉపయోగం లేకుండాపోయింది. ఒకవేళ రింగు రోడ్డు నిర్మాణం పూర్తయి ఉంటే ట్రక్కులు ఇతర భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా రింగు రోడ్డు గుండా వెళ్లిపోయే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం భారీ వాహనాలన్నీ పట్టణంలోని ప్రధాన రహదారి గుండా వెళ్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ఫలితంగా ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి.
విలీన గ్రామాల యూజీడీ ప్రతిపాదనకు మంగళం
మున్సిపాలీటీలో విలీనమైన ముట్రాజ్‌పల్లి, క్యాసారంతోపాటు మధిర గ్రామాలైన సంగాపూర్, రాజిరెడ్డిపల్లి, సంగుపల్లిల్లో రెండో విడతలో యూజీడీ పనులు చేపట్టడానికి నిర్ణయించారు. సుమారు 40కిలోమీటర్లకుపైగా ఆయా గ్రామాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అవసరమని గుర్తించారు. ఇందుకోసం రూ.49కోట్లు అవసరమని ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. కానీ ఈ ప్రతిపాదనలకు దాదాపుగా మంగళం పాడారు.

సమస్యల మోత..

సమస్యల మోత..

సమస్యల మోత..

సమస్యల మోత..

సమస్యల మోత..

సమస్యల మోత..

సమస్యల మోత..

సమస్యల మోత..

సమస్యల మోత..

సమస్యల మోత..

సమస్యల మోత..

సమస్యల మోత..

సమస్యల మోత..

సమస్యల మోత..

సమస్యల మోత..
Comments
Please login to add a commentAdd a comment