విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలి
డీఈఓ ఎల్లంకి శ్రీనివాస్‌రెడ్డి
కొండపాక(గజ్వేల్): చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమేనని, వారిలో సృజనాత్మకత పెంపొందించాలని డీఈఓ ఎల్లంకి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దుద్దెడలోని ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాలల్లో చదువుతో పాటు ఆటలు, పాటలను నేర్పించాలని అన్నారు. పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా సర్కారు బడులకు పంపేలా తల్లిదండ్రులు, యువకులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఆయిల్‌పామ్
పంట కోత షురూ
గజ్వేల్: మండల పరిధి అక్కారంలో మొదటి కోతకు వచ్చిన లక్ష్మణ్ ఆయిల్‌పామ్ తోటను ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఏడీఏ బాబునాయక్‌లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పంట కోతను ప్రారంభించారు. నాలుగేళ్లుగా సాగుచేస్తున్న ఆయిల్‌పామ్ తొలిసారి కోతకు రావడం పట్ల రైతు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఈవోలు జ్యోతి, మాధవి, ఆయిల్‌ఫామ్ ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
వీహెచ్ ప్రత్యేక పూజలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో, మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు ఽశుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు హనుమంతరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ సతీష్, మహేందర్‌రావు, దాస అంజయ్య, భిక్షపతి, అర్జున్ పాల్గొన్నారు.
యశోదారెడ్డి కథలు
భావితరాలకు స్ఫూర్తి
సిద్దిపేటఎడ్యుకేషన్: యశోదారెడ్డి కథలు భావితరాలకు స్ఫూర్తినిస్తాయని గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ రాజిరెడ్డి మహేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో శుక్రవారం తెలుగు శాఖ ఆధ్వర్యంలో యశోదారెడ్డి కథాసాహిత్యంపై విస్తృతోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజిరెడ్డి మహేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. 60 ఏళ్ల క్రితమే తెలంగాణ భాషను, సంస్కృతిని పరిరక్షించే దృక్పథంతో యశోదారెడ్డి రాసిన కథలు భావితరాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. తెలంగాణ భాషాసంస్కృతి పరిరక్షణకు కృషిచేసిన వారిలో యశోదారెడ్డి ముందువరుసలో ఉంటారన్నారు. ఎచ్చమ్మ కథలు, మాఊరి ముచ్చట్లు తదితర కథలను విద్యార్థులు చదివి వాటిపై అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరన్నారు. కళాశాల తెలుగుశాఖ అధ్యక్షులు డాక్టర్ మట్టా సంపత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ యశోదారెడ్డి సాహిత్యసృజన తెలంగాణ భాషకు, యాసకు జీవగర్ర, పుట్టు కుల్లలు అని కొనియాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు పిట్లదాసు, నారోజు వెంకటరమణ, నరేష్, శైలజ, సంపత్‌కుమార్, రామస్వామి, నర్సింలు, సాయిసురేశ్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలి


