
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో నిరాశ పరిచిన కోహ్లి.. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలోనూ విఫలమయ్యాడు. ఈ క్రమంలో విండీస్ పర్యటనకు దూరంగా ఉన్న కోహ్లి తిరిగి ఆసియా కప్‌కు భారత జట్టులోకి రానున్నాడు. కాగా యూఏఈ వేదికగా ఆగస్ట్ 27 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది. మొత్తం 6 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొనున్నాయి. ఈ సిరీస్ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్‌ను ప్రముఖ స్ఫోర్ట్స్ ఛానల్ స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది.
ఇక తాజాగా ఈ టోర్నీకి సంబంధించిన ప్రోమోను స్టార్ స్పోర్ట్స్ ట్విటర్ వేదికగా విడుదల చేసింది. అదే విధంగా ఈ టోర్నీకి సంబంధించి కోహ్లి స్టేట్ మెంట్‌ను కూడా స్టార్ స్పోర్ట్స్ శనివారం రిలీజ్ చేసింది. "టీమిండియాకు ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ అందించడమే నా ప్రధాన లక్ష్యం. అదే విధంగా జట్టుకు ఇక ఆటగాడిగా ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నా" అంటూ కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్లోఅత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు. వన్డే,టీ20 ఫార్మాట్‌లలో కలిపి 14 ఇన్నింగ్స్‌లలో 766 పరుగులు సాధించాడు.
చదవండి: ఆ యువ ఆటగాడు సైమండ్స్‌ను గుర్తు చేస్తున్నాడు: రికీ పాంటింగ్
The man whose passion brings the game alive! 🫶
— Star Sports (@StarSportsIndia) July 24, 2022
Drop a 💥 below if you agree with @KamiAkmal23!#BelieveInBlue #TeamIndia pic.twitter.com/k0tEJ5uyfz