
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌కు ముందు టీమిండియాను ఓ విషయం బయపెడుతుంది. అదేంటంటే.. ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు మ్యాచ్ వేదిక అయిన ఓవల్‌లో అద్భుతమైన రికార్డు ఉండటం. ఈ ఆసీస్ స్టార్ ఓవల్ మైదానంలో ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 97.75 సగటున 391 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు (138*, 143), ఓ హాఫ్ సెంచరీ (80) ఉన్నాయి. ఓవల్‌లో స్మిత్‌కు ఉన్న ఈ రికార్డే ప్రస్తుతం టీమిండియాను కలవరపెడుతుంది.
స్మిత్‌కు కళ్లెం వేసే వ్యూహరచనలో భారత బౌలర్లు నిమగ్నమయ్యారు. అతన్ని ఎలాగైనా తొందరగా ఔట్ చేయాలని వారు భావిస్తున్నారు. స్మిత్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. స్మిత్‌ను తొందరగా పెవిలియన్‌కు పంపితే మంచిదని, అతను క్రీజ్‌లో కుదురుకుంటే చాలా ప్రమాదమని వారు వార్నింగ్ ఇస్తున్నారు.
స్మిత్‌కు ఇంగ్లండ్‌లో వాతావరణ పరిస్థితులపై కూడా పూర్తి అవగాహణ ఉందని, అక్కడి పిచ్‌లపై అతను ఏకంగా 6 శతాకలు బాదాడని గుర్తు చేస్తున్నారు. మరోవైపు స్మిత్‌కు టీమిండియాపై కూడా ఘనమైన రికార్డు ఉన్న విషయాన్ని గుర్తించాలని అంటున్నారు. స్మిత్ భారత్‌పై 35 ఇన్నింగ్స్‌లు ఆడి 65.07 సగటున 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు సాయంతో 1887 పరుగులు చేశాడన్న విషయాన్ని మరవకూడదని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా స్మిత్‌తో జాగ్రత్తగా ఉండాలని, లేదంటి అతను మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడని వార్నింగ్ ఇస్తున్నారు.
కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని కెన్నింగ్‌స్టన్ ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే.