
వాసవీ క్లబ్బుల కీర్తిప్రతిష్టలు పెంచాలి
● ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ
కొరుక్కుపేట: సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అందజేసే వాసవీ క్లబ్‌ల కీర్తి ప్రతిష్టలు పెంచేలా ఆ క్లబ్ నిర్వాహకులు కృషి చేస్తున్నారని అంతర్జాతీయ అధ్యక్షుడు ఎరుకల రామకృష్ణ తెలియజేశారు. చైన్నె నుంగంబాక్కంలో శనివారం వాసవీ క్లబ్ చైన్నె, వనిత గ్రాండ్ చైన్నె సంయుక్త ఆధ్వర్యంలో గుడ్ విల్ విజిట్ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎరుకల రామకృష్ణ, ప్రత్యేక సభ వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సీహెచ్ వెంకటేశ్వర రావు, ట్రెజరర్ సుజాత రమేష్ బాబు, జిల్లా గవర్నర్ సీఎం రాజేష్, క్లబ్ అధ్యక్షుడు ఎ.సుధాకర్, ఎ.మీనా కుమారి, కార్యదర్శులు ఎం జగదీష్,
ఎం.జయలక్ష్మి, కోశాధికారులు ఊరా రమేష్ గుప్తా, పద్మావతి సహా ఈ క్లబ్బుల సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా రెండు అనాథాశ్రమాలకు వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంకులతోపాటు ఏడు సేవా కార్యక్రమాలను అందించినట్లు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు.