PSL 2025: హెయిర్‌ డ్రైయర్‌, ట్రిమ్మర్‌.. షాహీన్‌ అఫ్రిదికి ఖరీదైన బహుమతి | 24K Gold Plated IPhone 16 Pro For Shaheen Afridi, Qalandars Captain Receives Big Gift | Sakshi
Sakshi News home page

PSL 2025: హెయిర్‌ డ్రైయర్‌, ట్రిమ్మర్‌.. షాహీన్‌ అఫ్రిదికి ఖరీదైన బహుమతి

Published Mon, Apr 21 2025 1:26 PM | Last Updated on Mon, Apr 21 2025 3:02 PM

24K Gold Plated IPhone 16 Pro For Shaheen Afridi, Qalandars Captain Receives Big Gift

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2025లో కరాచీ కింగ్స్‌ ఫ్రాంచైజీ యాజమాన్యం తమ ఆటగాళ్లకు (జేమ్స్‌ విన్స్‌, హసన్‌ అలీ) హెయిర్‌ డ్రైయర్లు, హెయిర్‌ ట్రిమ్మర్ లాంటి వస్తువులను బహుమతులుగా (అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ) ఇచ్చి విమర్శలపాలైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లకు కనీస విలువ చేసే బహుమతులైనా ఇవ్వాలేరా అంటూ నెటిజన్లు సదరు ఫ్రాంచైజీ యాజమాన్యంపై మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో లాహోర్‌ ఖలందర్స్‌ ఫ్రాంచైజీ యాజమాన్యం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన తమ ఆటగాడు షాహీన్‌ అఫ్రిదికి ఓ ఖరీదైన వస్తువును బహుమతిగా ఇచ్చి ట్రోలింగ్‌ నుంచి తప్పించుకుంది. అఫ్రిది తన ప్రదర్శనలతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఖలందర్స్‌ను విజేతగా నిలపడంతో యాజమాన్యం అతనికి 24 క్యారెట్ల బంగారు పూత పూసిన ఐఫోన్ 16 ప్రోను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ విషయాన్ని ఖలందర్స్‌ యాజమాన్యం ఓ వీడియో ద్వారా సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది.

ఖలందర్స్‌కు కెప్టెన్‌గా కూడా ఉన్న అఫ్రిది క్వెట్టా గ్లాడియేటర్స్‌, కరాచీ కింగ్స్‌పై వరుసగా 2-6, 3-35 ప్రదర్శనలు చేశాడు. ఈ ప్రదర్శనల కారణంగా ఖలందర్స్‌ ఆయా జట్లపై 79, 65 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇస్లామాబాద్‌ యునైటెడ్ చేతిలో ఓటమి అనంతరం ఖలందర్స్‌ క్వెట్టా గ్లాడియేటర్స్‌, కరాచీ కింగ్స్‌పై విజయాలు సాధించింది. 

తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో (డిఫెండింగ్‌ ఛాం​ప్‌ ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంది)  కొనసాగుతుంది. ఖలందర్స్‌ తమ తదుపరి మ్యాచ్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌ నేతృత్వంలోని ముల్లాన్‌ సుల్తాన్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ ఏప్రిల్‌ 22న జరుగనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement