Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Waqf Amendment Act Hearing Live Updates April 17th Updates1
వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, సాక్షి: వక్ఫ్‌ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్‌ (సవరణ) చట్టం 2025ను సవాల్‌ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది. కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు. ఈ క్రమంలో.. వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దని సీజేఐ నేతృత్వంలోని బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. ‘‘వక్ఫ్‌ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దు. వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దు. వక్ఫ్, వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై చేయొద్దు వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై స్టేటస్ కో విధిస్తున్నాం. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు వారం రోజుల్లో సవివర రిప్లై దాఖలు చేయాలి. మరో ఐదు రోజుల్లో రిజైన్డర్ దాఖలు చేయాలి’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. గత విచారణలో(బుధవారం).. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుందిఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టంవక్ఫ్ అంటే ఇస్లాం కు అంకితమైందికేంద్రప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలుజేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామువక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమేహిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయిహిందూయేతర అధికారులు హిందూ ధార్మిక సంస్థలను నిర్వహిస్తున్నారువక్ఫ్ భై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారురిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకున్న అభ్యంతరం ఏమిటి సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యలుసుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయివక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైందిఅయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయిహిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదాపార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా ?హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదాఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమి లోనే ఉందని అంటున్నారు చారిత్రక , పురావస్తు ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించడానికి వీలు లేదు వక్ఫ్‌ పిటిషన్లపై విచారణ వేళ.. హైలైట్స్‌అంతకు ముందు.. వక్ఫ్ పిటిషన్ల విచారణను లైవ్ టెలికాస్ట్ కోరుతూ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ లేఖ రాసింది. బుధవారం విచారణ టైంలో కిక్కిరిసిపోయిన కోర్టు హాల్‌లో కనీసం నిలబడటానికి కూడా స్థలం సరిపోలేదని, ఊపిరి ఆడక ఇద్దరు లాయర్లు స్పృహ కోల్పోయారని లేఖలో ప్రస్తావించింది. 👉అధికారంలోకి రాగానే వక్ఫ్‌ చట్టాన్ని అడ్డుకుంటాం. బీహార్‌ను వక్ఫ్‌ అల్లర్లతో మరో బెంగాల్‌(ముర్షిదాబాద్‌)గా మార్చాలని వాళ్లు(కేంద్రంలోని బీజేపీ) అనుకుంటున్నారు. ఆర్జేడీ నాయకత్వంలో అది అయ్యే పని కాదు అని తేజస్వి యాదవ్‌ అన్నారు. 👉వక్ఫ్‌ చట్టం దేశ ప్రజల మధ్య ఐక్యతను క్రమంగా తుడిచిపెట్టేందుకేనని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వక్ఫ్‌ సవరణ చట్టం తెచ్చిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. ఇది ఫెడరలిజాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26ను ఉల్లంఘించడమేనని అన్నారాయన. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్య ద్వారా.. ఆరెస్సెస్‌, బీజేపీలు వక్ఫ్‌ చట్టం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ఇండియా కూటమి.. కలిసి పోరాడుదాంరాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్‌ సవరణ చట్టం అడ్డుకునేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా కలిసి రావాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. సొంత దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం.. సౌదీ అరేబియా, దుబాయ్‌ లాంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఆతిథ్యం మాత్రం స్వీకరిస్తున్నారని మండిపడ్డారు. ఏకతాటిపైకి వచ్చి వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు పోరాడాలని ఆమె అంటున్నారు.

YSRCP Bumana Karunakara Reddy Other Leaders House Arrest In Tirupati2
తిరుపతిలో గోవులన్నీ రిలయన్స్‌, జీ స్క్వేర్ నుంచి వచ్చాయి: భూమన

గోశాలకు భూమన అప్‌డేట్స్‌.. భూమన కామెంట్స్‌..మమ్మల్ని ఇంట్లోనే నిర్బంధించి కూటమి నేతలను అనుమతించారు.గోశాల సందర్శనకు రావాలని టీడీపీ నేతలే ఛాలెంజ్‌ విసిరారు.ఛాలెంజ్‌ విసిరిన వారే నన్ను గోశాలకు రాకుండా అడ్డుకున్నారు.నన్ను ఉదయం నుంచి పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.మా పార్టీ నేతలను కూడా ఎక్కడికక్కడే హౌస్‌ అరెస్ట్‌ చేశారు.ఉదయం నుంచి నేను కూడా వెయిట్‌ చేస్తున్నా అని వారికి చెప్పాను.నాకు సవాల్‌ విసిరిన పల్లా శ్రీనివాస్‌ తోకముడిచి గోశాల రాలేదు.ఛాలెంజ్‌ స్వీకరించి భయపడిపోయామని చిత్రీకరించే ప్రయత్నం చేశారు.టీడీపీ ఎమ్మెల్యేలు నాకు ఫోన్‌ చేసి గోశాలకు రమ్మన్నారు.నేను మరోసారి గోశాలకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.మమ్మల్ని బయటకు రానివ్వకపోగా తోసేశారు.కూటమి నేతల కుట్ర మీడియా సాక్షిగా బట్టబయలైంది.టీటీడీని ప్రక్షాళన చేస్తామన్న కూటమి సర్కార్‌ హామీ ఏమైంది?.170 గోవులు ఎందుకు మృత్యువాతపడ్డాయి.2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 176 ఆవులు మరణించాయని అధికారులే చెబుతున్నారు.గోవుల మృతిపై ఈవో, చైర్మన్‌, ఎమ్మెల్యే వ్యాఖ్యలకు పొంతన లేదు.గోశాలకు వెళ్ళేందుకు అనుమతి నిరాకరించారుగోశాలకు వెళ్ళకుండా అడ్డగించారుజిల్లా ఎస్పీ అధికారితో కూడా అబద్ధాలు మాట్లాడిస్తున్నారుగోశాలకు ఐదు మందిని అనుమతిస్తే ఎప్పుడూ అయినా మేము వెళ్లేందుకు సిద్ధం,గోశాలకు రేపు అయిన, ఎల్లుండి అయినా వచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాంగత ఏప్రిల్ నెల నుంచి ఏడాది మార్చి వరకూ 191 ఆవులు చనిపోయాయి అని గోశాల మేనేజర్ అధికారికంగా ఇచ్చారుప్రక్షాళన చేస్తామని చెప్పిన చంద్రబాబు ఈ పది నెలలు చేసిన ప్రక్షాళన ఇదేనామీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ నెల నుంచి మార్చి నెలవరకు 170 ఆవులు చనిపోయాయి అని అధికారికంగా ప్రకటించారు550 గోవులను రాజస్థాన్, పంజాబ్ నుంచి కొనుగోలు చేశారుటీవీ9 అధినేత రామేశ్వర రావు, రిలయన్స్ సంస్థ, జీ స్క్వేర్ సంస్థ ప్రతినిధులు దాతలుగా 550 ఆవులు కొనుగోలు చేసిటీటీడీ గోశాలకు గోవులు విరాళంగా ఇచ్చారుఇవన్నీ మా ప్రభుత్వ పాలనలో ఈవో జవహర్ రెడ్డి పాలనలో చేశాం, ఇది మా గొప్పతనంబైలోన మెథడ్ ద్వారా పెరుగును చిలకడం ద్వారా వెన్నను వెలికి తీసే పద్ధతి ప్రవేశ పెట్టాం, నవనీత సేవ ప్రవేశ పెట్టాంమీ పాలనలో ఆచారాలకు భిన్నంగా అరాచకాలు జరుగుతున్నాయితిరుమలలో శివ అనే డ్రైవర్ ను హత్య చేశారు70 ఏళ్ల తర్వాత తిరుమలలో హత్య జరిగింది,చెప్పులు వేసుకుని మహాద్వారం వద్ద పట్టుబడ్డారుగోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి అక్రమాలకు పాల్పడినప్పుడు మీ పాలనలో 8 నెలలు ఎందుకు కొనసాగించారుతొక్కిసలాట ఘటన లో ఎందుకు సస్పెండ్ చేశారుగోశాలలో గోవుల మరణాలను వాస్తవాలు పక్కదారి పట్టిస్తున్నారుమీ ఎల్లో మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారుదైవం కోసం జైలుకు వెళ్తాం, ప్రాణాలు అయినా అర్పిస్తాంసీఎం చంద్రబాబు నాయుడు ఒక్క ఆవు చనిపోలేదు అని ప్రకటన చేశారుపుట్టుకతోనే వృద్ధ ఆవులు అంటున్నారు టీటీడీ చైర్మన్మా పాలనలో రెండేళ్ల వయస్సు ఉన్న 550 గోవులు సాహివాల్ దాతలు సహాయంతో తీసుకు వచ్చాము,చంద్రబాబు పాలనలో స్పందన, ఉలుకు పలుకు లేదు, గృహ నిర్భందంహిందూ సమాజం అంతా ఈ వాస్తవాలు గ్రహించాలిఈ మూడు నెలల్లో తిరుమల వేదికగా ఎన్నో అరాచకాలు జరిగాయిఅజ్ఞానం తలకు ఎక్కిన వాళ్ళు సమాధానం చెప్తున్నారు,ఎవరి అజ్ఞానం వారి సొంత ఆస్తిస్వామి వారి అనుగ్రహం ఉంది కాబట్టే నేను మూడు సార్లు టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్నా.గర్భంతో ఉన్న సాహివాల్ ఆవు రైలు ఢీకొని మృతి చెందితే దాన్ని కప్పి పుచ్చేదుంకు ప్రయత్నం చేశారుచనిపోయిన ఆవు చెవుకు ఉన్న ట్యాగ్ కోసేశారు, వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత గోశాల ఆవు అని అంగీకరించారుస్వామి ఊరేగింపులో పాల్గొనే వృషభం కూడా చనిపోయింది, తిరుమల లో పూజలు అందుకునే ఆవు కూడా చనిపోయిందిఫొటోలు మార్పింగ్ కాదు.. ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామాగోశాలకు మరోసారి రమ్మని పిలిచి తోకముడిచిన టీడీపీభూమనకు ఫోన్‌ చేసి గోశాలకు రావాలన్న టీడీపీ ఎమ్మెల్యేలు.భూమనకు పులివర్తి నాని, సుధీర్‌రెడ్డి, శ్రీనివాసులు ఫోన్‌.ఇటు ఫోన్‌లో రమ్మని.. అటు అడ్డుకోవడానికి పోలీసులను పంపిన ఎమ్మెల్యేలు.మీడియా ముందు డ్రామాలడి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు.టీడీపీ నేతలకు జవాబు చెప్పడానికి మళ్లీ బయలుదేరిన భూమన.ఇంటి దగ్గరే భూమనను నిర్బంధించిన పోలీసులు.గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి.వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తిని లాక్కుపోయిన పోలీసులుగోశాల గేటు వద్ద అభినయ్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.మీడియా సాక్షిగా బట్టబయలైన టీడీపీ ఎమ్మెల్యేల బండారం.అభినయ్‌ రెడ్డి కామెంట్స్‌..సవాల్‌ స్వీకరిస్తే అడ్డుకోవడమేంటి?.కూటమి నేతలు భూమనకు ఫోన్‌ చేసి రమ్మంటారు.అక్కడ పోలీసులు అడ్డుకుంటారు.. ఇదేనా పద్దతి.ఎస్కార్ట్‌తో భూమనను గోశాల వద్దకు తీసుకురావాలి. తిరుపతిలో మరోసారి ఉద్రిక్తత..ఎంపీ గుర్తుమూర్తి కామెంట్స్‌..గోశాలకు రాకుండా భూమనను అడ్డుకున్నారు.వేరే దారిలో నేను గోశాలకు వచ్చాను.నిజాన్ని నిరూపించడానికి మేము సిద్ధం. ఉద్రిక్తత..కూటమి నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారు.ఒకవైపు.. పోలీసులతో నిర్బంధించిన కూటమి నేతలుమరోవైపు భూమనకు ఫోన్లు చేస్తున్న కూటమి నేతలు.గోశాలకు రావాలంటూ భూమనకు కూటమి నేతల ఫోన్లు.గోశాలకు బయలుదేరిన భూమనను అడ్డుకున్న పోలీసులు.గోశాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ నాయకులు భూమన అభినయ్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పల్లాకు భూమన ఫోన్‌ కాల్‌..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు భూమన ఫోన్‌మీరు ఎక్కడున్నారు.. మీ సవాల్‌కు ిసిద్ధమన్న భూమనగోశాలలో గోవుల మరణాలు నిగ్గు తేల్చేందుకు నేను సిద్ధం.మీరు ఎక్కుడున్నారని పల్లాను ప్రశ్నించిన భూమనఈ క్రమంలో భూమన కాల్‌ కట్‌ చేసిన పల్లా. మాజీ మంత్రి ఆర్కే రోజా కామెంట్స్‌..టీడీపీ నేతల సవాల్‌కు భూమన సిద్ధమయ్యారుగోశాల వద్దకు అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా?.సవాల్‌ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్‌?.కూటమి ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.కొండపై డ్రైవర్‌ను కొట్టి చంపితే విజిలెన్స్‌ ఏం చేస్తోంది?.శ్రీవారి ఆలయంపై డ్రోన్లు తిరుగుతుంటే ఏం చేస్తున్నారు?.క్యూలైన్‌లో తొక్కిసలాటపై ఒక్క అరెస్ట్‌ జరిగిందా?.సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్‌ కల్యాణ్‌?.భూమన కామెంట్స్‌..టీడీపీ నేత చాలెంజ్‌పైనే నేను స్పందించాను.గోశాలకు రావాలని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్‌ పిలిచారు.పోలీసు బలగాలతో నిర్బంధించడం దారుణం.గోవుల మృతిపై కూటమి నేతలు తలోమాట మాట్లాడుతున్నారు.గోశాల వద్ద ఘోరాలను వెలికితీస్తామని భయం పట్టుకుంది.నన్ను రమ్మన్న వాళ్లే ఇలా నిర్బంధించడం ఎంత వరకు కరెక్ట్‌?.టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతిస్తే ఏం ఉపయోగం?. తిరుపతి..👉గోశాలకు బయలుదేరిన భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు 👉పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్న భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి👉పద్మావతి పురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్న ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి👉తిరుపతి మేయర్‌ డాక్టర్‌ శిరీషను హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు.👉భూమన అభినయ రెడ్డి కామెంట్స్‌..భూమన ఒక్కరైనా గోశాలకు వెళ్తారు.తిరుమల శ్రీవారి ప్రతిష్టను కాపాడాలి.కూటమి సర్కార్‌ సవాల్‌ను మేము స్వీకరిస్తే ఎందుకు అనుమతించడం లేదు?.👉కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా తిరుపతి నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద తిరుచానూరు పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. భూమనతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హౌస్ అరెస్ట్ చేశారు.👉వివరాల ప్రకారం.. తిరుపతి నగరంలో ఉద్రిక్తత నెలకొంది. గోశాల గోవుల మృతిపై కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోంది. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని భూమనకు టీడీపీ సవాల్‌ చేసింది. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని వ్యాఖ్యానించింది. దీంతో, టీడీపీ ఛాలెంజ్‌ను భూమన కరుణాకర్‌రెడ్డి స్వీకరించారు. ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన తెలిపారు. ఈ క్రమంలో భూమనతో పాటు, తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు.👉మరోవైపు.. భూమన హౌస్‌ అరెస్ట్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు మాట్లాడారు. ఈ క్రమంలో భూమన కరుణాకరరెడ్డి రెడ్డి ఒక్కరినే గోశాలకు అనుమతిస్తామని హుకుం జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గోశాలకు వెళ్ళాలని సూచించారు. 👉ఇదిలా ఉండగా.. అంతకుముందు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు అని భూమన మండిపడ్డారు.👉కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటిళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్‌ కెమెరాల హల్‌చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు.

Tdp Mlas High Drama At Tirupati Goshala3
తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామా

తిరుపతి,సాక్షి: తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామా మరోసారి బట్టబయలైంది. గోశాలకు మరోసారి రమ్మని టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి ఫోన్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు నాని, సుధీర్ రెడ్డి, అరణి శ్రీనివాసులు తోక ముడిచారు. ఫోన్‌లో భూమనను రమ్మనమని అడ్డుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు పోలీసుల్ని ఆదేశించారు. దీంతో మీడియా ముందు డ్రామా ఆడి టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయారు. ఫోన్‌ చేసిన ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పేందుకు భూమన బయల్దేరగా.. ఇంటి వద్దే ఆయనను పోలీసులు నిర్భందించారు. గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు. ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. టీడీపీ ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు గోశాల లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో మీడియా సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేల బండారం బట్టబయలైంది.ఎమ్మెల్యేల దారిలో పల్లామరోవైపు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు భూమన ఫోన్‌ చేశారు. మీరు ఎక్కడున్నారు.. మీ సవాల్‌కు సిద్ధమన్న భూమన. గోశాలలో గోవుల మరణాలు నిగ్గు తేల్చేందుకు నేను సిద్ధం. మీరు ఎక్కుడున్నారని పల్లాను భూమన ప్రశ్నించారు. ఈ క్రమంలో భూమన ఫోన్‌ కాల్‌ను పల్లా శ్రీనివాస్‌ కట్‌ చేశారు.

Odela 2 Movie Review And Rating Telugu4
'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?

టైటిల్‌ : ఓదెల 2నటీనటులు: తమన్నా, హెబ్బా పటేల్‌, వశిష్ఠ ఎన్‌.సింహ,యువ, మురళీ శర్మ, యువ, నాగ మహేశ్‌, వంశీ తదితరులునిర్మాణ సంస్థలు: సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌, మధు క్రియేషన్స్‌నిర్మాతలు: డీ. మధుఎడిటింగ్: అవినాష్‌దర్శకత్వం: అశోక్‌ తేజ కథ, దర్శకత్వ పర్యవేక్షణ: సంపత్‌ నందిసంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌సినిమాటోగ్రఫీ: సౌందర్‌ రాజన్‌.ఎస్‌విడుదల: ఏప్రిల్‌ 17, 2025సుమారు మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఓదెల 2’ చిత్రాన్ని దర్శకుడు అశోక్‌తేజ తెరకెక్కించారు. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌తో కలిసి మధు క్రియేషన్స్‌ పతాకంపై డి.మధు నిర్మించారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించగా హెబ్బా పటేల్‌, వశిష్ఠ ఎన్‌.సింహ కీలక పాత్రలలో మెప్పించారు. 2022లో ఓటీటీ వేదికలో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందింది. దర్శకుడు సంపత్‌ నంది ఇచ్చిన కథతో, అశోక్‌తేజ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే కలయికలో మరింత ఘనంగా, థ్రిల్లింగ్‌గా 'ఓదెల2' చిత్రాన్ని రూపొందించామని చిత్ర ప్రమోషన్స్‌ కార్యక్రమాలలో చెప్పారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేస్తూ.. తమన్నా గుర్తుండిపోయే పాత్రలో కనిపించారని ట్రైలర్‌ చూస్తే అర్థం అవుతుంది. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి ఎలా రక్షిస్తాడనేది 'ఓదెల2' అసలు కథ. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటి..తిరుపతి (వశిష్ఠ) మరణంతో ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమా ముగుస్తుంది. అయితే, ఓదెల 2 అక్కడి నుంచే మొదలౌతుంది. తిరుపతి మరణించడంతో గ్రామస్థులందరూ సంతోషంగా ఉంటారు. తమ గ్రామంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిల శోభనం నాడే చంపిన తిరుపతిని రాధ (హెబా పటేల్) చంపేసి మంచి పనిచేసిందని అనుకుంటారు. అయితే, తిరుపతి ఆత్మకు కూడా శాంతి ఉండకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించుకుందటారు. అలా జరగాలంటే అతని అంత్యక్రియలు ఎలా చేయాలో గ్రామంలోని పూజారిని అడిగి తెలుసుకుంటారు. శాస్త్రాల ప్రకారం 'సమాధి శిక్ష' పద్ధతి ద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. దీంతో తిరుపతి ఆత్మ గోషిస్తూ ఉంటుంది. అదే అతనికి శిక్ష అంటూ గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. అలా కొద్దిరోజులు గడిచిన తర్వాత ఆ గ్రామంలో మళ్లీ పెళ్లి జరుగుతుంది. గతం మాదిరే శోభనం నాడే అత్యంత క్రూరంగా యువతులు హత్య చేయబడుతారు. ఇలాంటి ఘటనలు రెండు జరగడంతో గ్రామంలో మళ్లీ భయం మొదలౌతుంది. పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ వారి చావులకు అసలు కారణాలు కనుగొనలేరు. అయితే, అదే గ్రామానికి చెందిన దర్గాలో ఉన్న మురళీ శర్మ (ఫకీర్‌) అసలు కారణం కనుక్కొంటాడు. తిరుపతి దెయ్యంగా తిరిగొచ్చాడని చెప్తాడు. దీంతో తమ గ్రామాన్ని ఎవరు కాపాడుతారని ఆందోళనలో గ్రామస్తులు ఉంటారు. అయితే, ఒకరోజు జైల్లో ఉన్న రాధ (హెబా పటేల్) వద్దకు వెళ్లి జరిగిన హత్యల గురించి చెప్తారు. ఎలాగైనా తిరుపతి నుంచి ఓదెల గ్రామాన్ని కాపాడాలని వేడుకుంటారు. దీంతో శివశక్తి (తమన్నా) మాత్రమే కాపాడుతుందని వారికి చెబుతుంది. శివశక్తి గతం గురించి చెబుతూ ఆమె ఎక్కడ ఉంటుందో వివరాలు తెలుపుతుంది. అలా ఒదెల గ్రామాన్ని కాపాడేందుకు శివశక్తి (తమన్నా)ను అక్కడ తీసుకొస్తారు. అలా దైవశక్తికి, ప్రేతాత్మ శక్తిల మధ్య పెద్ద పోరాటమే జరుగుతుంది. మరణించిన తిరుపతి 'సమాధి శిక్ష' నుంచి ఎలా తిరిగొస్తాడు..? శివశక్తి (తమన్నా), రాధ (హెబా పటేల్) మధ్య ఉన్న బంధం ఏంటి..? శివశక్తిలా తమన్నా మారడం వెనుకన్న అసలు స్టోరీ ఎంటి..? ఫైనల్‌గా తిరుపతి అంతం అవుతాడా..? మళ్లీ తిరిగొస్తాడా..? అనేది తెలియాలంటే ఓదెల2 చూడాల్సిందే.ఎలా ఉందంటే..దుష్టశక్తి, దైవశక్తిల పోరాటం గురించి చాలా సినిమాలు వచ్చాయి. ఓదెల2 కూడా ఇదే కోవకు చెందిన కథే.. సినిమా ఎక్కడా కూడా కొత్తగా అనిపించదు. ప్రతి సీన్‌ దాదాపు అంచనా వేయవచ్చు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’లో చూపించిన ఉదంతాలే పార్ట్‌-2లో ఎక్కువ భాగం కనిపిస్తాయి. గ్రామంలోని కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు తమ శోభనం నాడే అత్యంత దారుణంగా చనిపోతారు. అందుకు కారణం ఒక ప్రేతాత్మ అనేది మాత్రమే ఇక్కడ కాస్త భిన్నంగా ఉంటుంది. ఒదెల2 కథ ప్రారంభం ఘనంగా ఉన్నప్పటికీ మొదటి 15 నిమిషాల్లోనే తేలిపోతుంది. సుమారు ఇంటర్వెల్‌ వరకు కొత్తగా పెళ్లైన ఇద్దరి అమ్మాయిల చావుల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. పార్ట్‌1 చూసిన వారికి ఇవేమీ అంత కొత్తగా అనిపించవు.. అయితే, వారి హత్యలు చాలా క్రూరంగా ఉంటాయి. మరీ వయలెన్స్‌ ఎక్కువ అయిందేమో అనిపించేలా ఆ సీన్స్‌ ఉంటాయి. శివశక్తిగా (తమన్నా) ఎంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుంది. అది కాస్త ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. ఎప్పుడైతే తమన్నా కథలోకి ఎంట్రీ ఇస్తుందో కథ అనేక మలుపులు తిరుగుతుందని అనుకుంటారు. కానీ, సాధారణ రొటీన్‌ పద్ధతిలోనే స్టోరీ కొనసాగుతుంది. ఆమె నాగసాధువుగా ఎందుకు మారిందో చెప్పిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. అయితే, ఓదెల2లో ప్రేతాత్మగా ఉన్న తిరుపతి (వశిష్ఠ) పాత్రను చాలా బలంగా రాసుకున్న రచయిత.. శివశక్తిగా (తమన్నా) పాత్రను అంత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్‌ చేయలేకపోయాడు. దుష్టశక్తి, దైవశక్తిల పోరాటంలో పైచెయి దుష్టశక్తిదే ప్రతిసారి కనిపించడంతో ప్రేక్షకులలో విసుగు తెప్పిస్తుంది. హార్రర్‌ సినిమా అంటే భయపడుతారని అందరిలో అంచనాలు ఉంటాయి. కానీ, అలాంటిదేవీ ఇందులో ఉండదు.. పైగా హత్యలకు సంబంధించిన వయలెన్స్‌ సీన్లే ఎక్కువగా కలవరపెడుతాయి. శివశక్తిగా తమన్నాకు మొదట ఇచ్చిన అంత ఎలివేషన్‌ దుష్టశక్తితో పోరాడే విషయంలో ఎంతమాత్రం దాని ప్రభావం చూపించలేదు. కథలో చాలాసార్లు రిపీటెడ్‌ సీన్లే ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా మొత్తానికి చివరి 15 నిమిషాలు చాలా హైప్‌ ఉంటుంది. అక్కడ మాత్రమే శివశక్తిగా తమన్నా విశ్వరూపం చూడొచ్చు.. ఈ సినిమాకు బలం తమన్నా నటన మాత్రమే.. శివశక్తిగా విశ్వరూపం చూపించాల్సిన పాత్రకు ఎలాంటి శక్తులు లేకుండా ప్రేక్షకులకు చూపించడాన్ని పెద్దగా కనెక్ట్‌ కాలేరు. సినిమా చివరి వరకు కూడా దుష్టశక్తి మీద దైవశక్తి పైచెయి అనేది కనిపించకపోవడం అంతగా రుచించదు. ప్రేతాత్మకు, పంచాక్షరీ మంత్రానికి మధ్య జరిగిన యుధ్దం అని చెప్పినప్పటికీ కనీసం దైవశక్తికి ఉన్న బలం ఏంటి అనేది దర్శకుడు చివరి వరకు చూపించకపోవడం పెద్ద పొరపాటుగా చెప్పవచ్చు. అయితే, పార్ట్‌-3 కూడా ప్రకటించారు. అందులో శివశక్తిగా (తమన్నా) పాత్ర బలంగా ఉండబోతుందేమో తెలియాల్సి ఉంది.ఎవరెలా చేశారంటే..ఓదెల-2 కేవలం తమన్నా కోసం మాత్రమే వెళ్లోచ్చు. తన ఎంట్రీ ఆలస్యంగా ఉన్నప్పటికీ కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్‌ సీన్‌లో తమన్నాను చూస్తే గూస్‌ బంప్స్‌ రావడం గ్యారెంటీ. ఇప్పటి వరకు గ్లామర్‌ పాత్రలు మాత్రమే చేసిన తమన్నా మొదటిసారి శివశక్తిగా అదరగొట్టేసింది. ఆ తర్వాత ఈ మూవీకి అజనీష్‌ లోక్‌నాథ్‌ ఇచ్చిన బీజీఎమ్‌తో పాటు సంగీతం సూపర్బ్‌ అనిచెప్పవచ్చు. తమన్నా ఎంట్రీ సీన్‌తో పాటు క్లైమాక్స్‌లో అదరగొట్టేశాడని చెప్పవచ్చు. ఆపై సౌందర్‌ రాజన్‌.ఎస్‌ అందించిన సినిమాటోగ్రఫీ కథకు బాగా సెట్‌ అయింది. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసిన సీన్స్‌ బాగున్నాయి. అక్కడక్కడా ప్రేక్షకులను భయపెట్టే వర్క్‌ కెమెరాలతో తను మాత్రమే చేశాడని చెప్పవచ్చు. ఓదెల2లో ఎక్కువగా రిపీటెడ్‌ సీన్స్‌ వస్తున్నాయనే ఫీలింగ్‌ చాలామందిలో కలుగుతుంది. ఇంకాస్త కత్తెరకు పనిచెప్పింటే బాగుండు. బడ్జెట్‌ మేరకు వీఎఫ్‌ఎక్స్‌, నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి. తిరుపతి (వశిష్ఠ) ప్రేతాత్మగా చాలా బాగా చేశాడు. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. కానీ, శివశక్తిగా (తమన్నా) పాత్రను అత్యంత బలహీనంగా రాసుకోవడమే ఈ సినిమాకు పెద్ద మైనస్‌.. తమన్నా పాత్ర కాస్త పవర్‌ఫుల్‌గా ఉండుంటే ఓదెల-2 బ్లాక్‌బస్టర్‌ గ్యారెంటీ అని చెప్పవచ్చు.

5 key things for first time taxpayers Income Tax Returns AY 2025 265
ITR: తొలిసారి ట్యాక్స్‌పేయర్స్‌కు 5 కీలక విషయాలు

కొత్తగా ట్యాక్స్‌ పేయర్స్ అవుతున్నవారికి మొదటిసారి ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడం కష్టంగా అనిపించవచ్చు. కానీ ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా ఈ ప్రక్రియ సులభం అవుతుంది. అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2025-26, ఫైనాన్షియల్ ఇయర్ (FY) 2024-25కి సంబంధించి, మొదటిసారి పన్ను చెల్లించేవారు గుర్తుంచుకోవలసిన ఐదు కీలక అంశాలు ఇక్కడ అందిస్తున్నాం.సరైన ఐటీఆర్‌ ఫారమ్‌ను ఎంచుకోండిమీ ఆదాయ వనరులు, నివాస స్థితి, మొత్తం ఆదాయం ఆధారంగా సరైన ఐటీఆర్‌ ఫారమ్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, ITR-1 (సహజ్) అనేది జీతం, ఒక ఇంటి ఆస్తి, లేదా ఇతర వనరుల నుండి (ఉదా., వడ్డీ) రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న నివాసిత వ్యక్తులకు సరిపోతుంది. ITR-2 అనేది క్యాపిటల్ గెయిన్స్ లేదా ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తులు ఉండి వ్యాపార ఆదాయం లేనివారి కోసం ఉద్దేశించింది.ITR-3 లేదా ITR-4 ఫారాలు ప్రొఫెషనల్స్ లేదా ప్రిసంప్టివ్ టాక్సేషన్ కింద ఉన్నవారికి వర్తిస్తాయి. తప్పు ఫారమ్ ఉపయోగిస్తే రిటర్న్ తిరస్కరణకు గురికావచ్చు. కాబట్టి మీ ఆదాయ వనరులను జాగ్రత్తగా అంచనా వేయండి. ఆదాయపు పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్ సరైన ఫారమ్‌ను నిర్ణయించడానికి ఒక సాధనాన్ని అందిస్తుంది. తప్పులు జరగకుండా అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండిపాత, కొత్త పన్ను విధానాలను అర్థం చేసుకోండిఅసెస్‌మెంట్ ఇయర్ 2025-26 కోసం, కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా ఉంటుంది. ఇది తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది కానీ తక్కువ డిడక్షన్లు ఉంటాయి. ఇందులో జీతం పొందే వ్యక్తులకు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 87A కింద రూ.60,000 వరకు రిబేట్ ఉంటాయి. దీనివల్ల రూ.12 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. పాత విధానం సెక్షన్ 80C, 80D, లేదా 24(b) (హోమ్ లోన్ వడ్డీ కోసం) వంటి ఎక్కువ డిడక్షన్లను అనుమతిస్తుంది కానీ ఎక్కువ పన్ను రేట్లను కలిగి ఉంటుంది.మొదటిసారి ఫైలర్లు పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి రెండు విధానాలనూ పోల్చాలి. నాన్‌ బిజినెస్‌ పన్ను చెల్లింపుదారులు ప్రతి సంవత్సరం ఏదో ఒక విధానాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఫైలింగ్ గడువు (ఆడిట్ లేని కేసులకు జూలై 31) లోపు ఎంపిక చేయాలి. గడువు మిస్ అయితే, ఆలస్య ఫైలింగ్ కోసం కొత్త విధానంలోనే ఉండాల్సి వస్తుంది.అన్ని ఆదాయ వనరులను నివేదించాలిమీ మొత్తం ఆదాయం పన్ను విధించే పరిమితి (60 ఏళ్లలోపు వ్యక్తులకు కొత్త విధానంలో రూ.3 లక్షలు) కంటే తక్కువ ఉన్నప్పటికీ, అన్ని ఆదాయ వనరులను నివేదించాలి. ఇందులో జీతం, సేవింగ్స్ ఖాతా లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ, అద్దె ఆదాయం, పెట్టుబడుల నుండి క్యాపిటల్ గెయిన్స్, రూ.50,000 కంటే ఎక్కువ విలువైన బహుమతులు కూడా ఉంటాయి.ఫారమ్ 16 (యజమానుల నుండి), ఫారమ్ 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS) వంటి డాక్యుమెంట్లు ఆదాయం, టీడీఎస్‌ వివరాలను ధృవీకరించడానికి సహాయపడతాయి. ఏ ఆదాయాన్ని నివేదించకపోతే, ఆదాయపు పన్ను విభాగం నుండి పరిశీలన లేదా నోటీసులు రావచ్చు. ఈ డాక్యుమెంట్ల రికార్డులను భవిష్యత్తు అవసరాల కోసం దగ్గర ఉంచుకోండి. అయితే వీటిని ఐటీ రిటర్నుకు జోడించాల్సిన అవసరం లేదు.గడువులను పాటించండి.. ఈ-వెరిఫై చేయండిఆడిట్ లేని పన్ను చెల్లించేవారికి ఐటీఆర్‌ దాఖలు చేయడానికి గడువు జూలై 31. ఈ గడువు మిస్ అయితే రూ.5,000 జరిమానా (ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉంటే రూ.1,000) చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు చెల్లించని పన్నుపై సెక్షన్ 234A కింద నెలకు 1% వడ్డీ విధిస్తారు. మీరు డిసెంబర్ 31, 2025 వరకు ఆలస్య రిటర్న్ లేదా నాలుగు సంవత్సరాలలోపు (మార్చి 31, 2029 నాటికి) అప్‌డేటెడ్ రిటర్న్ (ITR-U) దాఖలు చేయవచ్చు కానీ జరిమానాలు ఉంటాయి.ఐటీఆర్‌ దాఖలు చేసిన తర్వాత, 30 రోజులలోపు ఆధార్ OTP, నెట్ బ్యాంకింగ్ లేదా ఈవీసీ ఉపయోగించి ఈ-వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి. మీ పాన్‌ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఇనాక్టివ్ పాన్‌ కార్డుల వల్ల రిఫండ్‌లు లేదా ప్రాసెసింగ్‌ ఆలస్యం కావచ్చు. ఏప్రిల్ లేదా మేలో ముందుగానే ఐటీఆర్‌ దాఖలు చేస్తే, AIS/ఫారమ్ 26ASతో వివరాలు సరిపోలితే, ఒక వారంలో రిఫండ్‌లు వస్తాయి.👉 ఇదీ చదవండి: ‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..డిడక్షన్లను క్లెయిమ్ చేయండి.. తప్పులు చేయొద్దుపాత విధానంలో, సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షలు (ఉదా., PPF, ELSS), సెక్షన్ 24(b) కింద హోమ్ లోన్ వడ్డీపై రూ.2 లక్షలు, లేదా సెక్షన్ 80D కింద మెడికల్ ఇన్సూరెన్స్ వంటి డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు. కొత్త విధానంలో డిడక్షన్లు పరిమితం, కానీ స్టాండర్డ్ డిడక్షన్, ఫ్యామిలీ పెన్షన్ డిడక్షన్ వర్తిస్తాయి.AIS, ఫారమ్ 26ASతో క్రాస్-చెక్ చేసి ఖచ్చితత్వాన్ని నిర్ధారించండి, లేకపోతే తప్పులు ప్రాసెసింగ్‌ను ఆలస్యం చేయవచ్చు లేదా నోటీసులకు దారితీయవచ్చు. ఇక్కడ తప్పులు అంటే తప్పుడు వ్యక్తిగత వివరాలు, ఆదాయం దాచడం, తప్పు విధానం ఎంచుకోవడం వంటివి అన్నమాట. 80DD లేదా 80U వంటి డిడక్షన్లు క్లెయిమ్ చేస్తే, ఫారమ్ 10-IA దాఖలు చేయండి. ప్రక్రియను పూర్తి చేయడానికి వెంటనే ఈ-వెరిఫై చేయండి.అదనపు చిట్కాలుAIS, ఫారమ్ 26AS నుండి డేటాను ఆటో-ఫిల్ చేసే సదుపాయం ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఉంది. ఉపయోగించండి. మీ ఆదాయం ఎక్సెంప్షన్ లిమిట్ కంటే తక్కువ ఉన్నప్పటికీ, రూ.1 కోటి కరెంట్ ఖాతాలలో డిపాజిట్ చేయడం, రూ.2 లక్షలు విదేశీ ప్రయాణంలో ఖర్చు చేయడం, లేదా రూ.25,000 కంటే ఎక్కువ TDS/TCS ఉన్నట్లయితే ఐటీఆర్‌ దాఖలు చేయండి. క్యాపిటల్ గెయిన్స్ వంటి సంక్లిష్ట ఆదాయ వనరులకు సంబంధించి సందేహం ఉంటే టాక్స్ ప్రొఫెషనల్‌ను సంప్రదించండి.

Pakistan Army Chief Asim Munir Sensational Comments On Hindus Kashmir6
కశ్మీర్‌ను మరిచిపోయే ప్రసక్తే లేదు: పాక్‌ ఆర్మీ చీఫ్‌

కశ్మీర్‌ పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌(General Asim Munir) భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్‌, పాకిస్థాన్‌లు సిద్ధాంతాల పరంగా వేర్వేరు దేశాలేనన్న ఆయన.. కశ్మీర్‌ను ఇస్లామాబాద్‌కు గళ సిరగా అభివర్ణించారు. ఈ క్రమంలో పాక్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్మీర్‌ను మరిచిపోదని, ఏ శక్తీ దానిని పాక్‌ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. అలాగే దేశ విభజనకు కారణమైన రెండు దేశాల విభజనను సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలూ చేశారు. పాక్‌ మీడియా హౌజ్‌ డాన్‌(dawn) కథనం ప్రకారం.. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన జనరల్‌ మునీర్‌ మాట్లాడారు. ఉగ్రకార్యకలాపాలతో పాక్‌ నిధులు రావనే భయాలు నెలకొన్నాయని.. కానీ, ఆ భయాలను తొలగించే ప్రయత్నాల్లో పాక్‌ సైన్యం ఉందని అన్నారు. ఉదాహరణగా.. బెలూచిస్తాన్‌, కశ్మీర్‌ అంశాలను(Kashmir Issue) ప్రస్తావించారు. పాక్‌కు బెలూచిస్తాన్‌ ఎంతో గర్వకారణమైంది. అలాంటి ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలను పాక్‌ సైన్యం సమర్థవంతంగా అణచివేసింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా పెట్టుబడులు రాకపోవచ్చనే భయాలు ఉన్నాయి. కానీ, ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును మార్చగలరా?. త్వరలో పూర్తి విజయం సాధిస్తాం. ఇంకో పది జన్మలెత్తినా ఆ ప్రాంతాన్ని మనకు ఎవరూ దూరం చేయలేరు. ఇక.. కశ్మీర్‌పై తమ ఆశ చావదన్న పాక్‌ ఆర్మీ చీఫ్‌(Pak Army Chief).. అది మాకు గళ సిర(జగ్యులర్‌ సిర) అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మరిచిపోలేమని, కశ్మీరీ సోదరుల వీరోచిత పోరాటాలను అంత సులువుగా వదిలిపెట్టబోమని, ఏ శక్తీ దానిని పాక్‌ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. పాక్‌ గురించి తర్వాతి తరాలకు ఎంతో చెప్పాల్సిన అవసరం ఉందన్న జనరల్‌ మునీర్‌.. మతం, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు.. ఇలా ప్రతీ విషయంలోనూ హిందువులతో మనం(ముస్లిం) వేరనే విషయం తెలియజేయాల్సిన బాధ్యత ఉందంటూ పాక్‌ పౌరులకు సూచించారు. ఇదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది అని అన్నారాయన. ఏరకంగా ఈ రెండు దేశాలు ఒక్కటి కాదని.. అందుకే తమ పూర్వీకులు పాక్‌ కోసం పోరాడారని వ్యాఖ్యానించారు. ఇలాంటి దేశాన్ని ఎలా రక్షించుకోవాలనే దానిపైనే దృష్టిసారించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలకు భారత్‌ ఎలా ‍స్పందిస్తుందో చూడాలి మరి!.Ugh! I thought General Musharraf was the worst, but this COAS takes the cake. The whole bakery. General Asim Munir. pic.twitter.com/t8eVYukQqG— Smita Prakash (@smitaprakash) April 16, 2025

Kushboo Sundar 54 Flaunts Her New Glam Look Weight Loss Secret7
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్‌ అదే!

నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్‌ టాలీవుడ్‌ కోలీవుడ్‌లో తనదైన ముద్రవేసిన ప్రసిద్ధ నటి. 90లలో తన అందం, నటనతో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన నటి ఆమె. ఎన్నో వైవిద్య భరితమైన పాత్రలో ప్రేక్షకుల, విమర్శకుల మెప్పుని పొందారు. అంతేగాదు వేలాదిగా అభిమానులను సొంతం చేసుకున్న తమిళ నటి. అలాగే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అక్కడ కూడా తన హవాను చాటుతున్నారు. అవసరమైనప్పుడూ ప్రజల తరుపున గళం విపుత్తు..వార్తల్లో నిలుస్తున్నారు కూడా. రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉండే ఆమె కూడా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతుంటారు. అందుకు నిదర్శనమే ఆమె కొత్త గ్లామరస్‌ లుక్‌. ఎంతో లావుగా ఉండే ఆమె ఒక్కసారిగా పదహారణాల పడుచు పిల్లలా మారిపోయారు. నెటిజన్లు సైతం ఆమె కొత్త లుక్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరీ.. అంతలా బరువు కోల్పోయినా..ఖుష్బు వెయిట్‌లాస్‌ సీక్రెట్‌ ఏంటో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఐదుపదుల వయసులో ఖుష్బూ అద్భుతంగా తన బాడీ ఆకృతిని మార్చుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారామె. ఇటీవలే అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నిజంగా ఆమెనా..? ఖుష్బు కూతురా..? అని కన్ఫ్యూజ్‌ అయ్యేలా గ్లామరస్‌ లుక్‌లో కనిపించారామె. అయితే ఆమె కొత్త లుక్‌ని చూసి.. కొందరు నెటిజన్లు మెచ్చుకోగా మరికొందరు మాత్రం ఇంజెక్షన్లు ఏవో తీసుకునే బరువు తగ్గారామె అంటూ కామెంట్లు చేశారు. అయితే ఖుష్బూ వాటిన్నంటిని కొట్టిపారేస్తూ..తాను ఎలా బరువుని తగ్గించుకోగలిగరో షేర్‌ చేసుకున్నారు. అలాగే తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటో కూడా చెప్పారు. బరువు తగ్గడానికి షార్ట్‌ కట్స్‌ ఉండవని నర్మగర్భంగా తేల్చి చెప్పారామె. ఒకవేళ్ల తగ్గినా..అది తాత్కాలికమే అని కూడా అన్నారు ఖుష్బూ. కేవలం క్రమశిక్షణాయుతమైన జీవనశైలి, బరువు తగ్గాలన్న కృత నిశ్చయాలే..అద్బుతంగా బరువు తగ్గేందుకు దారితీస్తాయని అంటున్నారామె. అంతేగాదు అందుకోసం తాను ఎలాంటి లైఫ్‌స్టైల్‌ని అనుసరించారో కూడా పంచుకున్నారు. మనసుపెట్టి తినడం, ఒక గంటపాటు వర్కౌట్లు, అలాగే సాయంత్రం 45 నుంచి 50 నిమిషాలు తప్పనిసరి వాక్‌ తదితరాలే ఈ సరికొత్త లుక్‌కి కారణమని అన్నారు. అయితే తాను ఇలా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడానికి ప్రధాన కారణం కూడా వరించారు. షూటింగ్‌ల సమయంలో సంవత్సరాల తరబడి అయిన గాయాలు, శస్త్రచికిత్సలు తన మోకాళ్లను పూర్తిగా బలహీనపరిచాయన్నారు. వాటిపై ఒత్తిడిపడకూడదంటే బరువు తగ్గక తప్పదని వైద్యులు సూచించినట్లు తెలిపారు. చీలమండలాలు బాగానే ఉన్నాయని, మోకాళ్లు ఆల్‌మోస్ట్‌ అరిగిపోయాయని అన్నారు. అప్పుడే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే అంతే సంగతులని భావించి..బరువు తగ్గాలని గట్టిగా ఫిక్స్‌ అయ్యానన్నారు. అలా తాను దాదాపు 20 కేజీల బరువుని కోల్పాయానన్నారు.ఇక్కడ ఖుష్బూ బరువు తగ్గేందుకు ఎటువంటి సౌందర్య చికిత్సల జోలికిపోకుండా.. అందంగా..ఆరోగ్యకరంగా వృద్ధాప్యాన్ని ఎలా మలుచుకోవచ్చో చూపించారు. ఏదీఏమైనా.. వయసురీత్యా మార్పులనేవి సహజం. వాటిని దాచే ప్రయత్నం కంటే..ఆరోగ్యదాయకమైన పద్ధతిలో తీసుకొస్తే..అటు అందం, ఇటు ఆరోగ్యాన్ని పదిలపరుచుకున్న వాళ్లమవుతామని తన చేతలతో చెప్పకనే చెప్పింది నటి ఖుష్బూ. (చదవండి: ఎవరీ రేష్మా కేవల్‌రమణి..? ఏకైక భారత సంతతి మహిళగా టైమ్స్‌లో చోటు..)

SC Allows Sacked Bengal Teachers To Continue Till Fresh Selections8
‘సుప్రీం’ కీలక నిర్ణయం.. పశ్చిమ బెంగాల్‌ టీచర్లకు స్వల్ప ఊరట

న్యూఢిల్లీ: విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని, నియామకాల్లో అవకతవకల కారణంగా ఈ నెల ప్రారంభంలో నియామకాలు రద్దు చేసిన పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయులు.. తాజా ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు విధుల్లో కొనసాగవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్‌ ఉపాధ్యాయ నియామక కుంభకోణంపై ఈ నెల ప్రారంభంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు 2016లో చేపట్టిన 25,753 మంది టీచర్లు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నియామకాలు చెల్లవని తేల్చి చెప్పింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. తాజాగా, టీచర్ల నియామకం రద్దులో స్వల్ప ఊరట కల్పించింది.ఆ ఉద్యోగులకు వర్తించదుకొత్త టీచర్ల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు బోధన కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. అయితే, ఈ ఉపశమనం 2016 నియామకాలపై దర్యాప్తు సమయంలో ఆరోపణలు లేని అసిస్టెంట్ టీచర్లకే వర్తిస్తుంది. గ్రూప్- సీ, గ్రూప్-డీ, నాన్-టిచింగ్ ఉద్యోగులకు ఇది వర్తించదు. ఎందుకంటే వారిలో ఎక్కువమంది నియామకాల్లో అవినీతి పాల్పడ్డారని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కొత్త నియామక ప్రక్రియ ఎప్పుడంటేచీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం, పశ్చిమ బెంగాల్‌ స్కూల్ సర్వీస్ కమిషన్ (SSC)కు స్పష్టమైన గడువు విధించింది. కొత్త నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రకటన మే 31లోపు విడుదల చేయాలి. డిసెంబర్ 31లోపు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే, కోర్టు తగిన చర్యలు తీసుకుంటుందనీ, జరిమానా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ నెల ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ (West Bengal Teacher Scam 2016)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది.

Sandeep Sharma Bowls 11-Ball Over, Joins Rare IPL Feat In RR Vs DC9
సందీప్ శ‌ర్మ అత్యంత చెత్త రికార్డు.. 18 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ స్టార్ పేస‌ర్ సందీప్ శ‌ర్మ (Sandeep Sharma) అత్యంత చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఆఖ‌రి ఓవ‌ర్‌లో అత్యధిక బంతులు విసిరిన బౌల‌ర్‌గా సందీప్ నిలిచాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో శ‌ర్మ ఈ చెత్త రికార్డును నెల‌కొల్పాడు.ఈ మ్యాచ్‌లో ఆఖ‌రి ఓవ‌ర్ బౌలింగ్ చేసిన సందీప్ ఏకంగా 11 బంతులు విసిరాడు. ఆ ఓవ‌ర్‌లో సందీప్ నాలుగు వైడ్లు, ఓ నోబాల్ వేయ‌డం గ‌మ‌నార్హం. ఆఖ‌రి ఓవ‌ర్‌లో శ‌ర్మ మొత్తంగా 19 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఓవ‌రాల్‌గా ఈ చెత్త రికార్డు సాధించిన నాలుగో బౌల‌ర్‌గా సందీప్ నిలిచాడు. సందీప్ కంటే ముందు మ‌హ్మ‌ద్ సిరాజ్‌, తుషార్ దేశ్ పాండే, శార్ధూల్ ఠాకూర్ 11 బంత‌లు ఒకే ఓవ‌ర్‌లో వేశారు. అయితే ఈ ముగ్గురు ఆఖ‌రి ఓవ‌ర్ కాకుండా వేర్వేరు ఓవ‌ర్ల‌ల్లో 11 బంతులు విసిరారు.ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు విసిరిన బౌల‌ర్లు..👉11 బంతులు మొహమ్మద్ సిరాజ్ vs ముంబై ఇండియ‌న్స్‌ 2023 (ఓవర్ 19)👉11 బంతులు తుషార్ దేశ్‌పాండే vs ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ 2023 (ఓవర్ 4)👉11 బంతులు శార్దూల్ ఠాకూర్ vs కేకేఆర్‌ 2025 (ఓవర్ 13)👉11 బంతులు సందీప్ శర్మ vs ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ 2025 (ఓవర్ 20)కాగా చివర వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్ ఫలితం సూప‌ర్ ఓవ‌ర్‌లో తేలింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. అయితే సూప‌ర్ ఓవ‌ర్‌లో కూడా సందీప్ శ‌ర్మ‌నే బౌలింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం. 12 ప‌రుగుల టార్గెట్‌ను సందీప్ డిఫెండ్ చేసుకోలేక‌పోయాడు.చ‌ద‌వండి: 'మ‌రీ అంత స్వార్ధం ప‌నికిరాదు బ్రో.. నీ వ‌ల్లే రాజ‌స్తాన్ ఓడిపోయింది'

Not Snake Bite Its Wife Plan Another Meerut Shocker10
పాము కాటు కాదు.. భార్య నిర్వాకమే!

ప్రియుడికి తనకు మధ్యలో అడ్డుగా ఉన్నాడని భర్తను ముక్కలు చేసి సిమెంట్‌ డ్రమ్ములో కుక్కింది ఓ భార్య. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారి తీసిందో తెలిసిందే. ఈ క్రమంలో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ చూశాం. ఇప్పుడు అదే ప్రాంతంలో మరో ఘోరం చోటు చేసుకుంది.రెండు రోజుల కిందట సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని. రాత్రంతా ఆ పాము అలాగే పక్కలోనే ఉండిపోయింది. ఉదయం దానిని తొలగించి అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా బాగా వైరల్‌ అయ్యాయి. దీంతో ‘పాపం’ అనుకున్నారంతా. అయితే బుధవారం సాయంత్రం ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. అందులో షాకింగ్‌ విషయం ఒకటి వెలుగు చూసింది.మీరట్‌ అక్బర్‌పూర్‌ సదాత్‌ గ్రామానికి చెందిన అమిత్‌(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని పాము కాటేయడంతో మరణించాడని ప్రచారం చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.రవితకు అమర్‌జీత్‌ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసి అమిత్‌ తన భార్యను మందలించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఆ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియుడు అమర్‌జీత్‌తో కలిసి భర్తను కడతేర్చాలని రవిత స్కెచ్‌ వేసింది. అమర్‌జీత్‌ సాయంతో అమిత్‌ నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిపి ఊపిరి ఆడకుండా చేసి చంపింది. ఆపై రోజుకి రూ.వెయ్యి ఖర్చు అద్దెతో తెచ్చిన ఓ పామును మంచం మీద పడేసింది. పాము కాటు వల్లే చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికుల సాయంతో పాములు పట్టేవాడిని తెచ్చి దానిని తొలగించింది. దీంతో జనం కూడా పాము కాటు వల్లే అతను చనిపోయాడని నమ్మి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. రవితతో పాటు అమర్‌జీత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఇంకా వేరే ఎవరి ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement