
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. హెచ్‌సీఏలో అవినీతి పెరిగిపోయిందని.. సెలక్షన్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ తీరును ప్రభుత్వం గమనిస్తుందని త్వరలోనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
''ఉప్పల్ స్టేడియంకు సంబంధించిన లీజ్ త్వరలో ముగిసిపోతుంది. ఉప్పల్ స్టేడియం లీజ్‌పై ప్రభుత్వం పునరాలోచనలో ఉంది. హెచ్‌సీఏ అవినీతిని దృష్టిలో పెట్టుకొని ఉప్పల్ స్టేడియాన్ని స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించే యోచనలో ఉన్నాం.'' అని వెల్లడించారు.
చదవండి: చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్!