డీజిల్‌ లీకై రేంజ్‌ రోవర్‌ కారు దగ్ధం | Fire Broke Out In Car Near Narketpally Nalgonda, More Details Inside | Sakshi
Sakshi News home page

డీజిల్‌ లీకై రేంజ్‌ రోవర్‌ కారు దగ్ధం

Published Tue, Apr 1 2025 8:05 AM | Last Updated on Tue, Apr 1 2025 12:06 PM

 Fire Broke out In Car Near Narketpally Nalgonda

కారులో నుంచి సురక్షితంగా 

బయటపడిన యువకులు  

నార్కట్‌పల్లి: రేంజ్‌ రోవర్‌ కారు డీజిల్‌ ట్యాంకు లీకేజీ కావడంతో మంటలు ఎగిసిపడి కారు దగ్ధమైంది. ఈ ఘటన సోమవారం నార్కట్‌పల్లి– అద్దంకి హైవేపై నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు వద్ద జరిగింది. హైదరాబాద్‌కు చెందిన శివప్రసాద్, శివకుమార్, గోవర్ధన్‌ ముగ్గురు స్నేహితులు కలిసి గుంటూరులో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. సోమవారం అద్దంకి వద్ద పెట్రోల్‌ బంక్‌లో రేంజ్‌ రోవర్‌ కారుకు పెట్రోల్‌ పోయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. 

చెర్వుగట్టు సమీపంలోకి రాగానే కారు డీజిల్‌ ట్యాంక్‌ లీకై చిన్నచిన్న మంటలు రావడాన్ని గుర్తించిన వారు కారును రోడ్డు పక్కన నిలిపి బయటకు వచ్చారు. వెంటనే అగి్నమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆగ్ని మాపక సిబ్బంది  మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు చాలా వరకు కాలిపోయింది. నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement