Lahore Qalandars
-
PSL 2025: హెయిర్ డ్రైయర్, ట్రిమ్మర్.. షాహీన్ అఫ్రిదికి ఖరీదైన బహుమతి
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం తమ ఆటగాళ్లకు (జేమ్స్ విన్స్, హసన్ అలీ) హెయిర్ డ్రైయర్లు, హెయిర్ ట్రిమ్మర్ లాంటి వస్తువులను బహుమతులుగా (అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ) ఇచ్చి విమర్శలపాలైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లకు కనీస విలువ చేసే బహుమతులైనా ఇవ్వాలేరా అంటూ నెటిజన్లు సదరు ఫ్రాంచైజీ యాజమాన్యంపై మండిపడ్డారు.ఈ నేపథ్యంలో లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన తమ ఆటగాడు షాహీన్ అఫ్రిదికి ఓ ఖరీదైన వస్తువును బహుమతిగా ఇచ్చి ట్రోలింగ్ నుంచి తప్పించుకుంది. అఫ్రిది తన ప్రదర్శనలతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఖలందర్స్‌ను విజేతగా నిలపడంతో యాజమాన్యం అతనికి 24 క్యారెట్ల బంగారు పూత పూసిన ఐఫోన్ 16 ప్రోను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ విషయాన్ని ఖలందర్స్ యాజమాన్యం ఓ వీడియో ద్వారా సోషల్‌మీడియాలో షేర్ చేసింది.The iPhone has landed 📱😉Our Captain Qalandar receives a gift he’s worthy of 💛🤴🏽 A custom 24K Gold-plated IPhone 16 Pro, made just for Lahore Qalandars’ main man, Shaheen! pic.twitter.com/PYigEiJvRR— Lahore Qalandars (@lahoreqalandars) April 20, 2025ఖలందర్స్‌కు కెప్టెన్‌గా కూడా ఉన్న అఫ్రిది క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్‌పై వరుసగా 2-6, 3-35 ప్రదర్శనలు చేశాడు. ఈ ప్రదర్శనల కారణంగా ఖలందర్స్ ఆయా జట్లపై 79, 65 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్ చేతిలో ఓటమి అనంతరం ఖలందర్స్ క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్‌పై విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో (డిఫెండింగ్ ఛాంప్ ఇస్లామాబాద్ యునైటెడ్ టాప్ ప్లేస్‌లో ఉంది) కొనసాగుతుంది. ఖలందర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని ముల్లాన్ సుల్తాన్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 22న జరుగనుంది. -
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో పోలుస్తూ పాక్ రిపోర్టర్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ రెండింటిలో గొప్ప లీగ్ ఏదో చెప్పాలంటూ అతడు అడిగిన ప్రశ్నకు లాహోర్ ఖలందర్స్ స్టార్, ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ సత్తాకాగా ప్రపంచంలోని అత్యంత ఆదరణ పొందిన, ఖరీదైన టీ20 లీగ్‌గా ఐపీఎల్ వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో భాగమైన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ జట్లను కొనుగోలు చేసి.. అక్కడా సత్తా చాటుతున్నాయి. ఇక ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.ఐపీఎల్‌తో పోటీకి దిగిపదిహేడేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఐపీఎల్‌కు ఇంత వరకు ప్రపంచంలోని ఏ టీ20 లీగ్ కూడా పోటీ ఇవ్వలేకపోతోంది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాత్రం ఈసారి ఐపీఎల్‌తో ఢీకొట్టింది. మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025 మే 25న ముగియనుండగా.. పీఎస్ఎల్ను ఏప్రిల్ 11- మే 18 వరకు నిర్వహించేందుకు పీసీబీ షెడ్యూల్ ఖరారు చేసింది.ఫలితంగా.. ఐపీఎల్‌తో పోటీ కారణంగా ప్రేక్షక ఆదరణ లేక పీఎస్ఎల్ వెలవెలబోతోంది. అయితే, కొంత మంది పాక్ జర్నలిస్టులు మాత్రం ఐపీఎల్‌తో పీఎస్ఎల్ను పోలుస్తూ విదేశీ ఆటగాళ్లను తికమకపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా లాహోర్ ఖలందర్ స్టార్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్‌ను ఓ రిపోర్టర్.. ప్రపంచంలోని ఇతర లీగ్‌లతో పోలిస్తే పీఎస్ఎల్ స్థానమేమిటి? అంటూ ప్రశ్నించారు.PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదుఈ ప్రశ్నను అర్థం చేసుకున్న సామ్ బిల్లింగ్స్.. ‘‘నా నుంచి మీరేదో చిలిపి సమాధానం ఆశిస్తున్నారు.. అంతే కదా!.. ప్రపంచంలో ఎక్కడైనా ప్రేక్షకులను కలిగి ఉండటం క్రికెట్‌కు ఉన్న ప్రత్యేకత. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. ఇలా ఎక్కడ క్రికెట్ ఆడినా అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోవడం క్రికెటర్లుగా మా బాధ్యత.కాబట్టి వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న లీగ్‌లను పోల్చి చూస్తూ.. ర్యాంకులు ఇవ్వడం కాస్త కష్టంతో కూడుకున్న పని. అయితే, ఇతర లీగ్‌లతో పోలిస్తే.. ఐపీఎల్ ప్రీమియర్ కాంపిటిషన్ అన్న మాట వాస్తవం. ఐపీఎల్‌తో పోలిస్తే ప్రతి లీగ్.. దానికంటే వెనుబడి ఉన్నట్లే.ఇంగ్లండ్‌లో మేము.. ఇక్కడ పీఎస్ఎల్ మాదిరే ప్రపంచంలోని రెండో అత్యుత్తమ టీ20 లీగ్‌గా పేరొందాలనే ప్రయత్నాలు చేస్తున్నాము. ఆస్ట్రేలియాకు చెందిన బిగ్‌బాష్ లీగ్ పరిస్థితి కూడా ఇంతే.ఏదేమైనా ప్రతీ లీగ్ దానికదే ప్రత్యేకం. నేనైతే ప్రపంచంలోని అత్యుత్తమ లీగ్‌లలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నా’’ అని సామ్ బిల్లింగ్ పేర్కొన్నాడు. పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ కచ్చితంగా బెటర్ అంటూ పరోక్షంగా తన మనసులో మాటను వెల్లడించాడు.గతంలో ఐపీఎల్లో ఆడిన బిల్లింగ్స్కాగా 33 ఏళ్ల సామ్ బిల్లింగ్స్ 2015-16లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున పీఎస్ఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అంటే.. 2023 నుంచి లాహోర్ ఖలందర్స్కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ ఆడిన బిల్లింగ్స్.. 2018, 2019లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. చివరగా 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: Rohit Sharma: కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం -
PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)-2025 సీజన్ శుక్రవారం (ఏప్రిల్ 11) మొదలైంది. తొలి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ (ISU)- లాహోర్ ఖలందర్స్ (LHQ) తలపడ్డాయి. రావల్పిండి వేదికగా జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఇస్లామాబాద్ జట్టు.. లాహోర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.అయితే, ఓపెనర్లు ఫఖర్ జమాన్ (1), మహ్మద్ నయీమ్ (8) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరడంతో లాహోర్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ (38 బంతుల్లో 66) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అతడికి తోడుగా సికందర్ రజా (23) రాణించాడు.చెలరేగిన జేసన్ హోల్డర్అయితే, డారిల్ మిచెల్ (13) సహా మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో 19.2 ఓవర్లలో కేవలం 139 పరుగులు మాత్రమే చేసి లాహోర్ జట్టు ఆలౌట్ అయింది. ఇస్లామాబాద్ బౌలర్లలో పేసర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జేసన్ హోల్డర్ నాలుగు వికెట్ల (4/26)తో చెలరేగగా.. కెప్టెన్, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ (3/25) మూడు వికెట్లతో రాణించాడు.మిగిలిన వారిలో నసీం షా, రిలే మెరిడిత్, ఇమాద్ వసీం ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిగిన ఇస్లామాబాద్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ఆండ్రీ గౌస్ (4) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగగా.. మరో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (24 బంతుల్లో 25) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపుఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కొలిన్ మున్రో, సల్మాన్ ఆఘా కాస్త వేగంగా ఆడి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. మున్రో 42 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులతో అజేయంగా నిలవగా.. సల్మాన్ 34 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా 17.4 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఇస్లామాబాద్ టార్గెట్ పూర్తి చేసింది. లాహోర్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.ఐపీఎల్‌తో ఢీ!కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సాధారణంగా ఐపీఎల్‌తో పోటీ లేకుండా పీఎస్ఎల్ నిర్వహించేది. కానీ ఈసారి మాత్రం క్యాష్ రిచ్ లీగ్‌ను ఢీకొడుతూ ఏప్రిల్ 11- మే 18 వరకు షెడ్యూల్ ఖరారు చేసింది. మరోవైపు మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025.. మే 25న ఫైనల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది విదేశీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఆడే నిమిత్తం పీఎస్ఎల్ నుంచి తప్పుకొన్నారు.చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!ఇక పరుగుల వరద పారే ఐపీఎల్‌తో పోటీకి వచ్చిన పీఎస్ఎల్ తొలి మ్యాచే చప్పగా సాగింది. కనీసం ఇరు జట్లు కలిసీ కనీసం మూడు వందల పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయాయి. దీంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. పీఎస్ఎల్ ఇలాగే కొనసాగితే ఎవరూ చూడరని.. సొంత అభిమానులే పీసీబీని విమర్శిస్తున్నారు. టీ20 క్రికెట్ అంటేనే బౌండరీలు, సిక్సర్ల వర్షం ఉండాలని.. కాస్త బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు తయారు చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.పీఎస్ఎల్-2025: ఇస్లామాబాద్ వర్సెస్ లాహోర్ స్కోర్లులాహోర్: 139 (19.2)ఇస్లామాబాద్: 143/2 (17.4)ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లాహోర్‌ను ఓడించి ఇస్లామాబాద్.చదవండి: KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? ఇంతకీ మెదడు పనిచేస్తోందా?!ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. విదేశీ క్రికెటర్లు వీరే Agha goes BOOM! That’s a clean strike clearing the boundary! 🤩#HBLPSLX l #ApnaXHai l #IUvLQ pic.twitter.com/khDjmxyB57— PakistanSuperLeague (@thePSLt20) April 11, 2025 -
సత్తా చాటిన ప్రిటోరియస్.. బోణీ కొట్టిన అమెజాన్ వారియర్స్
గాయానా వేదికగా గ్లోబల్ సూపర్ లీగ్ ఇవాల్టి నుంచి (భారతకాలమానం ప్రకారం) ప్రారంభమైంది. లీగ్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 27) లహోర్ ఖలందర్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్‌పై.. అమెజాన్ వారియర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. టామ్ ఏబెల్ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వికెట్‌కీపర్ రొసింగ్టన్ (25), లూక్ వెల్స్ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అమెజాన్ వారియర్స్ బౌలర్లలో ప్రిటోరియస్ 4 వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ హసన్ సకిబ్, హసన్ ఖాన్ తలో 2 వికెట్లు, ఇమ్రాన్ తాహిర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అమెజాన్ వారియర్స్.. షాయ్ హోప్ (45 నాటౌట్), కీమో పాల్ (27 నాటౌట్) రాణించడంతో 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో మొయిన్ అలీ 17, మార్క్ దయాల్ 1, షిమ్రోన్ హెట్‌మైర్ 14, రోస్టన్ ఛేస్ 15 పరుగులు చేశారు. ఖలందర్స్ బౌలర్లలో సల్మాన్ మిర్జా, ఆసిఫ్ అఫ్రిది తలో 2 వికెట్లు పడగొట్టారు. -
సౌతాఫ్రికా ఆటగాడి విధ్వంసకర సెంచరీ.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో!
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో లాహోర్ ఖలందర్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లాహోర్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేసింది. లాహోర్ స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. భారీ లక్ష్య ఛేదనలో డస్సెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 50 బంతుల్లోనే తన తొలి పీఎస్ఎల్ సెంచరీని ఈ సఫారీ స్టార్ బ్యాటర్ అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న డస్సెన్ 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఏదేమైనప్పటికీ డస్సెన్ విధ్వంసకర సెంచరీ వృథా అయిపోయింది. లహోర్ బ్యాటర్లలో డస్సెన్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. పెషావర్ బ్యాటర్లలో ఓపెనర్ సైమ్ అయూబ్(55 బంతుల్లో 88, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు బాబర్ ఆజం(48), పావెల్(46) పరుగులతో రాణించారు. 2024 PSL's first centurion 💯🥇 Take a bow, Rassie van der Dussen 🤩🔥pic.twitter.com/6RIybWt2Ay — Sport360° (@Sport360) February 25, 2024 -
పొలార్డ్ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు! షాక్‌లో షాహీన్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 సీజన్లో కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో కరాచీ విజయం సాధించింది. చివరి బంతికి మీర్ హంజా సింగిల్ తీసి కరాచీని గెలిపించాడు. అయితే 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కరాచీ ఆటగాడు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదుకు దాడికి దిగాడు. మరో ఎండ్‌లో ఉన్న షోయబ్ మాలిక్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కిరాన్ కేవలం 33 బంతుల్లోనే 5 సిక్స్‌లు, ఒక ఫోరుతో 58 పరుగులు చేశాడు. అయితే కరాచీ ఇన్నింగ్స్ 16 ఓవర్లో షాహీన్ అఫ్రిది.. అద్భుత బంతితో పొలార్డ్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మాలిక్ కూడా ఔట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ లాహోర్ వైపు మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్లో కరాచీ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది.. ఆఫ్ స్పిన్నర్ ఆషాన్ బట్టికి అప్పగించాడు. ఇదే షాహీన్ చేసిన తప్పిదం. చివరి ఓవర్లో తొలి బంతినే హసన్ అలీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో కరాచీ విజయసమీకరణం 5 బంతుల్లో 5 పరుగులగా మారిపోయింది. ఆ తర్వాత ఐదో బంతికి హసన్ అలీ ఔటైనప్పటికీ.. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ మీర్ సింగిల్ తీసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఇది చూసిన అఫ్రిది తలను పట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. లహోర్ ఓన సాహిబ్జాదా ఫర్హాన్(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కరాచీ బౌలర్లలో మీర్ హంజా, షంసీ, హసన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు?
పాకిస్తాన్ దేశం ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతోంది. ఇప్పటికి అక్కడ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అక్కడి పాకిస్తాన్ ఆటగాళ్లకు మాత్రం ప్లాట్లు, ఖరీదైన ఐఫోన్లను గిఫ్ట్‌లుగా అందజేశారు. ఇప్పుడు ఈ వార్త పాక్‌లో సంచలనం రేపింది. విషయంలోకి వెళితే.. ఇటీవలే ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) తొమ్మిదో సీజన్ విజేతగా లాహోర్ ఖలండర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో షాహిన్ అఫ్రిది సేన విజయం సాధించి వరుసగా రెండోసారి పీఎస్ఎల్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. దీంతో సదరు ఫ్రాంఛైజీ ఓనర్ లాహోర్ ఖలండర్స్ సీవోవో సమీన్ రాణా ఆటగాళ్లకు అదిరిపోయే గిఫ్ట్ లు ఇచ్చింది. ప్లేయర్స్ అందరికీ ప్లాట్లు, ఐఫోన్లు ఇచ్చారు. ఈ ఫ్రాంఛైజీ ఓనర్ ఖలందర్స్ సిటీ అనే ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేపట్టింది. దీంతో తమ ప్లేయర్స్ కు అందులోనే ప్లాట్లు ఇచ్చింది. ఈ ప్లాట్లు, ఐఫోన్లు అందుకున్న వాళ్లలో స్టార్ ప్లేయర్స్ షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, జమాన్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఉన్నారు. ఒక్కొక్క ప్లేయర్ కు 5445 చదరపు అడుగుల ప్లాట్లు ఇచ్చారు. వీటి విలువ పాకిస్థాన్ కరెన్సీలో 92. 5 లక్షలు కాగా.. ఇండియన్ కరెన్సీలో రూ.27 లక్షలు. ఈ లీగ్ మొత్తం ఆడే అవకాశం రాకుండా బెంచ్ కే పరిమితమైన ప్లేయర్స్ కు కూడా ఈ ప్లాట్లు ఇచ్చారు. పీఎస్‌లో ఫైనల్లో బ్యాట్‌తోనూ, బంతితోను మెరిసి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి అదనంగా గిఫ్ట్‌లు అందించడం విశేషం. ఫైనల్లో మొదట బ్యాటింగ్‌లో 44 రన్స్.. ఆ తర్వాత బౌలింగ్ లో రాణించిన షాహిన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లాహోర్ టీమ్ లీగ్ గెలిచినందుకు ఒక ప్లాట్ అందుకున్న షాహీన్.. కెప్టెన్ గా వ్యవహరించినందుకు మరో రెండు ప్లాట్స్ అదనంగా అందుకోవడం విశేషం. ఇది చూసిన క్రికెట్ అభిమానులు.. ''దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పాక్ ఆటగాళ్లకు లభించిన గిఫ్ట్‌లను డబ్బుల రూపంలో దేశానికి అందిస్తే బాగుండేది'' అంటూ కామెంట్ చేశారు. Great Gesture from Lahore Qalandars - Appreciation for ALL "This is why we call it a FAMILY"#PSL08 #qalandarhum #SabSitarayHumaray #QalandarsCity pic.twitter.com/X4z2wxi7Tj — Lahore Qalandars (@lahoreqalandars) March 22, 2023 చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ క్రికెటర్ గుడ్‌బై అభిమానులను పిచ్చోళ్లను చేశారు