Tokyo Olympics: మ్యాచ్‌ గెలిచినా ఇంటిదారి ప‌ట్టిన భార‌త జోడీ | Tokyo Olympics: Satwik, Chirag pair Out Of Mens Doubles Badminton | Sakshi
Sakshi News home page

Tokyo Olympics: మ్యాచ్‌ గెలిచినా ఇంటిదారి ప‌ట్టిన భార‌త జోడీ

Published Tue, Jul 27 2021 3:33 PM | Last Updated on Tue, Jul 27 2021 3:33 PM

Tokyo Olympics: Satwik, Chirag pair Out Of Mens Doubles Badminton - Sakshi

టోక్యో: భారత షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్ షెట్టి జోడీ మంగ‌ళ‌వారం జ‌రిగిన గ్రూప్ ఎ పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌లో విజ‌యం సాధించారు. బ్రిట‌న్‌కు చెందిన బెన్ లేన్‌, సీన్ వెండీల‌పై 21-17, 21-19 తేడాతో గెలుపొందారు. అయితే గ్రూప్‌ దశలో మ‌రో మ్యాచ్ మిగిలి ఉన్నా క్వార్ట‌ర్స్‌కు మాత్రం వీళ్లు క్వాలిఫై కాలేక‌పోయారు. మ‌రో మ్యాచ్‌లో చైనీస్ తైపీ జోడీ లీ యాంగ్‌, వాంగ్ చిలిన్ జోడీ ప్రపంచ నంబ‌ర్ వ‌న్‌ ఇండోనేషియా జోడీ మార్క‌స్ గిడియోన్‌, కెవిన్ సుక‌ముల్జో జోడీపై గెల‌వ‌డం సాత్విక్‌, చిరాగ్ అవ‌కాశాల‌ను దెబ్బ‌తీసింది. కాగా, సోమ‌వారం జ‌రిగిన తొలి మ్యాచ్‌లో మార్క‌స్ గిడియోన్‌, కెవిన్ సుక‌ముల్జో జోడీ 21-13, 21-12 తేడాతో సాత్విక్‌, చిరాగ్‌ల జోడీపై గెలుపొందిన విష‌యం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement