సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు
జిల్లా వ్యవసాయ అఽధికారి రాధిక
జగదేవ్‌పూర్(గజ్వేల్): జాతీయ ఆహార భద్రత మిషన్‌లో భాగంగా రైతులకు సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు పంపిణీ చేస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. బుధవారం మండలంలో మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు, పీఎస్‌బీ, ట్రైకోడెర్మా విరిడిని పంపిణీ చేశామన్నారు. పంట మార్పిడి వల్ల చీడపీడల ఉధృతి తగ్గుతుందని తెలిపారు. ఎకరం వరిని పండించే నీటితో ఐదెకరాల మొక్కజొన్నను సాగు చేయవచ్చని వివరించారు. కార్యక్రమంలో ఏఓ వసంతరావు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
పంట మార్పిడి తప్పనిసరి
మర్కూక్(గజ్వేల్): పంట మార్పిడితోనే చీడపీడల ఉధృతి తగ్గుతుందని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. మండంలోని నర్సన్నపేటలో బుధవారం మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు యాసంగిలో పత్తి పంట తీసిన తర్వాత మొక్కజొన్న పంటలను సాగుచేయడం వలన నీటిని ఆదాచేయడంతోపాటు పంటమార్పిడి జరుగుతుందని తెలిపారు. తద్వారా చీడపీడల ఉధృతిని తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు, ఏఈఓ విష్ణు, రైతులు పాల్గొన్నారు.