బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు
ముస్తాబైన నాచగిరి క్షేత్రం
● నేటి నుంచి అంగరంగౖ వెభవంగా శ్రీలక్ష్మీనృసింహస్వామివారి వేడుకలు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
వర్గల్(గజ్వేల్): హరిద్రనది పరవళ్లు, ప్రకృతి రమణీయతలతో అలరారే సహజసిద్ధ కొండగుహల్లో స్వయంభుగా శ్రీలక్ష్మీనారసింహుడు కొలువుదీరిన భవ్యక్షేత్రం నాచారం గుట్ట నాచగిరి శ్రీలక్ష్మీనృ సింహ క్షేత్రం. మండలంలోని నాచగిరి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీ క్రోధి నామ సంవత్సర పాల్గుణ బహుళ పంచమి బుధవారం 11వ తేదీ నుంచి శ్రీవిశ్వావసు నామ చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం 30 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
హైదరాబాదుకు చేరువలో..
హైదరాబాదుకు 55 కిలోమీటర్లు, 44వ నెంబర్ జాతీయ రహదారి తూప్రాన్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో నాచగిరి ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ప్రజ్ఞాపూర్ మీదుగా కూడా నాచగిరికి చేరుకోవచ్చు. నాచగిరి క్షేత్రానికి ఆర్టీసీ సౌకర్యం ఉంది.
ఆకర్షణీయంగా..
ఉత్సవాలను పురస్కరించుకొని ప్రధాన ఆలయం, రాజగోపురం, తూర్పుద్వారం, ఉత్తరద్వారం, సభా మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. భక్తు లు బసచేసేందుకు సత్రాలు సిద్ధం చేశారు. క్షేత్ర పరిసరాలలో పిచ్చిమొక్కలు, ముళ్లపొదల తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.
నాచగిరి వద్ద హరిద్రనది వాగు
క్షేత్ర ప్రాశస్త్యం
నాచగిరిపై శేషశాయి మాదిరి గుహలో స్వామి స్వయంభుగా కొలువుదీరారు. క్షేత్రం ఎదుట పరవళ్లు తొక్కుతూ సాగిపోయే హరిద్రనది హల్దీవాగు రమణీయ దృశ్యకావ్యంలా గోచరిస్తుంది. కొండ గుహలో కొలువైన శ్రీవారిని దర్శించుకుంటే శత్రుబాధ, భూత, ప్రేత, పిశాచ బాధలు తొలగిపోతాయని, దీర్ఘరోగములు నయమవుతాయని, కుటుంబ శాంతి, వివాహం, సంతానం సమకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు.
బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు
బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment