
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో గత వారంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 772 కరోనా కేసులు నమోదు కాగా 7 మంది కరోనా బారి పడి మృతి చెందారు. గత 24 గంటలల్లో 748 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,472గా ఉంది. రాష్ట్రంలో వైరస్ బారిని పడి ఇప్పటి వరకు మొత్తం 3,710 మంది చనిపోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.