IND vs ENG 3rd ODI: మూడో వన్డేలో భారత్‌ ఘన విజయం | India vs Eng 3rd odi live updates and highlights | Sakshi
Sakshi News home page

IND vs ENG 3rd ODI: మూడో వన్డేలో భారత్‌ ఘన విజయం

Published Wed, Feb 12 2025 2:44 PM | Last Updated on Wed, Feb 12 2025 9:04 PM

India vs Eng 3rd odi live updates and highlights

IND vs ENG 3rd Odi Live Updates: 

భారత్‌ ఘన విజయం..
అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో భారత్‌ ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌ స్వీప్‌ చేసింది. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్‌ జట్టు.. 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణాచ, అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుందర్‌, కుల్దీప్‌ చెరో వికెట్‌ సాధించారు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో గాస్‌ అట్కినసన్‌(38), టామ్‌ బాంటన్‌(38) టాప్‌ స్కోరర్లగా నిలవగా.. డకెట్‌(34) మరోసారి దూకుడుగా ఆడాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి భారత్‌ ఆలౌట్‌ అయింది. శుబ్‌మన్‌ గిల్‌(112) శతక్కొట్టగా.. విరాట్‌ కోహ్లి(52), శ్రేయస్‌ అ‍య్యర్‌(78) అర్ధ శతకాలతో రాణించారు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌రాహుల్‌ సైతం 29 బంతుల్లోనే 40 పరుగులతో మెరిశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్‌ వుడ్‌ రెండు, సకీబ్‌ మహమూద్‌, గస్‌ అట్కిన్సన్‌, జో రూట్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

ఓటమి దిశగా ఇంగ్లండ్‌..
ఇంగ్లండ్‌ వరుస క్రమంలో మూడు వికెట్లను కోల్పోయింది. తొలుత హ్యారీ బ్రూక్‌ను హర్షిత్‌ రాణా క్లీన్‌ బౌల్డ్‌ చేయగా.. ఆ తర్వాత లైమ్‌ లివింగ్‌ స్టోన్‌, అదిల్‌ రషీద్‌ పెవిలియన్‌కు చేరారు. 31 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 179/8

ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ డౌన్‌..
జోస్‌ బట్లర్‌ రూపంలో ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన బట్లర్‌.. హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ డౌన్‌..
జో రూట్‌ రూపంలో ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 24 పరుగులు చేసిన రూట్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ వచ్చాడు. 22 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 137/4

మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
టామ్‌ బాంటన్‌ రూపంలో ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో కీపర్‌ కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి అతడు పెవిలియన్‌ చేరాడు. మొత్తం 41 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేసి నిష్క్రమించాడు.  ఇంగ్లండ్‌ స్కోరు: 126/3 (18). రూట్‌ 20 పరుగులతో ఉండగా.. హ్యారీ బ్రూక్‌ క్రీజులోకి వచ్చాడు.
నిలకడగా ఆడుతున్న రూట్‌, బాంటన్‌
ఇంగ్లండ్‌ బ్యాటర్లు టామ్‌ బాంటన్‌(25), జో రూట్‌(9) నిలకడగా ఆడుతున్నారు. 14 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 102/2

ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ డౌన్‌.. సాల్ట్‌ ఔట్‌
ఫిల్‌ సాల్ట్‌ రూపంలో ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన సాల్ట్‌.. అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి జో రూట్‌ వచ్చాడు. 10 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 84/2. 

ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ డౌన్‌​..
60 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. దూకుడుగా ఆడిన బెన్‌ డకెట్‌(32).. అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి టామ్‌ బాంటన్‌ వచ్చాడు.

టీమిండియా భారీ స్కోరు
ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శుబ్‌మన్‌ గిల్‌(112) శతక్కొట్టగా.. విరాట్‌ కోహ్లి(52), శ్రేయస్‌ అ‍య్యర్‌(78) అర్ధ శతకాలతో రాణించారు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌రాహుల్‌ సైతం 29 బంతుల్లోనే 40 పరుగులతో మెరిశాడు. 

ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి భారత్‌ ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్‌ వుడ్‌ రెండు, సకీబ్‌ మహమూద్‌, గస్‌ అట్కిన్సన్‌, జో రూట్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన హర్షిత్‌ రాణా
టెయిలెండర్‌ హర్షిత్‌ రాణా రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. గస్‌ అట్కిన్సన్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి అతడు పెవిలియన్‌ చేరాడు. 10 బంతుల్లో 13 పరుగులు చేసి నిష్క్రమించాడు. భారత్‌ స్కోరు: 353-8(49). అర్ష్‌దీప్‌ సింగ్‌ క్రీజులోకి వచ్చాడు.

ఏడో వికెట్‌ డౌన్‌.. రాహుల్‌ నిష్క్రమణ
కేఎల్‌ రాహుల్‌ రూపంలో టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. ఇంగ్లండ్‌ పేసర్‌ సకీబ్‌ మహమూద్‌ బౌలింగ్‌లో లెగ్‌ బిఫోర్‌ వికెట్‌(ఎల్‌బీడబ్ల్యూ)గా రాహుల్‌.. 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. హర్షిత్‌ రాణా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 334-7(47).

ఆరో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
జో రూట్‌ బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టామ్‌ బాంటన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. వాషింగ్టన్‌ సుందర్‌ క్రీజులోకి రాగా.. కేఎల్‌ రాహుల్‌ 21 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 308-6(44). 

టీమిండియా ఐదో వికెట్‌ డౌన్‌.. పాండ్యా ఔట్‌
టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన పాండ్యా.. అదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి అక్షర్‌ పటేల్‌ వచ్చాడు. 42 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 295/5

అయ్యర్‌ ఔట్‌.. 
టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 78 పరుగులు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌.. అదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.క్రీజులోకి హార్దిక్‌ పాండ్యా వచ్చాడు. 40 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 275/4

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
సెంచరీ వీరుడు శుబ్‌మన్‌ గిల్‌ రూపంలో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో గిల్‌ బౌల్డ్‌ అయ్యాడు. 112 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కేఎల్‌ రాహుల్‌ క్రీజులోకి రాగా.. శ్రేయస్‌ అయ్యర్‌ 52 పరుగులతో ఉన్నాడు. స్కోరు​: 227/3 (34.4) 

గిల్‌ సెంచరీ..
అహ్మదాబాద్‌ వన్డేలో టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీతో మెరిశాడు. 92 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో సాయంతో గిల్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్‌కు ఇది ఏడో వన్డే సెంచరీ కావడం విశేషం. 31 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 213/2. క్రీజులో గిల్‌(104)తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌(48) ఉన్నాడు.

విరాట్‌ కోహ్లి ఔట్‌..
విరాట్‌ కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 52 పరుగులు చేసిన కోహ్లి.. అదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చాడు.

గిల్‌, కోహ్లి హాఫ్‌ సెంచరీలు..
మూడో వన్డేలో టీమిండియా స్టార్‌ ప్లేయర్లు విరాట్‌ కోహ్లి(51), గిల్‌(60) అదరగొడుతున్నారు. వీరిద్దరూ ఈ మ్యాచ్‌లో తమ హాఫ్‌ సెంచరీలను పూర్తి చేస్తున్నారు. 18 ఓవర్లకు భారత్‌ స్కోర్‌​: 120/1

నిలకడగా ఆడుతున్న కోహ్లి, గిల్‌..
16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 97 పరుగులు చేసింది. కోహ్లి(41), గిల్‌(48) నిలకడగా ఆడుతున్నారు.
10 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 52/1
10 ఓవర్లు ముగిసే టీమిండియా వికెట్‌ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లి(17), శుబ్‌మన్‌ గిల్‌(28) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రూపంలో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. రెండో వన్డేల్లో విధ్వంసకర శతకం(119)తో చెలరేగిన రోహిత్‌.. తాజాగా ఒక్క పరుగుకే నిష్క్రమించాడు. మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ ఫిలిప్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 8-1(2)

అహ్మదాబాద్ వేదిక‌గా మూడో వ‌న్డేలో భార‌త్‌-ఇంగ్లండ్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈమ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓ మార్పుతో బ‌రిలోకి దిగింది. జేమీ ఓవర్టన్‌ స్థానంలో టామ్‌ బాంటన్‌ జట్టులోకి వచ్చాడు.

 మ‌రోవైపు భార‌త్ మూడు మార్పులతో ఆడుతోంది.  రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీలకు విశ్రాంతి ఇవ్వ‌గా.. స్పిన్న‌ర్ వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి గాయం కార‌ణంగా దూర‌మ‌య్యాడు.  ఈ ముగ్గురి స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్ యాద‌వ్ తుది జ‌ట్టులోకి వ‌చ్చారు.

కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సూర్యకుమార్‌ సేన చేతిలో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌లో 4-1తో ఓడిపోయిన బట్లర్‌ బృందం.. వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది.

నాగ్‌పూర్‌, కటక్‌ వేదికలుగా జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్‌ సేన జయభేరి మోగించగా.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ 2-0తో ఓటమిపాలైంది. తాజాగా అహ్మదాబాద్‌ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది. 

తుదిజట్లు
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.

ఇంగ్లండ్‌
ఫిలిప్ సాల్ట్(వికెట్‌ కీపర్‌), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్‌), టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకీబ్‌ మహమూద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement