అడ్రస్‌లేని మాస్టర్‌ప్లాన్, యూజీడీ
మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని అధికారులు చెప్పడమే తప్ప ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. పట్టణంలోని ప్రధాన రోడ్లు సైతం విస్తరణకు నోచుకోకపోవడంతో ఇరుకు రోడ్లతో నిత్యం నరకయాతనకు గురువుతున్నారు. హబ్షీపూర్ చౌరస్తా నుంచి దుబ్బాక బస్టాండ్ వరకు నాలుగులేన్ల రోడ్డు, బస్టాండ్ నుంచి కొత్త రోడ్డు మీదుగా గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి చౌరస్తా, లాల్ బహుద్దూర్ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తాల మీదుగా ముస్తాబాద్ రోడ్డు వెడల్పు చేస్తామని అధికారులు మార్కింగ్ పెట్టి వదిలేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా నేటికీ నోచుకోవడంలేదు.