IPL 2022 DC Vs KKR: Delhi Capitals To Wear Special Rainbow Jersey Against KKR - Sakshi
Sakshi News home page

IPL 2022 DC Vs KKR: కేకేఆర్‌తో మ్యాచ్‌లో న్యూలుక్‌తో బ‌రిలోకి దిగ‌నున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

Published Thu, Apr 28 2022 6:03 PM | Last Updated on Thu, Apr 28 2022 6:42 PM

IPL 2022: Delhi Capitals To Wear Special Rainbow Jersey Against KKR - Sakshi

ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో ఇవాళ (ఏప్రిల్ 28) మ‌రో కీల‌క స‌మ‌రం జ‌రుగ‌నుంది. ప్ర‌స్తుత సీజ‌న్‌లో అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా రాణించ‌లేక‌పోతున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు నేటి మ్యాచ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.  వాంఖ‌డే వేదిక‌గా జ‌రుగ‌బోయే ఈ పోరులో గెలుపు కోసం ఇరు జ‌ట్లు హోరాహోరీగా త‌ల‌ప‌డ‌నున్నాయి. రాత్రి 7:30 గంట‌ల‌కు ప్రారంభమ‌య్యే ఈ మ్యాచ్‌లో గెలిచే జ‌ట్టు ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్ల‌నుండ‌గా, ఓడిన జ‌ట్టు ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకోనుంది. ఢిల్లీ జ‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజ‌యాలు 4 ప‌రాజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉండ‌గా, కేకేఆర్.. తామాడిన 8 మ్యాచ్‌ల్లో 3 విజ‌యాలు 5 అప‌జ‌యాల‌తో 8వ‌ స్థానంలో నిలిచింది. 


ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో త‌ల‌ప‌డ‌బోయే నేటి మ్యాచ్‌లో ఢిల్లీ జ‌ట్టు న్యూలుక్‌లో క‌న‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో పంత్ సేన కొత్త జెర్సీలు ధ‌రించి బ‌రిలోకి దిగ‌నుంది. భార‌త దేశ‌పు యొక్క వైవిధ్యం ప్రతిబింబించేలా నీలం రంగులో ఉన్న రెయిన్‌బో జెర్సీల‌తో ఢిల్లీ ఆట‌గాళ్లు నేటి మ్యాచ్ ఆడ‌నున్నారు. ఢిల్లీ యాజ‌మాన్యం ప్ర‌తి సీజన్‌లో ఓ మ్యాచ్‌ను నీలం రంగు రెయిన్‌బో జెర్సీల‌తో ఆడ‌టాన్ని ఆన‌వాయితీగా పెట్టుకుంది. ప్ర‌స్తుత సీజ‌న్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో కొత్త జెర్సీలు ధ‌రించి త‌మ అన‌వాయితీని కంటిన్యూ చేయ‌నుంది. త‌మ ఆట‌గాళ్లు కొత్త జెర్సీల‌తో ఉన్న ఫోటోల‌ను డీసీ యాజ‌మాన్యం ట్విట‌ర్‌లో షేర్ చేసింది. సెకెండాఫ్ మ్యాచ్‌ల ప్రారంభానికి క‌ల‌ర్‌ఫుల్ జెర్సీల‌తో అంటూ క్యాప్ష‌న్‌ను జోడించింది.  
చ‌ద‌వండి: కోహ్లికి విశ్రాంతి; ఒక్క సిరీస్‌కేనా.. పూర్తిగా పక్కనబెట్టనున్నారా?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement