అతడిని బ్యాన్‌ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం | Kuldeep Yadav Slaps Rinku Singh Twice As KKR Star Left Shocked, Watch Viral Video And Fans Reactions Inside | Sakshi
Sakshi News home page

Kuldeep Slaps Rinku Singh: అతడిని బ్యాన్‌ చేయండి, టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం

Published Wed, Apr 30 2025 9:25 AM | Last Updated on Wed, Apr 30 2025 11:11 AM

Kuldeep Yadav Slaps Rinku Singh Twice As KKR star left shocked Fans Reacts

Photo Courtesy: BCCI/JioHotstar

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav)పై నెటిజన్లు మండిపడుతున్నారు. అనుచితంగా ప్రవర్తించినందుకు అతడిపై నిషేధం విధించాలంటూ సోషల్‌ మీడియా వేదికగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?!

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో కుల్దీప్‌ యాదవ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అతడు 12 వికెట్లు తీశాడు. ప్రదర్శన పరంగా ఫర్వాలేదనిపిస్తున్నా.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో కుల్దీప్‌ ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది.

204 పరుగులు
ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు.. కేకేఆర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో రహానే సేన నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 204 పరుగుల స్కోరు సాధించింది.

భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆఖరి వరకు పోరాడి పద్నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆనవాయితీ ప్రకారం ఇరుజట్ల ఆటగాళ్ల కరచాలనం చేసుకున్న తర్వాత.. కొంత మంది విడివిడిగా మాట్లాడుకున్నారు.

రింకూ చెంపపై కొట్టిన కుల్దీప్‌
ఈ నేపథ్యంలో కుల్దీప్‌ యాదవ్‌ (ఢిల్లీ)- రింకూ సింగ్‌ (కేకేఆర్‌)తో సరదాగా సంభాషించాడు. ఇద్దరూ కలిసి జోకులు వేసుకుంటూ నవ్వులు చిందించారు. కానీ అంతలోనే కుల్దీప్‌ రింకూ చెంపపై కొట్టాడు. దీంతో రింకూ కాస్త ఆశ్చర్యానికి లోనయ్యాడు.

అయితే, మరోసారి కుల్దీప్‌ అదే పని చేయడంతో రింకూ ముఖంలో రంగులు మారిపోయాయి. కుల్దీప్‌ చర్య అతడికి ఎంతమాత్రం నచ్చలేదని అతడి ఎక్స్‌ప్రెషన్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అతడి నిబ్యాన్‌ చేయండి
ఈ నేపథ్యంలో కుల్దీప్‌ యాదవ్‌ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత చొరవ ఉన్నప్పటికీ లైవ్‌లో ఉన్నప్పుడు సహచర ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. ఇలాంటి వాళ్లను ఉపేక్షించకూడదని.. ఒకటీ, రెండు మ్యాచ్‌లలో ఆడకుండా నిషేధం విధిస్తేనే దారిలోకి వస్తారంటూ బీసీసీఐని ట్యాగ్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ మూడు ఓవర్ల బౌలింగ్‌లో 27 పరుగులు ఇచ్చి.. వికెట్లు ఏమీ తీయలేకపోయాడు. మరోవైపు రింకూ కేకేఆర్‌ తరఫున ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. 25 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి.

ఐపీఎల్‌-2025: ఢిల్లీ వర్సెస్‌ కేకేఆర్‌
👉కేకేఆర్‌ స్కోరు: 204/9 (20)
👉ఢిల్లీ స్కోరు: 190/9 (20)
👉ఫలితం: ఢిల్లీపై 14 పరుగుల తేడాతో గెలిచిన కేకేఆర్‌
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: సునిల్‌ నరైన్‌ (16 బంతుల్లో 27 రన్స్‌, 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు).

చదవండి: సూర్యవంశీపై శుబ్‌మన్ గిల్ కామెంట్స్‌.. జడేజా కౌంట‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement