
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ దుష్మంత చమీర అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. చమీరా సంచలన క్యాచ్‌తో అనుకుల్ రాయ్‌ను పెవిలియన్‌కు పంపాడు.
చమీరా క్యాచ్ అంతా షాక్ అయిపోయారు. కేకేఆర్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన స్టార్క్ బౌలింగ్‌లో మూడో బంతికి రావ్‌మన్ పావెల్ వికెట్లు ముందు దొరికిపోయాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అనుకుల్ రాయ్‌కు స్టార్క్ నాలుగో బంతిని మిడిల్ అండ్ లెగ్ దిశగా సంధించాడు.
ఆ డెలివరీని అనుకుల్ రాయ్ డీప్ స్వ్కెర్ లెగ్ దిశగా ఫ్లిక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా బౌండరీ వెళ్తుందని భావించారు. కానీ స్వ్కెర్ లెగ్‌లో ఉన్న చమీరా అద్బుత విన్యాసం చేశాడు. స్వ్కెర్ లెగ్ నుంచి పరిగెత్తుకుంటూ గాల్లోకి జంప్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు.
దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం ఒక్కసారిగా బిత్తరపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటిగా నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు.
Two moments of brilliance ✌
Andre Russell's 1️⃣0️⃣6️⃣m six 🤩
Dushmantha Chameera's spectacular grab 🤯
Which was your favourite out of the two? ✍
Scorecard ▶ https://t.co/saNudbWINr #TATAIPL | #DCvKKR | @KKRiders | @DelhiCapitals pic.twitter.com/9griw9ji4f— IndianPremierLeague (@IPL) April 29, 2025