
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ప్రొటీస్ జట్టు.. కెప్టెన్ డీన్ ఎల్గర్ వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. ఓ అద్భుతమైన డెలివరీతో బుమ్రా.. ఎల్గర్‌ని పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో బుమ్రా వేసిన లెంగ్త్ డెలివరీకి ఎల్గర్ అడ్డంగా దొరికిపోయాడు. బుమ్రా వేసిన లెంగ్త్ డెలివరీను ఎల్గర్ ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్‌లో ఉన్న పుజారా చేతికి వెళ్లింది. దీంతో పూర్తి నిరాశతో ఎల్గర్ వెనుదిరిగాడు. అంతకముందు కెప్టెన్ కోహ్లి(79) ఓంటరి పోరాటం చేయడంతో 223 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ను భారత్ చేయగల్గింది. సఫారీ బౌలర్లలో రబాడ 4, మార్కో జన్సెన్ 3, ఒలీవియర్, ఎంగిడి, కేశవ్ మహారాజ్ తలో వికెట్ సాధించారు. ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి దక్షిణాఫ్రికా 17 పరుగులు చేసింది. క్రీజ్‌లో మార్క్రమ్(8), కేశవ్ మహారాజ్(6) ఉన్నారు.
— Sunaina Gosh (@Sunainagosh7) January 11, 2022
చదవండి: SA vs IND: కోహ్లి షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్.. వెంటనే మయాంక్ ఔటయ్యాడు.. వీడియో వైరల్