
మొదటి వెయ్యి రోజులే ముఖ్యం
చేర్యాల(సిద్దిపేట): గర్భిణిలకు మొదటి వెయ్యి రోజులు ఎంతో ముఖ్యమని సీడీపీఓ రమాదేవి అన్నారు. పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు పట్టణ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రం–6లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీ్త్ర తాను గర్భిణీ అని తెలిసినప్పటి నుంచి పుట్టిన బిడ్డ రెండేళ్ల వయస్సు వచ్చే సమయాన్ని మొదటి 1000 రోజులు అంటారన్నారు. ఈ సమయంలో గర్భిణిలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై వివరించారు. బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే ఒక పూట పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పోషణ అభియాన్ బ్లాక్ కో–ఆర్డినేటర్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
సీడీపీఓ రమాదేవి
పోషణ పక్వాడ అవగాహన సదస్సు