
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తిరిగి పుంజుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగల్గింది.
ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అక్షర్ పటేల్(43) ఫర్వాలేదన్పించాడు. వీరితో విప్రజ్ నిగమ్(19 బంతుల్లో 38) ఆఖరిలో మెరుపులు మెరిపించనప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, అనుకుల్ రాయ్,రస్సెల్, ఆరోరా తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
చదవండి: IPL 2025: వావ్.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్