బంతి తగిలి అంపైర్‌ ముఖంపై తీవ్ర గాయాలు..! | Cricket Umpire Gets Seriously Hurt With A Straight Drive | Sakshi
Sakshi News home page

బంతి తగిలి అంపైర్‌ ముఖంపై తీవ్ర గాయాలు..!

Published Thu, Nov 21 2024 11:00 AM | Last Updated on Thu, Nov 21 2024 11:21 AM

Cricket Umpire Gets Seriously Hurt With A Straight Drive

క్రికెట్‌ మైదానంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బంతి తగిలి ఫీల్డ్‌ అంపైర్‌ ముఖం వాచిపోయింది. ఆస్ట్రేలియాలోని ఛార్లెస్‌ వెర్యార్డ్‌ రిజర్వ్‌ క్రికెట్‌ మైదనంలో ఇది జరిగింది. ఓ స్థానిక మ్యాచ్‌ సందర్భంగా టోనీ డినోబ్రెగా అనే వ్యక్తి వికెట్ల వద్ద అంపైరింగ్‌ చేస్తున్నాడు. బ్యాటర్‌ కొట్టిన బంతి (స్ట్రయిట్‌ డ్రైవ్‌) నేరుగా డినోబ్రెగా ముఖంపై తాకింది. బంతి బలంగా తాకడంతో డినోబ్రెగా ముఖం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. కుడి కన్ను, కుడి వైపు ముఖం అంతా కమిలిపోయి, వాచిపోయింది.

అదృష్టవశాత్తు డినోబ్రెగా ముఖంపై ఎలాంటి ఫ్రాక్చర్స్‌ లేవు. ప్రస్తుతం అతను అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డినోబ్రెగా త్వరగా కోలుకోవాలని స్థానిక అంపైర్ల సంఘం ఆకాంక్షించింది. గాయపడక ముందు డినోబ్రెగా ముఖం.. గాయపడిన తర్వాత డినోబ్రెగా ముఖాన్ని అంపైర్ల సంఘం సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. 

క్రికెట్‌ మైదానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు.  ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. అందుకే అంపైర్లు కూడా హెల్మెట్లు ధరించి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఆస్ట్రేలియాలోనే ఓ ఫీల్డ్‌ అంపైర్‌ ఇలానే బంతి ముఖంపై తాకడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. 2014లో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్‌ హ్యూస్‌ బంతి తలకు తాకడంతో తొలుత కోమాలోని వెళ్లి, ఆతర్వాత ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement