Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Team India Head Coach Gautam Gambhir Receives Death Threats1
"గౌతమ్‌ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్‌ బెదిరింపులు

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ కశ్మీర్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. హతమారుస్తామంటూ (IKILLU) ఐసిస్‌ కశ్మీర్ రెండు ఈ-మెయిల్స్‌ చేసింది. ఈ విషయాన్ని గంభీర్‌ వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఢిల్లీలోని రాజీందర్‌నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించినందుకు గంభీర్‌కు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని గంభీర్‌ ఢిల్లీ పోలీసులను కోరాడు.Praying for the families of the deceased. Those responsible for this will pay. India will strike. #Pahalgam— Gautam Gambhir (@GautamGambhir) April 22, 2025గంభీర్‌ పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించుకుంటారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నాడు.కాగా, ఐపీఎల్‌ కారణంగా గంభీర్‌ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. గంభీర్‌ ఇటీవలే కుటుంబంతో కలిసి ఫ్రాన్స్‌లో హాలిడే ఎంజాయ్‌ చేసి వచ్చాడు. గంభీర్‌ గతేడాది జులైలో టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత్‌ టీ20 వరల్డ్‌కప్‌ గెలిచాక రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి బాధ్యతలు స్వీకరించాడు. టీమిండియా కోచ్‌గా గంభీర్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గంభీర్‌ నేతృత్వంలో భారత్‌.. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్, న్యూజిలాండ్‌ చేతిలో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ల్లో ఓటమిపాలైంది. మధ్యలో కొన్ని చిన్నాచితక విజయాలతో పాటు భారత్‌ గంభీర్‌ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలిచింది.

Operation Kagar in Mulugu Karregutta Latest Updates2
ములుగులో ముమ్మరంగా ఆపరేషన్‌ కగార్‌

ములుగు, సాక్షి: చత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్‌ కగార్‌(Operation Kagar) మూడో రోజుకి చేరింది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో కూంబింగ్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఎప్పుడు.. ఏం జరుగుతుందో అని చుట్టుపక్కల గ్రామాల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.సుమారు 2,500 మంది మావోయిస్టులు దాగి ఉన్న సమాచారంతో.. వేలమంది పోలీస్‌, కేంద్ర భద్రతా బలగాల సిబ్బంది కర్రిగుట్టలను చట్టుముట్టారు. మూడు హెలికాప్టర్ల ద్వారా ములుగు అటవీ ప్రాంతం(Mulugu Forest)లో కూంబింగ్‌ కొనసాగుతోంది. కేంద్ర భద్రత బలగాలకు మంచినీరు, ఆహారం, తుపాకులు, మందు గుండు సామాగ్రిని పోలీసులు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుండడంతో.. కర్రిగుట్టల అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరగవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.మరోవైపు.. ఛత్తీస్‌గడ్‌ వైపు నుంచి ఊసూర్ బ్లాక్‌లోని కర్రెగుట్టల(Karreguttalu) సమీపంలో మంగళవారం కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కానీ, కాల్పులను పోలీసులు ధృవీకరించలేదు. కేవలం సెర్చింగ్ ఆపరేషన్ మాత్రమే చేస్తున్నామని చెబుతున్నారు.కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా ఊసూర్‌ బ్లాక్‌ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇటీవ‌ల మావోయిస్టుల నుండి క‌ర్రెగుట్ట‌ల్లో బాంబులు అమ‌ర్చామని.. గుట్ట‌ల్లోకి ఎవ‌రు రావొద్దంటూ లేఖ విడుద‌ల చేశారు. ఈ లేఖపై ములుగు ఎస్పీ శబరీష్(SP Shabarish) స్పందించారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, బాంబుల పేరుతో వారిని బెదిరించడం సమంజసం కాదన్నారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు..మావోయిస్టుల లేఖతో అప్ర‌మ‌త్త‌మైన ఇరు రాష్ట్రాల పోలిస్ బ‌ల‌గాలు క‌ర్రెగుట్ట‌ల్లో కూంబింగ్ నిర్వ‌హిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మ‌డ‌వి హిడ్మా, హీడ్మా ద‌ళం క‌ర్రెగుట్ట‌ల్లో సంచ‌రిస్తున్న‌ట్లుగా కేంద్ర సాయుద బ‌ల‌గాల‌కు ఉప్ప‌ందించనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముమ్మరంగా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉంటే.. కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణను పాటించి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పీస్‌ డైలాగ్‌ కమిటీ(పీడీసీ) చైర్మన్‌ జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. కర్రెగుట్టలకు సంబంధించి పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ వెంటనే కాల్పులు ఆపాలని డిమాండ్ చేశారు. ఓ వైపు శాంతి చర్చల ప్రతిపాదన తెస్తూనే ఇటువంటి హత్యకాండకు ప్రభుత్వాలు తెగబడటం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్రభుత్వం నుంచి ముందుగా శాంతి చర్చల అడుగులు పడాలని, ఆ ప్రతిపాదన మావోయిస్టుల నుంచి కూడా వచ్చిందని గుర్తు చేశారు. శాంతి చర్చలకు అడుగులు పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో భద్రతా బలగాలను ఉసిగొల్పి మావోయిస్టులను పూర్తిస్థాయిలో అంతమొందించాలని చూడటంతో ఒక దుర్మార్గమైన చర్య అంటూ హరగోపాల్ వ్యాఖ్యానించారు.

YSRCP Vidadala Rajini Relative Gopi Arrest In Hyderabad Updates3
రెడ్‌బుక్‌ పాలన.. విడదల రజిని మరిది గోపీ అరెస్ట్‌

సాక్షి, గుంటూరు/హైదరాబాద్‌: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు సర్కార్‌.. వైఎస్సార్‌సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో నారా లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో అమలులో భాగంగా మరో వైఎస్సార్‌సీపీ నేతను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏపీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోపీపై పలు కేసులు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు హైదరాబాదులోని గచ్చిబౌలిలో గోపీని అరెస్ట్ చేశారు. లక్ష్మీ బాలాజీ క్రషర్స్ ఆరోపణల కేసులో విడదల గోపీని అరెస్ట్‌ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కాసేపట్లో గోపీని ఏపీకి తరలించనున్నారు.

somashetti Madhusudan Funeral At Kavali Over Pahalgam4
కావలి చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహం.. కుటుంబ సభ్యులు ఆవేదన

మధుసూదన్‌ అంత్యక్రియలు అప్‌డేట్స్‌.. మధుసూదన్ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిసోమిశెట్టి మధుసూదన్ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అంత్య క్రియలకు హాజరుకానున్న మంత్రి ఆనంకావలి పట్టణంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొననున్న మంత్రి ఆనం.👉జమ్ము కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాం కావలి చేరుకుంది. మధుసూదన్‌ను చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మధుసూదన్‌ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో​ బంధువులు, స్థానికులు చేరుకున్నారు.👉వివరాల ప్రకారం.. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాం గురువారం ఉదయం స్వగ్రామం చేరుకుంది. తెల్లవారుజామున మూడు గంటలకు చెన్నై ఎయిర్‌పోర్టు చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహాన్ని కావలికి తరలించారు. ఈ క్రమంలో ఇంటి వద్ద మధుసూదన్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళి అర్పించారు. మరోవైపు.. ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.👉ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇలాంటి దుర్ఘటన జరగడం, అందులో కావలి వాసి మృతి చెందడం బాధాకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. దేశం మొత్తం మృతుడి కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయం ఇది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా.. కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. మృతుని కుటుంబ సభ్యులను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తున్నారు’ అని తెలిపారు.👉కశ్మీర్‌లో పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన మారణహోమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మరణించారు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ ఘటన జరిగింది. సోమిశెట్టి మధుసూదన్‌ తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. మధుసూదన్‌ తండ్రి తిరుపాల్, తల్లి పద్మావతి పట్టణంలోని పెదపవని బస్టాండ్‌లో అరటిపళ్లు, టెంకాయల వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెల తరువాత మధుసూదన్‌రావు పుట్టారు. స్థోమత లేకున్నా కష్టపడి చదివించారు. అన్నితరగతుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న మధుసూదన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా చేరారు.👉వృత్తిరీత్యా బెంగళూరులో ఉంటున్న మధుసూదన్‌ అక్కడ సొంతింటిని కూడా కట్టుకున్నారు. వృత్తిలో ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఆశలు పండాయని వృద్ధ తల్లిదండ్రులు సంబరపడ్డారు. వేసవి విడిది కోసమని మధుసూదన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న తన భార్య కామాక్షి, కుమార్తె మేధు (ఇంటర్‌) కుమారుడు దత్తు (8వతరగతి)తో కలసి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల తూటాలకు మధుసూదన్‌రావు బలయ్యారు. తమ కుమారుడు మృతి చెందాడన్న విషయం తెలియని ఆ తండ్రి బుధవారం ఉదయం కూడా అరటిపళ్ల బండి వద్ద ఉండి వ్యాపారం చేసుకుంటున్నారు. మృతుడు మధుసూదన్‌కు భార్య మీనాక్షి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Godrej Unlocks a New Range of Smart Security in Hyderabad5
పసిడి పరుగుతో లాకర్లకు డిమాండ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పసిడి ధర పరుగులు తీస్తున్న నేపథ్యంలో హోమ్‌ లాకర్లకు కూడా గణనీయంగా డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గోద్రెజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూప్‌నకు చెందిన సెక్యూరిటీ సొల్యూషన్స్‌ విభాగం సరికొత్త సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించింది. గృహ, వ్యాపార అవసరాల కోసం ఉపయోగపడే 7 ఉత్పత్తులు ఉన్నాయి.వీటిలో డిజిటల్‌.. బయోమెట్రిక్‌ యాక్సెస్, ఇంటెలిజెంట్‌ ఐబజ్‌ అలారం సిస్టం వంటి ఫీచర్లు ఉన్నట్లు సెక్యూరిటీ సొల్యూషన్స్‌ బిజినెస్‌ హెడ్‌ పుష్కర్‌ గోఖలే వివరించారు. ఇళ్లలో వినియోగించే ఉత్పత్తుల ధర శ్రేణి రూ. 9,000 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఏపీ, తెలంగాణలో 500 పైచిలుకు అవుట్‌లెట్స్‌ ఉండగా, సుమారు రూ. 130 కోట్ల ఆదాయం ఉంటోందని జోనల్‌ హెడ్‌ శరత్‌ మోహన్‌ పేర్కొన్నారు.

Vijayashanti React On Chiranjeevi AND Balakrishna Movies6
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా 'అఖండ2'లో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి(Vijayashanti ) నటిస్తున్నారనే వార్తలు సోషల్‌మీడియాతో పాటు ప్రధాన మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అందులో ఆమె నటిస్తే సినిమాకు మరింత బజ్‌ క్రియేట్‌ అవుతుందని మేకర్స్‌ కూడా ప్లాన్‌ చేశారని టాక్‌ వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఆమె రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా కల్యాణ్‌రామ్‌తో అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతిలో దుమ్మురేపారు. దీంతో ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అవుతారేమోనని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ బాలకృష్ణ( Nandamuri Balakrishna), చిరంజీవిలతో సినిమాలు చేస్తారని అభిమానులు భావించారు. అయితే, విజయశాంతి ఆలోచనలను భట్టి చూస్తే జరిగే పని కాదని చెప్పవచ్చు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి ఆమె మాట్లాడారు.తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విజయశాంతికి ఇలా ఒక ప్రశ్న ఎదురైంది. 'చిరంజీవితో 19, బాలకృష్ణతో 17 సినిమాలు చేశావట కదా.. మళ్లీ వారితో చేస్తావా..? ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చెరో సినిమా చేశాక మంత్రివైపోయి ఆ బిజీలో తిరుగు' అనే ప్రశ్నకు ఒక సెకను కూడా ఆలోచించకుండా విజయశాంతి సమాధానం ఇచ్చారు. 'నటించే చాన్స్ లేదు, ఎమ్మెల్సీగానే టైమ్ సరిపోదు… పనిచేయాలి కదా.. అసలు కుదరదు' అని చెప్పారు. ఆ ప్రశ్నే పూర్తిగా అసంబద్ధం అనిపించేలా విజయశాంతి సమాధానం ఇచ్చారు.విజయశాంతికి టైమ్‌ ఉన్నా కూడా చిరంజీవి(Chiranjeevi )తో సినిమా చేయదని సోషల్‌మీడియాలో కొందరు చెప్పుకొస్తున్నారు. గతంలో ఒక సినిమాకు సంబంధించి వారిద్దరి మధ్య కాస్త దూరం పెరిగిందని గుర్తుచేస్తున్నారు. అయితే, చిరంజీవి, బాలకృష్ణ కూడా విజయశాంతితో నటించడానిక ఇష్టపడకపోవచ్చు. దానికి ప్రధాన కారణం గతంలో వారికి సమానంగా స్టేటస్‌ను ఆమె అనుభవించారు. ఇప్పుడు వారి సినిమాల్లో ఆమెకు పాత్ర ఇవ్వాలంటే సమానమైన రోల్‌ ఇవ్వాలి. అందుకు వారిద్దరూ ఒప్పుకోరు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో మరో పాత్ర ప్రధానంగా హైలెట్‌ అవడం చాలా తక్కువని చెప్పవచ్చు. వారిద్దరి కంటే ప్రాముఖ్యత తక్కువగా ఉన్న రోల్‌ విజయశాంతికి ఇస్తే ఎట్టిపరిస్థితిల్లోనూ ఒప్పుకోరు. అందుకే ఈ కాంబినేషన్‌ను సెట్‌ చేయడం అంత సులభం కాదని నెటిజన్ల అభిప్రాయం.ఇప్పటి తరం యూత్‌కు అంతగా విజయశాంతి ఇమేజ్‌ గురించి తెలియకపోవచ్చు. ఒకప్పుడు హీరోలకు ఎంత క్రేజ్‌ ఉంటుందో ఆమెకు కూడా అంతే స్థాయిలో ఇమేజ్‌ ఉండేది. అలాంటి స్టేటస్‌ను ఆమె అనుభవించారు. అందుకే రీసెంట్‌గా జరిగిన సినిమా వేడుకలో ఎన్టీఆర్‌తో పాటు కల్యాణ్‌రామ్‌ ఆమె పట్ల చాలా గౌరవంగానే మెలిగారు. కర్తవ్యం సినిమాకు ఉత్తమ జాతీయ నటిగా అవార్డ్‌ అందుకోవడంతో పాటు 4 నంది, 6 ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ను అందుకున్నారు. 1989లోనే ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటడమే కాకుండా తమిళ్‌, మలయాళం, కన్నడ వంటి భాషల్లో మెప్పించారు. సుమారు 200 సినిమాల్లో ఆమె నటించారు. బాలయ్య, చిరుతో సహా ఆ నంబర్స్‌కు దగ్గర్లో లేరు.

PM Narendra Modi Govt Fires On Pakistan For Pahalgam Terror Attack7
పాక్‌కు ‘పంచ్‌’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై మంగళవారం ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని భారత్‌ అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీని వెనక పాకిస్తాన్‌ హస్తం స్పష్టంగా కనిపిస్తోందంటూ మండిపడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలకు దిగింది. పాకిస్తాన్‌ పౌరులకు భారత్‌లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక పాక్‌తో దౌత్య సంబంధాలకు చాలావరకు కత్తెర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమా వేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ మేరకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది తగ్గింపు తదితరాలు వీటిలో ఉన్నాయి. దీంతో పాక్‌తో ఇప్పటికే క్షీణించిన దౌత్య సంబంధాలు మరింత అట్టడుగుకు దిగజారాయి. ఈ చర్యలతోనే సరిపెట్టకుండా ఉగ్ర ముష్కరులకు, వారిని ప్రేరేపిస్తున్న పొరుగు దేశానికి దీటుగా బదులిచ్చేందుకు కూడా కేంద్రం సమాయత్తమవుతోంది. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై సీసీఎస్‌ భేటీలో రెండున్నర గంటలకు పైగా లోతుగా చర్చ జరిగింది. విమానాశ్రయంలోనే మోదీ సమీక్ష మంగళవారం రాత్రి సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వెనుదిరిగిన ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీతో విమానాశ్రయంలోనే సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పలు అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సాయంత్రం ఆరింటికి మోదీ సారథ్యంలో సీసీఎస్‌ అత్యవసరంగా సమావేశమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జైశంకర్, దోవల్, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సింగ్, విక్రం మిస్రీ, ప్రధాని ముఖ్య కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత దాస్, అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీసీఎస్‌ సభ్యురాలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అమెరికా పర్యటనలో ఉండటంతో హాజరు కాలేదు. దాడిపై ప్రతిస్పందన ఎలా ఉండాలన్నదే ప్రధాన అజెండాగా భేటీ జరిగింది. దాడి జరిగిన తీరు తదితరాలను అమిత్‌ షా వివరించారు. 25 మంది భారతీయులు, ఒక నేపాల్‌ జాతీయుడు మృతి చెందినట్టు చెప్పారు. శిక్షించి తీరతాం: మిస్రీ పహల్గాం దాడిని సీసీఎస్‌ అత్యంత తీవ్రంగా ఖండించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. దాడికి తెగబడ్డ ముష్కరులతో పాటు దాని సూత్రధారులను కూడా కఠినంగా శిక్షించి తీరాలని సీసీఎస్‌ తీర్మానించింది’’ అని వెల్లడించారు. ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్‌ రాణా మాదిరిగానే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టడం ప్రకటించారు. ‘‘జమ్మూ కశ్మీర్‌లో విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ ప్రాంతమంతా ఆర్థికాభివృద్ధితో కళకళలాడుతున్న వేళ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రపూరిత దాడి ఇది. దాని వెనక దాగున్న సీమాంతర లింకులపై సీసీఎస్‌ లోతుగా చర్చించింది. ప్రపంచ దేశాలన్నీ దాన్ని అత్యంత తీవ్ర పదజాలంతో ఖండించిన తీరును ప్రశంసించింది. ఉగ్రవాదంపై రాజీలేని పోరులో భారత్‌కు ఆ దేశాల మద్దతుకు ఇది ప్రతీక అని పేర్కొంది. పాక్‌పై తీసుకున్న చర్యల జాబితాను చదివి వినిపించారు. పాక్‌పై చర్యలివే... – సార్క్‌ వీసా మినహాయింపు పథకం (ఎస్‌వీఈఎస్‌) కింద పాక్‌ జాతీయులకు భారత వీసాల జారీ నిలిపివేత. ఇప్పటికే జారీ చేసిన వీసాల రద్దు. వాటిపై ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్తానీలు 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశం. – ఉగ్రవాదానికి పాక్‌ మద్దతివ్వడం మానుకునేదాకా 1960లో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్‌. – భారత్, పాక్‌ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజాబ్‌లోని అటారీ సరిహద్దు తక్షణం మూసివేత. దానిగుండా పాక్‌కు వెళ్లినవారు తిరిగొచ్చేందుకు మే 1 దాకా గడువు. – ఢిల్లీలోని పాక్‌ హై కమిషన్‌ నుంచి రక్షణ, త్రివిధ దళాల సలహాదారు, వారి ఐదుగురు సహాయక సిబ్బంది బహిష్కరణ. వారంలోపు భారత్‌ వీడాలని ఆదేశం. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌ నుంచి భారత రక్షణ, త్రివిధ దళాల సలహాదారుల ఉపసంహరణ. – ఇరుదేశాల హై కమిషన్లలో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు.

TDP Govt Red Book Conspiracy against senior IPS officer PSR Anjaneyulu8
పక్కా కక్షే... అక్రమ కేసే

సాక్షి, అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై టీడీపీ కూటమి సర్కారు పక్కా పన్నాగంతో అక్రమ కేసు నమోదు చేసింది. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్‌ నివేదికే ఆ కుట్రలను బహిర్గతం చేసింది. వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు ఇప్పించేందుకు ఎంతటి పన్నాగంతో వ్యవహరించారో బయటపడింది. ఆమెపై గతంలో నమోదైన క్రిమినల్‌ కేసులు దర్యాప్తు ఉండగానే వాటిని వక్రీకరిస్తూ... భారత సాక్ష్యాధారాల చట్టానికి విరుద్ధంగా కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసినట్లు స్పష్టమైంది. తాను ఎలాంటి తప్పూ చేయలేదని... జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో నాడు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తన వాదనలను న్యాయస్థానంలో స్వయంగా వినిపించారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్‌ విధించింది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన అక్రమ కేసులోనూ పీఎస్‌ఆర్‌ పేరును చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేయడంతోపాటు మరిన్ని అక్రమ కేసులకు ప్రభుత్వం సిద్ధమైంది.జత్వానీ అబద్ధపు ఫిర్యాదు.. అక్రమ కేసుటీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించింది. అందుకోసం కాదంబరీ జత్వానీని సాధనంగా చేసుకుంది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌కు చెందిన భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు యత్నించిన కేసులో ఆమె నిందితురాలు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ అతిథిగా మారిపోయారు. అక్రమ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తూ ముందుగా 2024 ఆగస్టులో టీడీపీ అనుకూల చానల్‌తో ఆమెను మాట్లాడించారు. వెంటనే విజయవాడ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆమెతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమెను 2024 సెప్టెంబరు 5న విజయవాడకు రప్పించడంతో ఏసీపీతోపాటు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబును కలిశారు. వారం రోజులు ఆమె విజయవాడలోనే ప్రభుత్వ అతిథి హోదాలో ఉన్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా నియమించాలని అప్పటికే నిర్ణయించిన ఉమామహేశ్వరరావు ఆమెకు కుట్ర కేసు నమోదు కథను వివరించారు. అనంతరం 2024 సెప్టెంబరు 13 అర్ధరాత్రి కాదంబరీ జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిరా>్యదు చేయడం... వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి.జత్వానీ ఫోర్జరీ పత్రాలపై కేసు విచారణలో ఉండగానే పోలీసులపై ఫిర్యాదా..!పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకే కాదంబరీ జత్వానీతో అబద్ధపు ఆరోప­ణలతో ఫిర్యాదు చేయించినట్లు సీఐడీ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. కుక్కల విద్యా సాగర్‌కు చెందిన భూములను విక్రయించేందుకు వాటిని 2018లో కొనుగోలు చేసినట్టు ఆమె 2023లో ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కానీ తనపై అక్రమ కేసు పెట్టారని జత్వానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫిర్యాదు చేయడం గమనార్హం. అవి ఫోర్జరీ పత్రాలో.. కావో అన్నది పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలుతుంది. అంతిమంగా న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వాలి. అంతేగానీ ఇంకా దర్యాప్తులో ఉన్న కేసులోని అభియోగాలు తప్పని చెబుతూ నిందితులు పోలీసులపైనే ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయడం నిబంధనలకు విరుద్ధం. అదే విధానంగా మారితే దేశంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న అన్ని క్రిమినల్‌ కేసుల్లోనూ నిందితులు తిరిగి పోలీసులపై ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టేందుకు అనుమతించినట్టే అవుతుంది. తప్పు చేయలేదు... జత్వానీ ఎవరో తెలియదుతనపై నమోదు చేసిన అక్రమ కేసులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. కాదంబరి జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు. సివిల్‌ పోలీసులు పర్యవేక్షించే క్రిమినల్‌ కేసులు, ఇతర దర్యాప్తులతో ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం ఉండదని పోలీసు సర్వీసు నియమావళిని ఉటంకిస్తూ వివరించారు. జత్వానీ తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలన్నారు. అందుకే తాను కనీసం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. తనపై అబద్ధపు అభియోగాలతోనే పోలీసులు, సీఐడీ అధికారులు అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నీ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల ఒత్తిడితో ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోకూ­డదని కోరారు. తాను సదా అందుబాటులో ఉన్నానని... దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధమని చెప్పినా సరే సీఐడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.అబద్ధపు వాంగ్మూలం కోసం పీఎస్‌ఆర్‌పై ఒత్తిడిఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాల కోసం సీఐడీ అధికారులు సీనియర్‌ ఐపీఎస్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసే సమయంలో తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఫోన్‌ను సీఐడీ అధికారులకు అప్ప­గించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు సమ్మతించారు. కానీ పీఎస్‌ఆర్‌ను విజయ­వాడకు తీసుకువచ్చిన తరువాత సీఐడీ అధికారులు మధ్యవర్తుల నివేదిక పేరుతో ఓ పత్రాన్ని తెచ్చి సంతకం చేయాలని పేర్కొన్నారు. అందులో ఆయన వద్ద ల్యాప్‌టాప్, ఐప్యాడ్, మరో సెల్‌ ఫోన్‌ ఉన్నా­యని అంగీకరించినట్లుగా పొందుపరిచారు. దీనిపై పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశా­రు. తన వద్ద లేని ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉన్నట్టుగా రాసేందుకు నిరాకరించారు. హైదరాబాద్‌లో తన ఇంటి వద్దే అన్ని విషయాలు చెప్పానని, ఇప్పుడు ఇలా అబద్ధపు వాంగ్మూలం రాయమని చెప్పడం ఏమిటని నిలదీశారు. తమపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని సీఐడీ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని పీఎస్‌ఆర్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.సాక్ష్యాధారాల చట్టం వక్రీకరణ...పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టి వెంటనే స్వాధీనం చేసుకున్నారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొనడం మరో అబద్ధపు అభి­యో­గం. విచారణ జరుగుతున్న కేసులో భారత సాక్ష్యా­ధారాల చట్టాన్ని వక్రీకరించేందకు తెగించడం గమ­నార్హం. డ్రగ్స్, గంజాయి, ఇతర స్మగ్లింగ్‌ నిరో­ధక కేసుల్లో దేశవ్యాప్తంగా పోలీసులు, కస్టమ్స్‌ అధికా­రులు అనుసరించే విధానాన్నే నాడు విజయ­వాడ పోలీసులు పాటించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా ఫోర్జరీ పత్రాలు లభించా­యి. పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టా­రని ఆమె ప్రస్తుతం తప్పుడు అభియోగాలు మోప­డం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల పన్నాగం ఉంది.టిఫిన్‌ కూడా పెట్టకుండా.. సీఐడీ అధికారులు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు పట్ల మానవత్వం లేకుండా, అగౌరవంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆయన్ని బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం న్యాయస్థానానికి తరలించారు. ఆయనకు కనీసం టిఫిన్‌ కూడా పెట్టలేదు. అనంతరం మధ్యాహ్నం రిమాండ్‌ కోసం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. పీఎస్‌ఆర్‌పై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.⇒ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామరాజు గతంలో ఇచ్చిన అబద్ధపు ఫిర్యాదులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. తనను సీఐడీ అధికారులు హింసించారని రఘురామ గతంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చినప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. ఈ కేసులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును కూడా చేరుస్తూ న్యాయస్థానంలో సీడీఐ బుధవారం మెమో దాఖలు చేయడం గమనార్హం. అసలు ఆయనకు సీఐడీతో ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా కూడా లేరు. ఏసీబీ డీజీగా ఉన్నారు. అయినా సరే పీఎస్‌ఆర్‌ను ఆ కేసులో నిందితుడుగా చేర్చడం విస్మయం కలిగిస్తోంది.⇒ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు గతంలో ఏపీపీఎస్పీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో కొన్ని ఫైళ్లు కనపడకుండా పోయాయంటూ దాదాపు నాలుగేళ్ల తరువాత ఏపీపీఎస్పీ కార్యదర్శితో తాజాగా ఫిర్యాదు ఇప్పించడం కూటమి సర్కారు కుట్రలకు నిదర్శనం.⇒ గతంలో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తనను బెదిరించారంటూ ఉద్యోగ సంఘం నేత సూర్యనారా­యణతో టీడీపీ ప్రభుత్వం ఇటీవల అబద్ధాలతో ఫిర్యాదు ఇప్పించింది. ఆ ఫిర్యాదును సీఐడీకి తాజాగా పంపించడం ప్రభుత్వ కుటిల పన్నా­గానికి నిదర్శనం.

India puts Indus Waters Treaty on hold, special story9
ఏమిటీ సింధూ నదీ  జలాల ఒప్పందం?

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఈ నదీజలాల అంశం చర్చనీయాంశమైంది. ఘర్షణతో మొదలై ఒప్పందం దాకా..ఇరు దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధూ నది, దాని ఉపనదుల జలాలను సాగు కోసం, జలవిద్యుత్‌ఉత్పత్తి, జల రవాణా, చేపల వేట తదితరాల కోసం వినియోగించుకునేందుకుగాను భారత్, పాకిస్తాన్‌ దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్‌ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, పాకిస్తాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధూ ఉపనదుల్లో తూర్పువైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లైజ్‌ నదులపై భారత్‌కు హక్కులు దఖలుపడ్డాయి. సింధూ ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు లభించాయి. ఈ నదీ జలాల వినియోగం, ఇరు దేశాల మధ్య ఉత్తరప్రత్యత్తరాల కోసం ఒక సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పరస్పర సహకారం భావనతో నదీజలాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. భారత్‌ తన పాక్షిక హక్కు మేరకు పాకిస్తాన్‌ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలనూ పరిమితంగా వాడుకోవచ్చు. వ్యవసాయం, జలవిద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు. అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్‌లోకి వెళ్లకుండా అడ్డుకోకూడదు. ఈ ఒప్పందంలో భాగంగానే గతంలోనే శాశ్వత సింధూ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ కమిషన్‌లో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్‌ ద్వారా చెప్పుకోవచ్చు. ఈ నదీజలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యామ్‌లను నిర్మించి, హఠాత్తుగా నీటిని వదిలి నీటిబాంబులుగా మార్చకూడదని షరతు పెట్టుకున్నారు. గడచిన ఆరు దశబ్దాల్లో ఈ నదీప్రవాహాల వెంట భౌగోళికంగా, రాజకీయంగా, పర్యావరణపరంగా చాలా మార్పులొచ్చాయి. జీలంకు ఉపనది అయిన కిషన్‌గంగ నదిపై భారత్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించింది. దీనిపై పాకిస్తాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. ప్రాజెక్టు కారణంగా తమ భూభాగంలోకి నదీజలాల ఉధృతి బాగా తగ్గిపోయిందని సింధూ నదీజలాల ఒప్పందానికి భారత్‌ తూట్లు పొడుస్తోందని పాకిస్తాన్‌ వాదిస్తోంది. భారత్, పాక్‌ల మధ్య గతంలో 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగినా, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా సింధు జలాల ఒప్పందం అమలుకు నిరాటంకంగా కొనసాగడం విశేషం. అయితే ఇటీవలి కాలంలో డ్యామ్‌ల నిర్మాణం, నీటి వినియోగం తదితర అంశాలపై వివాదాలు ఎక్కువయ్యాయి. కిషన్‌గంగ, రాట్లే ప్రాజెక్టులపై పంచాయతీని పాకిస్తాన్‌ ప్రపంచబ్యాంక్‌ దాకా తీసుకెళ్లింది. అయితే తాజాగా ఒప్పందం నుంచి తాత్కాలికంగా భారత్‌ వైదొలిగితే ఇకపై కేంద్రప్రభుత్వం తనకు నచ్చినట్లు ప్రవర్తించే వీలుంది. అంటే జీలం, చినాబ్, రావి, బియాస్, సట్జైజ్‌ నదీజలాలు పాకిస్తాన్‌కు స్వేచ్ఛగా ప్రవహించకుండా డ్యామ్‌లు కట్టే వీలుంది. అప్పుడు పాకిస్తాన్‌కు నీటి కష్టాలు పెరుగుతాయి. దీంతో దాయాదిదేశాన్ని జలసంక్షోభం చుట్టుముడుతుంది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ .

Syed Adil Hussain tried to stop terrorist Pahalgam10
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా

న్యూఢిల్లీ: ఒక జంటది హనీమూన్‌. కొందరిది పెళ్లి రోజు. ఇంకొందరికి ఎన్నో ఏళ్ల కల. పహల్గాం మారణకాండ 26 కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఒక్కొక్క పర్యాటకున్నీ పేరు, వ్యక్తిగత వివరాలు అడిగి మరీ ముష్కరులు బలి తీసుకున్న తీరు హృదయాలను కలచివేస్తోంది. దాదాపుగా అందరినీ ఆధార్‌ కార్డులు చూపించాలని, ఖురాన్‌ పంక్తులు అప్పజెప్పాలని అడిగి మరీ కాల్చేశారు.మృతుల్లో ఇద్దరు మినహా అంతా హిందువులే. వారిలో మహారాష్ట్రకు చెందిన వారు ఆరుగురు, గుజరాత్, కర్నాటక నుంచి ముగ్గురేసి, పశి్చమబెంగాల్‌ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, యూపీ, బిహార్, పంజాబ్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరితో పాటు ఒక నేపాలీ పర్యాటకునితో పాటు స్థానికుడు కూడా దాడిలో మరణించారు.హార్స్‌ రైడింగ్‌కని బయటికొచ్చి...ఉగ్ర కాల్పులకు బలైన వారిలో యూపీలోని కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది అనే 31 ఏళ్ల వ్యాపారవేత్త కూడా ఉన్నాడు. ఆయనకు గత ఫిబ్రవరిలోనే పెళ్లైంది. భార్య, తల్లిదండ్రులు, సోదరి, ఆమె అత్తామామలు, బావమరిది తదితరులతో కలిసి సరదాగా గడిపేందుకు బైసారన్‌ వెళ్లాడు. మంగళవారం కుటుంబీకులంతా హోటల్‌కే పరిమితం కాగా భార్యతో కలిసి శుభం హార్స్‌ రైడింగ్‌కు వెళ్లాడు. ఉగ్రవాదులు అతన్ని కూడా పేరడిగారు. కల్మా చదవమన్నారు. రాదనడంతో నేరుగా తలపై కాల్చి భార్య కళ్లముందే పొట్టన పెట్టుకున్నారు.CM Omar Abdullah, joined by thousands, offered funeral prayers for Syed Adil Hussain—killed in the Pahalgam militant attack that left 26 tourists dead—at his native village on Wednesday.Photos KM / @UmarGanie1 pic.twitter.com/nXCD0vbsnh— The Kashmir Monitor (@Kashmir_Monitor) April 23, 2025👉కేరళలోని ఎడప్పల్లికి చెందిన రామచంద్రన్‌ (65) కూడా కాల్పులకు బలయ్యాడు. పర్యాటకప్రియుడైన ఆయన భార్య, ఇటీవలే దుబాయ్‌ నుంచి వచ్చిన కూతురు, ఆమె పిల్లలతో కలిసి కశ్మీర్‌ వెళ్లాడు. వాళ్ల కళ్లముందే ఉగ్రవాదులు ఆయన్ను కాల్చేశారు. ఆయన్ను కూడా ఖురాన్‌ పంక్తులు చదవాలని అడిగి, తాను ముస్లింను కాదని చెప్పగానే చంపేశారు.👉ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన దినేశ్‌ మిరానియా అనే వ్యాపారవేత్త పెళ్లి రోజును సరదాగా జరుపుకునేందుకు కుటుంబీకులతో కలిసి పహల్గాం వచ్చారు. భార్యాపిల్లల కళ్లముందే ఉగ్ర తూటాలకు బలయ్యారు.👉కశ్మీర్‌ వెళ్లాలన్నది ఒడిశాకు చెందిన ప్రశాంత్‌ సత్పతి (41) కల. నెలల తరబడి డబ్బు కూడబెట్టి మరీ బైసారన్‌ వెళ్లాడు. భార్య, 9 ఏళ్ల కొడుకు కళ్లముందే నిస్సహాయంగా మృత్యువాత పడ్డాడు.పోరాడిన పోనీవాలా.. ఉగ్రవాదుల నుంచి పర్యాటకులను కాపాడేందుకు సయ్యద్‌ ఆదిల్‌ హుస్సేన్‌ షా (30) అనే స్థానిక పోనీవాలా వీరోచితంగా ప్రయత్నించాడు. ఉగ్ర వాదుల నుంచి తుపాకులను లాక్కునే ప్రయత్నంలో వారి కాల్పులకు బలయ్యాడు. ఆదిల్‌ గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించాడంటూ జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ప్రస్తుతించారు. బుధవారం అతని అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement