
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ వుమెన్, యూపీ వారియర్జ్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ స్టన్నింగ్ రనౌట్లతో మెరిసింది. మాములుగానే తాను ఫీల్డ్‌లో ఉందంటే ప్రత్యర్థి బ్యాటర్ల పప్పులు ఉడకవు. ఎందుకంటే బంతి ఆమె చేతి నుంచి వెళ్లడం అసాధ్యం. అయితే పరుగులు సేవ్ చేయడమో లేదంటే ప్రత్యర్థి ఆటగాళ్లను రనౌట్ చేయడమో జరుగుతుంది.
తాజాగా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా రెండు రనౌట్లతో మెరవడం విశేషం. అయితే ఇసీ వాంగ్‌ను రనౌట్ చేసిన తీరుకు మాత్రం ఆమెను మెచ్చుకోకుండా ఉండలేం. ఆఖరి ఓవర్‌ను దీప్తి శర్మనే వేసింది. ఓవర్ నాలుగో బంతిని ఇసీ వాంగ్ లాంగ్‌ఆఫ్ దిశగా ఆడింది. సింగిల్ పూర్తి చేసిన వాంగ్ రెండో పరుగుకు పిలుపునిచ్చింది.
అప్పటికే బంతిని అందుకున్న దీప్తి శర్మకు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఈజీగా రనౌట్ చేసే చాన్స్ వచ్చింది. కానీ తను మరోలా ఆలోచించింది. స్ట్రైకింగ్ ఎండ్‌వైపు వెళ్తున్న ఇసీ వాంగ్‌ను రనౌట్ చేయాలనుకొని డైరెక్ట్ త్రో వేసింది. అంతే వాంగ్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీప్తి శర్మ కాన్ఫిడెంట్‌కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
Right On Target 🎯 ft. Deepti Sharma#CricketTwitter #WPL2023 #MIvUPW pic.twitter.com/LkGcz9ubKt
— Female Cricket (@imfemalecricket) March 18, 2023
చదవండి: విశాఖ చేరుకున్న క్రికెటర్లు; వర్షం నేపథ్యంలో అభిమానుల్లో ఆందోళన