
PC: IPL.com
ఐపీఎల్-2022లో టీమిండియా వెటరన్ కీపర్, ఆర్సీబీ స్టార్ ఆటగాడు దినేష్ కార్తీక్ దుమ్మురేపుతున్నాడు. శనివారం(ఏప్రిల్ 16) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో అజేయంగా 66 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా మ్యాచ్ అనంతరం దినేష్ కార్తీక్‌ను తన సహచర ఆటగాడు విరాట్ కోహ్లి ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలో కార్తీక్‌పై కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు.
అదే విధంగా కార్తీక్‌ను తన ఫ్యూచర్ గోల్స్ కోసం ఆడగగా.. తన మనసులోని మాటను అతడు బయట పెట్టాడు. టీమిండియాలో చోటు కోసం తాను అన్ని విధాలుగా కష్టపడుతున్నానని కార్తీక్ తెలిపాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తరపున ఆడాలన్నతన కోరికను కార్తీక్ వ్యక్తం చేశాడు. "భారత్ తరుపున మళ్లీ ఆడాలనేది నా లక్ష్యం. టీ20 ప్రపంచకప్ దగ్గరలోనే ఉందని నాకు తెలుసు.నేను జట్టులో చోటు కోసం చాలా కష్టపడుతున్నాను
వరల్డ్‌కప్ జట్టులో బాగమై భారత్ విజయంలో నా వంతు పాత్ర పోషించాలి అనుకుంటున్నాను. భారత్ ఐసీసీ టోర్నమెంట్‌లను గెలిచి చాలా కాలం అయ్యింది. కాబట్టి భారత్ ఈ ప్రపంచకప్‌లో టైటిల్ నెగ్గాలని కోరుకుంటున్నాను" అని కార్తీక్ పేర్కొన్నాడు. కాగా 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ జట్టుకు కార్తీక్ ప్రాతినిధ్యం వహించాడు.
చదవండి: IPL 2022: కోహ్లి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. అనుష్క శర్మ వైపు చూస్తూ.. వైరల్