చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం | IND vs SA, 2nd Test Day 2: Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND VS SA 2nd Test Day 2: చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం

Published Thu, Jan 4 2024 2:56 PM | Last Updated on Thu, Jan 4 2024 6:39 PM

IND vs SA, 2nd Test Day 2: Updates And Highlights - Sakshi

South Africa Vs India 2nd Test 2024 Day 2 Updates- కేప్‌టౌన్‌:

చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం
కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం​ సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ 1-1తో సమంగా ముగిసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్‌ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా  (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటై, భారత్‌ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను భారత్‌ ఆడుతూ పాడుతూ ఛేదించింది.  

స్కోర్‌ వివరాలు..
సౌతాఫ్రికా- 55 (వెర్రిన్‌ 15, సిరాజ్‌ 6/15), 176 (మార్క్రమ్‌ 106, బుమ్రా 6/61)
భారత్‌- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్‌ 28, జన్సెన్‌ 1/15)
7 వికెట్ల తేడాతో భారత్‌ విజయం

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి ఔట్‌
75 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. జన్సెన్‌ బౌలింగ్‌లో కోహ్లి (12) ఔటయ్యాడు. భారత్‌ లక్ష్యానికి ఇంకా నాలుగు పరుగుల
దూరంలో ఉంది.

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. గిల్‌ ఔట్‌
57 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (10) ఔటయ్యాడు. భారత్‌ గెలుపుకు ఇంకా 22 పరుగుల దూరంలో ఉంది.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌.. జైస్వాల్‌ ఔట్‌
44 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. బర్గర్‌ బౌలింగ్లో జైస్వాల్‌ (28) ఔటయ్యాడు.భారత్‌.. దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక గెలుపుకు ఇంకా 35 పరుగుల దూరంలో ఉంది.

దూకుడుగా ఆడుతున్న జైస్వాల్‌.. లక్ష్యంగా దిశగా దూసుకుపోతున్న టీమిండియా
79 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా దూకుడుగా ఆడుతుంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్‌ టీ20 తరహాలో విరుచుకుపడుతున్నాడు. అతను కేవలం 21 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. రోహిత్‌ 6 పరుగులతో అతని జతగా క్రీజ్‌లో ఉన్నాడు. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 35/0గా ఉంది.

176 పరుగులకు ఆలౌటైన సౌతాఫ్రికా.. టీమిండియా టార్గెట్‌ ఎంతంటే..?
సౌతాఫ్రికా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ 176 పరుగుల వద్ద ముగిసింది. మార్క్రమ్‌ అద్భుతమైన సెంచరీ సాధించిన అనంతరం​ సౌతాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఆఖరి వికెట్‌ (ఎంగిడి (8)) కూడా బుమ్రాకే దక్కింది. దీంతో బుమ్రా ఖాతాలో ఆరు వికెట్లు చేరాయి. తొలి ఇన్నింగ్స్‌లో రెండు, ఈ ఇన్నింగ్స్‌లో ఆరు కలుపుకుని బుమ్రా ఖాతాలో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడ్డాయి. బుమ్రాతో పాటు ముకేశ్‌ 2, సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో వికెట్‌ దక్కించుకున్నారు. టీమిండియా టార్గెట్‌ 79 పరుగులుగా ఉంది. మ్యాచ్‌కు లంచ్‌ విరామం ప్రకటించారు. 

భారత పేసర్ల విజృంభణ.. తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
32.1: ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన రబడ(2)

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
31.4: సిరాజ్‌ బౌలింగ్‌లో సెంచరీ హీరో మార్క్రమ్‌ అవుట్‌

సెంచరీ పూర్తి చేసిన మార్క్రమ్‌.. 60 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా
ఓపెనర్‌గా బరిలోకి దిగిన మార్క్రమ్‌ అత్యంత కఠినమైన పిచ్‌పై అద్బుత సెంచరీతో (99 బంతుల్లో 102 నాటౌట్‌; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున ఇది ఆరో వేగవంతమైన సెంచరీ కూడా కావడం విశేషం.  

ఐదేసిన బుమ్రా.. పట్టుబిగించిన టీమిండియా
3 వికెట్ల నష్టానికి 62 పరుగుల స్కోర్‌ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. బుమ్రా ధాటికి తొలి సెషన్‌లోనే మరో 4 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా బుమ్రా ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో (5/59) చెలరేగడంతో సౌతాఫ్రికా 30 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 60 పరుగుల ఆధిక్యంలో ఉంది. మార్క్రమ్‌ (102 నాటౌట్‌) అద్భుత శతకంతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. అతనికి జతగా రబాడ (2) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 2 వికెట్లు పడగొట్టాడు. 

సౌతాఫ్రికా వర్సెస్‌ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు
సౌతాఫ్రికా
డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి.

టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్‌ కృష్ణ, ముకేష్ కుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement