పంటలు కాపాడాలంటూ ఆందోళన
దుబ్బాక: మల్లన్నసాగర్ కాలువ ద్వారా నీటిని అందించి ఎండుతున్న పంటలు కాపాడాలని సోమవారం దుబ్బాకలో రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ దుబ్బాకకు కన్నతల్లి లాంటి పెద్దచెరువులోకి మల్లన్నసాగర్ నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కాల్వ పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. పెద్దచెరువును నింపితే 1500 ఎకరాలకు పైగా పంటలు సాగులోకి వస్తాయన్నారు. వెంటనే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ రఘునందన్‌రావు స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో రైతులు రాజమల్లు, రాంచంద్రం, జోగయ్య, యాదగిరి, రాజయ్య, బాబు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment