
కూలీలకు వసతులు కల్పించాలి: డీపీఓ దేవకీదేవి
నంగునూరు(సిద్దిపేట): ఉపాధిహామీ పనులు నిర్వహించే స్థలంలో కూలీలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని డీపీఓ, మండల స్పెషలాఫీసర్ దేవకీదేవి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నంగునూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఈజీఎస్ సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి రోజు 150 మందకి మించకుండా కూలీలను ఏర్పాటు చేసుకొని పనులు చేయించాలన్నారు. పనులు చేయించే స్థలంలో వర్క్‌షెడ్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఫాస్టెయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎండీపీఓ లక్ష్మణప్ప, టీఏ, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.