నేడు డయల్ యువర్ డీఎం
గజ్వేల్‌రూరల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్(జీపీపీ) ఆర్టీసీ డిపో పరిఽధిలో మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సులలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని జీపీపీ ఆర్టీసీ డిపో మేనేజర్ పవన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు 99592 26270 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు, సూచనలు తెలపాలన్నారు.
నాచగిరి హుండీ ఆదాయం
రూ.15.42 లక్షలు
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో సోమవారం హుండీ కానుకలు లెక్కించారు. గడచిన 88 రోజులలో భక్తులు వేసిన కానుకల ద్వారా ఆలయానికి రూ.15,42,922 ఆదాయం సమకూరినట్లు కార్యనిర్వహణాధికారి విశ్వనాథశర్మ తెలిపారు. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో హుండీలను తెరిచారు. హైదరాబాద్ భ్రమరాంబిక సేవాసమితి సభ్యులు, శివకేశవ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఆలయసిబ్బంది హుండీ కానుకల లెక్కింపులో పాల్గొన్నారు.
వర్గీకరణ తర్వాతే
నియామకాలు చేపట్టాలి
ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షలు ప్రారంభం
గజ్వేల్: ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గజ్వేల్‌లో నిరసన దీక్షలను ప్రారంభించారు. ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉబ్బని ఆంజనేయులు మాదిగ అధ్వర్యంలో ఈ దీక్షలు చేపట్టారు. ఎంఈఎఫ్(మాదిగ ఉద్యోగుల సమాఖ్య) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరిమాదిగ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఉద్యోగాల నియామకాలను ఆపేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్‌పీ) రాష్ట్ర నాయకులు మైస రాములు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బుడిగే మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
కుష్ఠు రహిత
సమాజాన్ని నిర్మిద్దాం
డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్
సిద్దిపేటకమాన్: కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మించేందుకు జిల్లాలో సోమవారం నుంచి ఈ నెల 30వరకు క్షేత్రస్థాయిలో ఆశాకార్యకర్తల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ పల్వన్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ముందస్తుగా గుర్తించి చికిత్స అందిస్తామన్నారు. కుష్ఠు వ్యాధిపై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 882 టీంల ద్వారా సర్వే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. వైద్య సిబ్బంది గృహ సందర్శనకు వచ్చినపుడు ప్రజలు సహకరించాలన్నారు.
బీజేపీతోనే బీసీల అభివృద్ధి
జగదేవ్‌పూర్(గజ్వేల్): బీజేపీతోనే దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. సోమవారం గొల్ల, కురుమ సంఘం ఆధ్వర్యంలో కొండపోచమ్మ ఆలయ అవరణలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సన్మానం కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న ఆయనను సంఘం నేతలు సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ఐలయ్యయాదవ్, నాయకులు భాస్కర్, రాజు, నర్సింహులు, రమేశ్ పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
నేడు డయల్ యువర్ డీఎం
Comments
Please login to add a commentAdd a comment