స్వశక్తితో ముందుకు సాగాలి
అదనపు కలెక్టర్ అగర్వాల్
సిద్దిపేటజోన్: మహిళలు స్వశక్తితో సాధికారత వైపు అడుగులు వేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. బుధవారం సెట్విన్ కేంద్రంలో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు శిక్షణ ద్వారా మరింత నైపుణ్యం సాధించాలని సూచించారు. మహిళలకు రుణాలు, శిక్షణ తరగతులు, స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సెట్విన్ ఇన్‌చార్జి అమినా భాను, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
నాణ్యమైన బియ్యం అందించండి
దుబ్బాకరూరల్: మండలంలోని రామక్కపేట బాలికల గురకుల పాఠశాలను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని వంట గదిని, కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించారు. బియ్యం నాణ్యతగా లేక పోవడంతో వెంటనే సివిల్ సప్లై అధికారులతో మాట్లాడారు. నాణ్యమైన బియ్యాన్ని అందించాలని ఆదేశించారు. వంట విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శారద, జిల్లా సివిల్ సప్‌లై అధికారి తనూజ, తహసీల్దార్ సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు.