
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్రూక్ విధ్వంసకర ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు.
ముల్తాన్ వికెట్‌పై పాక్ బౌలర్లకు బ్రూక్ చుక్కలు చూపించాడు. అతడని ఆపడం ఎవరి తరం కాలేదు. 310 బంతుల్లో 28 ఫోర్లు, 3 సిక్స్‌లతో బ్రూక్ తన తొలి ట్రిపుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
బ్రూక్ ప్రస్తుతం 305 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు సీనియర్ ఆటగాడు జో రూట్(262) డబుల్ సెంచరీ సాధించాడు. రూట్‌తో కలిసి హ్యారీ బ్రూక్ నాలుగో వికెట్ 454 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇంగ్లండ్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 147 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 795 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 239 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.