
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రికెల్టన్ విధ్వంసం సృష్టించాడు. రికెల్టన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే లక్నో బౌలర్లపై విరుచుకుపడ్దాడు. ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు.
ఈ క్రమంలో రికెల్టన్ కేవలం 25 బంతుల్లోనే తన రెండో ఐపీఎల్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 32 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిసిన రికెల్టన్ ఓ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికెల్టన్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు తిలక్ వర్మ పేరిట ఉండేది. ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో వర్మ కేవలం 26 బంతుల్లో ఆర్ధ శతకం సాధించాడు. తాజా మ్యాచ్‌తో వర్మను రికెల్టన్ అధిగమించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.
చదవండి: టీమిండియాపై సంచలన శతకం సాధించిన ఆటగాడిపై నిషేధం