
ప్రతి ఒక్కరూ విద్యావేత్తలు కావాలి
వేలూరు: ప్రతి ఒక్కరూ విద్యావేత్తలుగా తయారైతే దేశాభివృద్ధి సాధ్యమని డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే నందకుమార్ అన్నారు. వేలూరు సమీపంలోని వెంకటాపురంలోని పుదువసూరు గ్రామంలో పెంటెక్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభోత్సవం, రివేరా 21వ వార్షికోత్సవ కార్యక్రమం పాఠశాల చైర్మన్ జానకి అద్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పాఠశాలలు అందుబాటులో ఉండేవి కావని ప్రభుత్వం ప్రతి చిన్న గ్రామానికి ఒక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ పాఠశాలల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో ఇంటర్నేషనల్ పాఠశాలను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వేలూరు ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, యూనియన్ చైర్మన్ అముద, పాఠశాల కార్యదర్శి బాలాజీ, ట్రెజరర్ విజయ్ ఆనంద్, ట్రస్టీ మోహన్‌రాజ్, టీచర్‌లు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.