
రాహుల్ త్రిపాఠి (PC: BCCI)
రాహుల్ త్రిపాఠి అద్భుత సిక్సర్.. వైరల్ వీడియో
India vs New Zealand, 3rd T20I- Viral Video: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా ఎట్టకేలకు టీమిండియా వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి తన ముద్ర వేయగలిగాడు. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో రాణించి సత్తా చాటాడు. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొన్న త్రిపాఠి 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 44 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుత అజేయ సెంచరీ(126- నాటౌట్)తో మెరిసిన వేళ.. టీమిండియా భారీ స్కోరు చేయడంతో తన వంతు పాత్ర పోషించాడు త్రిపాఠి. అయితే, అర్ధ శతకానికి ఆరు పరుగుల దూరంలో నిలిచిపోవడం తనను నిరాశపరిచింది.
ఇంకొన్ని రన్స్ తీసి ఉంటే బాగుండేది
ఈ విషయం గురించి రాహుల్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘ఇంకొన్ని రన్స్ తీసి ఉంటే నేను మరింత సంతోషంగా ఉండేవాడిని. రాహుల్ సర్ సహా ప్రతి ఒక్కరు.. నాదైన శైలిలో నన్ను ఆడమని ప్రోత్సహించారు. పవర్‌ప్లేలో వీలైనన్ని పరుగులు రాబట్టమని చెప్పారు. నేను అలాగే చేశాను.
కానీ.. మరికొన్ని పరుగులు చేస్తే ఇంకా బాగుండేది. ఏదేమైనా.. అహ్మదాబాద్ స్టేడియంలో అద్భుతమైన ప్రేక్షకుల నడుమ ఆడటం.. మేము సిరీస్ గెలవడం సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లతో రాణించిన రాహుల్ త్రిపాఠి మొదట కొట్టిన సిక్స్ మాత్రం హైలైట్‌గా నిలిచింది.
సూర్యను గుర్తు చేసిన త్రిపాఠి
ఇండియా ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ మూడో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్. ఈ బాల్‌ను ఫైన్‌లెగ్ మీదుగా సిక్సర్‌గా మలిచిన త్రిపాఠి.. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేశాడు.
త్రిపాఠి స్కూప్ షాట్‌కు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా హాఫ్ సెంచరీకి చేరువైన తరుణంలో మరో భారీ షాట్‌కు యత్నించిన త్రిపాఠి ఇష్ సోధి బౌలింగ్‌లో ఫెర్గూసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. తొలి టీ20లో డకౌట్ అయిన రాహుల్ త్రిపాఠి.. రెండో మ్యాచ్‌లో 13 పరుగులు మాత్రమే చేసి విమర్శలపాలైన సంగతి తెలిసిందే.
చదవండి: Shubman Gill Century: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్ రావాల్సిందే!
SA Vs Eng: అన్నా.. ఏందన్నా ఇది! ఇలాంటి షాట్ ఎవరూ ట్రై చేసి ఉండరు! వైరల్
That SIX by Rahul Tripathi tho! 😍#INDvNZ pic.twitter.com/yXiBJuKLu2
— Punjab Kings (@PunjabKingsIPL) February 1, 2023