
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 704 కరోనా కేసులు నమోదు కాగా 5 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో మహమ్మారి నుంచి 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,31,218కు పెరిగింది. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,725 మంది బాధితులు ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.