రోడ్డెక్కిన రైతులు
దుబ్బాకటౌన్: తలాపునే గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ నీరు అందక పంటలు ఎండుతున్నాయని రైతులు మండిపడ్డారు. చేగుంట, దౌల్తాబాద్ మండలాల రైతులు దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ చౌరస్తాలో సోమవారం రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. దౌల్తాబాద్ మండలం మాచిన్ పల్లి, నర్సంపల్లి, చేగుంట మండలం పోతన్‌పల్లి, పోతంశెట్టిపల్లి, మక్కరాజుపేట, చందాయిపేట, కాసాన్‌పల్లి, తదితర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. సాగునీరు అందించి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అక్కడికివచ్చి వారితో మాట్లాడారు. సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల ధర్నాను విరమింప జేశారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు, ఉపాధ్యక్షుడు స్వామి, ఇరిగేషన్ అధికారులు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment