
పోటెత్తిన భక్తజనం
కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదవ ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వచ్చేవారం బ్రహ్మోత్సవాలు ముగియనుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. గంగిరేణు చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
– కొమురవెల్లి(సిద్దిపేట)
Comments
Please login to add a commentAdd a comment