Report
-
బయోటెక్నాలజీలో ఏపీ నయా రికార్డులు
సాక్షి, అమరావతి: బయో టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా దూసుకుపోతోంది. 2024 సంవత్సరంలో రూ.95,030 కోట్ల విలువైన బయోటెక్నాలజీ ఉత్పత్తులతో రాష్ట్రం దేశంలో ఐదో స్థానానికి చేరుకుంది. రూ.14,25,020 కోట్ల దేశీయ బయో ఎకానమీలో 6.7 శాతం వాటాతో రాష్ట్రం ఐదవ స్థానంలో నిలిచినట్లు ఇండియా బయో ఎకానమీ నివేదిక–2025 వెల్లడించింది. గడిచిన ఐదేళ్లుగా దేశీయ బయో టెక్నాలజీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. 2020లో రూ.7,39,600 కోట్లుగా ఉన్న దేశీయ బయో టెక్నాలజీ పరిశ్రమ ఇప్పుడు రెట్టింపై రూ.14.25 లక్షల కోట్లతో జీడీపీలో 4.25 శాతం వాటాకు చేరుకుంది. మొత్తం బయో టెక్నాలజీలో 47 శాతంతో బయో ఇండస్ట్రియల్ విభాగం మొదటి స్థానంలో నిలవగా, 35.2 శాతంతో బయో ఫార్మా రెండో స్థానంలో, 9.4 శాతంతో బయో ఐటీ, 8.1 శాతంతో బయో అగ్రీ ఉన్నాయి. 2050 నాటికి దేశీయ బయో టెక్నాలజీ రంగం రూ.129 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.బయో ఇండస్ట్రీలో మొదటి స్థానం2024లో దేశ వ్యాప్తంగా బయో ఇండస్ట్రీ విభాగం రూ.6,72,520 కోట్ల విలువైన ఉత్పత్తి సాధిస్తే, అందులో ఆంధ్రప్రదేశ్ 12 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది రాష్ట్రంలో బయో ఇండస్ట్రీ ద్వారా రూ.71,724 కోట్ల విలువైన ఉత్పత్తులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా ఆక్వా ఫీడ్ రూ.38,528 కోట్లు, పౌల్ట్రీ ఫీడ్ రూ.12,986 కోట్లు, ఆల్కహాల్ రూ.20,210 కోట్లుగా ఉన్నాయి. ఏపీ తర్వాత మహారాష్ట్ర 11.4 శాతం వాటాతో రెండవ స్థానంలో, తమిళనాడు 10.1 శాతం, కర్ణాటక 8.5 శాతం, పంజాబ్ 8.4 శాతం వాటాతో ఉన్నాయి. బయో ఫార్మా రంగంలో కూడా రాష్ట్రం వేగంగా దూసుకుపోతోందని, ఏకంగా 8 ఫార్మా క్లస్టర్లతో దేశంలో మూడో స్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 48 ఫార్మా క్లస్టర్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత గుజరాత్ 13 , ఆంధ్రప్రదేశ్ 8 క్లస్టర్లను కలిగి ఉందని తెలిపింది. పీఎల్ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ కీలకమైన ఫార్మా ప్రాజెక్టులను దక్కించుకొని అప్పుడే ఉత్పత్తి ప్రారంభించిందని పేర్కొంది. అరబిందో గ్రూపునకు చెందిన లైఫజ్ అనే సంస్థ పెన్సిలిన్ జీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, గతేడాది వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. మరోవైపు 274 స్టార్టప్‌లతో ఏపీ 10వ స్థానంలో నిలిచిందని తెలిపింది. -
భారత్ బంగారు కొండ.. HSBC సంచలన రిపోర్ట్
-
ఇదేం గ్యాంగ్ రేప్ కేసు కాదు.. ఆర్జీకర్ ఘటనపై సీబీఐ
కోల్‌కతా: సంచలన ఆర్జీకర్ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కోల్‌కతా హైకోర్టుకు తన నివేదిక సమర్పించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెబుతూనే.. సామూహిక హత్యాచారం జరిగిందన్న వాదనను తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీకర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో యువ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందనే అనుమానాలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని తాజాగా సీబీఐ ధృవీకరించింది. -
ఐఐటియన్లకు అందని జాబ్!
సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లలో అసాధారణ క్షీణత కనిపిస్తోంది. కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే సగానికి పైగా ఐఐటీల్లో సగటున 10% మేర తగ్గుదల నమోదవడం గమనార్హం. తొలి తరం ఐఐటీల్లో ఒకటైన ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో మాత్రమే స్వల్పంగా 2.28% తగ్గుదల కనిపించింది. మిగిలిన అన్నింటిలోనూ క్యాంపస్ ప్లేస్మెంట్ల పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం 23 ఐఐటీలు ఉండగా.. చాలా ఐఐటీల్లో 2022–23లో మొదలైన తగ్గుదల... 2023–24లోనూ కొనసాగింది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లోనూ ప్లేస్మెంట్ల క్షీణతపై పార్లమెంట్ స్టాడింగ్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. దీనిని అసాధారణ తగ్గుదలగా గుర్తించింది. దేశంలో విద్యపై ఖర్చు భూటాన్, మాల్దీవుల కంటే తక్కువగా ఉందని అభిప్రాయపడింది. తొలి తరం ఐఐటీల్లోనూ ఎదురుగాలే..» తొలి తరం ఐఐటీల్లోనూ క్యాంపస్ ప్లేస్మెంట్ల తగ్గుదల నమోదవుతోంది. ప్లేస్మెంట్ల కోసం నమోదు చేసుకునేవారు తగ్గుతుంటే.. అందులోనూ ఉద్యోగాలు పొందేవారు మరింత తగ్గిపోతున్నారు.» తాజా గణాంకాల ప్రకారం ఐఐటీ రూర్కీలో ప్లేస్మెంట్లు గణనీయంగా పడిపోయాయి. 2021–22లో 98.54 శాతం ఉన్న ప్లేస్మెంట్లు... 2023–24కు వచ్చేసరికి 79.66 శాతానికి తగ్గాయి. అంటే ఏకంగా 18.88 శాతం తగ్గిపోయాయి. ఐఐటీ ఢిల్లీలో 15 శాతం, ఐఐటీ బొంబాయిలో 12.72 శాతం మేర క్షీణత నమోదైంది. ఐఐటీ మద్రాస్‌లో 12.42 శాతం, ఐఐటీ కాన్పూర్‌లో 11.15 శాతం ప్లేస్మెంట్లు పడిపోయాయి.» ఐఐటీ భువనేశ్వర్‌లో 2021–22తో పోలిస్తే 2022–23లో ప్లేస్మెంట్లు మెరుగైనప్పటికీ.. 2023–24లో మాత్రం 7.58 శాతం తగ్గుదల నమోదైంది. » రెండో తరం ఐఐటీల్లోనూ పరిస్థితి చెప్పుకోతగ్గట్టు లేదు. 2008–09 మధ్య స్థాపించిన ఐఐటీల్లో హైదరాబాద్ అత్యంత ఎక్కువ క్షీణతను (17.17 శాతం) నమోదు చేసింది. ఆ తర్వాత స్థానాల్లో ఐఐటీ మండీ (14.1శాతం), రోపర్ (13.15శాతం), ఇండోర్ (11.03శాతం) ఉన్నాయి. » ఇక 2015–16 మధ్య స్థాపించిన మూడో తరం ఐఐటీల్లోనూ ప్లేస్మెంట్ల పరిస్థితి ఏమీ బాగాలేదు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023–24లో ఐఐటీ జమ్మూలో 21.83 శాతం ప్లేస్మెంట్లు తగ్గిపోయాయి.ఆర్థిక మందగమనం ఓ కారణం..కోవిడ్ తర్వాత కూడా ఐఐటీల్లో క్యాంపస్ నియామకాలు ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగనమనం కారణంగా రెండేళ్లుగా ప్లేస్మెంట్లపై ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు ఉన్నత విద్య వైపు వెళ్లడం, స్టార్టప్‌లపై దృష్టి సారించడం వంటి కారణాల వల్ల కూడా క్యాంపస్ ప్లేస్మెంట్లు తగ్గుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. క్యాంపస్ కొలువులు మార్కెట్ ట్రెండ్లపై ఆధారపడి ఉన్నప్పటికీ, విభాగాల వారీగా కొత్త మార్గాలను కనుగొని తదనుగుణంగా ఉపాధి పొందే అవకాశాలను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని సూచిస్తున్నారు. గత సంవత్సరం చాలా ఐఐటీలు తమ క్యాంపస్ ప్లేస్మెంట్లు వెల్లడించలేదు. అయితే, సెప్టెంబర్‌లో ఐఐటీ బొంబాయి విడుదల చేసిన నివేదిక ప్రకారం... గత పరిస్థితులతో పోలిస్తే తక్కువ మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లు పొందారని, ఇందులోనూ అత్యల్ప ప్యాకేజీ ఏడాదికి రూ.4లక్షలకు పడిపోయిందని పేర్కొంది. దీనిని బట్టి చూస్తే ఉద్యోగ మార్కెట్లో ఆందోళనకర మార్పు కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఐఐటీల్లో ప్లేస్‌మెంట్స్ శాతంలో తగ్గుదల ఇలా...ఐఐటీ 2021–22 2023–24ఖరగ్‌పూర్ 86.79 83.91బొంబాయి 96.11 83.39మద్రాస్ 85.71 73.29కాన్పూర్ 93.63 82.48ఢిల్లీ 87.69 72.81గౌహతి 89.77 79.10రూర్కీ 98.54 79.66వారణాసి 83.15 88.04ధన్‌బాద్ 87.89 75.38గాంధీనగర్ 91.85 82.39భువనేశ్వర్ 94.78 86.07హైదరాబాద్ 86.52 69.33జోద్పూర్ 96.59 92.98రోపర్ 88.49 75.34పాట్నా 97.65 90.03ఇండోర్ 96.74 85.71మండీ 98.13 84.03పాలక్కాడ్ 97.27 82.03తిరుపతి 94.57 86.57జమ్మూ 92.08 70.25భిలాయ్ 89.92 72.22గోవా 98.65 92.73ధార్వాడ్ 90.20 65.56––––––––––––––––––––––––––––– మొత్తం 449/410 -
తగ్గుముఖం పట్టిన హోమ్ లోన్స్: క్రెడిట్ కార్డుల్లోనూ..
ముంబై: గృహ రుణాలు డిసెంబర్ త్రైమాసికంలో సంఖ్యా పరంగా చూస్తే 9 శాతం తగ్గాయి. విలువ పరంగా చూస్తే 3 శాతం క్షీణించినట్టు క్రెడిట్ బ్యూరో సంస్థ ట్రాన్స్ యూనియన్ సిబిల్ వెల్లడించింది. ఎక్కువ రిస్క్‌తో కూడిన వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల్లోనూ రుణాల సంఖ్య తగ్గినట్టు తన తాజా నివేదికలో పేర్కొంది.అన్ సెక్యూర్డ్ రుణాల విషయంలో దూకుడు తగ్గించి, నిదానంగా వెళ్లాలంటూ ఆర్బీఐ బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలను కొన్ని త్రైమాసికాలుగా సూచించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. అదే సమయంలో సెక్యూర్డ్ రుణ విభాగం, ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తూ, బ్యాంక్‌లకు కీలకంగా ఉన్న గృహరుణాల్లోనూ స్తబ్దత నెలకొనడాన్ని ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది.గృహ రుణాల్లో బాకీలు (మొత్తంగా జారీ అయి, తిరిగి వసూలు కావాల్సిన మొత్తం) క్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి 15 శాతంగా ఉంటే, అవి 2024 డిసెంబర్ త్రైమాసికం చివరికి 13 శాతానికి తగ్గినట్టు తెలిపింది. రుణ వితరణ పరంగా 2024 అక్టోబర్-డిసెంబర్ కాలం రెండేళ్లలోనే అతి తక్కువ డిమాండ్‌ను చూసినట్టు పేర్కొంది. మెట్రోల్లో రుణ విచారణలు తగ్గాయి.చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగాయి. మొదటిసారి రుణ గ్రహీతలు, ప్రధాన కస్టమర్ల (ఎన్టీసీ)కు రుణ వితరణ 2023 డిసెంబర్ త్రైమాసికంలో 21 శాతంగా ఉంటే, 2024 డిసెంబర్ చివరికి 17 శాతానికి తగ్గింది. ఎన్టీసీ రుణ గ్రహీతల్లో 41 శాతం మంది జెనరేషన్ జెడ్ వారు (1995 తర్వాత జని్మంచిన వారు) కావడం గమనార్హం. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలను వీరు ఎక్కువగా తీసుకున్నారు. -
ర్యాగింగ్ భూతం చంపేస్తోంది!
సాక్షి, అమరావతి: దేశ విద్యా వ్యవస్థను ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది. బంగారు భవిష్యత్తు కోసం కలలు కనే ఎందరో విద్యార్థుల ప్రాణాలను బలి కోరుతోంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ మాటున మితిమీరిన చేష్టలు చావు కేకలు పెట్టిస్తున్నాయి. ఇవి ఎంతగా ఉన్నాయంటే కోటాలో విద్యార్థుల బలవన్మరణాలతో దాదాపు సమానంగా ర్యాగింగ్ మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వైద్య విద్యా సంస్థల్లో ర్యాగింగ్ ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపిస్తోంది. సొసైటీ అగైనెస్ట్ వయొలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ (సేవ్) సంస్థ ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2022–24’ నివేదిక ప్రకారం.. వర్సిటీలు, కళాశాలల్లో 2022 – 24 మధ్య కాలంలో 51 ర్యాగింగ్ మరణాలు నమోదైనట్టు తేలింది. ఇందులో వైద్య కళాశాలలను ర్యాగింగ్ ఫిర్యాదులకు ‘హాట్‌స్పాట్’లుగా గుర్తించింది. దేశంలోని విద్యార్థుల సంఖ్యలో వైద్య విద్యార్థుల సంఖ్య 1.1 శాతమే. కానీ, మొత్తం ఫిర్యాదుల్లో వైద్య కళాశాలల నుంచి వచ్చినవి 38.6 శాతం.అందని ఫిర్యాదులు ఎన్నో..దేశంలోని 1,946 కళాశాలల నుంచి నేషనల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌లో నమోదైన 3,156 ఫిర్యాదుల ఆధారంగా ఈ నివేదిక కీలక ధోరణులను అంచనా వేసింది. ఇందులో అధిక ప్రమాదకర సంస్థలు, ర్యాగింగ్ సంబంధిత కేసుల తీవ్రతను గుర్తించింది. వాస్తవానికి నివేదికలో ఇచ్చిన ఫిర్యాదులు మూడేళ్లలో కేవలం జాతీయ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌లో నమోదు చేసినవి మాత్రమేనని విశ్లేషకులు తెలిపారు. ఇందులో నమోదవని ఫిర్యాదులు ఇంకా చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయని చెబుతున్నారు. కళాశాలలకు నేరుగా నమోదయ్యే ఫిర్యాదులు భారీ సంఖ్యలో ఉన్నాయని, కేసు తీవ్రతను బట్టి నేరుగా పోలీసులకు కూడా అందుతాయని వివరించారు. సాధారణంగా తక్కువ సంఖ్యలోని బాధితులు దైర్యంగా ముందుకొచ్చి సమస్యను నివేదిస్తారని, అందుకే చాలా కేసులు బయటకు రావడంలేదని అభిప్రాయపడ్డారు. బాధితుల వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి పేరు లేకుండా ఫిర్యాదులను స్వీకరించాలని జాతీయ ర్యాగింగ్ వ్యతిరేక హెల్ప్‌లైన్‌కు ఈ నివేదిక సిఫారసు చేసింది.వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ ఎమర్జెన్సీ..తాజా నివేదికలో నమోదైన 51 ర్యాగింగ్ మరణాల్లో సుమారు 45.1 శాతం వైద్య కళాశాలల్లో జరిగినవే. వైద్య కళాశాలల్లో 23 మంది ర్యాగింగ్ భూతానికి బలైపోయారు. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే వైద్య కళాశాలలు, వర్సిటీల్లో 30 శాతం అధికంగా ర్యాగింగ్ మరణాలు నమోదవుతున్నాయని సేవ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య కళాశాలల్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించింది.ర్యాగింగ్ నియంత్రణ బృందాలు పర్యవేక్షించాలిర్యాగింగ్ నియంత్రణకు సేవ్ సంస్థ చేసిన ప్రధాన సూచనల్లో కొన్ని..» కళాశాలలు అంకితభావంతో కూడిన వ్యక్తులతో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలి» కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులకు సుహృద్భావ వాతావరణంలో విద్యను అందించాలి» యూజీసీ, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కొత్తగా చేరే విద్యార్థులకు ప్రత్యేక హాస్టళ్లలో వసతి కల్పించాలి» హాస్టళ్లలోని సీసీ కెమెరాల నిఘాను భద్రతా సిబ్బంది, యాంటీ ర్యాగింగ్ కమిటీలు, తల్లిదండ్రులు పర్యవేక్షించాలి» తీవ్రమైన ర్యాగింగ్ కేసుల్లో సంబంధిత సంస్థలు 24 గంటల్లోగా పోలీసులకు ఫిర్యాదు చేయాలిమూడేళ్లలో కోటా ఆత్మహత్యలతో పోలిస్తే..కోటాలో బలవన్మరణాలసంఖ్య 57విద్యా సంస్థల్లో ర్యాగింగ్ మరణాల సంఖ్య 51 2022 – 24 మధ్య ర్యాగింగ్ మరణాలు..2022 142023 172024 20 -
2030.. కండక్టర్ ఉద్యోగానికీ ఏఐ!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక ఇటీవల విడుదల చేసిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్–2025’ఉద్యోగాలకు సంబంధించి పలు ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది. కిందిస్థాయి ఉద్యోగాల్లోకి సైతం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చొరబడుతోందని, ఫలితంగా 2030 నాటికి కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయని, మరికొన్ని రంగాల్లో ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 2030 నాటికి బస్ కండక్టర్ వంటి ఉద్యోగానికి కూడా ఏఐ టెక్నాలజీ తెలుసుకుని ఉండటం అవసరమని, ఆఖరుకు వ్యవసాయం చేసే వాళ్ళకూ ఏఐ టెక్నాలజీ అవసరం ఏర్పడుతుందని ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ (ఉద్యోగాల భవిష్యత్తు) రిపోర్టు పేర్కొంది. జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచాలని, విద్యార్థుల్లో ఆ మేరకు నైపుణ్యం పెంచాలని సూచించింది. 2023లో సేకరించిన లెక్కల ప్రకారం భారత్‌లో 4.16 లక్షల మంది మాత్రమే ఏఐ నిపుణులు ఉన్నారు. కాగా 2025 చివరి నాటికి 6.29 లక్షలు 2026 నాటికి 10 లక్షల ఏఐ నిపుణులు అవసరమని పేర్కొంది. ఈ మేరకు కంప్యూటర్ కోర్సుల్లో సిలబస్‌ను మార్చాలని ఏఐ ఆధారిత పరిశ్రమల తోడ్పాటుతో సిలబస్‌కు రూపకల్పన చేయాలని సూచిస్తోంది. అంతర్జాతీయ యూనివర్శిటీలు ఇప్పటికే ఈ బాటలో పయనిస్తున్నాయి. అమెరికా స్కూల్ స్థాయి నుంచే ఏఐపై బోధన చేస్తోంది. భారత్ కూడా ఈ దిశగా పయనించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. -
పన్నీర్లో ప్రమాదకర బాక్టీరియా
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోను, రాష్ట్రంలో ఆహార తనిఖీలలో రోజుకొక ఆహారం బండారం బయటపడుతోంది. ఇప్పటివరకు బొంబై మిఠాయి, టమాటా సాస్, బేకరీలలో కేక్‌లు, పానీ పూరి, గోబీ, ఇడ్లీ, కళింగర పండ్లు తదితరాలలో కల్తీలు, కాలుష్య కారకాలు ఉన్నాయని ఆహార భద్రతా శాఖ ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు పన్నీర్ వంతు వచ్చింది. స్టార్ హోటళ్ల నుంచి తోపుడు బండ్ల వరకు పన్నీర్ వంటకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ ఆ పన్నీర్ ఎంత శుభ్రమైనది అనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. మసాలాలు వేసి వండి వడ్డిస్తే ఆబగా తినేయడం కనిపిస్తుంది. ఆహారశాఖ అధికారులు బెంగళూరులో పలు చోట్ల పన్నీర్ శాంపిల్స్‌ను సేకరించి నాణ్యత పరీక్షకు పంపించారు. రిపోర్టుల్లో పన్నీర్లో ప్రమాదకర బాక్టీరియా ఉన్నట్టు పేర్కొన్నారు. 231 పన్నీర్ శాంపిల్స్‌లో 17 శాంపిల్స్ రిపోర్టు మాత్రం వచ్చింది. వాటిలో ప్రమాదకర బాక్టీరియా ఉన్నట్టు, దానివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. కల్తీ పదార్థాలతో పన్నీర్ తయారీ, అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ, దానిని వట్టి చేతులతో తాకడం వల్ల కలుషితం అవుతుంది. -
పెద్దపులికి పెనుముప్పు
నడకలో రాజసం.. ఒళ్లంతా పౌరుషం.. పరుగులో మెరుపు వేగం.. పెద్దపులికే సొంతం. అది ఒక్కసారి గాండ్రిస్తే అడవి అంతా దద్దరిల్లిపోవాల్సిందే. ఏ జంతువైనా తోక ముడుచుకోవాల్సిందే. టన్నుల కొద్దీ ఠీవీని తనలో ఇముడ్చుకున్న పెద్దపులి మనుగడ ప్రమాదపు అంచులకు చేరడం జంతు, పర్యావరణ ప్రేమికులతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలనూ ఆందోళనకు గురిచేస్తోంది. పులి గాండ్రింపు సురక్షితం కావాలన్న ఆకాంక్ష బలంగా వినిపిస్తోంది. సాక్షి, అమరావతి: దేశంలో పెద్దపులికి పెనుముప్పు వచ్చి పడింది. ఐదేళ్లలో పులుల వేట అమాంతం పెరిగింది. పులులను వేటాడి వాటి ఎముకలు, చర్మాలను విదేశాలకు భారీగా అక్రమ రవాణా చేస్తున్నారు. అందుకోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో ప్రత్యేకంగా కొన్ని ముఠాలు వ్యవస్థీకృతమై మరీ స్మగ్లింగ్ దందాను సాగిస్తున్నాయి.పులి ఎముకలకు చైనా, తైవాన్, జపాన్లలో పెద్దఎత్తున డిమాండ్ ఉండటంతో ఈ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ప్రధానంగా 2024లో దేశంలో పులుల వేట, స్మగ్లింగ్ జోరందుకోవడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర ప్రభుత్వ విభాగం ‘వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో బలైన 100 పులులు కొన్నేళ్లుగా చేపడుతున్న చర్యలతో దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని సంతోషించేలోగానే.. పులుల వేట కూడా అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో ఉన్న పెద్ద పులుల సంఖ్యలో 70 శాతం భారత్‌లోనే ఉన్నాయి. దేశంలో 58 టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో 2022 నాటికి 3,682 పెద్ద పులులు ఉన్నాయి. 2006లో కేవలం 1,411 పెద్ద పులులు మాత్రమే ఉండగా.. 2023 నాటికి వాటి సంఖ్య 3,682కు పెరగడం విశేషం.కాగా 17 ఏళ్లలో క్రమంగా దేశంలో పులుల సంఖ్య పెరగ్గా.. గత ఐదేళ్లలో పులుల వేట కూడా పెరగడం ప్రతికూలంగా పరిణమిస్తోంది. గత ఐదేళ్లలో స్మగ్లింగ్ ముఠాలు దేశంలో 100 పులులను వేటాడాయి. వాటి ఎముకలు, చర్మం, ఇతర భాగాలను అక్రమంగా రవాణా చేశాయి. 2021–23లోనే 33 పులులను హతమార్చగా... 2024లోనే 42 పులులను వేటాడారు. ఐదేళ్లలో అత్యధికంగా మహారాష్ట్రలో 41 పులులను హతమార్చారు. ఆ రాష్ట్రంలో 2024 డిసెంబర్ 30 నుంచి 2025 జనవరి 22 నాటికి.. అంటే కేవలం 24 రోజుల్లోనే 12 పులులను వేటాడటం దేశంలో స్మగ్లింగ్ ముఠాల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. స్మగ్లింగ్‌లో రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఐదేళ్లలో 10 పులులు వేటగాళ్ల దెబ్బకు బలయ్యాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మూడేసి, తమిళనాడులో రెండు పులులు హతమవగా... కేరళ, ఉత్తరాఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్లో మిగిలిన పులులను వేటాడారు. మందుల తయారీ ముడిసరుకుగా పులి ఎముకలు చైనా, తైవాన్, జపాన్ తదితర దేశాల్లో పులుల ఎముకలకు భారీ డిమాండ్ ఉండటంతో వాటి వేట పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పులి శరీర భాగాలను వాణిజ్యపరమైన డిమాండ్ ఏమీ లేదు. పులి చర్మాలను స్టేటస్ సింబల్‌గా కొందరు బడా బాబులు తమ బంగ్లాలలో ప్రదర్శిస్తుంటారు. కానీ.. చైనా, తైవాన్, జపాన్ దేశాల్లో పులి శరీర భాగాలకు వాణిజ్యపరమైన డిమాండ్ భారీగా ఉంది. ప్రధానంగా పులి ఎముకలకు ఆ దేశాల్లో అత్యధిక డిమాండ్ ఉంది. చైనా, తైవాన్లలో ఔషధాల తయారీకి పులి ఎముకలను వినియోగిస్తున్నారు. పులి ఎముకలను పొడి చేసి వాటిని ప్రత్యేకమైన కొన్ని ఔషధాల తయారీకి వాడుతున్నారు. ఇక జపాన్‌లో పులి ఎముకలను బాగా ఉడికించి ఆ రసాన్ని ఖరీదైన మద్యం తయారీకి వాడుతున్నారు. ఆ దేశాల్లో పులులు లేవు. దాంతో ఆ దేశాల్లోని ఔషధ కంపెనీలు భారత్ నుంచి అక్రమంగా పులి ఎముకలను కొనుగోలు చేస్తున్నాయి. అందుకోసం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ముఠాలు పులులను వేటాడి వాటి శరీర భాగాలను ఆ ఏజెంట్లకు విక్రయిస్తున్నాయి. ఏజెంట్లు ఈశాన్య రాష్ట్రాల్లోని షిల్లాంగ్– సిల్చార్–ఐజ్వాల్–చంఫాయి గుండా దేశ సరిహద్దులు దాటించి మయన్మార్ మీదుగా చైనా, తైవాన్, జపాన్ తదితర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. స్మగ్లింగ్ అడ్డుకట్టకు సిట్ ఏర్పాటు దేశంలో పులుల వేట, స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఇప్పటికే కొందర్ని అరెస్ట్ చేసింది. పులులను వేటాడే ముఠాల భరతం పట్టేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. -
మనుషులకంటే ఫోన్ కనెక్షన్లే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జానాభా కంటే ఫోన్ కనెక్షన్లే అధికంగా ఉన్నాయి. మొబైల్ కనెక్షన్ల డెన్సిటీ (సాంద్రత)లో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక ముఖచిత్రం (సోషియో ఎకనామిక్ ఔట్లుక్)లో 2024 సెప్టెంబర్ వరకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రకటించిన డేటాను పొందుపరిచింది. దేశంలో వైర్లెస్ ఫోన్ల డెన్సిటీలో గోవా (152.64 శాతం) మొదటి స్థానంలో ఉంది. కేరళ (115.05 శాతం), హర్యానా (114.08 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. తెలంగాణ (105.82 శాతం) నాలుగో స్థానంలో నిలిచింది. బలమైన సమాచార వ్యవస్థ రాష్ట్రంలో మొత్తం ఫోన్ కనెక్షన్లు 41.94 మిలియన్లు (దాదాపు 4 కోట్ల 19 లక్షల 40 వేలు) ఉన్నాయని ఆర్థిక సర్వేలో తెలిపారు. అందులో వైర్లెస్ కనెక్షన్లు 40.42 మిలియన్లు (4 కోట్ల 42 వేలు) ఉన్నట్లు తేల్చారు. ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్లు రాష్ట్రంలో 1.52 మిలియన్లు ఉన్నట్లు వెల్లడించారు. సమాచార వ్యవస్థ తెలంగాణలో బలోపేతంగా ఉన్నట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని సర్వే నివేదికలో ప్రభుత్వం తెలిపింది. పట్టణాలు, నగరాల్లో వైర్లెస్ ఫోన్ నెట్వర్క్ బలంగా ఉంది. మొత్తం వైర్లెస్ కనెక్షన్లలో పట్టణాల్లో 23.87 మిలియన్లు (59.05 శాతం) ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 16.55 మిలియన్లు (40.95 శాతం) ఉన్నాయి. ల్యాండ్‌లైన్ ఫోన్లలో పట్టణా ల్లో 1.46 మిలియన్ కనెక్షన్లు ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో 0.06 మిలియన్లు ఉన్నాయి. బ్రాడ్‌బ్యాండ్ జోరు రాష్ట్రంలో డిజిటల్ ఇన్ఫర్మేషన్ మౌలిక సదుపాయాలు భారీగా విస్తరిస్తున్నాయి. తెలంగాణలో 36.43 మిలియన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నట్లు ట్రాయ్ లెక్కలు తేల్చాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ఈ– పరిపాలన, విద్య, ఆరోగ్యం, ఐటీ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో బ్రాండ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లు అధికంగా ఉన్నాయి. బ్రాండ్‌బ్యాండ్, న్యారోబ్రాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లలో బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ 98% ఉన్నాయి. మొత్తం 36.43 ఇంటర్నెట్ కనెక్షన్లలో బ్రాండ్‌బ్యాండ్ కనెక్షన్లు 35.68 మిలియన్లు, న్యారోబ్రాండ్ కనెక్షన్లు 0.75 లక్షలు ఉన్నట్లు వివరించింది. -
మల్టీప్లెక్స్ స్టాక్ పంట పండింది..?
హిందీతో పాటు విభిన్న భాషల్లో ఇటీవల విడుదలైన పాన్ ఇండియా సినిమా ఛావా తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని ప్రముఖ థియేటర్లతోపాటు మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ సినిమాస్‌లోనూ విడుదల చేయడంతో కంపెనీకి లాభాల పంట పండినట్లయిందని స్టాక్ రేటింగ్ బ్రేకరేజ్ సంస్థ నువామా ఇన్ స్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. ఇటీవల కాలంలో మార్కెట్ అనిశ్చితుల నేపథ్యంలో కంపెనీ షేర్లు గరిష్ఠం నుంచి 32 శాతం పతనమైనప్పటికీ రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని తెలిపింది.2024-25 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో ఛావా సినిమా కలెక్షన్లు ఊపందుకోవడంతో పీవీఆర్ ఐనాక్స్ మంచి లాభాలు పోస్ట్ చేస్తుందని నువామా తన నివేదికలో అంచనా వేసింది. ఇటీవల కంపెనీ ప్రమోటర్లు షేర్లు కొనుగోలు చేసినట్లు గుర్తు చేసింది. ఫిబ్రవరిలో ఛావా బాక్సాఫీస్ వసూళ్లతోపాటు ఇతర సినిమాల సహకారంతో స్టాక్ ధర ఏడాది ప్రాతిపదికన 39 శాతం పెరుగుదలతో ఆదాయాన్ని రూ.2,264 కోట్లకు పెంచిందని పేర్కొంది. కరోనా తర్వాత ఫిబ్రవరి నెలలో రూ.1,245 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో పరిశ్రమకు అత్యధిక వసూళ్లు సాధించడంలో ఛావా తోడ్పడింది.ఇదీ చదవండి: భారత్‌తో వాణిజ్యంపై యూఎస్ స్పై చీఫ్ స్పందనకొత్తగా 100 స్క్రీన్లు..పీవీఆర్ ఐనాక్స్ అసెట్-లైట్ గ్రోత్ స్ట్రాటజీని పాటిస్తోంది. భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో 30-40 కొత్త స్క్రీన్లను జోడించాలని భావిస్తున్నారు. సంస్థ క్యాపిటల్-లైట్ గ్రోత్ మోడల్ కింద 100 స్క్రీన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నువామా పేర్కొంది. ఇందులో 31 స్క్రీన్లు మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ మోడల్ కింద, 69 అసెట్-లైట్ మోడల్ కింద ఉండనున్నాయి. ఇందులో 42 శాతం నుంచి 80 శాతం వరకు మూలధన వ్యయాన్ని డెవలపర్ భరిస్తారని పేర్కొంది. కొత్తగా ప్లాన్ చేసిన ఈ స్క్రీన్లు రెండు మూడేళ్లలో అందుబాటులోకి వస్తాయని నువామా నివేదించింది. -
దగా యాష్..నిఘా ట్రాష్
సాక్షి, పెద్దపల్లి: భారతావనికి ఎన్టీపీసీ విద్యుత్ వెలుగులు పంచుతుంటే, విద్యుదుత్పత్తిలో భాగంగా విడుదలయ్యే బూడిద (యాష్) రాజకీయ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. బూడిదతో ఎన్నిరకాలుగా దందా చేయవచ్చో, అన్నిరకాలుగా అక్రమమార్గాల్లో అమ్ము కుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే రామగుండం కేంద్రంగా యాష్ పాండ్‌లో జరుగుతున్న అక్రమాలపై ఇంటలిజెన్స్ రిపోర్టు సీఎంవో కార్యాలయానికి చేరుకున్నా.. ఈ దందాకు అడ్డుకట్ట పడలేదు. దీంతో బూడిద సరఫరా పేరుతో జరుగుతున్న అక్రమాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం.. చివరకు గోదావరిఖని పోచమ్మ ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేసేస్థాయికి చేరుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. నేషనల్ హైవేకి తరలింపు పేరుతో..ఉత్పత్తిలో భాగంగా విడుదలయ్యే బూడిద.. చెరువులో నిర్ణీత స్థాయికి మించితే కాలుష్య సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఎనీ్టపీసీ అవసరమైన వారికి ఎప్పటికప్పుడు అందులో బూడిదను ఉచితంగా సరఫరా చేస్తోంది. కానీ జాతీయ అవసరాల దృష్ట్యా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా.. కొత్తగా నిర్మించే జాతీయ రహదారులకు.. రామగుండంలోని కుందనపల్లిలోని బూడిద చెరువు నుంచి తరలించాల్సి ఉంటుంది. అందుకు లోడింగ్, రవాణా ఖర్చులు సైతం ఎన్టీపీసీయే భరిస్తుంది. రవాణా చార్జీలుగా టన్నుకు రూ.1,250 చొప్పున చెల్లిస్తుంది. అంటే ఒక లారీకి రూ.50 వేల వరకు బూడిద రవాణాకు చెల్లిస్తుంది. దీంతో కొంతమంది కాంట్రాక్టర్లు కొత్త దందాకు తెర తీశారు. నేషనల్ హైవే పేరిట తరలించే లారీల్లో సగం లారీలను నేషనల్ హైవేల నిర్మాణానికి చేరుస్తూ, మిగిలిన సగం లారీల బూడిదను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.పాండ్ నుంచి లోడింగ్ అయి బయటకు వచ్చాక వాటికి నంబర్ ప్లేట్లు మార్చి జీపీఎస్‌ను మరో లారీలో పెట్టడం తదితర జిమ్మిక్కులతో నేషనల్ హైవేకు తరలించాల్సిన బూడిదను.. కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల తదితర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారు. దీంతో పక్కదారి పట్టించిన ఒక్కొక్క లారీకి ఎన్టీపీసీ నుంచి రవాణా చార్జీల పేరిట రూ.50 వేలు, ఇటుక బట్టీలకు లారీ బూడిదను రూ.50 వేలకు అమ్మి తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. బూడిదతో పాటు నిర్వహణ ఖర్చుల పేరిట అక్రమార్కులు డబుల్ ధమాకా పొందుతున్నారు. లోడింగ్ పేరుతో..పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తిలో భాగంగా వెలువడే నీటితో కలిసిన బూడిదను.. బూడిద చెరువులో నింపుతారు. ఆ బూడిదను డీసిల్టేషన్ ప్రక్రియలో భాగంగా అధికారులు టన్నుకు రూ.130 చొప్పున 38 ఏజెన్సీలు 15 లక్షల మెట్రిక్ టన్నుల బూడిద తరలించేలా టెండర్లు ఖరారు చేశారు. కాగా, ఎన్టీపీసీ ఈ టెండర్లను రద్దు చేసి రూ.1కే టన్ను ఇచ్చేందుకు టెండర్లు పిలిచింది. దీంతో 114 మంది ఈ టెండర్లను దక్కించుకున్నారు. టెండర్లు దక్కించుకున్న వారిలో ఐదుగురు.. రాజకీయ బలంతో లోడింగ్ పేరుతో దందాకు తెర తీశారు. లారీల సామర్థ్యాన్ని బట్టి రూ.4,600 నుంచి రూ.9,600 వరకు అక్రమంగా వసూలు చేస్తూ ఇటుకబట్టీలకు సరఫరా చేస్తున్నారు. రోజుకు వెయ్యి వాహనాల్లో బూడిద తరలిస్తూ రూ.లక్షల్లో జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పరస్పర ఆరోపణలతో..బూడిద చెరువులోకి వచ్చి చేరే బూడిదను జాతీయ రహదారుల నిర్మాణం, ఇటుకల తయారీతో పాటు ఇతరత్రా నిర్మాణాలకు ఉచితంగా ఎన్టీపీసీ అందిస్తుంది. కానీ, ఈ బూడిద తరలింపు వ్యవహారంలో రాజకీయ నేతల జోక్యంతో అక్రమాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు వెయ్యి లారీల చొప్పున సరఫరా అవుతుండటంతో.. అంతే మొత్తంలో బూడిద దందాలో డబ్బులు చేతులు మారుతున్నాయి. దీంతో కొన్నిరోజులుగా జిల్లాలో బూడిద పంచాయితీపై నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చివరకు ఎన్టీపీసీ కాంట్రాక్టు కారి్మక సంఘం అధ్యక్షుడు కౌశిక్‌హరి తడిబట్టలతో గోదావరిఖని పోచమ్మ గుడిలో ప్రమాణం చేయడం రాజకీయంగా దుమారం రేపింది. -
యువత మార్కెట్ సోషల్ మీడియా
కొత్త బట్టలు కొనాలన్నా... లేటెస్ట్ గాడ్జెట్ కావాలన్నా... టీవీలు, ఫ్రిడ్జ్‌లు వంటి గృహోపకరణాలు తీసుకోవాలనుకున్నా.. ఇంటీరియర్ డిజైనింగ్.. ఆటోమొబైల్స్.. ఆభరణాలు.. ఇలా మార్కెట్లోకి వచ్చిన కొత్త ట్రెండ్స్ తెలుసుకునేందుకు సోషల్ మీడియా వేదికలను ఆశ్రయిస్తున్నామని యువత ముక్తకంఠంతో చెబుతోంది.హాలిడే ట్రిప్స్‌ను ప్లాన్ చేసేందుకు సైతం సోషల్ మీడియాలోనే అన్వేషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వస్తు వినియోగ మార్కెట్‌ను సోషల్ మీడియా శాసిస్తోంది. అంతర్జాతీయ మార్కెటింగ్ కన్సల్టెన్సీ స్ప్రౌట్ సోషల్ ఇండెక్స్ తాజా నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. – సాక్షి, అమరావతి1 కొత్త ఫ్యాషన్లు, మార్కెట్ ఆవిష్కరణల గురించి తెలుసుకునేందుకు యువత ఆధారపడే వాటిలో సోషల్ మీడియా స్థానం90 శాతం కొత్త ఫ్యాషన్లు, మార్కెట్ ఆవిష్కరణల గురించి తెలుసుకునే విషయంలో సోషల్ మీడియానునమ్మేవారు81 శాతం సోషల్ మీడియా ప్రభావంతో తక్షణం స్పందించి వస్తువులు కొనుగోలు చేస్తున్నవారు » కొత్త ఫ్యాషన్లు, మార్కెట్ ఆవిష్కరణలను గురించి తెలుసుకునేందుకు యువత ఆధారపడేవాటిలో సోషల్ మీడియా మొదటి స్థానంలో ఉంది. ఏకంగా 90శాతం మంది యువత సోషల్ మీడియాను విశ్వసిస్తున్నారు. » స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదించడం అనేది రెండో స్థానంలో ఉంది. 68శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. » టీవీ చానళ్లు మూడో స్థానంలో ఉన్నాయి. 60శాతం మంది యువత టీవీ చానళ్లలో ప్రకటనలను పరిశీలిస్తున్నారు. » నాలుగో స్థానంలో డిజిటల్ మీడియా ఉంది. 54శాతం మంది డిజిటల్ మీడియా ద్వారా మార్కెటింగ్ ట్రెండ్స్ తెలుసుకుంటున్నారు.» పాడ్ కాస్ట్ ప్రసారాలను 35శాతం మంది విశ్వసిస్తున్నారు. » 23శాతం మంది పత్రికలను ఆశ్రయిస్తున్నారు. » సోషల్ మీడియా ప్రభావంతో తక్షణం స్పందించి నచ్చినవి కొనుగోలు చేస్తున్నామని ఏకంగా 81శాతం మంది చెప్పారు.» కనీసం నెలకు ఒకసారి అయినా సోషల్ మీడి యా తమ కొనుగోలు అభిరుచులను నిర్దేశిస్తోందని 28శాతం మంది తెలిపారు.» ఇక ఏదైనా బ్రాండ్ గురించి సోషల్ మీడియాలో లేకపోతే తాము ప్రత్యామ్నాయ బ్రాండ్ల పట్ల మొగ్గుచూపుతున్నట్లు 78శాతంమంది వెల్లడించారు. » సోషల్ మీడియా ద్వారా వస్తువుల కొనుగోలుకు పలు కారణాలను కూడా యూజర్లు వెల్లడించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రదర్శించే వివిధ కంపెనీల ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారులకు అందించే సేవల పట్ల సంతృప్తి కారణంగా వస్తువులు కొనుగోలు చేస్తున్నామని 63శాతం మంది తెలిపారు. -
ఫైర్ లేని వాల్స్!
సాక్షి, హైదరాబాద్: ప్రతీ రంగంలో సాంకేతికత అత్యంత కీలకంగా మారింది. అదేస్థాయిలో సైబర్ దాడుల ముప్పు పొంచి ఉంటోంది. ఏదైనా సంస్థ నెట్‌వర్క్‌ను భద్రంగా ఉంచేందుకు పటిష్టమైన ఫైర్‌వాల్ రక్షణ వ్యవస్థ తప్పనిసరి. అయితే, హ్యాకర్ల దాడుల విషయంలో భారతీయ కంపెనీలకు చెందిన నెట్‌వర్క్‌లు బలహీనమని గ్రూప్–ఐబీ సంస్థ ఇటీవల విడుదల చేసిన హైటెక్ క్రైం ట్రెండ్స్ రిపోర్ట్–2025లో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 2024లో జరిగిన సైబర్ దాడుల్లో అత్యధికంగా 13 శాతం ఘటనలు భారత్‌లోనే జరిగినట్టు ఆ నివేదిక స్పష్టంచేసింది. ప్రధానంగా విద్యాసంస్థలకు సంబంధించిన నెట్వర్క్లపైనే హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత ప్రభుత్వరంగ సంస్థల నెట్వర్క్, మిలిటరీ, ఆర్థికసేవల సంస్థల నెట్‌వర్క్‌లు హ్యాకర్లకు లక్ష్యంగా మారుతున్నాయని పేర్కొంది. హ్యాకర్లు ఫైర్‌వాల్స్‌ను ఛేదించి సదరు నెట్‌వర్క్‌లోకి చొరబడి మొత్తం వ్యవస్థను తమ అ«దీనంలోకి తీసుకుని సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నట్టు తెలిపింది. డేటా లీకేజీలో అమెరికాది తొలిస్థానంపబ్లిక్ డొమైన్లో ఉండే డేటా లీకేజీలో అమెరికా తొలిస్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది. 2024లో ఈ తరహా ఘటనలు అమెరికాలో 214 నమోదైనట్టు పేర్కొంది. తర్వాత స్థానంలో రష్యా (195 ఘటనలు) ఉండగా.. భారత్ (60) మూడో స్థానంలో నిలిచినట్టు గ్రూప్–ఐబీ నివేదిక పేర్కొంది. ఈ–మెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, పాస్వర్డ్లు ఈ డేటా లీకేజీలో ఉంటున్నాయి. 2024లో ఈ–మెయిల్ అడ్రస్‌లు, పాస్‌వర్డ్‌లను డార్క్‌వెబ్‌లో విక్రయించడం ద్వారానే సైబర్ నేరగాళ్లు రూ.248.9 కోట్లు కొల్లగొట్టారు.ఫైర్‌వాల్స్ అంటే? అనధికారికంగా నెట్‌వర్క్‌లోకి చొరబడకుండా, హానికరమైన డేటాను నెట్‌వర్క్‌లోకి చొప్పించకుండా రక్షించే భద్రతా పరికరమే ఫైర్‌వాల్. ఇది హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్వేర్ కావొచ్చు. నెట్వర్క్ ప్యాకెట్లను పరిశీలించి వాటిని అనుమతించాలా లేదా నిరోధించాలా అనేదాన్ని ఫైర్‌వాల్ నిర్ణయిస్తుంది. ఫైర్‌వాల్స్ ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ లేదా నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయకుండా హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను నిరోధించగలవు. -
ఇల్లు వద్దు.. అప్పు అసలే వద్దు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పాలనలో పురోభివృద్ధిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు.. గత ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరోగమనంలో ఉన్నట్లు వ్యక్తిగత గృహ రుణాలు తేటతెల్లం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలు, చర్యల కారణంగా వ్యక్తిగత గృహ రుణాలు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా గృహ రుణాల్లో 14 శాతం వృద్ధి నమోదైతే.. మన రాష్ట్రంలో మాత్రం క్షీణించినట్లు ఎన్‌హెచ్‌బీ 2024 నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల (ఏప్రిల్–సెప్టెంబర్) కాలంలో వివిధ బ్యాంకులు విడుదల చేసిన వ్యక్తిగత గృహ రుణాల విలువ రూ. 15,831 కోట్లకు పడిపోయింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో బ్యాంకులు విడుదల చేసిన రుణాల మొత్తం రూ.16,033 కోట్లు. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణాల విలువ రూ.202కోట్లు తక్కువ. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మంజూరైన గృహ రుణాల విలువ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 14శాతం పెరిగి రూ.33.53 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబర్ 2024 నాటికి రాష్ట్రంలో ఔట్‌స్టాండింగ్ రుణాల విలువ రూ.4,10,416 కోట్లుగా ఉన్నట్లు ఎన్‌హెచ్‌బీ నివేదికలో పేర్కొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించాయనడానికి బ్యాంకుల రుణ మంజూరు తగ్గడం, జీఎస్టీ వసూళ్లు క్షీణించడం నిదర్శనమని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. -
వర్క్ ఫ్రం హోంపై కొత్త పాలసీ
సాక్షి, అమరావతి: వర్క్ ఫ్రం హోంపై సర్వే నివేదిక ఆధారంగా నూతన పాలసీ తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యార్హతలు ఉండి, పనిచేసే సామర్థ్యం ఉన్నవారికి శిక్షణ ఇవ్వడం ద్వారా ఇంటి నుంచి పనిచేసే అవకాశాలు కల్పించేందుకు ఆయా సంస్థలతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై సోమవారం సీఎం సమీక్ష చేశారు. వివిధ కార్యక్రమాల అమల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో అసెంబ్లీలోని తన ఛాంబర్లో సమీక్షించారు.ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో 100 శాతం నాణ్యత కనిపించాలని, లబ్ధిదారుల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తంకావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలుచేయడంపై అన్ని స్థాయిల్లో దృష్టిపెట్టాలని సూచించారు. పదేపదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని ఆదేశించారు. కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులకు కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా ఉన్నతాధికారులు సేవలు మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించొద్దన్నారు. ‘ఆస్పత్రుల్లో అందించే సేవలపై రోగుల నుంచి ప్రభుత్వం అభిప్రాయం సేకరించగా.. 68.6శాతం మంది డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. డాక్టర్ల ప్రవర్తనపై 71.7 శాతం, సిబ్బంది ప్రవర్తనపై 65.6 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేశారు. మందులు ఆస్పత్రుల్లో ఇస్తున్నారా, ప్రభుత్వాస్పత్రిలో పరిశుభ్రత ఎలా ఉందన్న ప్రశ్నలకు 65 శాతం సంతృప్తి వ్యక్తంకాగా.. దీన్ని మరింత మెరుగుపరుచుకోవాలి’ అని సీఎం సూచించారు. ‘ఎప్పటికప్పుడు చెత్త సేకరిస్తున్నారా... అన్న ప్రశ్నకు 67 శాతం మంది అవునన్నారు. రెవెన్యూ సేవలకు సంబంధించి పాసు పుస్తకానికి అదనపు చార్జీలు తీసుకుంటున్నారని.. సర్వే దరఖాస్తుపై దరఖాస్తు రుసుము కాకుండా అదనపు చార్జీలు తీసుకుంటున్నారని ప్రజలు బదులిచ్చారు. రెవెన్యూ సేవల్లో మార్పు కనిపించాలి’ అని సీఎం చెప్పారు. కాగా, ‘పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్’పై మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగే సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.అమరావతికి డీప్ టెక్నాలజీప్రభుత్వ క్యాన్సర్ సలహాదారునిగా డాక్టర్ నోరిడీప్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతికి తేవడానికి కృషిచేస్తానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రముఖ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు జీవిత ప్రయాణానికి సంబంధించిన ‘మంటాడ టూ మ్యాన్‌హ్యాటన్’ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు సోమవారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నోరి దత్తాత్రేయుడు పేద కుటుంబంలో పుట్టి, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రపంచస్థాయి వైద్యులుగా ఎదిగారని కొనియాడారు. 50 ఏళ్ల పాటు క్యాన్సర్ వైద్యసేవల్లో నిమగ్నమయ్యారన్నారు. నోరి ఫౌండేషన్ పెట్టి ప్రజాసేవ చేస్తున్నారన్నారు. ‘నోరి’ని ఏపీ ప్రభుత్వ క్యాన్సర్ సలహదారుగా నియమిస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని బసవతారకం తరహాలోనే అమరావతిలోనూ ఓ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. వచ్చే నాలుగైదేళ్లలో రాష్ట్రంలో ప్రకృతి సాగును 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తామన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా మాట్లాడారు. -
బ్యాంకింగ్ సంస్థల పేరిట బురిడీ!
సాక్షి, అమరావతి: బ్రాండింగ్ ముసుగులో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేర్లతోనే అత్యధికంగా నిధులు కొల్లగొడుతున్నారు. రిటైల్, టెక్నాలజీ రంగాల పేరిట మోసాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక సైబర్ నేరస్తులు నిధులు కొల్లగొట్టేందుకు ఫిషింగ్ యాప్‌లు, లింక్‌లనే ప్రధాన సాధనంగా చేసుకుంటున్నారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘క్లౌడ్ సేక్’ దేశంలో సైబర్ నేరాల తీవ్రతపై తాజా నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2025లో దేశంలో సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోయే అవకాశాలున్నాయని కూడా అంచనా వేసింది. నివేదికలోని ప్రధాన అంశాలివి..» బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో 39.5 శాతం సైబర్ నేరాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిటæ బురిడీ కొట్టించి నిధులు కొల్లగొడుతున్నారు. » రెండు, మూడు స్థానాల్లో రిటైల్/ఈ–కామర్స్, టెక్నాలజీ సంస్థలున్నాయి. రిటైల్ సంస్థల పేరుతో 21.4 శాతం, టెక్నాలజీ సంస్థల పేరిట 12.5శాతం సైబర్ నేరస్తులు బురిడీ కొట్టిస్తున్నారు. ఇక టెలీ కమ్యూనికేషన్ల సంస్థలు(9.1శాతం), ట్రావెల్ సంస్థలు(8.6శాతం), రియల్ ఎస్టేట్ సంస్థలు(2.5శాతం), బీమా కంపెనీలు(1.9%) పేరిట కూడా సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు.» సైబర్ ముఠాలు అత్యధికంగా ఫిషింగ్ యాప్‌లు/లింకులనే తమ మోసాలకు సాధనంగా చేసుకుంటున్నాయి. ఫిషింగ్ యాప్‌లు/ లింకులు పంపి వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాల్లో నిధులు కొల్లగొడుతున్నాయి. మొత్తం సైబర్ నేరాల్లో ఈ తరహా మోసాలు ఏకంగా 58% ఉండటం గమనార్హం. » తర్వాత స్థానాల్లో సోషల్ మీడియా మాధ్యమాలున్నాయి. ఫేక్ ఫేస్బుక్ ఐడీల పేరిట 25.7శాతం, యూట్యూబ్ ద్వారా 5.8శాతం, ఎక్స్( ట్విట్టర్) ఖాతాల ద్వారా 3.2శాతం, ఇన్స్టాగామ్ ద్వారా 2.5శాతం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. » సైబర్ నేరస్తులు 2025లో దేశంలో ఏకంగా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని అంచనా. దేశంలో సైబర్ మోసాలపై ఏకంగా 25 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం ఉంది. వాటిలో 41 శాతం వరకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే ఉంటాయని భావిస్తున్నారు. ఇక దేశంలో మోసపూరితమైన యాప్‌లు 83 శాతం, ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు 65 శాతం పెరగొచ్చని అంచనా. -
తుంగభద్ర నీరు తాగలేం..
సాక్షి, అమరావతి: ‘‘తుంగాపానం.. గంగాస్నానం’’ అనేది నానుడి.. అంటే, తాగేందుకు తుంగభద్ర నీరు.. స్నానానికి గంగా నది నీరు అని. కానీ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నివేదిక మాత్రం తుంగభద్ర నది కాలుష్య కాసారంగా మారిందని.. నదీ జలాల్లో హానికర బ్యాక్టీరియా, వ్యర్థాలు ప్రమాదకర స్థాయికి చేరాయని.. ఈ నీటిని శుద్ధి చేయకుండా తాగితే వ్యాధుల బారినపడక తప్పదని హెచ్చరిస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని తుంగభద్ర పరివాహక ప్రాంత నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగు నీటి, పారిశ్రామిక వ్యర్థ జలాలను యథేచ్ఛగా నదిలోకి వదిలేయడం.. వ్యర్థాలను పడేయడం వల్ల జలాలు కలుషితం అవుతున్నాయి. జాతీయ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటికి బీవోడీ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) రెండు మిల్లీగ్రాముల లోపు ఉండాలి. కానీ, కర్ణాటక పరిధి తుంగభద్ర జలాల్లో బీవోడీ గరిష్ఠంగా 7 మిల్లీగ్రాముల నుంచి కనిష్ఠంగా 6.2 మిల్లీగ్రాములు ఉంది. దీన్నిబట్టే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. రాష్ట్ర పరిధిలో మంత్రాలయం నుంచి కర్నూలు వరకు తుంగభద్ర జలాల్లో లీటర్ నీటికి బీవోడీ గరిష్ఠంగా 6.2 మిల్లీగ్రాముల నుంచి కనిష్ఠంగా 2.4 మిల్లీగ్రాములు ఉండగా.. కోలీఫామ్ (బ్యాక్టీరియా) వంద మిల్లీ లీటర్లకు 220 ఉన్నాయి. ఇక ఫీకల్ కోలీఫామ్ (హానికర బ్యాక్టీరియా) వంద మిల్లీలీటర్లకు ఒక్కటి కూడా ఉండకూడదు. కానీ.. మంత్రాలయం నుంచి కర్నూలు వరకు తంగభద్ర జలాల్లో వంద మిల్లీలీటర్లకు 58 హానికర బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది. నాడు స్వచ్ఛతకు.. నేడు కాలుష్యానికికర్ణాటక పరిధిలోని పశ్చిమ కనుమల్లో కుద్రేముఖ్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,196 మీటర్ల ఎత్తులో తుంగ ఒకవైపు.. భద్ర ఒకవైపు జన్మిస్తాయి. 147 కిలోమీటర్ల పొడవున తుంగ, 171 కి.మీ.ల పొడవున భద్ర పయనించాక కూడలి వద్ద సంగమిస్తాయి. తుంగభద్రగా మారాక 547 కి.మీ. ప్రవహించి తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర సమీపంలోని గొందిమల్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. కృష్ణాకు ప్రధాన ఉప నది అయిన తుంగభద్ర ఒకప్పుడు స్వచ్ఛతకు పెట్టింది పేరు. అయితే, కర్ణాటక పరిధి పరివాహక ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు, వ్యర్థాలను యథేచ్ఛగా వదిలేయడంతో కాలుష్య కాసారంగా మారింది. నిరుడు నవంబరులో తుంగభద్ర జలాల స్వచ్ఛతపై సీడబ్ల్యూసీ, సీపీసీబీ సంయుక్తంగా అధ్యయనం చేసి కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇచ్చాయి.ఈ నివేదిక ప్రకారం.. » కర్ణాటకలో శివమొగ్గ వద్ద తుంగ నదీ జలాల్లో లీటర్ నీటికి 6 మిల్లీగ్రాముల బీవోడీ ఉంది. » కర్ణాటక పరిధి భద్రావతి నుంచి హోలెహొన్నూరు వరకు భద్ర నదీ జలాల్లో లీటర్ నీటికి 7 మిల్లీ గ్రాముల బీవోడీ ఉంది. » తుంగభద్రగా రూపాంతరం చెందే కూడలి నుంచి మైలార, ఉల్లనూరు నుంచి హొకినేహళ్లి వరకు జలాల్లో లీటర్ నీటికి బీవోడీ 6.2 మిల్లీగ్రాములు ఉంది. » కర్ణాటకలో వ్యర్థాలతో కలుషితమైన తుంగభద్ర నదీ జలాలు ఏపీలోకి ప్రవేశించాక.. మంత్రాలయం నుంచి బావపురం మధ్య ప్రాంతంలోనూ లీటర్ నీటికి బీవోడీ గరిష్ఠంగా 6.2 మిల్లీగ్రాముల నుంచి కనిష్ఠంగా 3 మిల్లీగ్రాములు ఉంది. » తుంగభద్రలో కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న శివమొగ్గ, భద్రావతి–హోలెహొన్నూరు, కూడలి–మైలార, ఉల్లనూరు–హోకినేహళ్లి, మంత్రాలయం–కర్నూలు ప్రాంతాల్లో మురుగు, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేశాకే నదిలోకి వదలాలి. -
మా నియంత్రణ ఉండాల్సిందే..
పొద్దున గుడ్‌మార్నింగ్ మొదలు రాత్రి గుడ్‌నైట్ చెప్పే వరకు ఈ రోజుల్లో యువత ఎక్కువగా స్మార్ట్ఫోన్లలోనే గడుపుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరిలో ‘సోషల్’వాడకం పెరిగింది. ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్.. ఇలా ఎన్నో రకాల సోషల్ మీడియా యాప్‌లతోపాటు ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియా అకౌంట్ లేకపోతే నామోషీ అనే స్థాయికి స్కూల్ పిల్లలు సైతం వచ్చేశారు. ఇది చాలా నష్టం చేస్తోందని, పిల్లల సోషల్ మీడియా వాడకంపై కచ్చితంగా నియంత్రణ ఉండాలని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. వయసు తప్పుగా చూపి.. వాస్తవానికి సోషల్ మీడియా యాప్‌లలో ఖాతా తెరవాలంటే కనీసం 18 ఏళ్లు ఉండాలి. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఖాతా తెరవాలంటే వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. కానీ, వయస్సును తప్పుగా చూపిస్తూ 18 ఏళ్లలోపు వారు సొంతంగా సోషల్ మీడియా ఖాతాలు తెరవటం షరా మామూలైంది. దీంతో అవగాహన లేని వయస్సులో పిల్లలు సైబర్ విష ప్రపంచంలో కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఏదో ఒక అనర్థం జరిగేవరకు తల్లిదండ్రులకు తెలియటం లేదు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ఎలక్టాన్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) రూల్స్– 2025ను తీసుకువచి్చంది. ఇందులో పలు కీలక అంశాలను చేర్చారు. 18 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతా తెరవాలన్నా, ఓటీటీ యాప్‌లు, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో చేరాలన్నా తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి చేశారు. ఈ నూతన నిబంధనలపై తల్లిదండ్రుల అభిప్రాయాలను లోకల్ సర్కిల్స్ సంస్థ సేకరించింది. దేశవ్యాప్తంగా 349 జిల్లాల్లోని 44 వేలమంది పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను సర్వే చేసి ఈ సంస్థ నివేదికను రూపొందించింది. కాగా, ఏ వయస్సు చిన్నారులు తమ వయస్సును ఎంతశాతం ఎక్కువగా చూపి సోషల్ మీడియా ఖాతాలు తెరుస్తున్నారన్న అంశంపై బ్రిటన్ సంస్థ ఆఫ్కామ్ ఓ నివేదిక విడుదల చేసింది. వయస్సు తప్పుగా నమోదు చేస్తున్న వారిలో 8 నుంచి 17 ఏళ్లలోపు చిన్నారులు 77 శాతం సొంత ప్రొఫైల్స్‌తో సోషల్ మీడియా ఖాతాలు వాడుతున్నట్టు ఆ సంస్థ తెలిపింది. -
సోలో ట్రిప్‌కే అతివల ఆసక్తి
సాక్షి, అమరావతి: పర్యాటకుల అభిరుచి కొత్త పుంతలు తొక్కుతోంది. వర్తమాన జీవితంలో సంతోషానికే ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం మహిళల సోలో ప్రయాణాలకు కేరాఫ్‌గా మారనుంది. దీనికితోడు వెల్నెస్ రిట్రీట్లు, పాప్ సంస్కృతి ప్రేరేపిత టూర్లపై ఆసక్తి కనిపిస్తోంది. వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది అత్యంత ముఖ్యమైన ట్రెండ్లలో ‘సోలోగా మహిళా ప్రయాణం’ ఒకటిగా నిలుస్తోంది. 2024లో సోలో వీసాలకు దరఖాస్తు చేసిన మహిళలు 30 శాతం ఉంటే.. ఈ ఏడాది 37 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తోంది. సుమారు 25–40 ఏళ్ల మధ్య మహిళలు సోలో ట్రిప్‌లను ఉద్యమంగా చేపట్టబోతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. బాలి, థాయ్‌లాండ్, జపాన్ వంటి గమ్యస్థానాలలో సాహస యాత్రల ద్వారా తమ అన్వేషణను చేపట్టాలని భావిస్తున్నట్టు తేలింది.పర్యాటక శక్తి కేంద్రంగా ఆసియాప్రపంచ ప్రయాణ రంగంలో ఆసియా ఆధిపత్యం కొనసాగుతోంది. థాయ్‌లాండ్, జపాన్, వియత్నాంతో పాటు ఇండోనేషియా 2025లో అత్యంత పర్యాటక రద్దీని ఎదుర్కోనుంది. వీసా రహిత విధానాలు, వివిధ ఎక్స్‌పోలు లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించనుంది. సింగపూర్‌కు చెందిన డిస్నీ క్రూయిజ్‌కు 27 శాతానికిపైగా డిమాండ్ పెరగనుంది. నోరూరించ రుచుల కోసంప్రయాణ ప్రణాళికలో ఆహారం ప్రధాన భాగంగా మారుతోంది. 2025లో వంటకాల పర్యాటకం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇటలీ ట్రఫుల్ ఫెస్టివల్, థాయ్‌లాండ్ సాంగ్‌క్రాన్ ఫుడ్ ఫెస్టివల్ వంటి ఐకానిక్ ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో స్లోవేనియా, లావోస్, ఫారో దీవులు వంటి ఆఫ్‌బీట్ గమ్యస్థానాలు సాహస యాత్రల అనుభవాలను మహిళలు కోరుకుంటున్నారు.ఆరోగ్యకర ప్రయాణంప్రయాణికులు తమ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలి, తైవాన్ వంటి ప్రశాంతమైన గమ్యస్థానాలలో యోగా, ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ ప్రాంతాలను చుట్టిరావడం కంటే ఒకే ప్రాంతంలో అనుభూతులను పూర్తిగా ఆస్వాదించేలా ‘స్లో ట్రావెలింగ్’ భావనను అలవర్చుకుంటున్నారు. మరోవైపు పాప్ సంస్కృతి ప్రయాణాన్ని ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఇష్టపడుతున్నారు. అభిమానులు తమకు ఇష్టమైన సినిమాలు, ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాల నుంచి ప్రేరణ పొంది టూర్లను ప్లాన్ చేసుకుంటున్నారు. -
పొదుపులో కుదుపు..
సాక్షి, అమరావతి: దేశంలో అప్పుల అప్పారావులు పెరిగిపోతున్నారు. పాత తరం పొదుపు మంత్రాన్ని జపిస్తే.. నేటి తరం పొదుపు కంటే అప్పులే ముద్దంటోంది. ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత నుంచి పొదుపు తగ్గించి.. అప్పుచేసి మరీ వస్తువులను కొనుగోలు చేసే ట్రెండ్ పెరుగుతోంది. తాగాజా బ్లూమే రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2000 సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు కుటుంబ పొదుపు భారీగా పతనమై.. ఆ స్థానంలో కన్సూ్యమర్ రుణాలు పెరుగుతున్నాయని పేర్కొంది. 2000 సంవత్సరంలో మొత్తం దేశీయ పొదుపు విలువలో కుటుంబ పొదుపు వాటా 84 శాతంగా ఉంటే.. అది 2022–23 సంవత్సరానికి 61 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశీయ కుటుంబ పొదుపు విలువ రూ.49 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా. వడ్డీ రేట్లు తగ్గిపోవడం, నవతరానికి సులభంగా రుణాలు అందించే సంస్థలు అందుబాటులోకి రావడంతో పొదుపు రేటు పడిపోవడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.2000 సంవత్సరంలో దేశ జీడీపీలో 10.1 శాతంగా ఉండే కుటుంబ పొదుపు విలువ ఇప్పుడు 5 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో జీడీపీలో కుటుంబ రుణాల విలువ 2 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగిపోయిందని బ్లూమే రీసెర్చ్ వెల్లడించింది.నచ్చితే కొనేయడమే..ప్రస్తుత తరం ఏదైనా ఒక వస్తువు నచ్చితే జేబులో డబ్బులు లేకపోయినా కొనేస్తోంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, లోన్ యాప్స్ విరివిగా రుణాలు ఇస్తుండటంతో ప్రస్తుత తరం వాళ్లు ఖర్చుకు వెనకాడటం లేదు. 2015–16లో మొత్తం రుణాల్లో కన్సూ్యమర్ రుణాల వాటా 21 శాతంగా ఉంటే.. 2023–24 నాటికి 34 శాతానికి చేరిపోయింది. దీనికి విరుద్ధంగా పారిశ్రామిక రుణాలు 42 శాతం నుంచి 34 శాతానికి పడిపోయాయి. భారతీయులు చేస్తున్న అప్పుల్లో అత్యధికంగా గృహ రుణాలు కాకుండా ఇతర రుణాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం పొదుపు–అప్పుల నిష్పత్తి చూస్తే కొంత ఆందోళన కలిగిస్తోందని, దీర్ఘకాలంలో దేశ సుస్థిర ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని బ్లూమే రీసెర్చ్ నివేదిక పేర్కొంది. -
‘రియల్’ ఢమాల్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశ్వనగరి విశాఖలో ‘రియల్’ రంగం ఆటుపోట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది! టీడీపీ కూటమి ప్రభుత్వ ఏకపక్ష చర్యలతో అస్థిర వాతావరణం నెలకొంది. తింటే గారెలే తినాలి... కొంటే వైజాగ్‌లోనే ఇల్లు కొనాలనే పరిస్థితి నుంచి రాజకీయ కుట్రలకు బలవుతామేమోనన్న భయంతో కొనుగోలుదారులు ఇతర నగరాలవైపు చూస్తున్న పరిస్థితి తలెత్తింది. గతేడాది దేశవ్యాప్తంగా టైర్–2 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినా విశాఖలో మాత్రం నేల చూపులు చూస్తున్నాయి. గృహ విక్రయాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ‘ప్రాప్ ఈక్విటీ’ నివేదికలో ఈ అంశాలు బహిర్గతమయ్యాయి. అమ్మకాల్లో అట్టడుగున విశాఖ దేశవ్యాప్తంగా 15 ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలపై ప్రాప్ ఈక్విటీ సంస్థ సర్వే నిర్వహించింది. టైర్–2 నగరాల్లో విశాఖలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గృహ విక్రయాలు బాగా పడిపోయిన నగరాల్లో విశాఖ సైతం టాప్‌లో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. విశాఖతో పాటు అహ్మదాబాద్, సూరత్, వడోదర, గాంధీనగర్, నాసిక్, జైపూర్, నాగపూర్, భువనేశ్వర్, మొహాలీ, లక్నో, కోయంబత్తూర్, గోవా, భోపాల్, త్రివేండ్రంలో 2024లో ఇళ్ల అమ్మకాలు, నూతన గృహాల నిర్మాణాలపై ప్రాప్ ఈక్విటీ సంస్థ సర్వే చేపట్టింది. విష ప్రచారంతోనే.. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన గత ప్రభుత్వం.. మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించేలా అడుగులు వేసింది. నగరంలో ఇన్ఫోసిస్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపింది. గత ప్రభుత్వ కృషితో పలు సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అయితే విశాఖపై కూటమి పారీ్టలతో పాటు ఎల్లో మీడియా అక్కసు పెంచుకుంటూ వచ్చాయి. ఏటా సముద్ర మట్టం పెరిగి విశాఖ మునిగిపోతుందంటూ తప్పుడు కథనాలు వెలువరించాయి. నగరంలో భూ కబ్జాలు, హత్యాకాండలు అంటూ దు్రష్పచారానికి తెర తీశాయి. ఈ క్రమంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖలో ఒక్కసారిగా పెట్టుబడుల వాతావరణం దెబ్బతింది. ఈ ప్రభావం ప్రధానంగా రియల్ ఎసేŠట్ట్ రంగంపై పడింది. ఫలితంగా మిగిలిన టైర్–2 నగరాలతో పోలిస్తే విశాఖలో ఇళ్ల అమ్మకాలు ఏకంగా 21 శాతం తగ్గాయి. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు మినహా కొత్తవి ఏవీ పట్టాలు ఎక్కకపోవడానికి విశాఖపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోయంబత్తూర్‌లో అత్యధికం2024లో టైర్ 2 సిటీల్లో గృహ విక్రయాలు నాలుగు శాతం పెరగగా విలువ పరంగా 20 శాతం వృద్ధి కనిపించింది. 15 నగరాల్లో 1,78,771 యూనిట్లు విక్రయించగా వీటి విలువ రూ.1,52,552 కోట్లుగా ఉంది. 2023లో రూ.1,27,505 కోట్ల విలువైన 1,71,903 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఏకంగా 36 శాతం వృద్ధితో కోయంబత్తూర్‌లో అత్యధిక విక్రయాలు జరిగాయి. అమ్మకాల విలువ పరంగా భువనేశ్వర్ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే విక్రయాల విలువలో 47 శాతం వృద్ధి రేటును భువనేశ్వర్ నమోదు చేసింది. అహ్మదాబాద్‌లో రూ.49,421 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2023లో రూ.42,063 కోట్లతో పోలిస్తే 17 శాతం పెరిగింది. ఏడాదిలో ఎంత తేడా ఏడాదిన్నర క్రితం వరకూ రియల్ బూమ్‌తో ఉప్పొంగిన విశాఖ ఇప్పుడు ఒక్కసారిగా కిందకు పడిపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతోపాటు అధికార పార్టీ నేతల భూ దందాలతో క్రయ విక్రయాలు సుప్తావస్థలోకి చేరుకున్నాయి. ఫలితంగా విశాఖలో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. 2023లో విశాఖలో 5,361 ఇళ్లు అమ్ముడు కాగా 2024లో ఇది 4,258కి పడిపోయింది. ఇళ్ల నిర్మాణ విషయంలోనూ విశాఖలో తిరోగమనం కనిపించిందని ప్రాప్ ఈక్విటీ సంస్థ స్పష్టం చేసింది. సాధారణంగా విశాఖలో ఏటా సగటున 4,997 కొత్త యూనిట్ల నిర్మాణం జరుగుతుంది. గతేడాది మాత్రం దాదాపు 8శాతం తగ్గుదల నమోదైంది. అటు విక్రయాలతో పాటు ఇటు నిర్మాణాల్లోనూ విశాఖలో రియల్ రంగం తిరోగమనంలోనే సాగుతోంది. -
వారెవ్వా... వాస్తు శిల్పి!
మనం ఒక పురాతన దేవాలయానికి వెళతాం. ఆ దేవాలయం అద్భుత నిర్మాణం గురించి చర్చించుకుంటాం. ఆధునిక ప్రపంచంలో ఒక నగరానికి వెళతాం. అక్కడి ఆకర్షణీయమైన భవనాల గురించి మాట్లాడుకుంటాం. మన ఆఫీసులో ఏర్పాటు చేసిన వసతుల గురించి గర్వంగా చెప్పుకుంటాం. అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ... ఈ ఆకర్షణీయమైన నిర్మాణ రూపకల్పలో కీలక వ్యక్తి.. అప్పటి వాస్తు శిల్పి... ఇప్పటి ఆర్కిటెక్ట్. ఆధునిక సమాజంలో ఆర్కిటెక్ట్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.చాలా బిజీ ప్లేస్‌లో ఉన్న ఒక చిన్న స్థలంలో సైతం అద్భుత, ఆకర్షణీయమైన వాణిజ్య నిర్మాణ రూపకల్పన వారి ప్రత్యేకం. తక్కువ చోటైనా... అన్ని సదుపాయాలతో చక్కటి ఇంటి నిర్మాణానికి డిజైన్ వేయడం వారి ప్రతిభ. మన కలలను నిజం చేయగల సామర్థ్యం వారి సొంతం. ఇవే అంశాలు వారిని ఇప్పుడు ప్రత్యేక స్థానంలో నిలబెడుతున్నాయి. జాబ్ మార్కెట్ డిమాండ్ విషయంలో ఇంజనీర్లను కాదని వారిని అగ్ర స్థానాన నిలబెడుతోంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ఆర్కిటెక్ట్లు ఇప్పుడు దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న నిపుణులుగా మారారు. ప్రపంచంలో నంబర్ వన్ జాబ్ సైట్, గ్లోబల్ జాబ్ మ్యాచింగ్, హైరింగ్ ప్లాట్‌ఫామ్– ఇండీడ్ఙ్ ‘బెస్డ్ జాబ్స్ ఫర్ 2025 ఇన్ ఇండియా’ పేరుతో విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని చెబుతోంది. పలు రంగాలను పరిశీలిస్తే, ఉపాధి అవకాశాల పెరుగుదల రేటు ఆర్కిటెక్ట్ విభాగంలో ఏకంగా 81 శాతంగా ఉందంటే ప్రస్తుత సమాజంలో వారి ప్రాధాన్యత అర్థం అవుతుంది.నివేదిక ప్రకారం వారి సగటు వార్షిక వేతనం రూ.14,95,353. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణులకు ఉన్న డిమాండ్‌తో పోల్చితే భారత్ కార్పొరేట్ రంగంలో ఆర్కిటెక్ట్‌ల డిమాండ్ అధికంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాల్లో వచ్చిన మార్పులకు ఇది ప్రతిబింబం. ప్రత్యేకత ఎందుకు?ఆర్కిటెక్ట్ లను ఇంజనీర్లతో పోల్చి కొందరు వారిని తక్కువగా అర్థం చేసుకుంటారు. కానీ వాస్తవానికి ఇంజనీర్లతోపాటు ఆర్కిటెక్ట్‌లు కూడా ఒక భవనాన్ని రూపుదిద్దడానికి ఎంతో అవసరం. అందమైన, బలమైన, సుస్థిరమైన భవనాల రూపకల్పనలో ఇంజనీర్‌తో పాటు ఆర్కిటెక్ట్ పాత్ర కూడా ఎంతో కీలకం. ఆర్కిటెక్టŠస్ భవనాన్ని కేవలం నిర్మాణం కోణంలోనే కాకుండా, దానిని అందంగా, వినియోగదారులకు అనువుగా డిజైన్ చేస్తారు. వారు ఫంక్షనాలిటీ అలాగే ఎస్తెటిక్ని సమతుల్యం చేస్తారు. ఇంజనీర్ పటిష్ట నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తే, ఆర్కిటెక్ట్ అందమైన, వినియోగదారులకు అనువైన ప్రదేశాలను సృష్టిస్తారు. కస్టమర్ అవసరాలు, ఆర్థిక పరిమితులు, పర్యావరణ అంశాలు, నగర విస్తరణ– ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేస్తారు. ఆర్కిటెక్టŠస్ కొత్త, విభిన్నమైన డిజైన్ ఆలోచనలను ప్రతిపాదిస్తారు. ఇంజనీర్లు వాటిని సాధ్యమయ్యేలా చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఆర్కిటెక్టŠస్ సృజనాత్మకతను జోడించి వినూత్నమైన భవనాలు రూపొందిస్తారు. ఇంజనీర్లు వాటిని ప్రాక్టికల్‌గా మార్చుతారు. ఆధునికతతో అగ్రస్థానంఉద్యోగ నియామకాలు, జీతం పోకడలు, వృద్ధి అవకాశాలు, వేగవంతమైన పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిర, ఆకర్షణీయ మైన నిర్మా ణాలు, ప్రాధాన్యతలు ఇలా ఎన్నో అంశాలు ఆర్కిటెక్ట్‌ను జాబ్ మార్కెట్ డిమాండ్‌లో అగ్రభాగాన నిలబెట్టింది. మెట్రోల విస్తరణ, స్మార్ట్ నగరాల రూపకల్పన, పర్యావరణ సానుకూలతలు అలాగే పర్యావరణానికి అనుకూలమైన ఇంధన సమర్థ వినియోగ కార్యాలయాల నిర్మాణాలు వంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత్ కార్పొరేట్ కార్యాలయ స్థలాలలో పెట్టుబడి పెడతాయి, ఆర్కిటెక్ట్‌లు ఈ పరివర్తనకు కేంద్రంగా ఉండడం గమనార్హం.కీలక పాత్రకస్టమర్ అవసరాలను అర్థం చేసుకుని, వారి అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేయడం వీరి ప్రత్యే కత. నియమాలు, భద్రతా ప్రమాణాలు పాటించడం, ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ల అనుమతుల కోసం సమర్పించాల్సిన ప్లాన్లు సిద్ధం చేయడం, సంపదను, వనరులను సమర్థవంతంగా వినియోగించడం, భవనం నిర్మాణాన్ని, తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్లానింగ్ చేయడం, ప్రా జెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేయడానికి అన్ని విభాగాలతో సమన్వయం, ఆధునిక సమాజంలో గ్రీన్ బిల్డింగ్స్, ఎనర్జీ–ఎఫిషియెంట్ డిజైన్ల రూపకల్పన.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆధు నిక నిర్మాణ రంగంలో వారి పాత్ర అపారం. డిమాండ్ ఎక్కడ?» వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం» అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్, ఆఫీస్ బిల్డింగ్లు» రోడ్లు, బ్రిడ్జీలు, గవర్నమెంట్ భవనాల వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు » మల్టీనేషనల్ కంపెనీల క్యాంపస్ డిజైన్లు» మ్యూజియం, హోటల్స్, ఎయిర్పోర్ట్, స్టేడియం, దేవాలయాల వంటి ప్రత్యేక భవనాల డిజైన్ఇంజనీర్లు భవనానికి ప్రాణం పోసే గుండె లాంటి వారు అయితే, ఆర్కిటెక్ట్ ఆ భవనానికి జీవం పోసే ఆత్మ. ఆర్కిటెక్ట్ లేకపోతే భవనాలు కేవలం ‘నిర్మాణాలు’గానే ఉంటాయి. అందమైన, ఆకర్షణీయమైన వినియోగదారులకు అనుకూలమైన, చిరస్థాయిగా నిలిచే నిర్మాణాలను రూపొందించేది ఆర్కిటెక్ట్‌లే!ఆర్కిటెక్ట్ కావాలంటే?భారతదేశంలో ఆర్కిటెక్ట్‌గా పనిచేయాలంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీ.ఆర్క్) అనే 5 సంవత్సరాల కోర్సు పూర్తి చేయాలి. దీనికి నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) లేదా జేఈఈ పేపర్ 2 ద్వారా అర్హత పొందాలి. -
ఆప్ నెత్తిన కాగ్ మరో పిడుగు
న్యూఢిల్లీ: గత ఆప్ ప్రభుత్వానికి సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(CAG) మరో నివేదికను విడుదల చేసింది. ఆరోగ్య భద్రత, మౌలిక వసతుల కల్పనలో గత సర్కార్ పూర్తి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, కరోనా సమయంలోనూ నిధులను సక్రమంగా వినియోగించలేకపోయిందని సంచలన విషయాలు వెల్లడించింది.గత ఆరేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాల్లో తీవ్ర అవినీతికి పాల్పడిందనేది ఆ నివేదిక సారాంశం. ఆప్ ప్రతిష్టాత్మకంగా భావించిన మొహల్లా క్లినిక్స్‌లో తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడం దగ్గరి నుంచి అత్యవసర నిధులను వినియోగించకపోవడం దాకా ఎన్నో వివరాలను కాగ్ తన నివేదికలో పొందుపరిచింది. అంతేకాదు..ఢిల్లీ వ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు అందట్లేదన్న విషయం గురించి ప్రముఖంగా కాగ్ ప్రస్తావించింది. ఢిల్లీలో ఉన్న 27 ఆస్పత్రుల్లో 14 హాస్పిటల్స్‌లో ఐసీయూ సదుపాయం లేదని వెల్లడించింది. 16 ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకులు లేవని తెలిపింది. ఎనిమిది ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా సదుపాయం లేదని తెలిపింది. పదిహేన్నింటిలో మార్చురీ సదుపాయాల్లేవని తెలిపింది. 12 ఆస్పత్రులకు ఆంబులెన్స్ సదుపాయాలు లేవని వెల్లడించింది. ఇక ఆప్ ప్రభుత్వం అప్పట్లో మొహల్లా క్లినిక్స్(Mohallah Clinics) ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వెయ్యికి పైగా ఏర్పాటు చేయాలని భావించినా.. అందులో 2023 నాటికి సగం మాత్రమే పూర్తి చేయగలిగిందని తెలిపింది. అయితే వాటిలోనూ సరైన సౌకర్యాలు, వైద్య సదుపాయాలు లేవని తెలిపింది. మొహల్లా క్లినిక్స్‌తో పాటు ఆయుష్ డిస్పెన్సరీల్లో మౌలిక వసతులు సరిగా లేవని పేర్కొంది. విద్యుత్ సదుపాయం, చెకప్ టేబుల్స్, చివరికి టాయిలెట్స్ సదుపాయాలు కూడా లేవని తెలిపింది. వీటికి తోడు అదనంగా సిబ్బంది కొరత కూడా ఉందని నివేదించింది. ఇక.. అత్యవసర సేవల కోసం వినియోగించాల్సిన నిధుల్ని కూడా ఆప్ పక్కన పెట్టిందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. మరీ ముఖ్యంగా కరోనా టైంలో.. రూ.200 కోట్ల నిధులను, వైద్య సిబ్బంది కోసం కేటాయించిన మరో రూ.30 కోట్లను, అత్యవసర ఔషధాలతో పాటు పీపీఈ కిట్ల కోసం కేటాయించిన ఇంకో రూ.83 కోట్లను వినియోగించకుండా పోయిందని తెలిపింది. ఆస్పత్రులకు సంబంధించి కొత్త ప్రాజెక్టుల విషయంలో కాలయాపనతో భారం పెరిగిందని, దీనివల్ల ఢిల్లీలోని ఇతర ఆస్పత్రుల నిర్వహణపై ప్రభావం పడిందని కాగ్ తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ కాగ్ నివేదిక ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.మరోవైపు.. మద్యం విధానంపై కాగ్ రూపొందించిన నివేదిక అంశం ఎన్నికల ముందు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. 2021-22లో తీసుకొచ్చిన మద్యం విధానం కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ తేల్చింది. కొత్త మద్యం విధానం కారణంగా అప్పటి ప్రభుత్వం రూ.941.53 కోట్ల ఆదాయం కోల్పోయిందని, లైసెన్సు ఫీజుల కింద మరో రూ.890.15 కోట్లు నష్టపోయిందని, ఇక.. లైసెన్సుదారులకు మినహాయింపుల రూపంలో మరో రూ.144 కోట్లు కోల్పోయినట్లు వెల్లడించింది. ఈ నివేదికను తాజాగా బీజేపీ ప్రభుత్వం(BJP Government) అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందులోని అంశాలను బయటపెట్టగా, ఆప్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది. దీంతో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. -
పేదల సంఖ్య పైపైకి..!
సాక్షి, అమరావతి: కోవిడ్ అనంతరం ధనికుల సంపద గణనీయంగా పెరుగుతోంది. అదే సమయంలో పేదల సంఖ్య పెరుగుతూ పోతోంది. 1990లో దేశంలోని మొత్తం ఆదాయంలో 34 శాతం వాటా బిలియనీర్లది కాగా, ఇప్పుడు అది 57 శాతానికి పెరిగింది. అయితే, అదే సమయంలో కోట్లాది మంది ఆదాయం 22.2 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది. దేశంలో లగ్జరీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ సాధారణ వినియోగ వస్తువులకు లేకపోవడం గమనార్హం. భారత్ వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఉన్నందున, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఉండాలని బ్లూమ్ వెంచర్స్ నివేదిక సూచిస్తోంది. నివేదికలోని మరిన్ని అంశాలు పరిశీలిస్తే... అందుబాటులో లేని ఇళ్లు.. ఐదేళ్ల క్రితం అందుబాటు ధరలో ఇళ్ల సంఖ్య 40 శాతం ఉండగా, ఇప్పుడు అది 18 శాతానికి తగ్గింది. గడచిన పదేళ్లలో ద్రవ్యోల్బణం పెరిగినా, మధ్యతరగతి వేతనాలు పెరగలేదు. దేశ అభివృద్ధి వేగవంతం కావాలంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా చర్యలు తీసుకోవడం అవసరం. 14 కోట్ల మందికే కొనుగోలు శక్తి 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో కేవలం 13–14 కోట్ల మందికే సముచితమైన కొనుగోలు శక్తి ఉంది. ఇది మెక్సికో జనాభాకు సమానం. దేశ వినిమయ శక్తిలో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరో 30 కోట్ల మంది కొనుగోలు శక్తిని పెంచుకునే దశలో ఉన్నారు. అయితే, మిగిలిన 100 కోట్ల మందికి కొనుగోలు శక్తి లేకపోవడం ఆరి్థక అసమతుల్యతను సూచిస్తోంది. కోవిడ్ అనంతరం భారత ఆరి్థక వ్యవస్థ ‘‘కే–ఆకారపు‘ (వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందని దేశ ఒడిదుడుకుల వృద్ధి బాట) వృద్ధిబాటను అనుసరిస్తోంది. ధనికులు మరింత ధనవంతులవుతుండగా, పేదలు మరింత వెనుకబడుతున్నారు. లగ్జరీ వినియోగంలో పెరుగుదల దేశంలో ఆల్ట్రా లగ్జరీ వస్తువులు, ఖరీదైన ఫోన్లు, విలాస భవంతులకు డిమాండ్ విపరీతంగా ఉంది. ఐదేళ్ల క్రితం అందుబాటు ధరలో ఉన్న ఇళ్ల సంఖ్య 40 శాతంగా ఉండగా, ఇప్పుడు అది 18 శాతానికి పడిపోయింది. బ్రాండెడ్ ఉత్పత్తులకు భారతదేశం ప్రధాన మార్కెట్‌గా మారుతోంది. ఖరీదు ఎంతైనా నచి్చన వస్తువులను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. అంతర్జాతీయ కళాకారులు కోల్డ్‌ప్లే, ఈడీ షీరన్ వంటి ప్రముఖ సంగీత ప్రదర్శనల టిక్కెట్లు వేగంగా అమ్ముడుపోవడం, దేశంలో లగ్జరీ వినియోగం ఎలా పెరిగిందో సూచిస్తోంది. పెరగని మధ్యతరగతి వేతనాలు... దేశ వినిమయ వ్యవస్థలో అత్యంత కీలకమైన మధ్యతరగతి ప్రజల జీతాలు గడచిన కొన్నేళ్లుగా పెరగకపోవడం ప్రధాన సమస్య. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, జీతాలు పెరగకపోగా, వాస్తవంగా తగ్గాయి. భవిష్యత్తులో కూడా మధ్యతరగతి ప్రజలు ఇలాంటి గడ్డుపరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. పన్ను మినహాయింపు పరిమితి పెరిగినా.. సమస్యలే.. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని గత బడ్జెట్లో రూ.12.75 లక్షల ఆదాయం ఉన్నవారిని ఆదాయపన్ను నుంచి మినహాయించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది దిగువ మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని భావిస్తున్నారు. అయితే, మరోవైపు, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోనున్నట్లు పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే తయారీ, ఐటీ రంగాల్లో ఉద్యోగావకాశాలు తగ్గుతున్నాయి.పేదల కొనుగోలు శక్తిలో తగ్గుదల.. కోవిడ్ తర్వాత పేదల వినిమయ సామర్థ్యం గణనీయంగా తగ్గింది. దీనితో పాటు, పొదుపు శక్తికూడాబలహీనపడింది. వ్యక్తిగత, క్రెడిడ్ కార్డుల వంటి అన్సెక్యూర్డ్ రుణాలు పెరిగిపోవడంతో ప్రజలు రుణ ఊబిలో చిక్కుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా, రిజర్వ్ బ్యాంక్ ఇటువంటి రుణాలపై ఆంక్షలు విధించింది. దేశీయ గృహ పొదుపు 50 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
థర్డ్ ఏసీ.. బహు ఖుషీ
సాక్షి, అమరావతి : రైళ్లలో థర్డ్ ఏసీకి ప్రయాణికుల నుంచి డిమాండ్ భారీగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో థర్డ్ ఏసీ ప్రయాణికుల సంఖ్య, ఆదాయమూ కూడా రెండింతలకు పైగా పెరిగినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ప్రధానంగా కోవిడ్ అనంతరం థర్డ్ ఏసీ ప్రయాణికుల సంఖ్య పెరగడం గమనార్హం. కోవిడ్ ప్రభావంతో 2020–21లో డిమాండ్ బాగా తగ్గినప్పటికీ, ఆ తర్వాత ఏటేటా భారీగా పెరిగింది. 2024–25లో థర్డ్ ఏసీ కోచ్‌ల టికెట్ల ద్వారా రూ.30,089 కోట్లు రాబడి వచ్చిందని రైల్వే శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది. నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ..2019–20లో భారతీయ రైళ్లలో 11 కోట్ల మంది ప్రయాణించారు. వీరిలో 1.4 శాతం మాత్రమే థర్డ్ ఏసీ కోచ్‌లలో ప్రయాణానికి మొగ్గు చూపారు. ఆ ఏడాది థర్డ్ ఏసీ టికెట్ల ద్వారా రైల్వే శాఖకు రూ.12,370 కోట్ల రాబడి వచి్చంది.కోవిడ్ అనంతర పరిణామాలతో గత ఐదేళ్లలో థర్డ్ ఏసీ ప్రయాణికుల సంఖ్య అమాంతం పెరిగింది. 2024–25లో థర్డ్ ఏసీలో 26 కోట్ల మంది ప్రయాణించారు. మొత్తం రైల్వే ప్రయాణికుల్లో వీరు 19 శాతానికి పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.2019–20తో పోలిస్తే 2024–25లో రైల్వే టికెట్ల రాబడిలో స్లీపర్ క్లాస్ ప్రయాణికుల వాటా తగ్గింది. 2019–20లో స్లీపర్ క్లాస్ టికెట్ల వాటా 27శాతం ఉంది. మొత్తం రాబడి రూ.50,669 కోట్లు కాగా అందులో స్లీపర్ క్లాస్ టికెట్ల ద్వారా రూ.13,641కోట్లు వచ్చింది. మొత్తం ప్రయాణికులు 809 కోట్ల మంది కాగా, 37 కోట్ల మంది స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించారు. అంటే 4.6 శాతం. 2024–25లో మొత్తం రైల్వే రాబడిలో స్లీపర్ క్లాస్ కోచ్ టికెట్ల వాటా 19.5 శాతానికి తగ్గింది. సంఖ్యాపరంగా స్లీపర్ క్లాస్ ప్రయాణికుల సంఖ్య మాత్రం పెరిగింది. మొత్తం 38 కోట్ల మంది అంటే మొత్తం ప్రయాణికుల్లో 5.25 శాతం మంది స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించారు. -
ఉపాధిలో వ్యవసాయమే మేటి
సాక్షి, అమరావతి: దేశంలో ఉపాధి అవకాశాల కల్పనలో ఇప్పటికీ వ్యవసాయ రంగమే అగ్రగామిగా ఉన్నట్లు రిజర్వు బ్యాంకు రూపొందించిన నివేదిక వెల్లడించింది. 1991లో సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేసిన తరువాత దేశంలో ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. దీంతో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడే వారి శాతం తగ్గినప్పటికీ నేటికీ అత్యధిక శాతం మందికి ఇవే ఉపాధి కల్పిస్తుండటం గమనార్హం. దేశంలో వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలను ఆర్బీఐ ‘పీరియడిక్ లేబర్ ఫోర్స్ (పీఎల్ఎఫ్)’ సర్వే నివేదిక వెల్లడించింది. రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గగా ఐటీ కంపెనీలు, ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది.పీఎల్ఎఫ్ నివేదికలోని ప్రధానాంశాలు..1993–94లో దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై 64 శాతం మంది ఆధారపడగా 2018–19 నాటికి అది 42.5 శాతానికి తగ్గింది. 2023–24 నాటికి మాత్రం వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందుతున్న వారి సంఖ్య కొంత పెరిగి 46.2 శాతంగా నమోదైంది.అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా భారతీయ రైల్వే తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అయినప్పటికీ రైల్వేలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 1991–92లో రైల్వే శాఖలో 16.52 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2023–24లో 11.90 లక్షలకు తగ్గింది.బ్యాంకింగ్ రంగంలోనూ ఉపాధి అవకాశాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 1991–92లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 8.47 లక్షల మంది ఉద్యోగులు ఉండగా ప్రైవేట్ బ్యాంకుల్లో 63 వేల మంది మాత్రమే ఉన్నారు. కానీ 2023–24 నాటికిప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కంటే ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉద్యోగులు ఎక్కువ మంది ఉండటం గమనార్హం. 2023–24లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7.46 లక్షల మంది ఉద్యోగులు ఉండగా ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 8.74 లక్షల మంది పని చేస్తున్నారు.ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రాలో 2020 నాటికి 11.49 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2024 డిసెంబర్లో వీరి సంఖ్య 15.34 లక్షలకు చేరుకుంది. -
42.6% మంది పట్టభద్రులే ఉద్యోగాలకు అర్హులు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం మనది. కానీ, దేశంలోని గ్రాడ్యుయేట్లలో 42.6 శాతం మందికే ఉద్యోగం పొందడానికి అర్హత ఉందని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన మెర్సర్ మెటిల్ అనే కన్సల్టెన్సీ సంస్థ ‘ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్స్ ఇండెక్స్–2025’అధ్యయనంలో పట్టభద్రుల నైపుణ్యాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2023లో ఉద్యోగాలకు అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ల సంఖ్య 44.3 శాతం కాగా.. 2024లో 1.7 శాతం పడిపోయి 42.6 శాతానికి తగ్గిపోయింది. కొత్తగా పట్టభద్రులైన వారి నుంచి అంచనాలు అధికంగాఉండటం వల్ల ఈ కొరత ఏర్పడిందని నివేదికలో తేలింది. 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2,700కి పైగా క్యాంపస్‌లలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులపై అధ్యయనం చేసినట్లు ఈ సంస్థ పేర్కొంది. అత్యంత సమర్థత ఉన్న పట్టభద్రుల్లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌కాలేజీలు వరుసగా టాప్–3లో ఉన్నాయి.అలాగే.. అత్యధిక అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ 10స్థానంలో ఉండటం విశేషం. ఉత్తరాది రాష్ట్రాలదే హవా... » దేశంలో కనీసం 50% మంది గ్రాడ్యుయేట్లు ఉపాధి పొందగల రాష్ట్రాలు కేవలం 4 మాత్రమే ఉన్నాయి. » ఓవరాల్ పర్ఫార్మెన్స్లో రాజస్తాన్‌కు టాప్ 10లో చోటు దక్కలేదు. కానీ, సాంకేతిక అర్హతలున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తర్వాత 48.3 శాతంతో రాజస్తాన్ 5వ స్థానంలో నిలిచింది. » నాన్–టెక్నికల్ విభాగంలో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ (54%), ఢిల్లీ (54%), పంజాబ్ (52.7%) ఉన్నాయి నైపుణ్యాలుఉండాల్సిందే.. ఎస్.లావణ్యకుమార్, సహవ్యవస్థాపకుడు, స్మార్ట్‌స్టెప్స్ నాన్–టెక్ గ్రాడ్యుయేట్స్ అంశంపై గత 15 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. ఆధునిక సాంకేతికత విశ్వవ్యాప్తం కావడంతో... భారత్‌లో విదేశీ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయి. అందువల్ల తగిన శిక్షణ పొందడంతోపాటు అవసరమైన డొమైన్లలో నైపుణ్యాలు ఉంటే నాన్ టెక్ గ్రాడ్యుయేట్స్‌కూ మంచి అవకాశాలు లభిస్తాయి. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ఆన్లైన్లో డిగ్రీలు, ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి కొన్ని విషయాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే తగిన నైపుణ్యాలు తప్పనిసరి. » 2023తో పోలిస్తేౖటైర్–1, టైర్–3 కళాశాలలకు చెందిన పట్టభద్రుల ఉపాధి సామర్థ్యం స్వల్పంగా తగ్గింది. టైర్–1 విషయానికొస్తే.. ఈ సంఖ్య 2023లో 49.1శాతం కాగా.. 2024లో 48.75 శాతంగా ఉంది. » టైర్–3 లో 44% నుంచి 43.6 శాతానికి పడిపోయింది. టైర్–2 కళాశాలల్లో ఎక్కువ క్షీణత కనిపించింది. 2023లో 47.5% మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగానికి అర్హులుగా ఉంటే.. 2024లో అది 46.2 శాతానికి తగ్గింది. » ఉద్యోగానికి అర్హులైన గ్రాడ్యుయేట్ విభాగంలో మహిళలు (42%) పురుషుల (43%) కంటే పెద్దగా వెనుకబడి లేరని స్పష్టమవుతోంది. -
వచ్చే ఐదేళ్లలో విద్యుత్ వినియోగం డబుల్
పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తగ్గట్టు భవిష్యత్ డిమాండ్‌ను అంచనా వేయకపోతే పరిస్థితులు అంధకారంలో ముంచేస్తాయి. ఈ నేపథ్యంలోనే భవిష్యత్‌లో విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదలపై కేంద్ర, రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం నెలవారీ విద్యుత్ వినియోగం దాదాపు 130.40 బిలియన్ యూనిట్లుగా ఉంది. ఇది 2030–32 నాటికి రెట్టింపు అవుతుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. – సాక్షి, అమరావతిఇదీ అంచనాఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఇటీవల 200 గిగావాట్ల మైలురాయిని దాటింది. 2030 నాటికి 500 గిగావాట్ల్ల సామర్థ్యాన్ని, 2047 నాటికి 1,800 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 457 గిగావాట్లకు చేరుకుంది. ఇందులో పునరుత్పాదక ఇంధన వాటా 205 గిగావాట్లు (45 శాతం). ఇది ఈ ఏడాది 25–28 గిగావాట్లు పెరుగుతుందని అంచనా. 2030 నాటికి అది 55 శాతం నుంచి 60 శాతానికి చేరుకుంటుందని అధ్యయనంలో వెల్లడైంది. ఇక రాష్ట్ర విషయానికి వస్తే ప్రస్తుతం ఏటా 70,361 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. 2030 నాటికి ఇది 1,04,596 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని ఇంధన శాఖ అంచనా వేసింది. అదే 2047 నాటికి 4,22,402 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశం ఉంది. అంటే రానున్న 23 ఏళ్లలో ఇప్పుడున్న దానికి ఆరు రెట్లకు విద్యుత్ డిమాండ్ పెరిగిపోనుంది. -
ఏఐ ‘బ్రెయిన్ డ్రెయిన్’!
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మేధో వలస (బ్రెయిన్ డ్రెయిన్) భారత్‌కు పెద్ద సవాల్‌గా మారబోతోంది. యువతలో ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో మంచి పురోగతి ఉన్నా, వారు దేశంలోనే స్థిరపడేలా చేయడంలో విఫలమవుతున్నట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతీయ ఏఐ నిపుణులు అమెరికా వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. భారీ వేతనాలతోపాటు అత్యాధునిక పరిశోధనలకు మంచి వాతావరణం ఉండడంతో అటువైపు ఆకర్షితులవుతున్నారు. ‘ఏఐ టాలెంట్ కాన్సన్ట్రేషన్’లో ప్రపంచంలో భారత్ 13వ స్థానంలో నిలిచినట్టు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ‘ఏఐ ఇండెక్స్ రిపోర్ట్–2024’ప్రకటించింది. ప్రపంచంలో ఏఐ మేధో వలసలో మాత్రం మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఏఐ నైపుణ్యాలున్న ప్రతి 10 వేల మంది లింక్డ్ఇన్ ఖాతాదారుల్లో 0.76 శాతం (నెట్ మైగ్రేషన్ రేటు) మేధో వలస ఉన్నట్టు తెలిపింది. అంటే ప్రతి పదివేల మంది భారతీయ ఏఐ నిపుణుల్లో దాదాపు ఒకశాతం విదేశాలకు వలసపోతున్నారు. ఏఐ పేటెంట్స్‌లోనూ అథమ స్థానమే ఏఐ పేటెంట్స్ విషయంలోనూ భారత్ వెనుకబడే ఉంది. 2022లో ప్రపంచస్థాయి ఏఐ పేటెంట్స్‌లో మనదేశం 0.23 శాతానికే పరిమితమైంది. ఈ విషయంలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. గ్లోబల్ ఏఐ పేటెంట్స్‌లో 61.13 శాతంతో చైనా మొదటిస్థానంలో నిలువగా, 20.9 శాతంతో అమెరికా రెండో స్థానంలో ఉంది. ఏఐ మౌలికసదుపాయాల పటిష్టానికి ‘కంప్యూటింగ్ కెపాసిటీ’లో పెట్టుబడులు పెడుతున్నా పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఏఐ టూల్స్ ఫౌండేషన్ టెక్నాలజీలో ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్’ అందుబాటులోకి రావడంతో చైనాకు చెందిన డీప్‌సీక్–వీ2, అమెరికాకు చెందిన చాట్ జీపీటీ వంటివి గ్లోబల్ బెంచ్‌మార్క్‌గా నిలిచాయి. దీంతో భారత్‌కు సవాళ్లు ఎదురవుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. 2023 నాటికి భారత్ 60 జెనరేటివ్ ఏఐ స్టార్టప్‌లు కలిగి ఉన్నట్టు ప్రకటించుకున్నా (2021తో పోల్చితే రెండింతలు పెరుగుదల), ఈ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగేందుకు మరిన్ని కీలకమార్పులు చేయాల్సిన అవసరముందని అంటున్నారు. భారత్‌లో ఏఐ రంగం అభివృద్ధి, మేధో వలసల నిరోధానికి నిపుణుల సూచనలు » డేటా సెంటర్లు,కంప్యూటింగ్ వనరులు పెంచుకునేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలి. ఏఐ, డీప్‌టెక్ వంటి వాటిలో ప్రపంచస్థాయి రిసెర్చ్సెంటర్లు, ల్యాబ్‌లు, ఇన్నోవేషన్ హబ్స్ఏర్పాటుకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించాలి. » అత్యుత్తమ ప్రతిభ,నైపుణ్యాలున్నవారు దేశం వదిలి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. » ఏఐని సమాజాభివృద్ధికి, వైద్య, ఆరోగ్య, వ్యవసాయం, పర్యావరణ పరి రక్షణ తదితర రంగాల్లో విస్తారంగా వినియోగించాలి. » ప్రస్తుతం అమెరికాలోని సిలికాన్వ్యాలీలోఅత్యుత్తమ ఏఐనిపుణుల్లో భారతసంతతివారేఅధికంగా ఉన్నారు. వారిలో కొందరినైనా తిరిగి భారత్‌కు రప్పించి అవసరమైన పరిశోధన పర్యావరణ వ్యవస్థను, సౌకర్యాలను కల్పిస్తే మంచి ఫలితాలుసాధించవచ్చు. అవకాశాలు పెంచాలి బ్రెయిన్ డ్రెయిన్‌ను బ్రెయిన్ గెయిన్గా మార్చుకునేందుకు దేశంలో మంచి ఏఐ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దేశం నుంచి ఏఐ మేధో వలస ప్రమాదకర స్థాయిలో ఏమీలేదు. నిపుణులు నైపుణ్యాలు పెంచుకునేందుకు సరైన అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వ సంస్థలపై ఉంది. ఎంతగా పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తే అంతగా నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుంది. పాఠశాల స్థాయి నుంచే సిలబస్‌లో ఏఐ, మెíషీన్ లెరి్నంగ్ వంటివి చేర్చాలి. నాణ్యమైన శిక్షణ, ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్ సెంటర్లను అందుబాటులోకి తెస్తే దేశంలోని అద్భుతమైన నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. –వెంకారెడ్డి, వైస్‌ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కో ఫోర్జ్. -
ఆధ్యాత్మిక పర్యాటకం.. ఆనందమయం
ప్రపంచం ఆధ్యాత్మికతను స్మరిస్తోంది. మానసిక చింతన, ప్రశాంత జీవనం కోసం వెతుకుతోంది. హాలిడే ట్రిప్పుల్లోని సంతోషాన్ని ఆధ్యాత్మిక పరవశ పర్యటనలుగా మారుస్తోంది. ఈ క్రమంలోనే 2025లో అంచనా వేసిన ఆధ్యాత్మిక మార్కెట్ విలువ 1,378.22 బిలియన్ డాలర్ల నుంచి 2032 నాటికి 2,260.43 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని ‘ట్రావెల్ టూరిజం వరల్డ్’ నివేదిక పేర్కొంది. ఆధ్యాత్మిక పర్యాటకం సగటున 6.5శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయనుంది. –సాక్షి, అమరావతి విశ్వాసమే నడిపిస్తోంది..ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు వ్యక్తిగత సంపద పెరిగేకొద్దీ, ఎక్కువ మంది ప్రజలు తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక పండుగలపై ఆసక్తి చూపిస్తున్నారు. సాంకేతికత సాయంతో ముందుగా వర్చువల్ టూర్లు చేసిన తర్వాత పర్యటనలను ఖరారు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, భారతదేశం, ఇటలీ వంటి దేశాలు చాలా కాలంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని లోతైన విశ్వాసం, సంస్కృతితో ముడిపడి ఉన్న అనుభవాలను కోరుకునే సందర్శకుల సంఖ్యను పెంచుతున్నాయి. ఈ ధోరణి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల ఆధ్యాత్మిక అవసరాలు, ప్రాధాన్యతలను తీర్చే ప్రత్యేక పర్యటనలను అందించడానికి ట్రావెల్ ఏజెన్సీలకు అవకాశాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మికతలో ఆనందం..ఆధ్యాత్మిక పర్యటనలు శారీరక–మానసిక శ్రేయస్సుతో మిళితం చేసే వెల్నెస్ టూరిజంగా మారుతోంది. ధ్యానం, యోగాపై దృష్టి సారించే విహార యాత్రలు ఆరోగ్య, ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తున్నాయి. యూఎస్, కెనడా వంటి దేశాల్లో స్థానిక ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతోంది. వాషింగ్టన్ డీసీలోని బసిలికా ఆఫ్ ది నేషనల్ ష్రైన్ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ (క్యాథలిక్ చర్చి)కు తాకిడి పెరుగుతోంది. యూరప్‌లోని స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు యూరోపియన్ నాగరికతను అన్వేíÙంచడానికి మైలురాళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆసియా–పసిఫిక్‌లో అయితే భారతదేశంలో దేవాలయాలు, పీఠాలు, చర్చిలు, మసీదులను దర్శించుకునే వారు పెరుగుతున్నారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం, చైనా–జపాన్ దేశాల్లో బౌద్ధారామాలు వంటి పవిత్ర స్థలాలను లక్షలాది మంది సందర్శిస్తున్నారు. మధ్యప్రాచ్యం–ఆఫ్రికాలో అయితే సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, ఇజ్రాయెల్ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మక్కా, జెరూసలేం తీర్థయాత్రలు ఎక్కువ ఉంటాయి. -
అటు ఆందోళన.. ఇటు నిరాశ!
సాక్షి, అమరావతి : దేశంలో కార్పొరేట్ రంగంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల్లో మానసిక సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2023తో పోలిస్తే 2024లో 15 శాతం మేర మానసిక సమస్యలు పెరిగాయి. ఈ విషయం స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్బీయింగ్–2024 నివేదికలో వెల్లడైంది. 2024 జనవరి నుంచి నవంబర్ మధ్య ఉద్యోగులకు నిర్వహించిన 83 వేల కౌన్సెలింగ్ సెషన్స్, 12 వేల ఎలక్టివ్ స్క్రీనింగ్, 42 వేల అసెస్మెంట్ డేటాబేస్ ఆధారంగా పని ప్రదేశాల్లో మానసిక ఆరోగ్య సవాళ్లపై చేపట్టిన అధ్యయనం ఆధారంగా నివేదికను విడుదల చేశారు. కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న 25 ఏళ్లలోపు ఉద్యోగుల్లో 90 శాతం మంది ఆందోళన, 92 శాతం మంది నిరాశ సమస్యలతో సతమతమవుతున్నారు. 45 ఏళ్లు పైబడిన వారిలో నిరాశ 69 శాతం, ఆందోళన 67 శాతం మేర ఉంటోంది. 70 శాతం మందికి ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణం 2023తో పోలిస్తే గతేడాది పురుష ఉద్యోగుల మానసిక సమస్యల్లో 7 శాతం మేర వృద్ధి నమోదైంది. గతేడాది కౌన్సెలింగ్ తీసుకున్న వారిలో 52 శాతం మహిళలు, 47 శాతం పురుష ఉద్యోగులున్నారు. కాగా, కౌన్సెలింగ్ పొందిన వారిలో 70 శాతం మందికి మానసిక సమస్యలకు ప్రధాన కారణంగా ఆర్థిక ఇబ్బందులే. అదే మహిళల్లో 60 శాతం మందిలో రిలేషన్షిప్ సంబంధిత సమస్యలున్నట్టు వెల్లడైంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యల కారణంగా ఉద్యోగుల్లో ఆత్మహత్యల ఆలోచనలు పెరుగుతున్నట్టు గుర్తించారు. 2023తో పోలిస్తే 2024లో ఆత్మహత్యల ప్రమాదం 22 శాతం పెరిగింది. -
ఈ–వ్యర్థాలు.. భారీ లాభాలు!
సాక్షి, అమరావతి: కంప్యూటర్ పాడైపోతే.. సెల్‌ఫోన్ పూర్తిగా పనిచేయకపోతే.. టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్లు, మిక్సీలు, ఏసీలు వంటివి రిపేర్ చేయడానికి వీలులేనంతగా చెడిపోతే... అవన్నీ ఏమవుతాయి? మన వీధిలోకి వచ్చే పాత సామాన్లు కొనే వ్యక్తికి నామమాత్రపు ధరకే ఇచ్చేస్తాం. లేదా బయట చెత్త కుప్పలో పడేస్తుంటాం. బయట పడేసినవాటిని కూడా కొంతమంది సేకరించి స్క్రాప్(వ్యర్థ సామగ్రి) వ్యాపారికి విక్రయిస్తుంటారు. చూడటానికి ఇదంతా చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. కానీ, దేశవ్యాప్తంగా వచ్చే ఈ–వ్యర్థాలతో ఏటా 6 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసేందుకు అవకాశం ఉందని రెడ్‌సీర్ స్ట్రాటజీస్ కన్సల్టెంట్స్ తన తాజా నివేదికలో వెల్లడించింది. పని చేయని ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైక్లింగ్ యూనిట్‌కు తరలించి తిరిగి ఉపయోగించుకునేలా చేయడం ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారం చేయడంతోపాటు ఏటా 0.75 మిలియన్ టన్నుల ఈ–వ్యర్థాలు భూమిని, వాతావరణాన్ని దెబ్బతీయకుండా అడ్డుకోవచ్చని తెలిపింది. సోలార్ మాడ్యూల్స్‌లో విలువైన ఖనిజాలు దేశంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వ్యర్థాలు భారీగా పెరుగుతున్నాయి. 2022–23లో సుమారు 100 కిలో టన్నుల సౌర విద్యుత్ వ్యర్థాల ఉత్పత్తి జరిగింది. 2030 నాటికి అది 600 కిలో టన్నులకు చేరుతుందని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ నివేదిక వెల్లడించింది.సర్వేలోని ముఖ్యాంశాలుప్రస్తుతం చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఈ–వేస్ట్ ఉత్పత్తిదారుగా మన దేశం ఉంది. పట్టణీకరణ, పెరుగుతున్న ఆదాయాల కారణంగా 2014లో 2 మిలియన్ మెట్రిక్ టన్నులు(ఎంఎంటీ) ఉన్న ఈ–వ్యర్థాల ఉత్పత్తి... 2024 నాటికి 3.8 ఎంఎంటీలకు చేరింది.ఈ–వ్యర్థాల్లో విలువైన లోహాలు ఉంటాయి. వాటిలో ప్రస్తుతం 40శాతం మాత్రమే వెలికి తీసి తిరిగి వినియోగిస్తున్నారు. మిగతా 60 శాతంపై దృష్టి సారించగలిగితే కాసుల వర్షం కురిపించే భారీ వ్యాపారంగా మారుతుంది.అధికారిక రీసైక్లింగ్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం వల్ల మన దేశం మెటల్ దిగుమతులను 1.7 బిలియన్ డాలర్ల వరకు తగ్గించవచ్చు.సౌర విద్యుత్ వ్యర్థాల్లో దాదాపు 67శాతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది.సోలార్ మాడ్యూల్స్, ఫీల్డ్ నుంచి వచ్చే వ్యర్థాలు సవాలుగా మారనున్నాయి. ఫొటో వాల్టాయిస్ మాడ్యూల్స్‌లో సిలికాన్, కాపర్, టెల్లూరియం, కాడ్మి యం వంటి ఖనిజాలు ఉంటాయి.2030 నాటికి మన దేశంలో ఇప్పుడు ఉన్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచే సుమారు 340 కిలో టన్నుల వ్యర్థాలు రావొచ్చని అంచనా. 340 కిలో టన్నుల్లో 10 టన్నుల సిలికాన్, 18 టన్నుల వెండి, 16 టన్నుల కాడ్మియం, టెల్లూరియం ఉంటాయి. రసాయన ప్రక్రియల సహాయంతో రీసైక్లింగ్ చేస్తే వెండి, సిలికాన్‌ను తిరిగి పొందవచ్చని రెడ్‌సీర్ స్ట్రాటజీస్ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది. -
Bangladesh: ‘అవన్నీ ప్రభుత్వ హత్యలే’.. దడపుట్టిస్తున్న ఐక్యరాజ్యసమితి రిపోర్టు
బంగ్లాదేశ్‌లో గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఎగసిపడింది. అనంతరం జరిగిన పరిణామాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఒక నివేదికను వెలువరించింది. నాడు చెలరేగిన హింసలో 1,400 మంది హతమయ్యారని ఆ నివేదిక బయటపెట్టింది. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని పరోక్షంగా పేర్కొంది. నాడు బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న మానవహక్కుల ఉల్లంఘనల ఉదంతాలను కూడా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం ఆ నివేదికలో తెలియజేసింది.బంగ్లాదేశ్‌లో 2024లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. నాటి షేక్ హసీనా ప్రభుత్వం.. నేటి మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాల కాలంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలను ఈ నివేదికలో వివరంగా పొందుపరిచారు.2024 విద్యార్థి ఉద్యమంలో సుమారు 1,400 మంది హతమయ్యారని నివేదిక పేర్కొంది. భద్రతా దళాలు చిన్నారులతో సహా పలువురు నిరసనకారులను కాల్చిచంపాయని తెలిపింది.తిరుగుబాటు తొలి రోజుల్లో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం 150 మంది మరణాలను మాత్రమే నిర్ధారించింది. అయితే ఈ నివేదికలోని వివరాల ప్రకారం వందలాదిగా సాగిన చట్టవిరుద్ధ హత్యలు, ఏకపక్ష అరెస్టులు, నిర్బంధాలు మొదలైనవన్నీ షేక్ హసీనా ప్రభుత్వంతో పాటు భద్రతా అధికారుల సహకారంతోనే జరిగాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఈ నివేదికలో పేర్కొంది.ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కూడా మతపరమైన మైనారిటీలపై హింసను ప్రోత్సహిస్తున్నదని ఆ నివేదిక ఆరోపించింది. మహిళలు వారి నిరసనను వ్యక్తం చేయకుండా నిరోధించేందుకు వారిపై శారీరక దాడి, అత్యాచారం చేస్తామని పోలీసులు బెదిరించారని కూడా నివేదిక పేర్కొంది. నిరసనలను అణిచివేసే నెపంతో రాజకీయ నేతలు, భద్రతా అధికారులు ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ పేర్కొన్నారు. విద్యార్థి నేత, అమరవీరుడు అబూ సయీద్ హత్య కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆ నివేదిక పేర్కొంది.ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్ -
ముందున్నవి ‘పానీ’పట్టు యుద్ధాలే
సాక్షి, అమరావతి: ప్రపంచంలో 2030 నాటికి భారత్, చైనా సహా 113 దేశాల్లోని 560 కోట్ల (72 శాతం) మందిని నీటి కష్టాలు చుట్టుముడతాయా? పాకిస్తాన్, ఇథియోఫియా, హైతీ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మంది (8 శాతం) ప్రజలకు తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు తాగునీళ్లు దొరకవా? జల సంక్షోభంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడటం వల్ల ఆకలి చావులు తప్పవా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం(యూఎన్‌యూ) ఇటీవల విడుదల చేసిన ప్రపంచ జలభద్రత నివేదిక. ప్రపంచ జనాభాలో సుమారు 100 కోట్ల (20 శాతం) మందికి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయని నివేదికలో పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భూతాపాన్ని తగ్గించడం.. మురుగు నీటిని శుభ్రపరిచి పునర్వినియోగంలోకి తేవడం.. పంటల సాగులో యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడం ద్వారా జల సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆ నివేదిక సూచించింది. 17 సుస్థిరాభివృద్ధి సూచికల జారీ ప్రపంచంలో 195 దేశాలున్నాయి. ఇందులో 193 దేశాలకు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది. నానాటికీ పెరుగుతున్న కాలుష్యం తీవ్రత, వర్షపాతంలో తగ్గుదల, తీవ్రమవుతున్న ఆహార కొరత తదితరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల అభ్యున్నతి కోసం ఐక్యరాజ్యసమితి 17 సుస్థిరాభివృద్ధి సూచికలను ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. ఇందులో ప్రధానమైనది అందరికీ సరిపడా పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచడం (మనిíÙకి రోజుకు కనీసం 50 లీటర్ల పరిశుభ్రమైన నీరు). ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఈ లక్ష్యంపై ఐఎన్‌యూ 186 దేశాల్లో నివసిస్తున్న 778 కోట్ల ప్రజలకు 2030 నాటికి పరిశుభ్రమైన నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలతో ప్రపంచ జల భద్రత నివేదికను ఇటీవల విడుదల చేసింది. » మురుగు నీటిని శుభ్రపరిచి పునర్ వినియోగంలోకి తేవడం, పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే జలభద్రత » పంటల సాగులో యాజమాన్య పద్ధతుల ద్వారా సమర్థవంతంగా నీటి వినియోగం » తద్వారా జల సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సూచన కాలుష్యం, వాతావరణ మార్పుల వల్లే.. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత నానాటికీ తీవ్రమవుతోంది. ఇది భూతాపాన్ని పెంచుతోంది. దాంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇది ఎల్‌నినో.. లానినో పరిస్థితులకు దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రుతుపవనాల గమనాన్ని ఎల్‌నినో, లానినోలు దెబ్బతీస్తున్నాయి. వర్షం కురిస్తే కుంభవృష్టిగా కురవడం.. లేదంటే రోజుల తరబడి వర్షాలు కురవకపోవడం (డ్రై స్పెల్) వంటి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నీటికొరతకు ప్రధాన కారణం. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలుగా మార్చడంపై దృష్టి పెట్టకపోవడం.. భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా తోడేయడం కూడా నీటి కొరతకు దారితీస్తోంది. పంటల సాగులో యాజమాన్య పద్ధతులను పాటించకుండా ఇష్టారాజ్యంగా నీటిని వినియోగిస్తుండటం కూడా నీటి ఎద్దడికి దారితీస్తోంది. ఆసియా–పసిఫిక్ దేశాలపై తీవ్ర సంక్షోభం రుతుపవనాలపై అత్యధికంగా ఆధారపడేది ఆసియా–పసిఫిక్ దేశాలే. ఎల్‌నినో, లానినో ప్రభావం అత్యధికంగా పడేది ఈ దేశాలపైనే. ఇందులో అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని 113 దేశాల్లోని 560 కోట్ల మంది ప్రజలకు నీటికష్టాలు చుట్టుముడతాయి.పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ, చాద్, లైబేరియా, మడగాస్కర్ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మందికి తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు నీళ్లు కూడా అందుబాటులో ఉండవు. ఫిన్‌ల్యాండ్, అమెరికా, న్యూజిలాండ్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, లాత్వియా తదితర దేశాల్లోని 100 కోట్ల మంది, 49 దేశాల్లోని 100 కోట్ల మంది ప్రజలకు మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయి. -
భూగర్భ'గరళం'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూగర్భ జలం గరళంగా మారిందా? బావులు, బోరు బావుల్లో ఎక్కడ పడితే అక్కడ నీటిని తాగితే రోగాలు కొనితెచ్చుకున్నట్లేనా? 26 జిల్లాల్లోనూ కొన్ని చోట్ల తాగడానికే కాదు.. సాగుకు కూడా భూగర్భ జలాలు పనికి రానంత విషతుల్యంగా మారాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది భూగర్భ జలాల నాణ్యత నివేదిక–2024. దేశవ్యాప్తంగా 2023లో వర్షాకాలం ప్రారంభానికి ముందు, వర్షాకాలం ముగిసిన తర్వాత కేంద్ర భూగర్భ జల మండలి (సీజీడబ్ల్యూబీ) భూగర్భ జలాల నమూనాలను పరీక్షించి, వాటి నాణ్యతను తేల్చింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన రసాయనాలు పరిమితికి మించి చేరడం వల్ల విషతుల్యంగా మారాయని సీజీడబ్ల్యూబీ నివేదిక తేల్చింది. ఆర్శనిక్, యురేనియం, క్లోరైడ్, ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి ప్రమాదకరమైన రసాయనాలతోపాటు ఇనుము వంటి లోహ ధాతువులు భూగర్భ జలాల్లో పరిమితికి మించి ఉన్నట్లు వెల్లడించింది. పారిశ్రామిక వ్యర్థాలను యథేచ్ఛగా వదిలేయడం, వ్యవసాయంలో క్రిమి సంహారక మందులు, ఎరువులను అధిక మోతాదులో వినియోగించడం, పట్టణీకరణ పెరిగిపోవడంతో మురుగు నీటిని శుద్ధి చేయకుండా వదిలేయడం, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలను పరిమితికి మించి తోడేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తేల్చింది.రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నైట్రేట్, 17 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్, 12 జిల్లాల్లో ఇనుము, 7 జిల్లాల్లో ఆర్శనిక్ పరిమితికి మించి ఉన్నట్లు తెలిపింది. ప్రతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో పరిమితికి మించి సోడియం కార్బొనేట్ ఉండటం వల్ల ఆ నీళ్లు సాగుకు కూడా వాడకూడదని సీజీడబ్ల్యూబీ తేల్చింది.నైట్రేట్భూగర్భ జలాల్లో నైట్రేట్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నైట్రేట్ ఎక్కువ ఉంది. 2023 వర్షాకాలం ముగిసిన తర్వాత 1149 ప్రాంతాల్లో పరీక్షించగా.. 270 ప్రాంతాల్లో పరిమితికి మించి నైట్రేట్ ఉన్నట్లు తేలింది. రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తరువాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. పల్నాడు జిల్లాలో 70 చోట్ల పరీక్షించగా 36 చోట్ల నైట్రేట్ చాలా ఎక్కువ ఉన్నట్లు తేలింది.క్లోరైడ్లీటర్ నీటిలో 250 మిల్లీ గ్రాముల లోపు క్లోరైడ్ ఉంటే అవి తాగడానికి సురక్షితం. రాష్ట్రంలో 887 చోట్ల పరిమితికి లోపే క్లోరైడ్ ఉన్నట్లు తేలింది. 222 చోట్ల 250 నుంచి 1,000 మిల్లీగ్రాముల మధ్య ఉన్నట్లు తేలింది. వెయ్యి మిల్లీగ్రాములకంటే ఎక్కువ క్లోరైడ్ ఉంటే ఆ నీటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ తాగకూడదు. రాష్ట్రంలో 40 ప్రాంతాల్లో వెయ్యి మిల్లీగ్రాములకంటే ఎక్కువగా క్లోరైడ్ ఉన్నట్లు తేలింది.ఇనుములీటర్ నీటిలో ఒక మిల్లీ గ్రాముకంటే ఎక్కువ పరిమాణంలో ఇనుప (ఐరన్) ధాతువులు ఉంటే ఆ నీటిని పొరపాటున కూడా తాగకూడదు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో (అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశి్చమ గోదావరి) కొన్ని ప్రాంతాల్లో భూగర్భజలాల్లో పరిమితికి మించి ఇనుప ధాతువులు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.ఫ్లోరైడ్భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 8వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 130 ప్రాంతాల్లో పరిమితికి మించి ఫ్లోరైడ్ ఉన్నట్లు తేలింది. శ్రీసత్యసాయి జిల్లాలో 27 చోట్ల, పల్నాడు జిల్లాలో 19, ప్రకాశం జిల్లాలో 25 చోట్ల ఫ్లోరైడ్ పరిమితికి మించి చాలా ఎక్కువ ఉన్నట్లు తేలింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఎనీ్టఆర్, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాలోనూ ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్న జిల్లాలు 2015 నుంచి క్రమేణా పెరుగుతున్నాయి.ఆర్శనిక్ఆర్శనిక్ విషతుల్యమైనది. లీటర్ నీటిలో 0.01 మిల్లీ గ్రాములకు మించి ఉంటే ఆ నీటిని పొరపాటున కూడా తాగకూడదు. రాష్ట్రంలో అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో పరిమితికి మించి ఆర్శనిక్ ధాతువులు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.సాగుకూ పనికి రావు..లీటరు నీటిలో 1.25 మిల్లీ గ్రాములకంటే ఎక్కువగా సోడియం కార్బొనేట్ ఉంటే ఆ నీటిని సాగుకు వినియోగించకూడదు. రాష్ట్రంలో 27.68 శాతం నమూనాల్లో సాగుకు పనికిరాని విధంగా ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు తేలింది. -
ఏసీలతో పవర్ గ్రిడ్లకు ముప్పు!
సాక్షి, అమరావతి: ఒకప్పుడు విలాస వస్తువుగా కనిపించిన ఎయిర్ కండిషన్లు(ఏసీలు).. ఇప్పుడు విపరీత ఎండలతో తప్పనిసరి అవసరంగా మారిపోతున్నాయి. గతంలో సంపన్నులకే పరిమితమైన ఏసీలు.. ఇప్పుడు సామాన్యులకు చేరువవుతున్నాయి. ఈ క్రమంలో అవగాహన లేమి, అనవసర వృథా అనర్థాలకు దారితీస్తోంది. ఏసీల అతి వినియోగం వల్ల పవర్ గ్రిడ్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) హెచ్చరించింది. రానున్న రోజుల్లో వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో పాటు పట్టణ జనాభా కూడా భారీగా వృద్ధి చెంది.. ఏసీల వాడకాన్ని తారాస్థాయికి తీసుకెళ్తాయని పేర్కొంది. దీంతో పవర్ గ్రిడ్‌పై ఒత్తిడి పెరుగుతుందని ఐఈఏ తన తాజా నివేదికలో వెల్లడించింది.ప్రతి వందలో 24 ఇళ్లకు ఏసీ..దేశవ్యాప్తంగా ప్రతి 100 ఇళ్లల్లో 24 ఇళ్లకు ఏసీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) ఇటీవల వెల్లడించింది. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం గత 50 ఏళ్లలో 17 వేల మంది ఎండ దెబ్బకు మరణించారు. విపరీత ఎండలతో భవనాల నుంచి రేకుల షెడ్డు వరకూ ఏసీలను వినియోగిస్తున్నారని పేర్కొంది. ఫలితంగా ఏసీలకు వాడే విద్యుత్ వినియోగం.. మొత్తం విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 20 శాతానికి చేరింది. 2050 నాటికి దేశంలో పట్టణ జనాభా సంఖ్య 40 కోట్లకు పైగా చేరనుందని అంచనా. దీంతో అప్పటికల్లా పట్టణాల్లో విద్యుత్ డిమాండ్ నాలుగు రెట్లు పెరగనుందని.. గృహాల్లో ఏసీల వాడకం తొమ్మిది రెట్లు పెరుగుతుందని అంచనా.ఇది మొత్తం ఆఫ్రికా ఖండంలో విద్యుత్ వినియోగం కంటే ఎక్కువ. ఏసీలకు ఇలా డిమాండ్ పెరగడం వల్ల విద్యుత్ లోటు ఏర్పడి.. కోతలు విధించాల్సిన అవసరం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఏపీలో ఏసీలకు 3 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్..ఏసీలను నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వినియోగించడం ద్వారా విద్యుత్‌ను భారీగా ఆదా చేయవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ తాజా అధ్యయనంలో వెల్లడించింది. దీని ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 80 మిలియన్ టన్నుల రిఫ్రిజిరేషన్(టీఆర్) ఎయిర్ కండీషనర్ సామర్థ్యం ఉంది. ఇది 10 ఏళ్లలో దాదాపు 250 మిలియన్ టీఆర్‌కు చేరుకునే ప్రమాదం ఉంది. దీని వల్ల 2030 నాటికి దేశంలో విద్యుత్ లోడ్ సుమారు 200 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా. రాష్ట్రంలో ఏసీల విద్యుత్ డిమాండ్ ఏటా దాదాపు 3 వేల మిలియన్ యూనిట్లు. ఇది రాష్ట్రం మొత్తం విద్యుత్ వినియోగంలో 5 శాతం. వినియోగదారులు ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌గా పెట్టుకుంటే.. దేశంలో ఏటా రూ.10 వేల కోట్ల విలువైన దాదాపు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని బీఈఈ నివేదికలో పేర్కొంది.ఏసీ ఎక్కువైనా అనర్థమే..ఒక మనిషి 1.5 టన్నుల ఏసీని ఉపయోగిస్తే.. అది గంటకు సుమారుగా ఒక యూనిట్ విద్యుత్‌ను వినియోగించి.. దాదాపు 0.98 కిలోల కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. సాధారణంగా మానవ శరీర ఉష్ణోగ్రత సుమారు 36–37 డిగ్రీల సెల్సియస్. కానీ 18–21 డిగ్రీల సెల్సియస్‌కు ఏసీ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంటారు. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, కళ్లు, చర్మం పొడిబారడం, రక్తపోటు వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఎస్సీల వర్గీకరణకు త్వరలో చట్టం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ చరిత్రలో ఫిబ్రవరి 4కు అత్యంత ప్రాధాన్యం ఉంది. దశాబ్దాల నాటి ఎస్సీ వర్గీకరణకు వీలుగా తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి 2024 ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపింది. వర్గీకరణ నివేదికను 2025 ఫిబ్రవరి 4న మంత్రిమండలి ఆమోదించింది. దశాబ్దాలుగా నలుగుతున్న జఠిల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది ఈ రోజే. అందువల్ల ఈ రోజును సామాజిక న్యాయ దినోత్సవంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవస రం ఉంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎస్సీల వర్గీకరణ నివేదికపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణ అమలుకు త్వరలోనే చట్టం తేవటం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూస్తామని చెప్పారు. ఎస్సీల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ విధానాన్ని తిరస్కరించటం ద్వారా భవిష్యత్తులో సమస్య రాకుండా చేసుకున్నామన్నారు. వర్గీకరణ అమలు బాధ్యత తీసుకుంటాం: ఎస్సీ వర్గీకరణ అమలుచేసే బాధ్యతను తమ కేబినెట్ తీసుకుంటుందని రేవంత్ చెప్పారు. వర్గీకరణ నివేదికపై ప్రక టన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉమ్మడి ఏపీలో సీఎంలుగా ఉన్న 16 మందికి, తెలంగాణ ఏర్పడ్డాక సీఎంగా ఉన్న వారికి రాని అవకాశం నాకు వచ్చింది. ఈ సంతోషం చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది..’ అని పేర్కొన్నారు. గతంలో ఇదే అసెంబ్లీలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే తనను, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, సంపత్‌కుమార్‌లను సభ నుంచి బహిష్కరించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఇదే అసెంబ్లీలో సభా నాయకుడిగా వర్గీకరణ అమలుకు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. ఆ అంకెలేవీ అసెంబ్లీలో చెప్పలేదు: మంత్రి ఉత్తమ్ 2014లో గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి నా ఆ అంకెలేవి అసెంబ్లీలో చెప్పలేదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనల మేరకు కొత్తగూడెంలో నూతన ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు చేయ డానికి కేంద్రం ‘ఫీజబులిటీ రిపోర్ట్’ కోరిందని ఆయన వెల్లడించారు. వైఎస్ హయాంలోనూ తీర్మానం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మధ్యలో అడ్డంకులు ఎదురైనా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దీనిపై రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారని గుర్తుచేశారు. ఎస్సీలను చాలా రాజకీయ పార్టీలు ఓటుబ్యాంక్ గానే చూశాయని, సమాజంపై ఆయావర్గాలు విశ్వాసం కోల్పోకుండా చేసే అవకాశం తమకు దక్కిందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ జరిగేందుకు తన వంతు సాయం అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చర్చలో పాల్గొన్న సభ్యులకు, వర్గీకరణపై ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘానికి, ఆ నివేదికను ఆమోదించిన మంత్రివర్గానికి, నివేదిక కోసం కష్టపడిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
380 జిల్లాల్లో వర్సిటీలు లేవు
సాక్షి, అమరావతి : దేశంలో రాష్ట్రాల మధ్య విశ్వవిద్యాలయాలు, కాలేజీల నిష్పత్తిలో అసమానతలున్నాయని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ విశ్వవిద్యాలయాలుంటే ఇంకొన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ ఉన్నాయని తెలిపింది. ఉదా.. రాజస్థాన్‌లో 93, గుజరాత్లో 91, ఉత్తరప్రదేశ్‌లో 87 ఉండగా.. అండమాన్–నికోబార్ దీవులు, లక్షద్విప్, దాద్రా–నగర్ హవేలీ, డామన్–డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తక్కువ విశ్వవిద్యాలయాలున్నాయని నివేదిక తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాల నిష్పత్తిలోను, ఉన్నత విద్య అందుబాటులోనూ అసమానతలున్నాయని వివరించింది. నీతి ఆయోగ్ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు ఏమిటంటే.. పట్టణ ప్రాంతాల్లో 59 శాతం వర్సిటీలు.. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా 1,160 విశ్వవిద్యాలయాలుంటే ఇందులో 680 వర్సిటీలు పట్టణ ప్రాంతాల్లోనూ.. 480 వరిటీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే.. 66 శాతం జనాభా గల గ్రామీణ ప్రాంతాల్లో 41 శాతం యూనివర్శిటీలుండగా 34 శాతం జనాభాగల పట్టణ ప్రాంతాల్లో 59 శాతం యూనివర్సిటీలున్నాయి. జాతీయ విద్యా విధానంలో భాగంగా 2035 నాటికి ఉన్నత విద్యలో జీఈఆర్‌ను 50 శాతానికి పెంచాలన్న లక్ష్యాలు నెరవేరాలంటే ప్రస్తుతమున్న 4.33 కోట్ల విద్యార్థుల నమోదును 9 కోట్లకు చేర్చాల్సి ఉంది. దాదాపు 4.5 కోట్ల మంది అదనపు విద్యార్థులను ఉన్నత విద్యలోకి తీసుకురావాలి. ఈ నేపథ్యంలో.. ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాల మధ్య ఉన్నత విద్యా సంస్థల్లో అసమానతలను తొలగించేందుకు చర్య లు తీసుకుంటూ క్లస్టర్ వర్శిటీలతో సహా అనేక కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించాలని నీతి ఆయోగ్ నివేదిక సూచించింది. ప్రాంతీయ డిమాండ్, యాక్సెసిబిలిటీ, సామీప్యత పరిగణనలోకి తీసుకుని కొత్త వర్సిటీలు స్థాపించాలని సూచించింది. ఉన్నత విద్యలోనూ అవకాశాలు పరిమితం.. » తక్కువ జనాభా కలిగిన ఈశాన్య రాష్ట్రాల్లో లక్ష జనాభాకు చూస్తే ఎక్కువ విశ్వవిద్యాలయాలు, కాలేజీలున్నాయి. కానీ, అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో లక్ష జనాభాకు కొన్ని వర్సిటీలే ఉన్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లోనూ ఒక లక్ష జనాభాకు తక్కువ విశ్వవిద్యాలయాలున్నాయి. » దేశంలో ఉన్నత విద్య అందుబాటులోనూ అసమానతలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పరిమితంగా అవకాశాలు అందుబాటులో ఉండగా కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి. » రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యధికంగా 35, బెంగళూరులో 25, గుజరాత్లో 21 విశ్వవిద్యాలయాలున్నాయి. » 160 జిల్లాల్లో ఒక్కో విశ్వవిద్యాలయం చొప్పున.. 102 జిల్లాల్లో మూడు కంటే తక్కువగా వర్సిటీలున్నాయి. » ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని 380 జిల్లాల్లో అసలు విశ్వవిద్యాలయాలే లేవు. » ఇక కాలేజీలు కూడా దేశంలోని కొన్ని జిల్లాల్లో అత్యధికంగా కొన్ని జిల్లాల్లో తక్కువగాను ఉన్నాయి. » బెంగళూరులో 1,118 ఉండగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో 740, మహారాష్ట్రలోని పూణేలో 628 కాలేజీలు ఉన్నాయి. » దేశంలోని 153 జిల్లాల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ కాలేజీలుండగా 29 జిల్లాల్లో ఒక్క కాలేజీ కూడా లేదు. 85 జిల్లాల్లో ఐదు కన్నా తక్కువ కాలేజీలున్నాయి. -
పాతిక లక్షల జనాభాకో లోక్ సభ సీటు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోని ప్రధాన దేశాలతో పోల్చితే ఒక లోక్‌సభ (దిగువ సభ) సీటుకు సగటు జనాభా అత్యధికంగా ఉన్న దేశం భారతదేశమే. మిగిలిన ప్రధాన దేశాల్లో ఒక లోక్‌సభ స్థానానికి సగటు జనాభా అతి తక్కువ అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ఆధారంగా వివిధ దేశాల్లో దిగువ సభకు సీట్లు, ఒక సీటుకు జనాభా, మహిళల ప్రాతినిధ్యం, ఓటింగ్ శాతాలను ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది. భారత దిగువ సభలో ఒక్కో నియోజకవర్గం సగటు జనాభా 25.7 లక్షలు ఉండగా.. అమెరికాలో 7.3 లక్షలే ఉన్నట్లు తెలిపింది. ఇండోనేషియాలో 4.8 లక్షలు, జర్మనీ, ఫ్రాన్స్‌లో 1.2 లక్షల జనాభానే ఉందని తెలిపింది. మిగతా దేశాలతో పోల్చితే మన లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉందని నివేదిక తెలిపింది. అయితే భారత్ సహా ప్రధాన దేశాలన్నింటిలో ఓటింగ్ శాతం దాదాపు సమానంగా ఉన్నట్లు వెల్లడించింది. ఓటింగ్ శాతంలో త్వరలోనే భారత్ ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన చేరవచ్చునని తెలిపింది. దిగువ సభ ఓటింగ్ శాతం జర్మనీలో అత్యధికంగా ఉండగా, ఆ తరువాత ఫ్రాన్స్, స్పెయిన్, భారత్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
హైకోర్టు పోయె.. బెంచ్ వచ్చె!
సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమవాసుల హైకోర్టు ఆశలకు శాశ్వతంగా గండికొట్టిన టీడీపీ ప్రభుత్వం.. కర్నూలులో బెంచ్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా న్యాయ రాజధానిగా చేయాలనే సంకల్పంతో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan mohan Reddy) ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు, ఏపీఈఆర్సీని కర్నూలులో ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీఆర్సీకి శాశ్వత భవనాన్ని నిర్మించింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, కర్నూల్లో బెంచ్ మాత్రమే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో కర్నూలులో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా వసతి, నివాస సదుపాయాలు, కోర్టు రూములు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి ఇతర సౌకర్యాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తమ ముందుంచాలని కలెక్టర్ రంజిత్ బాషాను హైకోర్టు(High Court) ఆదేశించింది.కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంలో ప్రధాన న్యాయమూర్తి నియమించిన న్యాయమూర్తుల కమిటీ ముందు ఉంచేందుకు వీలుగా ఈ వివరాలను అందచేయాలని పేర్కొంటూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) శ్రీనివాస శివరామ్ ఈ నెల 29న కలెక్టర్‌కు లేఖ రాశారు. దీన్ని అత్యవసరంగా భావించాలని కోరడంతో కలెక్టర్ తక్షణమే స్పందించి ఆర్ అండ్ బీ ఎస్ఈ, మునిసిపల్ కమిషనర్, ఆర్డీవోలకు ఈ బాధ్యతను అప్పగించగా.. కర్నూలులో మూడు భవనాలను ‘బెంచ్’ కోసం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండేలా..కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు భవనం కోసం ప్రధానంగా ఏపీఈఆర్సీ భవనాన్ని అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. అధికారులు ప్రతిపాదించిన మూడు భవనాల్లో ఇదే కొత్తది కావడం, ప్రజలకు అందుబాటులో ఉన్నందున ఇక్కడే హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తారనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. భవనాల గుర్తింపు కోసం ప్రభుత్వం కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు మొత్తం మూడు భవనాలను సూచించినట్లు చెబుతున్నారు. ఇందులో ఏపీఈఆర్సీ భవనంతోపాటు జగన్నాథగట్టుపై నిర్మిస్తున్న క్లస్టర్ యూనివర్సిటీ భవనం, హైదరాబాద్–చెన్నై సమీపంలోని ఓ ప్రైవేట్ భవనం ఉన్నాయి. వీటి వివరాలను కలెక్టర్ గురువారం రిజిస్ట్రార్‌కు పంపినట్లు సమాచారం. దీనిపై కలెక్టర్‌ను వివరణ కోరగా.. భవనాలను పరిశీలిస్తున్నామని, ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు. కాగా, ఒకవేళ జగన్నాథ గట్టుపై ఉన్న భవనాలను హైకోర్టు బెంచ్(High Court Bench) కోసం ప్రతిపాదిస్తే అక్కడున్న క్లస్టర్ యూనివర్సిటీని సిల్వర్ జూబ్లీ కాలేజీ భవనాలకే పరిమితం చేసే అవకాశం ఉంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయంతో ఏపీఈఆర్సీని అమరావతికి తరలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గం తీర్మానం కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటును ఆమోదిస్తూ గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. అటు తరువాత అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలియచేసే నిమిత్తం ఫుల్ కోర్టుకు నివేదించాలని కోరుతూ న్యాయశాఖ కార్యదర్శి గత ఏడాది అక్టోబర్ 28న హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌కి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బెంచ్ ఏర్పాటుపై నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కమిటీని నియమించారు. జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఇప్పటికే ప్రాథమికంగా సమావేశమైనట్లు తెలిసింది. కమిటీ నివేదికను ప్రధాన న్యాయమూర్తి ఫుల్‌కోర్టు ముందుంచి చర్చించే అవకాశం ఉంది. ఫుల్‌కోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటు ఓ కొలిక్కి వస్తుంది.15 మంది న్యాయమూర్తుల కేటాయింపు?కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందుకున్న తరువాత జిల్లాల వారీగా దాఖలైన కేసుల గణాంకాలను హైకోర్టు సిద్ధం చేసినట్లు తెలిసింది. హైకోర్టులో మొత్తం కేసుల్లో 40 శాతం రాయలసీమ జిల్లాల నుంచే దాఖలవుతున్నాయి. దీని ఆధారంగా కర్నూలులో ఏర్పాటయ్యే శాశ్వత బెంచ్ న్యాయమూర్తుల సంఖ్యను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ప్రస్తుతం 30 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 40 శాతం కేసులు రాయలసీమ నుంచి దాఖలవుతున్నందున మొత్తం 37 మంది న్యాయమూర్తుల్లో అందుకు అనుగుణంగా 15 మందిని కర్నూలు(Kurnool) బెంచ్‌కు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన 22 మంది న్యాయమూర్తులు అమరావతిలో ఉన్న హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌లో న్యాయమూర్తులుగా కొనసాగే వీలుంది. ఈ క్రమంలోనే కర్నూలులో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాల గురించి ఆరా తీస్తూ కర్నూలు కలెక్టర్‌కు హైకోర్టు లేఖ రాసినట్లు భావిస్తున్నారు.కర్నూలు బెంచ్ పరిధిలోకి ప్రకాశం, నెల్లూరు?ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి రాయలసీమ జిల్లాలతో కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీన్ని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకులు, న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. కర్నూలు వెళ్లాలంటే తమకు నేరుగా రైలు సౌకర్యం లేదని, రోడ్డు ద్వారా వెళ్లాలంటే కనీసం 7 నుంచి 9 గంటల సమయం పడుతుందని ఇరు జిల్లాల వారు ప్రభుత్వానికి నివేదించారు. అయితే వీరి అభ్యంతరాలను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. -
రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్!
సాక్షి, అమరావతి: ‘మీకూ మీ రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఓ దండం.. నిబంధనలకు విరుద్ధంగా పని చేయడం నా వల్ల కాదు.. అక్రమ కేసులు, వేధింపులకు నేను పాల్పడ లేను..’ అని సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ తేల్చి చెప్పారు. అదంతా కాదు.. తాము చెప్పింది చేయాల్సిందేనని, నిబంధనలు జాన్తానై అంటూ డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ హుకుం జారీ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పడంతో ఆ ఉన్నతాధికారులు హడలిపోయారు. దాంతో తమ పుట్టి మునుగుతుందని హడలిపోయిన డీజీపీ, సీఐడీ చీఫ్ చాలాసేపు సర్ది చెప్పడంతో అతి కష్టం మీద రాజీనామా విషయంలోబ్రిజ్లాల్ వెనక్కి తగ్గారు. రెడ్‌బుక్(Redbook) వేధింపులకు పాల్పడలేనని స్పష్టం చేస్తూ సెలవుపై వెళ్లిపోయారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఉదంతం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తమ రెడ్‌బుక్ రాజ్యాంగ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం(Ration rice) అక్రమ రవాణా అవుతోందని గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. ముందస్తు పన్నాగంతో మంత్రి నాదేండ్ల మనోహర్ (Nadendla Manohar) ద్వారా కుట్రకు తెరతీసి.. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ‘సీజ్ ద షిప్’ డ్రామాను రక్తి కట్టించేందుకు యత్నించింది. కాగా, కేంద్ర కస్టమ్స్ అధికారులు నిబంధనలకు కట్టుబడటంతో టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం కుట్ర బెడిసికొట్టింది. దాంతో చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు కేసును తమ ఆధీనంలోని సీఐడీకి అప్పగించింది. అందుకోసం నియమించిన సిట్‌కు సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను చీఫ్‌గా నియమించింది. సిట్ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులను నియమించింది. కానీ ఒక్క రోజులోనే వారిని మార్చి పూర్తిగా తమ మాట వినే అధికారులను నియమించింది. అనంతరం వినీత్ బ్రిజ్‌లాల్ కాకినాడలో పర్యటించిన పోర్టు, గోదాములు మొదలైన వాటిని పరిశీలించి వచ్చారు. తాను గుర్తించిన వాస్తవ విషయాలతో నివేదిక రూపొందించేందుకు ఉపక్రమించారు. పెద్దలు చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాలి తాము అనుకున్న రీతిలో నివేదిక సిద్ధం కావడం లేదని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు.. పోలీసు పెద్దకు దిశా నిర్దేశం చేయడంతో అసలు కుట్రకు తెరలేచింది. ఈ నేపథ్యంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్.. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను పిలిచి మాట్లాడారు. తాము చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ‘క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విషయాలతో పని లేదు.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందా లేదా అన్నదానితో నిమిత్తం లేదు. జరిగినట్టు నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లు చెబుతారో వారిని బాధ్యులుగా పేర్కొనాలి’ అని ఆదేశించినట్టు తెలుస్తోంది. సీఐడీ చీఫ్ ఆదేశాలను వినీత్ బ్రిజ్‌లాల్ నిర్ద్వందంగా తిరస్కరించారు. తాను క్షేత్ర స్థాయిలో కనుగొన్న వాస్తవ విషయాలతోనే నివేదిక రూపొందిస్తానని స్పష్టం చేశారు. అలా అయితే కుదరదని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే నివేదిక ఇచ్చి తీరాలని సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దీనిపై వినీత్ బ్రిజ్‌లాల్ తీవ్రంగానే స్పందించినట్టు తెలుస్తోంది. డీజీపీదీ అదే మాట.. బ్రిజ్‌లాల్ వైఖరిని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో బ్రిజ్‌లాల్‌ను డీజీపీ తన చాంబర్‌కు పిలిపించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మరోసారి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని ఆదేశించారు. బ్రిజ్‌లాల్ మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వనని తేల్చి చెప్పారు. అంతేకాదు తనకు పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిబంధనల మేరకే పని చేస్తున్నానన్నారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూముల కుంభకోణంపై నియమించిన సిట్‌కు నేతృత్వం వహించానని, అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏవోబీలో గంజాయి నిర్మూలనకు సెబ్ కమిషనర్‌గా పని చేశానని చెప్పారు. విశాఖపట్నంలో భూముల కుంభకోణంలో ప్రమేయం ఉన్న అప్పటి టీడీపీ మంత్రిపై చర్యలు తీసుకోని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. ఆయన వాదనను ఏమాత్రం వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాల్సిందేనని డీజీపీ, సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన బ్రిజ్‌లాల్ ఇలా అయితే తాను ఏకంగా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి బయటకు వచ్చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని కూడా డీజీపీకి సమర్పించినట్టు సమాచారం. దాంతో డీజీపీ, సీఐడీ చీఫ్ హడలిపోయారు. ఈ వ్యవహారం బయటకు పొక్కితే తాము ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించారు. ఆ మర్నాడు మళ్లీ బ్రిజ్‌లాల్‌ను పిలిపించి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అతి కష్టం మీద అందుకు సమ్మతించిన ఆయన తాను మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం కావడంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు.త్వరలో సిట్ చీఫ్‌గా మరొకరు! తమ కుట్రలకు వినీత్ బ్రిజ్‌లాల్ ససేమిరా అనడంతో ఆయన స్థానంలో సిట్ చీఫ్‌గా మరొకర్ని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి గ్రేహౌండ్స్‌కు బదిలీ చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెలవు నుంచి వచ్చిన తర్వాత ఆయన్ను బదిలీ చేస్తారని సమాచారం. కాగా, వినీత్ బ్రిజ్‌లాల్ ఉదంతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల కక్ష సాధింపు కుట్రలకు పోలీసు వ్యవస్థను భాగస్వామిని చేస్తున్న పోలీసు ఉన్నతాధికారుల తీరుపై యంత్రాంగం తీవ్రంగా మండిపడుతోంది. ఉన్నత పదవులు పొందేందుకు, రిటైరైన తర్వాత కూడా పదవులు పొందేందుకు యావత్ పోలీసు వ్యవస్థను ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేసే వ్యవస్థగా మార్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పోలీసు అధికారులు బలవుతున్నా, వారికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నా.. పట్టించుకోని ఉన్నతాధికారులు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారని పోలీసు వర్గాలు దుయ్యబడుతున్నాయి. చదవండి: చెప్పారంటే.. చేయరంతే!డీజీపీ కావాలనే లక్ష్యంతో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, డీజీపీగా పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాకపోవడంతో రిటైరైన తర్వాత ఆర్టీసీ ఎండీగా పోస్టింగు లక్ష్యంగా ద్వారకా తిరుమలరావు పని చేశారన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గక బ్రిజ్‌లాల్ నిబద్ధతతో వ్యవహరించడాన్ని ప్రశంసిస్తున్నాయి. -
పనిగంటలపై 78 శాతం మంది అభిప్రాయమిదే..
వారానికి 72 గంటలు, వారానికి 90 గంటలు పనిచేయాలనే.. పనివేళలపై సర్వత్రా చర్చ జరిగింది. దీనిని సమర్దించిన వారి కంటే.. వ్యతిరేకించిన వారి సంఖ్యే ఎక్కువ. కాగా ఇప్పుడు ఇండీడ్.. పనిగంటలపై ఒక సర్వే నిర్వహించి, రిపోర్ట్ విడుదల చేసింది.గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ 'ఫ్యూచర్ కెరీర్ రిజల్యూషన్ రిపోర్ట్' ప్రకారం.. భారతదేశంలో ఐదుగురిలో నలుగురు (78 శాతం) ఉద్యోగులు తమ జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులతో సమయాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగంలో తక్కువ పని ఒత్తిడి ఉండేలా చూసుకోవడం మాత్రమే కాకుండా.. మానసిక ఆరోగ్యంపై కూడా ద్రుష్టి సారించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది.అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఉద్యోగావకాలు మెండుగా లభిస్తాయని పలువురు ఆశిస్తున్నట్లు కూడా ఈ సర్వేలోనే ఇండీడ్ వెల్లడించింది. ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలలో కూడా ఉద్యోగులు.. తమ ఉద్యోగానికి, వ్యక్తిగత జీవితానికి సమానంగా ప్రాధాన్యత ఇవ్వడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు ఇండీడ్ మార్కెటింగ్ డైరెక్టర్ 'రాచెల్ టౌన్స్లీ' (Rachael Townsley) పేర్కొన్నారు.జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం ముఖ్యమే.. కానీ జీవితం అనేది నిచ్చెన వంటివి కాదు. భద్రత, పనికి తగిన సరైన వేతనం మాత్రమే కాకుండా.. ఇతర ప్రయోజనాలను కూడా చాలామంది బేరీజు వేసుకుంటున్నారు.ఇదీ చదవండి: బడ్జెట్ 2025 రూపొందించిన ప్రముఖులు వీరే..ఈ ఏడాది కెరీర్లో పురోగతి కోసం.. ఏఐ, మెషిన్ లెర్నింగ్, కోడింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీలపై నైపుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 59 శాతం మంది భారతీయ ఉద్యోగులు కూడా సంప్రదాయ డిగ్రీ ఆధారిత అర్హతల కంటే నైపుణ్యాల ఆధారిత నియామకాలపై బలమైన దృష్టితో, నియామక పద్ధతుల్లో మార్పును చూడాలని భావిస్తున్నారు. -
ఆర్థిక వృద్ధితో మహిళల్లో రాజకీయ చైతన్యం
సాక్షి, అమరావతి: మహిళలు ఆర్థిక సాధికారత సాధించడం ద్వారా రాజకీయాల్లోనూ తమ భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నారు. గత పదేళ్లలో ఓట్లేసిన మహిళలు పెరగడం.. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మహిళల సంఖ్య పెరగడం ఇందుకు నిదర్శనం. ఈ విషయాలను ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. 2024 ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలు ఓట్లు వేశారని తెలిపింది. అదేవిధంగా అసోం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో కూడా మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారని వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లోని మహిళల్లో అత్యధిక మంది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై), మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ (ముద్ర) ఖాతాలు కలిగి ఉన్నారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది. అందువల్ల వారు ఆర్థిక సాధికారత సాధించారని, దాని ఫలితంగానే రాజకీయాలపైనా అవగాహన పెరిగిందని తెలిపింది. మరోవైపు ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హరియాణ రాష్ట్రాల్లో 2014 ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికల్లో ఓట్లు వేసిన మహిళల సంఖ్య తగ్గిందని ఆ నివేదిక తెలిపింది. -
12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లే అధికం
దేశంలోని 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో పురుషులతో సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారని వెల్లడించింది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ఆధారంగా రాష్ట్రాల వారీగా స్త్రీ, పురుష ఓటర్ల వివరాలను ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది. కేరళ, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ప్రతీ 100 మంది పురుష ఓటర్లకు, 109 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత మేఘాలయ, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ప్రతి 100 మంది పురుష ఓటర్లకు 108 మంది, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రతి 100 మంది పురుష ఓటర్లకు మహిళా ఓటర్లు 103 మంది ఉన్నారు. గుజరాత్, ఢిల్లీలలో మాత్రం ప్రతి 100 మంది పురుష ఓటర్లకు మహిళా ఓటర్లు కేవలం 84 మంది మాత్రమే ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. అయితే, దేశం మొత్తం మీద చూస్తే పురుష ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దేశంలో ప్రతి 100 మంది పురుష ఓటర్లకు 95 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. – సాక్షి, అమరావతి -
ఢిల్లీకి రూ. 2,026 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం ఢిల్లీ రాష్ట్ర పరిధిలో అమలుకోసం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. సంబంధిత కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదికను జాతీయ మీడియా బయటపట్టింది. లీక్ అయిన కాగ్ నివేదికలో పలు విస్మయకర విషయాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాష్ట్ర ఎక్సైజ్ విధానంలో అడుగడుగునా అక్రమాలు జరిగాయని, నిబంధనలకు నీళ్లొదిలేశారని, ధనార్జనే ధ్యేయంగా మద్యం పాలసీ రూపకల్పన చేశారని కాగ్ నివేదిక పేర్కొంది. తమకు అనుకూలంగా పనిచేసే మ ద్యం విక్రయ సంస్థలకు అయాచిత లబ్ధిచేకూరేలా ఎక్సయిజ్ పాలసీలో మార్పులుచేర్పులు, సవరణ లు చేశారని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. కాగ్ నివేదికలో ఏముంది? లీక్ అయిన కాగ్ నివేదిక ప్రకారం.. 2021 నవంబర్‌లో అమల్లోకి తెచ్చిన పాలసీని తొలుత కేబినెట్ నుంచి గానీ, ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ నుంచిగానీ అనుమతి తీసుకోలేదు. మద్యం విక్రయ లై సెన్సులు పొందిన లిక్కర్ సంస్థల ఆర్థిక స్థితిగతు లు, గత చరిత్ర, పూర్వాపరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థలకూ లైసెన్సులు మంజూరుచేశారు. కొన్నింటికి లైసెన్సులను ఉద్దేశపూర్వకంగా పునరుద్ధరించారు. కీలక నిబంధనలను మార్చే సందర్భాల్లో ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొందరు రిటైలర్లు ఆ విధానం ముగియకముందే తమ లైసెన్సులను ప్రభుత్వానికి సమర్పించి వెనుతిరిగారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవకపోవడంతో ప్రభుత్వం రూ. 890 కోట్ల ఆదా యం నష్టపోయింది. జోనల్ లైసెన్సుల్లో మినహాయింపులు ఇవ్వడంతో మరో రూ.941 కోట్ల ఆదా యం తగ్గిపోయింది. కోవిడ్‌ను సాకుగా చూపి కొందరికి లైసెన్స్ ఫీజులను మాఫీచేయడంతో మరో రూ144 కోట్ల ఆదాయం కోల్పోయింది. కోవిడ్ వంటి అనూహ్య పరిస్థితులు తలెత్తితే ఆ నష్టాలను వ్యాపారులే భరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. నష్టాలను చవిచూసేందుకే మొగ్గుచూపింది. అయితే కాగ్ నివేదిక ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. కేజ్రీవాల్ సమాధానం చెప్పాలి: బీజేపీ ఆప్ తెచ్చిన మద్యం విధానం లోపభూయిష్టమని కాగ్ నివేదించిన నేపథ్యంలో శనివారం బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘లిక్కర్గేట్’కు సూత్రధారి, ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ సమాధానం ఇవ్వాలి. 11 ఏళ్ల క్రితం అవినీతిపై సమాధానం చెప్పాలని సోనియాగాందీని పదేపదే డిమాండ్‌చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు’’అని ఠాకూర్ అన్నారు. ఇది కూడా చదవండి: ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి.. -
డీఎస్పీదే తప్పు: సీఎంకు కలెక్టర్ నివేదిక
తిరుపతి: తిరుపతి తొక్కిసలాటలో పెనువిషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబుకు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొన్నారు. డీఎస్పీ తొక్కిసలాట జరిగే సమయంలొ సరిగా స్పందించకపోవటంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. అయితే ఈ ప్రమాద సమయంలో ఎస్పీ సుబ్బారాయుడు వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేసినట్లు చెప్పారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేనట్లు వివరించారు. ఈ విషాద ఘటన డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని కలెక్టర్ సీఎంకు నివేదిక ఇచ్చారు. -
భారతీయులు ‘ఖర్చు’ పెట్టేస్తున్నారు!
సాక్షి, అమరావతి: భారతీయులు పొదుపు తగ్గించుకొని ఖర్చులు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. కొంతకాలంగా దేశీయ పొదుపు రేటు తగ్గుతూ వస్తోంది. అంతర్జాతీయంగా పొదుపు రేటులో 2,3 స్థానాల్లో నిలుస్తూ వచి్చన భారత్ ఇప్పుడు నాలుగో స్థానానికి దిగజారిపోయింది. 2023–24 సంవత్సరానికి దేశ జీడీపీలో పొదుపు రేటు 30.2 శాతానికి పడిపోయింది. 2023–24కి సంబంధించి దేశ జీడీపీ రూ.173.82 లక్షల కోట్లుగా ఉంటే అందులో పొదుపు మొత్తం రూ.52.49 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది 31.2%గా ఉన్న పొదుపు రేటు ఈ ఏడాది 1% పడిపోయింది. 2011–12లో దేశ పొదుపు రేటు అత్యధికంగా 34%గా నమోదైంది. అప్పటినుంచి పొదుపు రేటు క్రమేపి తగ్గుతూ ఇప్పుడు 30%కి చేరింది. రానున్న కాలంలో ఈ పొదుపు రేటు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక వేత్తల అంచనా. కానీ అంతర్జాతీయ సగటు పొదుపు రేటు 28.2%తో పోలిస్తే ఇండియా పొదుపు రేటు అధికంగానే ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. చైనా ఆ దేశ జీడీపీ రేటులో 46.6% పొదుపుతో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. అమెరికాలో మాత్రం పొదుపు రేటు18.1%గా ఉంది.7 దేశాలు మాత్రమే 20% కంటే అధిక పొదుపు రేటును కలిగి ఉన్నాయి.పొదుపు ఖాతాలు పెరుగుతున్నాయి.. పొదుపు రేటు తగ్గుతున్నా పొదుపు ఖాతాలు పెరుగుతున్నాయి. 18 ఏళ్లు నిండిన వారిలో 80% మందికి ఏదో ఒక ఆర్థిక ఖాతాను కలిగి ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 2011లో ఈ సంఖ్య 50%గా ఉంటే అది ఇప్పుడు 80%కు పెరిగినట్లు పేర్కొంది. ప్రస్తుత మన దేశ జనాభాలో 18 ఏళ్లు నిండిన వారు 96.88 కోట్లుగా ఉన్నట్లు అంచనా. దీని ప్రకారం చూస్తే 77.5 కోట్ల మంది పొదుపునకు సంబంధించి ఏదో ఒక ఖాతాను కలిగి ఉన్నారు. మూడేళ్లుగా బ్యాంక్ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తగ్గిస్తూ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, పీపీఎఫ్ వంటి ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. 2021లో 47.6 శాతంగా ఉన్న బ్యాంకు డిపాజిట్ల పొదుపు 2023 నాటికి 45.2%కు పడిపోయింది. ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పొదుపు శాతం 7.6% నుంచి 8.4%కు పెరిగినట్లు ఎస్బీఐ పేర్కొంది. -
ఇక పప్పులుడకవ్!
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో పప్పు ధాన్యాలకు కొరత ఏర్పడుతుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో ఆహార ధాన్యాలకు కొరత లేనప్పటికీ.. పప్పులు, తృణధాన్యాలు, కూరగాయలు, చక్కెర ఉత్పత్తులు డిమాండ్‌కు తగినట్టు సరఫరా ఉండదని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక తేల్చింది. వచ్చే ఆర్థిక ఏడాది (2025–26)తో పాటు, 2030–31 ఆర్థిక ఏడాది నాటికి ఆహార ధాన్యాలు డిమాండ్–సరఫరాతోపాటు పప్పులు, తృణధాన్యాలు, కూరగాయల డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేసింది. నాలుగేళ్లుగా ఆహార ధాన్యాలతోపాటు వివిధ ఆహారోత్పత్తులు రోజువారీ తలసరి లభ్యతపై నీతి ఆయోగ్ అధ్యయన నివేదికలో ఆసక్తికర విషయాలనువెల్లడించింది. నీతి ఆయోగ్ నివేదిక ఏం తేల్చిందంటే..నాలుగేళ్లుగా బియ్యం, గోధుమలు, తృణధాన్యాల రోజువారీ తలసరి లభ్యత పెరుగుతోంది. అయితే, పప్పుల రోజువారీ తలసరి లభ్యతలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.రానున్న రోజుల్లోనూ పప్పులు, కూరగాయలు, చక్కెర ఉత్పత్తుల డిమాండ్–సరఫరాకు మధ్య వ్యత్యాసం ఎక్కువగానే ఉంటుంది. దేశంలో వివిధ పంటల సాగు విస్తీర్ణంలో హెచ్చుతగ్గులుంటున్నాయి. దీనికి వాతావరణ పరిస్థితులు, నీటి పారుదల సౌకర్యాల లేమి, నేల పరిస్థితులు, తెగుళ్లు, వ్యాధులు వంటివి ప్రధాన కారణాలు. -
భారీగా తగ్గుతున్న అటవీ విస్తీర్ణం
రకరకాల కారణాలతో ఏపీలో అడవుల విస్తీర్ణం తగ్గి మైదానాలు దర్శనమిస్తున్నాయి. ఇలా అవడం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్–2023 ప్రకారం ఏపీలో 138.66 చదరపు కిలోమీటర్ల మేర అడవులు తగ్గిపోయాయి. ఇంత స్థాయిలో అడవులు తగ్గిపోవడంలో మధ్యప్రదేశ్ తొలిస్థానంలో, ఏపీ రెండోస్థానంలోనూ, తెలంగాణ మూడో స్థానంలోనూ నిలిచాయి.సాక్షి ప్రతినిధి, అనంతపురం: రకరకాల కారణాలతో ఏపీలో అడవుల విస్తీర్ణం తగ్గి మైదానాలు దర్శనమిస్తున్నాయి. ఇలా అవడం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్–2023 ప్రకారం ఏపీలో 138.66 చదరపు కిలోమీటర్ల మేర అడవులు తగ్గిపోయాయి. ఇంత స్థాయిలో అడవులు తగ్గిపోవడంలో మధ్యప్రదేశ్ తొలిస్థానంలో నిలవగా, ఏపీ రెండోస్థానంలోనూ, తెలంగాణ మూడో స్థానంలోనూ నిలిచాయి. 2021లో 30,223.62 చదరపు కిలోమీటర్లు ఉన్న ఏపీ అటవీ విస్తీర్ణం 2023 నాటి లెక్కల ప్రకారం 30,084.96 చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. మడ అడవుల్లో ఏపీ ఫస్ట్ఒకవైపు అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండగా..మరోవైపు మడ అడవుల విస్తీర్ణం ఏపీలో భారీగా పెరుగుతున్నట్టు ఫారెస్ట్ రిపోర్టులో వెల్లడైంది. దేశంలో 49,991.68 కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించి ఉన్నాయి. దీన్లోభాగంగా ఏపీలో 2023లో 13.01 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవుల విస్తీర్ణం పెరిగి మొదటి స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో మహారాష్ట్ర ఉంది. కృష్ణా, బాపట్ల, కాకినాడ ప్రాంతాల్లో సహజ పునరుత్పత్తి, తోటల పెంపకం తదితర కార్యకలాపాలతో మడ అడవుల పరిరక్షణ సమర్థంగా జరిగినట్టు నివేదికలో వెల్లడైంది.అగ్నికి ఆహుతవుతున్న అడవులుఏపీలోని అడవుల్లో మేలిమి జాతి వృక్షాలు, ఇతరత్రా అటవీ సంపద ఎక్కువగా అగ్నికి ఆహుతి అవుతున్నట్టు తేలింది. 2023–24లో ఏపీలో 5,286.76 చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూమి అగ్ని ప్రమాదాలకు గురైంది.ఇలా మంటల ధాటికి అడవులను కోల్పోయిన రాష్ట్రాల్లో ఏపీ తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణలోనూ 3,983.28 కిలోమీటర్ల మేర అడవులు మంటలకు గురయ్యాయి. అత్యధిక విస్తీర్ణం ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ 101.69 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం కోల్పోవడం విస్మయం కలిగించే అంశం.ఏపీలో అడవుల విస్తీర్ణం ఇలామొత్తం అటవీ విస్తీర్ణం 30,084.96చ.కి.మీగుంటూరులో అత్యల్పంగా 13.34చ.కి.మీరాష్ట్రంలో దట్టమైన అడవులు 1,995.71 చ.కి.మీఅల్లూరి జిల్లాలో అత్యధికంగా 6,917.32 చ.కి.మీఅల్లూరి జిల్లాలో అత్యధికంగా దట్టమైన అడవులు 1,183.18 చ.కి.మీరాష్ట్రంలో మధ్యస్థ అడవులు 13,725.75 చ.కి.మీ -
ప్రపంచ బ్యాంకు రిపోర్ట్‌లో మంచి స్కోర్ రావాలంటే కష్టమే..
వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితుల ఆధారంగా ప్రపంచ బ్యాంకు రూపొందించే బీ–రెడీ రిపోర్ట్(Report)లో మంచి స్కోరు దక్కించుకోవాలంటే భారత్‌కి కాస్త సవాలుతో కూడుకున్న వ్యవహారమేనని మేధావుల సంఘం జీటీఆర్ఐ ఒక నివేదికలో పేర్కొంది. బిజినెస్ ఎంట్రీ, కార్మిక చట్టాలు, అంతర్జాతీయ వాణిజ్యం తదితర అంశాల విషయంలో ప్రపంచ బ్యాంకు(World Bank) అంచనాలకు భారత్ దూరంగా ఉందని వివరించింది.ఈ నేపథ్యంలో బీ–రెడీలో (బిజినెస్ రెడీ) చోటు కోసం భారత్, ప్రధానంగా దేశీయంగా సంస్కరణలతో పాటు అంతర్జాతీయంగా అమలవుతున్న ఉత్తమ విధానాలను కూడా అధ్యయనం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) తెలిపింది. సాధారణంగా డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ పేరిట వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితులపై ప్రపంచ బ్యాంక్ గ్రూప్ .. ర్యాంకింగ్‌లు ఇస్తూ వస్తోంది. కానీ, దీని రూపకల్పనలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో 2020 నుంచి దాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దాని స్థానంలో కొత్త విధానాలతో బీ–రెడీ రిపోర్ట్‌ను రూపొందిస్తోంది. వ్యాపారాల విషయంలో అవరోధాలు ఈ రిపోర్ట్‌లో ప్రధాన అంశాలుగా ఉంటాయి.ఇదీ చదవండి: రూ.15,100 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించలేదు!బీ-రెడీ నివేదిక ప్రపంచ బ్యాంకు కొత్త ఫ్లాగ్ షిప్ రిపోర్ట్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో వ్యాపార, పెట్టుబడి వాతావరణాన్ని అంచనా వేస్తోంది. ఇది గతంలో ఉన్న ‘డూయింగ్ బిజినెస్ ఇండెక్స్’ను భర్తీ చేస్తుంది. దేశంలోని వ్యాపార అనుకూలతలు, కార్మిక నిబంధనలు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి ఎన్నో అంశాలను పరిగణిస్తుంది. బీ-రెడీ ఫ్రేమ్‌వర్క్‌లో చేరడానికి భారత్ సిద్ధమవుతుంది. అయితే ఇందులో మంచి స్కోర్ సంపాదించడం కొంత కష్టమని జీటీఆర్ఐ తెలిపింది. భారత్ చాలా రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ, డిజిటల్ ఇంటిగ్రేషన్, కస్టమ్స్(Customs) చెల్లింపుల్లో ఆలస్యం, కొన్ని విభాగాల్లో స్థిరమైన నిర్ణయాలు అమలు చేయడంలేదనే వాదనలున్నట్లు హైలైట్ చేసింది. -
జొమాటో చరిత్రలోనే తొలిసారి.. ఒక్కడే రూ.5 లక్షల బిల్లు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' (Swiggy) 2024కు సంబంధించిన యాన్యువల్ డేటా విడుదల చేసిన తరువాత 'జొమాటో' (Zomato) కూడా వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఫుడ్ 'బిర్యానీ' అని తేల్చి చెప్పింది. అయితే ఒక్క వ్యక్తి మాత్రం ఒక రెస్టారెంట్లో రూ. 5 లక్షల కంటే ఎక్కువ బిల్ చెల్లించినట్లు సమాచారం.2024లో జొమాటో ద్వారా 9 కోట్ల కంటే ఎక్కువ బిర్యానీ ఆర్డర్లు చేసినట్లు సమాచారం. అంతే సెకనుకు మూడు బిర్యానీల కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా ఎక్కువమంది ఆర్డర్ చేసుకున్న ఫుడ్‌గా బిర్యానీ రెకార్డ్ క్రియేట్ చేసింది. అయితే స్విగ్గీలో రైస్ డిష్ అత్యధికంగా ఆర్డర్ చేయబడిన ఆహారం అని తెలుస్తోంది.బిర్యానీ తరువాత ఎక్కువగా ఆర్డర్ చేయబడిన ఆహార పదార్థాల జాబితాలో పిజ్జా రెండవ స్థానంలో ఉంది. 2024లో జొమాటో ఏకంగా 5 కోట్ల కంటే ఎక్కువ పిజ్జాలను డెలివరీ చేసింది. ఫుడ్ విషయం పక్కన పెడితే 77,76,725 కప్పుల 'టీ', 74,32,856 కప్పుల కాఫీ ఆర్డర్లను జొమాటో స్వీకరించింది.అగ్రస్థానములో ఢిల్లీజొమాటో ఆఫర్లతో, ఢిల్లీ నివాసితులు తమ భోజన ఖర్చులపై ఏకంగా రూ. 195 కోట్లను ఆదా చేసినట్లు జొమాటో వెల్లడించింది. ఆ తరువాత జాబితాలో బెంగళూరు, ముంబై వంటివి ఉన్నాయి. ఈ సంవత్సరం భారతీయులు జనవరి 1 నుంచి డిసెంబర్ 6 మధ్య 1 కోటి కంటే ఎక్కువ టేబుల్లను రిజర్వ్ చేసుకోవడానికి జొమాటోను ఉపయోగించారు. ఇందులో ఎక్కువగా ఫాదర్స్ డే రోజు రిజర్వ్ చేసుకున్నారు.ఒకే వ్యక్తి రూ.5.13 లక్షల బిల్లుఒక్కసారికి మహా అయితే ఓ వెయ్యి లేదా ఫ్యామిలీతో కలిసి వెళ్తే.. ఒక పది వేలు ఖర్చు అవుతుంది అనుకుందాం. కానీ బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఒక రెస్టారంట్లో ఏకంగా రూ. 5.13 లక్షలు బిల్ చెల్లించినట్లు జొమాటో వెల్లడించింది. డైనింగ్ సేవల్లో సింగిల్ బిల్లు ఇంత చెల్లించడం జొమాటో చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
8 నెలలు..8 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ రాబడులు తగ్గిపోతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు ముగిసే నాటికి (నవంబర్ 30, 2024 వరకు) అన్ని రకాల రాబడులు కలిపి రూ.1,41,178 కోట్లు వచ్చినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడుల కింద అంచనా వేసిన రూ.2.74 లక్షల కోట్లలో ఇది 51.51 శాతం కావడం గమనార్హం.కాగా గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో నవంబర్ నెల ముగిసేసరికి రూ.1,49,316.41 కోట్లు రావడం గమనార్హం. గత ఏడాది మొత్తం అంచనాల్లో ఇది 57.46 శాతం కాగా, ప్రస్తుత 8 నెలల కాలంలో రూ.8 వేల కోట్ల మేర రాబడులు తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారీగా తగ్గిన పన్నేతర ఆదాయంరాష్ట్ర ప్రభుత్వ ఆదాయ రాబడులకు సంబంధించిన కీలకమైన పద్దుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా పన్నేతర ఆదాయంలో భారీగా క్షీణత నమోదైంది. ఇసుకతో పాటు ఇతర ఖనిజాల మైనింగ్, యూజర్ చార్జీలు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సమకూరే ఆదాయాన్ని పన్నేతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఈ పద్దు కింద 2023–24లో నవంబర్ నెల ముగిసే సమయానికి రూ.19,524.69 కోట్లు సమకూరింది. అదే ప్రస్తుత సంవత్సరంలో మాత్రం కేవలం రూ. 5,217.26 కోట్లు మాత్రమే వచ్చింది. వాస్తవానికి 2024–25లో రూ.35,208 కోట్ల పన్నేతర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ అందులో దాదాపు 15 శాతం మాత్రమే సమకూరడం గమనార్హం. మరోవైపు ఎక్సైజ్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో 8 నెలల్లో రూ.14,607 కోట్లు రాగా, ఈ ఏడాదిలో రూ.2 వేల కోట్లు తక్కువగా రూ.12,364 కోట్లు వచ్చింది. అయితే జీఎస్టీ పద్దు కింద గత ఏడాది కంటే రూ.3 వేల కోట్లు, అమ్మకపు పన్ను కింద రూ.1.500 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో రూ.3 వేల కోట్లు అధికంగా సమకూరాయి. గత ఏడాదితో పోలిస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.200 కోట్ల మేర ఆదాయం పెరిగింది. అప్పులు కూడా గత ఏడాది కంటే స్వల్పంగా తగ్గినా బడ్జెట్ అంచనాల్లో 72 శాతం ఇప్పటికే సమకూరడం గమనార్హం.నాలుగు నెలల్లో రాబడి వస్తుందా?ప్రస్తుత లెక్కల ప్రకారం నవంబర్ తర్వాత మిగిలిన నాలుగు నెలల్లో బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.1.30 లక్షల కోట్లకు పైగా రాబడులు ప్రభుత్వ ఖజానాకు సమకూరాల్సి ఉంది. అయితే గత ఏడాది చివరి నాలుగు నెలల్లో రూ.70 వేల కోట్లకు పైగా మాత్రమే వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించకపోతే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి బడ్జెట్ అంచనాలకు, రాబడులకు భారీ లోటు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి నాలుగు నెలల్లో రూ.80 వేల కోట్ల మేర రాబడులు వస్తాయని ఆశించినా, కనీసం మరో రూ.20–30వేల కోట్లు ఇతర మార్గాల్లో సమకూర్చుకోకపోతే బడ్జెట్ లెక్కలు తప్పుతాయని ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్ఆర్ఎస్, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం, భూముల అమ్మకాలు, మైనింగ్ ఆదాయం పెంపు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడం లాంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని వారు సూచిస్తున్నారు. -
తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ స్పందించారు. ఈ ఏడాదే కాదు, ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణంతో సూసైడ్ చేసుకుంటున్నారని డీజీపీ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులు, ఫ్యామిలీ సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కొన్ని కేసుల్లో పని ఒత్తిడి వలన కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని డీజీపీ వెల్లడించారు. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అల్లు అర్జున్ కేసు కోర్టు పరిధిలో ఉందని.. సమగ్ర విచారణ జరుగుతుందని డీజీపీ పేర్కొన్నారు.క్రైమ్ రేట్‌పై వార్షిక నివేదికను విడుదల చేస్తూ.. ఈ ఏడాది కేసుల నమోదు పెరిగిందని డీజీపీ తెలిపారు. డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే పోలీసు శాఖ లక్ష్యమని.. మోసాలకు పాల్పడుతున్న 1800 వెబ్సైట్ యూఆర్ఎల్లను బ్లాక్ చేసినట్లు ఆయన చెప్పారు. కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్న డీజీపీ.. డిజిటల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు.ఈ ఏడాది 33,618 సైబర్ క్రైమ్ కేసులను నమోదయ్యాయి.703 చోరీ, 58 దోపిడీ, 1,525 కిడ్నాప్, 856 హత్య, 2,945 లైంగిక దాడుల కేసులు నమోదు చేశాం. డయల్ 100కు 16,92,173 పిర్యాదులు వచ్చాయి. కొత్త చట్టం వచ్చిన తర్వాత 85,190 కేసులను నమోదు చేశాం. కొత్త చట్టం ప్రకారం సైబరాబాద్ పరిధిలో 15,360, హైదరాబాద్‌లో 10,501, రాచకొండలో 10,251 కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైం కేసుల్లో రూ.180 కోట్లను తిరిగి బాధితులకు అప్పగించాం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 142.95 కోట్లు మాద్రకద్రవ్యాలను సీజ్ చేశాం. డ్రగ్స్ కేసుల్లో 4,682 మంది నిందితులను అరెస్టు చేశాం’’ అని డీజీపీ జితేందర్ వివరించారు.‘‘ఇల్లిగల్ ప్రైవేట్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాపై ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేశాం. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో సోషల్ మీడియా ప్రచారాలపై దర్యాప్తు చేస్తాం.. కేసులు పోలీసులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు.. ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికి సంబంధం ఉండదు’’ అని డీజీపీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేరాల్లో మరో కోణం! -
నేరాలు.. ఘోరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు అమాంతం పెరిగిపోయాయి. హత్యలు, దోపిడీలు, దాడులు, మహిళలపై దారుణాలు, సైబర్ నేరాలు విపరీతమయ్యాయి. శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ఈ విషయం సాక్షాత్తూ పోలీసుల శాంతిభద్రతల వార్షిక నివేదికలో వెల్లడైంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు శనివారం శాంతిభద్రతల వార్షిక నివేదిక–2024ను విడుదల చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాం.. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు, ఇతర పరిజ్ఞానం సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ చెప్పారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నట్టుగానే రాష్ట్రంలోనూ పెరిగాయన్నారు. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ ద్వారా పటిష్ట కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. ఏపీ పోలీస్ అకాడమీ(అప్పా), గ్రేహౌండ్స్ ప్రధాన కేంద్రాలను త్వరలో నెలకొల్పుతామని డీజీపీ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఐపీఎస్ అధికారిగా హడావుడి చేసిన రిటైర్డ్ సైనికోద్యోగిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. -
ప్రతి 18మందిలో ఒకరికి షుగర్
రాష్ట్రంలో జీవనశైలి జబ్బులు ప్రమాద ఘంటిక మోగిస్తున్నాయి. ప్రతి 18 మందిలో ఒకరు షుగర్‌తో బాధపడుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించే నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) పోర్టల్‌లోని నవంబరు నెలాఖరు నాటి సమాచారం ఆధారంగా.. రాష్ట్రంలో 3.85 కోట్ల మందికి వైద్యశాఖ స్క్రీనింగ్ చేయగా.. 20.92 లక్షల మందిలో షుగర్ నిర్ధారణ అయినట్లు తేలింది. దేశవ్యాప్తంగా 32.33 కోట్ల మందికి గాను 2.96 కోట్ల మందిలో ఈ సమస్య ఉంది. ఇందులో అత్యధికంగా 47.92 లక్షల మంది కేరళలో ఉన్నారు. అనంతరం.. మహారాష్ట్రలో 40.03 లక్షలు, కర్ణాటక 28.83 లక్షలు, తెలంగాణలో 24.52 లక్షల మంది బాధితులున్నారు. ఈ లెక్కన గమనిస్తే దేశంలో సగటున 11 మందిలో ఒకరు షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. – సాక్షి, అమరావతితీసుకోవాల్సిన జాగ్రత్తలు..⇒ ధూమపానం, మద్యపానం వంటి వాటిని విడనాడాలి. ⇒ తక్కువ కేలరీలున్న ఆహార పదార్థాలు తీసుకుంటూ, బరువు తగ్గించుకోవాలి. ⇒ శరీరంలో కొవ్వు నియంత్రణకు తోడ్పడే జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒ ఆహారంలో జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు. పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ⇒ రోజూ కనీసం 30 నిమిషాల నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు విధిగా చేయాలి. క్రమం తప్పని వ్యాయామం వల్ల శరీర కణజాలంలోని ఇన్సులిన్ గ్రాహకాల సెన్సిటివిటీ పెరుగుతుంది. ⇒ తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం మంచిది. నియంత్రణ మన చేతుల్లోనే.. మధుమేహం రెండు రకాలు. టైప్–1.. ఇది వంశపారంపర్యంగా వస్తుంది. టైప్–2 ఇది అనారోగ్యకర జీవనశైలితో వస్తుంది. టైప్–1ను ఎవరూ ఆపలేరు. కానీ, టైప్–2 రాకుండా నియంత్రించడం మన చేతుల్లోనే ఉంది. చిప్స్, నూడిల్స్ వంటి అల్ట్రాప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం.. కదలికల్లేని యాంత్రిక జీవనంతో పాఠశాల విద్యార్థుల్లోనూ టైప్–2 మధుమేహం వస్తోంది. ఈ అలవాట్లను పూర్తిగా నియంత్రించాలి. వ్యాయామాలు చేయాలి.మధుమేహ బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ విషయంలో నిర్లక్ష్యంచేస్తే రెటినోపతి, కిడ్నీల వైఫల్యానికి కారణమయ్యే నెఫ్రోపతి, న్యూరోపతి, రక్తనాళాలకు సంబంధించిన పెరిఫెరల్ వాస్క్యులర్ వ్యాధుల వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. – డాక్టర్ ఎం. నాగచక్రవర్తి, జనరల్ మెడిసిన్ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, మంగళగిరి ఎయిమ్స్ -
గత ఆర్థిక ఏడాదిలో పండ్ల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: రైతుకు వెన్నుదన్నుగా నిలిస్తే పంటల దిగుబడి ఎంతగా పెరుగుతుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరూపించింది. ధాన్యం, వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటలకూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యతనిచి్చ, అడుగడుగునా రైతుకు అండదండగా నిలిచింది. దీంతో రాష్ట్రంలో పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. పండ్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో తలసరి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు, దేశంలో తలసరి పండ్లు, కూరగాయల ఉత్పత్తిపై నివేదికను విడుదల చేసింది. గత ఆరి్థక ఏడాదిలో దేశంలో మొత్తం తలసరి పండ్ల ఉత్పత్తి 80 కిలోలు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 333 కిలోలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే 2023–24లో ఆంధ్రప్రదేశ్ తలసరి కూరగాయల ఉత్పత్తి 119 కిలోలుందని తెలిపింది. గత దశాబ్ద కాలంలో దేశంలో తలసరి పండ్ల ఉత్పత్తి 7 కిలోలు, కూరగాయల ఉత్పత్తి 12 కిలోలు పెరిగినట్లు నివేదిక తెలిపింది. 2013–14లో దేశంలో తలసరి పండ్ల ఉత్పత్తి 73 కిలోలుండగా 2023–24లో 80 కిలోలకు, కూరగాయల ఉత్పత్తి 135 కిలోల నుంచి 147 కిలోలకు పెరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో తలసరి పండ్లు, కూరగాయల ఉత్పత్తి గత దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని నివేదిక తెలిపింది. దేశంలో మొత్తం ఒక వ్యక్తి సంవత్సరానికి పండ్లు, కూరగాయలు 146 కిలోలు తీసుకోవాలని సాధారణ సిపార్సు ఉందని నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఒక వ్యక్తికి సంవత్సరానికి పండ్లు, కూరయలు కలిపి 227 కిలోలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే పంట కోత అనంతరం, నిల్వ, గ్రేడింగ్, రవాణా, ప్యాకేజింగ్‌లో 30 నుంచి 35 శాతం తగ్గుతోందని, ఇది మొత్తం వినియోగంపై ప్రభావం చూపుతోందని నివేదిక తెలిపింది. -
మరింత పెరగనున్న బంగారం కొనుగోళ్లు: సంచలన రిపోర్ట్
విలువ పరంగా దేశీయ బంగారు ఆభరణాల వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) కూడా పటిష్టంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ- ఇక్రా పేర్కొంది. విలువ రూపంలో వినియోగం 14 శాతం నుంచి 18 శాతం వృద్ధి చెందుతుందని ఇక్రా నివేదిక తెలిపింది. 2023–24లో ఈ వృద్ధి రేటు 18 శాతంగా నివేదిక తెలిపింది.ఇక్రా నివేదిక ప్రకారం, బంగారం ధరలు అస్థిరంగా ఉన్నప్పటికీ వినియోగదారుల డిమాండ్ తగ్గలేదు. పండుగ నేపథ్యంలో.. ఇటీవలి నెలల్లో మరింత పెరిగిందని తెలిసింది. 2024 జూలైలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో 9% మేర (15 నుంచి 6 శాతానికి) దిగుమతుల సుంకం తగ్గడం, బంగారం ధరల్లో తాత్కాలిక ధరల కట్టడికి దారితీసిందని ఇది రెండవ త్రైమాసికంలో భారీ కొనుగోళ్లకు దారితీసిందని నివేదిక వివరించింది. ప్రత్యేకించి ఆభరణాలతోపాటు, నాణేలు, కడ్డీల కొనుగోళ్లూ పెరిగా యని వివరించింది. పండుగల సీజన్ కూడా పసిడి డిమాండ్‌కు కలిసి వచ్చిన అంశంగా పేర్కొంది. పెరుగుతున్న దిగుమతులు..భారత్ బంగారం దిగుమతులు సైతం భారీగా పెరుగుతుండడం గమనార్హం. భారత్ బంగారం దిగుమతులలో 40 శాతంతో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటా కలిగిఉంది. యూఏఈ వాటా 16% కాగా, దక్షిణాఫ్రికా వాటా 10%గా ఉంది. దేశంలోకి వచ్చీ – పోయే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్ అకౌంట్‌పై పసిడి కొనుగోళ్ల (దిగుమతుల) ప్రభావం కనబడుతోంది.2023–24లో భారత్ పసిడి దిగుమతుల విలువ 30% పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. యునైటెట్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) నుంచి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో భారత్ తయారీదారులు, వ్యాపారులు రాయితీ రేటుతో 160 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడనికి ప్రభుత్వం నోటిఫై చేసింది. భారతదేశం - యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 140 టన్నులు ఈ తరహాలో నోటిఫై అయ్యింది.ఎకానమీకి సవాలు: జీటీఆర్ఐదేశంలోకి భారీగా పసిడి దిగుమతులు వాణిజ్య సమతౌల్యకు, కరెంట్ అకౌంట్ లోటుకట్టు తప్పడానికి.. తద్వారా ఎకానమీ పురోగతిని దెబ్బతీయడానికి దారితీసే అంశమని ఆర్థిక విశ్లేషణా సంస్థ–జీటీఆర్ఏ ఒక నివేదికలో పేర్కొంది. పసిడి దిగుమతుల విలువ పెరగడం ఆందోళనకరమైన విషయమని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం నవంబర్‌లో పసిడి దిగుమతుల విలువ ఆల్‌టైమ్ హై 14.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2023 నవంబర్‌లో ఈ విలువ 3.5 బిలియన్ డాలర్లు. -
పంట ‘లాస్’ చాలా ఎక్కువే..
సాక్షి, అమరావతి: మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ వంటి సౌకర్యాల కొరత కారణంగా దేశంలో పంట కోత అనంతరం భారీ నష్టం కలుగుతోంది. ఈ నష్టం విలువ 2022లో ఏకంగా సుమారు రూ.1,57,787 కోట్లుగా నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పశు ఉత్పత్తుల్లో ఎక్కువ నష్టం కలుగుతున్నట్లు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించింది. అత్యధికంగా పశు ఉత్పత్తుల్లో నష్టం వస్తుండగా, ఆ తరువాత పండ్లు, కూరగాయలు ఎక్కువగా పాడైపోయి నష్టం వాటిల్లుతున్నట్లు నివేదిక పేర్కొంది. తృణ ధాన్యాల ఏడాది సగటు ఉత్పత్తి 281.28 మిలియన్ టన్నులు ఉండగా.. కోత అనంతరం 12.49 మిలియన్ టన్నులు నష్టపోతున్నట్లు చెప్పింది. అదే విధంగా కూరగాయల సగటు ఉత్పత్తి 164.74 మిలియన్ టన్నులకుగాను 11.97 మిలియన్ టన్నులు వృథా అవుతున్నట్లు వివరించింది. అత్యధికంగా పశువుల ఉత్పత్తుల (డెయిరీ, మాంసం, ఫిష్ తదితరమైనవి) నష్టం విలువ రూ. 29,871 కోట్లు అని పేర్కొంది. ఈ నష్టాలను తగ్గించేందుకు అవసరమైన మౌలిక, ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. తద్వారా పంటల విలువను పెంచడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ – సంరక్షణ సామర్ధ్యాల విస్తరణవిస్తరణ, ఆపరేషన్ గ్రీన్స్ సదుపాయాల కల్పనకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో క్రెడిట్ లింక్ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపింది. ఆహార ప్రాసెసింగ్, సంరక్షణకు, హార్వెస్ట్ నష్టాలను తగ్గించడానికి కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.మౌలిక సదుపాయాల కల్పనకు పీఎంకేఎస్‌వై కింద 1,187 ప్రాజెక్ట్‌లు ఆమోదించినట్లు వివరించింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నిధి ద్వారా శీతల గిడ్డంగులు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, కమ్యూనిటీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు పేర్కొంది. వీటి ద్వారా పంట వృధాను తగ్గించడం, విలువ పెంచడం లక్ష్యమని తెలిపింది. -
నెలకు రూ.20 వేల లోపు ఆదాయం ఉంటే నిరుపేదలు
నిరు పేదలు, మధ్య తరగతి ప్రజలు అంటే ఎవరు? నెలవారీ ఆదాయం ఎంతుంటే మధ్య తరగతి? మధ్య తరగతిలో ఎన్ని వర్గాలు? నిరు పేదల ఆదాయమెంత? వీటిపై ప్రపంచ బ్యాంకు స్పష్టతనిచి్చంది. ప్రపంచ దేశాల్లో మార్కెట్ ఆధారిత ఆరి్థక వ్యవస్థలను అధ్యయనం చేసే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ)తో కలిసి ప్రపంచ బ్యాంక్ అధ్యయనం చేసింది. ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వాల స్థిరమైన ఆర్థిక వృద్దిని ప్రోత్సహించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు ఓఈసీడీ 37 దేశాలతో కలిసి పనిచేస్తోంది.ప్రపంచ బ్యాంకు, ఓఈసీడీ కలిసి ప్రజల జీవన ప్రమాణాలపై అధ్యయనం చేశాయి. మారుతున్న సామాజిక, ఆరి్థక స్థితిగతులను అనుసరించి జరిపిన ఈ అధ్యయనం నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలు గతంతో పోలిస్తే మెరుగుపడుతున్నట్టుగా ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ప్రజల ఆదాయ ప్రమాణాలు పెరిగినట్టు ప్రకటించింది. ఈ అధ్యయనంలో అల్పాదాయ, మధ్య తరగతి ప్రజల ఆరి్థక స్థితిగతులపై లోతైన పరిశీలన జరిపింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులను బట్టి మూడు వర్గాలుగా విభజించింది. ఇక నుంచి నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష లోపు ఆదాయం ఆర్జించే వారిని మధ్య తరగతిగా పరిగణించాలని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. రూ.లక్ష కు పైబడి ఆదాయం ఆర్జించే వారిని ఎగువ మధ్యతరగతి వర్గీయులుగా పరిగణించాలని పేర్కొంది. రూ.20 వేల నుంచి రూ.40 వేల లోపు ఆర్జించే వారిని దిగువ మధ్య తరగతిగా గుర్తించాలని ప్రకటించింది. ఇక రూ.20 వేల లోపు ఆదాయం ఉన్న వారిని నిరుపేద వర్గానికి చెందిన వారిగా పరిగణించాలని పేర్కొంది. గతంలోకంటే మెరుగైన ఆర్థి క పరిస్థితిగతంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల లోపు ఉన్న వారిని మధ్య తరగతిగా, రూ.40 వేల నుంచి రూ.60 వేల లోపు ఉన్న వారిని ఎగువ మధ్యతరగతిగా, రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు ఉన్న వారిని దిగువ మధ్యతరగతిగా పరిగణించేవారు. రూ.10 వేలకు తక్కువగా ఆర్జించే వారిని నిరుపేదలు, అల్పాదాయ వర్గాలుగా గుర్తించే వారు. ప్రపంచ బ్యాంకు తాజా అధ్యయనం ప్రకారం అల్పాదాయ, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు గతంతో పోలిస్తే కొంత మెరుగు పడినట్టు తేలింది. జాతీయ తలసరి ఆదాయాన్ని బట్టి అంచనా.. జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే 75 శాతం నుంచి 200 శాతం ఆదాయం ఆర్జిస్తున్న వారిని మధ్య తరగతి ప్రజలుగా, 200 శాతం కంటే ఎక్కువ ఆర్జించే వారిని ఉన్నత వర్గాలుగా, 75% కంటే తక్కువ ఆదాయం ఆర్జించే వారిని అల్పాదాయ వర్గాలుగా ప్రపంచ బ్యాంకు విభజించింది. 75 శాతం నుంచి 50 శాతం ఆదాయం పొందే వారిని నిరుపేదలే అయినప్పటికీ, తక్కువ ఆదాయం (నాన్–పూర్ లోయర్ ఇన్కమ్) ఆర్జించే వర్గాలుగా పేర్కొంది. 50 శాతంకంటే తక్కువ ఆర్జించే వారిని మాత్రం నిరుపేదలుగా అభివర్ణించాలని పేర్కొంది. అదే విధంగా స్థూల జాతీయ ఆదాయం సగటున రూ.97,192 (1145 డాలర్లు) ఆర్జన కలిగిన దేశాలను తక్కువ ఆదాయ దేశాలుగా, రూ.3,82,917 (1146–4515 డాలర్లు) ఆర్జన కలిగిన దేశాలను దిగువ మధ్య ఆదాయ దేశాలుగా, రూ.11,87,764 (4516–14వేల డాలర్లు) ఆర్జించే దేశాలను ఉన్నత మధ్య ఆదాయ దేశాలుగా అభివరి్ణంచింది. భారత దేశం దిగువ మధ్య ఆదాయ ఆర్జన కలిగిన దేశాల జాబితాలో ఉంది. -
సేవలరంగమే టాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో సేవల రంగం వాటానే సింహ భాగమని తేలింది. 2023–24లో జీఎస్డీపీ రూ.15,01,981 కోట్లు కాగా, ఇందులో సేవల రంగం వాటా రూ.9,23,490 కోట్లుగా నమోదయింది. అంటే మొత్తం స్థూల ఉత్పత్తిలో 60 శాతం సేవల రంగం నుంచే నమోదైందన్న మాట. రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి స్థూల ఉత్పత్తిలో సేవల రంగం వాటా రూ.2,86,010 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల స్థూల ఉత్పత్తిని ప్రస్తు త ధరల ఆధారంగా నిర్ణయించగా..ఈ స్థూల ఉత్పత్తిలో ఏ రంగం ఏ మేరకు వాటా నమోదు చేసిందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన ‘స్టాటిస్టిటక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్–2024’నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం 2014– 15లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.5,05,848 కోట్లు కాగా, 2023–24కి అది రూ.15,01,981 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది (2022–23)లో రూ.13,11,823 కోట్లు ఉన్న జీఎస్డీపీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.9 లక్షల కోట్లు పెరగడం గమనార్హం. రెట్టింపు కంటే ఎక్కువగా వ్యవసాయ రంగం వృద్ధి ఆర్బీఐ నివేదిక ప్రకారం జీఎస్డీపీలో సేవల రంగం తర్వాతి స్థానంలో పరిశ్రమల రంగం నిలిచింది. 2023–24లో పరిశ్రమల రంగ స్థూల ఉత్పత్తి రూ.2,05,399 కోట్లుగా నమోదయ్యింది. 2014–15లో ఇది రూ.88,792 మాత్రమే కావడం గమనార్హం. ఇక, తయారీ, నిర్మాణ రంగాలు కూడా గత పదేళ్ల స్థూల ఉత్పత్తిలో చెప్పుకోదగిన వృద్ధిని నమోదు చేశాయి. తయారీ రంగం స్థూల ఉత్పత్తి 2014–15లో రూ.54,533 కోట్లు ఉండగా, 2023–24 నాటికి రూ.1,23,325 కోట్లకు చేరింది. నిర్మాణ రంగం వాటా రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి రూ. 27,786 కోట్లు ఉంటే.. 2023–24 నాటికి రూ.71,708 కోట్లకు చేరింది. ఇలావుండగా వ్యవసాయ రంగం పదేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగానే వృద్ధిని నమోదు చేయడం విశేషం. 2014–15లో జీఎస్డీపీలో వ్యవసాయ రంగం వాటా రూ.41,706 కోట్లు ఉండగా, 2023–24 నాటికి రూ.1,02,359 కోట్లుగా నమోదయింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గణనీయంగానే వృద్ధి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రస్తుత ధరలకు అనుగుణంగా తెలంగాణ జీఎస్డీపీ, వివిధ రంగాల వాటాల వృద్ధి బాగానే ఉందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. రూ.5 లక్షల కోట్లకు పైగా ఉన్న తెలంగాణ స్థూల ఉత్పత్తి పదేళ్ల తర్వాత రూ.15 లక్షల కోట్లు దాటింది. అంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళనాడు రూ.10 లక్షల కోట్ల నుంచి పదేళ్లలో రూ. 27 లక్షల కోట్లకు స్థూల ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్ప త్తి రూ.5.24 లక్షల కోట్ల నుంచి రూ.14.39 లక్ష ల కోట్లకు పెరిగింది. కర్ణాటక జీఎస్డీపీ 2014– 15లో రూ.9.13 లక్షల కోట్లు ఉండగా, 2023– 24 నాటికి రూ.25 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 60 శాతం వాటా నమోదు2023–24లో జీఎస్డీపీ రూ.15,01,981 కోట్లుఇందులో సేవల రంగం వాటా 9,23,490 కోట్ల రూపాయలు2014–15లో ఇది రూ.2.86 లక్షల కోట్లే సేవల రంగం తర్వాతి స్థానంలో పారిశ్రామిక రంగం.. ఆర్బీఐ ‘స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్–2024’నివేదిక వెల్లడి -
సోషల్ మేనియా!
సాక్షి, అమరావతి: ఐటీ ఉద్యోగి ప్రవీణ్‌కుమార్ అందరితో ఇట్టే కలిసిపోతాడు. స్నేహితులు ఎక్కువ. అతను ఎక్కడుంటే అక్కడ సందడే. ఆఫీసులో బాస్ నుంచి గేటు వద్ద గార్డు వరకు ప్రవీణ్‌ను ఇష్టపడని వారు ఉండరు. ఏడాది కాలంగా అతను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారాడు. సామాజిక, రాజకీయ అంశాలపై అతను పెడుతున్న పోస్టులకు మెచ్చుకొనే వారికంటే విమర్శించే వారే ఎక్కువయ్యారు. తనని తక్కువ చేసి కామెంట్ చేసే వారిలో రోజూ తనతో తిరిగే స్నేహితులు, కొలీగ్స్ సైతం ఉండడం చూసి విస్తుపోయాడు. ప్రస్తుతం దేశంలో 65 శాతం యువత పరిస్థితి ఇదే అని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) తాజా అధ్యయనంలో తేలింది.రెండు వైపులా పదునున్న సోషల్ మీడియా ఇప్పుడు భారతీయ యువత మెడకు చుట్టుకుంటోంది. ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్, ఫేస్బుక్ వంటివి కోట్లాది విద్యార్థుల రోజువారీ జీవితంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు 400 మిలియన్ల యువత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నట్టు సర్వేలో తేలింది. టీనేజర్లు ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో 3 గంటల కంటే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దేశంలో 2025 చివరికి 72% మంది సోషల్ మీడియా వినియోగదారులుగా ఉంటారని అంచనా. ప్రపంచంలోని చాలా దేశాల్లో యువత కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఉపయోగపడుతున్న ఈ ఫ్లాట్‌ఫారాలు.. భారత్‌లో మాత్రం మానసిక ఆరోగ్యం, విద్యలో వెనుకబాటు, భావోద్వేగాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తూ శత్రువులను పెంచుతున్నట్టు గుర్తించారు.బహిరంగ చర్చ మేలు చేస్తుందిపరిస్థితి ఇలాగే కొనసాగితే నేర్చుకునే సామర్థ్యం, శ్రమించే బలం ఉన్న భారతీయ యువత నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల మధ్య బహిరంగ చర్చలు జరగాలని, ఇది సోషల్ మీడియా ప్రతికూల ప్రభావాలను నివారిస్తుందని చెబుతున్నారు. మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలు చేయడం ద్వారా సోషల్ మీడియా సపోర్ట్ గ్రూపుల్లో యాక్టివ్‌గా ఉన్న విద్యార్థుల్లో 25 శాతం మంది ఆ వ్యసనం నుంచి బయటపడినట్టు గుర్తించారు.52%మంది సైబర్ మోసాలకు బలివిద్యార్థులందరికీ విద్యలో డిజిటల్ అక్షరాస్యతను తప్పనిసరి చేయడం చాలా అవసరమని, చాలామంది భారతీయ విద్యార్థులకు ఆన్లైన్ స్పేస్‌ను సురక్షితంగా నావిగేట్ చేసే నైపుణ్యాలు లేవని అధ్యయనంలో తేల్చారు. దీంతో తప్పుడు సమాచారం, సైబర్ బెదిరింపు, మోసాలకు గురవుతున్నారని గుర్తించారు. సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం కేవలం 25 శాతం విద్యార్థులు మాత్రమే ఆన్లైన్ గోప్యత సెట్టింగ్‌లను అర్థం చేసుకుంటారని వెల్లడైంది. చాలామంది వ్యక్తిగత సమాచారాన్ని ఎలాంటి గోప్యతా లేకుండా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని, ఇలాంటి వారిలో 52 శాతం మంది సులభంగా సైబర్ మోసాల బారిన పడుతున్నారని ఐసీఎస్ఎస్ఆర్ సర్వేలో తేలింది. 2023లో ఒక అధ్యయనం ప్రకారం డిజిటల్ లిటరసీపై శిక్షణ పొందిన విద్యార్థుల్లో 78 శాతం మంది సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. పాఠ్యాంశాల్లో డిజిటల్ మీడియా, మానసిక ఆరోగ్యంపైనా అవగాహన పెంచే అంశాలను చేర్చడం ద్వారా సమస్యను నివారించవచ్చని చెబుతున్నారు.వ్యసనంలా సోషల్ మీడియానేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) ఇటీవలి నివేదిక ప్రకారం.. » దేశంలోని 27 శాతం టీనేజర్లలో సోషల్ మీడియా డిపెండెన్సీ లక్షణాలను గుర్తించారు.» ఇది ఏకాగ్రత లోపానికి, చెడు వ్యసనాలకు, చదువులో వెనుకబాటుతో పాటు మానసిక అనారోగ్య పరిస్థితులకు దారితీస్తోంది.» ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకోవడం, 30 నిమిషాలకోసారి పోస్టులు, నోటిఫికేషన్లను తనిఖీ చేయడం పరిపాటిగా మారింది. వాటికి అప్డేట్స్ను పోస్ట్ చేయడం, స్క్రోలింగ్ ఫీడ్స్ చూడడంలో బిజీ అయిపోయి పరిసరాలను సైతం మరిచిపోతున్నారని గుర్తించారు.» తమ పోస్టులకు తెలిసిన వారు రిప్లై ఇవ్వకపోయినా కోపం తెచ్చుకుంటున్నారు. ఇది శత్రుత్వానికి దారితీస్తోంది.»అతిగా స్క్రీన్కు అతుక్కుపోవడంతో నిద్ర లేమి రుగ్మతలు ఎదుర్కొంటున్నారు. దేశంలోని 40 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు సోషల్ మీడియాను లేట్ నైట్ వరకు ఉపయోగించడంతో తమకు మంచి నిద్ర, సరైన విశ్రాంతి లభించడంలేదని చెప్పారు.» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) సర్వే ప్రకారం భారతీయ యువకుల్లో 65 శాతం మంది స్నేహితులకు వ్యతిరేకంగా మారినట్టు అంగీకరించారు. ఫోన్ చూడవద్దన్నందుకు 10 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రులను శత్రువులుగా భావిస్తున్నారని గుర్తించారు. పిల్లల స్క్రీన్ టైమ్‌పై కఠినమైన పరిమితులు ఉంటే సోషల్ మీడియాపై ఆధారపడటం 30 శాతం తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. -
దూసుకెళ్తున్న భారత్.. భారీగా పెరిగిన బిలియనీర్లు
భారతదేశం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సంపద సృష్టికి హాట్‌స్పాట్‌గా ఉద్భవించింది. పదేళ్లలో ఇండియాలోని బిలియనీర్ల నికర విలువ దాదాపు మూడు రేట్లు పెరిగి 905.6 బిలియన్లకు చేరింది. దీంతో భారత్ ఇప్పుడు మొత్తం బిలియనీర్ సంపదలో ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో నిలిచినట్లు స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్‌గా పేరుపొందిన 'యూబీఎస్' నివేదికలో వెల్లడించింది.యూబీఎస్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ జాబితాలోకి కొత్తగా 32 మంది చేరారు. దీంతో 153 మంది నుంచి బిలియనీర్ల సంఖ్య 185కు చేరింది. వీరి మొత్తం నికర విలువ ఒక్కసారిగా (905.6 బిలియన్స్) పెరిగింది. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.76 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా 2024లో బిలియనీర్ల సంఖ్య 2682కు చేరింది. అంతకు ముందు సంవత్సరంలో ఈ సంఖ్య 2,544గా ఉంది. నికర విలువ కూడా ఈ ఏడాది 12 ట్రిలియన్ డాలర్ల నుంచి 14 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అమెరికాలో బిలియనీర్ల సంఖ్య 751 నుంచి 835కి పెరిగింది, వారి మొత్తం సంపద 4.6 ట్రిలియన్స్ నుంచి 5.8 ట్రిలియన్లకు పెరిగింది.చైనాలో మాత్రం బిలియనీర్ల సంఖ్య 520 నుంచి 427కి చేరింది. వారి సంపద 1.8 ట్రిలియన్ డాలర్ల నుంచి 1.4 ట్రిలియన్లకు పడిపోయింది. భారత్ విషయానికి వస్తే.. ఇక్కడ బిలియనీర్ల సంఖ్య 153 నుంచి 185కు చేరింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
సంబంధాల్లో నిప్పులు పోస్తున్న స్మార్ట్‌ఫోన్.. సర్వేలో భయంకర నిజాలు
మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వాడకం మానవ వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తోందని.. తల్లిదండ్రులు & పిల్లల మధ్య కూడా దూరాన్ని పెంచేస్తోందని.. వివో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.తల్లిదండ్రులు సగటున రోజుకి.. ఐదు గంటల కంటే ఎక్కువ సమయం.. పిల్లలు నాలుగు గంటలకు పైగా స్మార్ట్ఫోన్లలో గడుపుతున్నారని సర్వేలో వెల్లడైంది. వీరందరూ ఎక్కువగా సోషల్ మీడియా, వినోదం కోసం వీటిని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.స్మార్ట్‌ఫోన్ వాడకం వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తోంది. 66 శాతం మంది తల్లిదండ్రులలో.. 56 శాతం మంది పిల్లలలో అధిక స్మార్ట్‌ఫోన్ వినియోగం కారణంగా వారి వ్యక్తిగత సంబంధాలలో ప్రతికూల మార్పులు వస్తున్నాయని సర్వేలో తేలింది. ఈ మార్పులు వారి మధ్య సంఘర్షణకు కూడా కారణమవుతున్నట్లు తెలిసింది.73 శాతం మంది తల్లిదండ్రులు.. 69 శాతం మంది పిల్లలు తమ మధ్య వివాదానికి కారణం మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగమే అని సర్వేలో తేలింది. స్మార్ట్‌ఫోన్ తల్లిదండ్రులు, పిల్లల జీవితాల్లో అనివార్యమైన భాగంగా మారింది. దీంతో 76 శాతం మంది తల్లిదండ్రులు, 71 శాతం మంది పిల్లలు తమ స్మార్ట్ఫోన్లు లేకుండా జీవించలేరని అంగీకరిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.ఇదీ చదవండి: అందరికీ ఇష్టమైన గేమ్.. ఇప్పుడు నథింగ్ ఫోన్లో64 శాతం మంది పిల్లలు స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోయినట్లు, ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా, వినోద కార్యక్రమాలలో గడుపుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణేలలోనే స్మార్ట్‌ఫోన్ యూజర్లను అధ్యయనం చేసిన తరువాత ఈ విషయాలను వెల్లడించారు. -
మూడేళ్లలో రూ.8.3 లక్షల కోట్లకు క్రీడారంగం!
ఆర్థికాభివృద్ధిలో క్రీడారంగాన్ని కూడా భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం నిర్దిష్ట మోడల్‌ను రూపొందించాలని ఓ నివేదిక సూచించింది. క్రీడల మౌలిక సదుపాయాలు, ఈవెంట్లు, సంబంధిత ఉత్పత్తులు, సర్వీసుల్లో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించేలా విధానాలను తయారు చేయాలని పేర్కొంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, నాంగియా నెక్ట్స్ కలిసి ఈ నివేదికను రూపొందించాయి.ఈ నివేదిక ప్రకారం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ప్రతిభావంతులైన క్రీడాకారులకు తోడ్పాటు అందించేలా, భారీ స్థాయి క్రీడా కార్యక్రమాలకు నిధులు సమకూర్చే ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం తగు ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చని నివేదిక తెలిపింది. ఇంటర్నేషనల్ కోచ్‌లు, న్యూట్రిషనిస్టులు, మానసిక, శారీర శిక్షణ నిపుణులతో సహా అత్యుత్తమ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సీఎస్ఆర్ నిధులను వినియోగించేలా చూడొచ్చని పేర్కొంది. భారత క్రీడారంగం ప్రస్తుతం గణనీయమైన వృద్ధిని సాధించే దశలో ఉందని నివేదిక తెలిపింది. 2020లో దాదాపు 27 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ రంగం వృద్ధి 2027 నాటికి 100 బిలియన్ డాలర్ల(రూ.8.3 లక్షల కోట్లు)కు చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.నివేదికలోని మరిన్ని విశేషాలు..స్పోర్ట్స్ కోచింగ్, మేనేజ్మెంట్ అంశాల్లో నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు నిర్వహించడం, విధానాలను రూపొందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల ద్వారా ఉపాధికి ఊతమిచ్చేలా క్రీడలకు సంబంధించిన అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునివ్వాలి.క్రీడారంగం గణనీయంగా పురోగతి సాధించినప్పటికీ, అథ్లెట్లకు ఆర్థిక భద్రత, మౌలిక సదుపాయాల కొరత వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి.ఆర్థిక సహాయాన్నందించే కార్యక్రమాలను విస్తరించడం, కెరియర్‌పరంగా పరివర్తనకు దోహదపడే పటిష్టమైన విధానాలను రూపొందించడం, సమ్మిళిత సంస్కృతిని పెంపొందించడం వంటి చర్యలు ఈ సవాళ్లను పరిష్కరించడంలో ఉపయోగపడగలవు.అంతర్జాతీయ కాంపిటీషన్లు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, వాటిని నిర్వహించేందుకు ప్రభుత్వం క్రియాశీలకమైన చర్యలు తీసుకోవాలి. దేశీయంగా వివిధ రాష్ట్రాలకు ప్రత్యేకమైన క్రీడలను మరింతగా వెలుగులోకి తెచ్చేందుకు స్పోర్ట్స్ టూరిజంను ప్రోత్సహించవచ్చు.ఇదీ చదవండి: విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా భారత్స్పోర్ట్స్ లీగ్‌లు, సాంకేతిక పురోగతి, వైవిధ్యమైన క్రీడలు మొదలైనవి ఈ రంగం వృద్ధికి తోడ్పడుతున్నాయి.స్పోర్ట్స్ గూడ్స్, దుస్తులు, మీడియా హక్కులు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి.స్పోర్ట్స్ మీడియా మార్కెట్ 2020లో 1 బిలియన్ డాలర్లుగా ఉండగా 2027 నాటికి 13.4 బిలియన్ డాలర్లకు చేరవచ్చనే అంచనాలు ఉన్నాయి.2023 ఏషియన్ గేమ్స్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన విజయాలు, అంతర్జాతీయంగా పోటీపడే సత్తా పెరుగుతోందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. -
సహకార రంగంలో 11 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: దేశ సహకార రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. 2030 నాటికి నేరుగా 5.5 కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పించనుంది. అదే విధంగా మరో 5.6 కోట్ల మంది పరోక్షంగా ఉపాధి పొందనున్నారు. ఈ వివరాలను మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ‘ప్రైమస్ పార్ట్నర్స్’ వెల్లడించింది. ‘భారత సహకార విప్లవం’ పేరుతో సహకార రంగంపై గురువారం ఒక నివేదికను విడుదల చేసింది.భారత కోపరేటివ్ నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్దదంటూ.. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల సహకార సొసైటీల్లో 30 శాతం మనదగ్గరే ఉన్నట్టు వెల్లడించింది. ‘‘భారత్ 2030 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అలా చూస్తే సహకార రంగం ఆశావాదానికి, సామర్థ్యానికి ఆధారంగా కనిపిస్తోంది’’అని ఈ నివేదిక పేర్కొంది. సహకార రంగానికి ఉన్న అపార సామర్థ్యాలను ఆర్థిక వృద్ధికి, సామాజిక సమానత్వానికి, సమ్మిళితాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కేవలం ఒక విభాగం కాదంటూ, సమాజ పురోగతికి, శ్రేయస్సుకు శక్తిమంతమైన చోదకంగా నిలుస్తుందని పేర్కొంది.ఉపాధికి చిరునామా: ‘‘ఉపాధి కల్పనలో సహకార రంగం వాటా 2016–17 నాటికి 13.3 శాతానికి చేరింది. 2007–08 నాటికి ఈ రంగంలో 12 లక్షలుగా ఉన్న ఉపాధి అవకాశాలు, 2016–17 నాటికి 58 లక్షలకు చేరాయి. 18.9 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. 2030 నాటికి కోపరేటివ్‌లు 5.5 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనున్నాయి. 5.6 కోట్ల మందికి స్వయం ఉపాధి లభించనుంది’’అని ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఈ రంగం కల్పించే స్వయం ఉపాధి అవకాశాలను ప్రధానంగా ప్రస్తావించింది.‘‘2006–07 నాటికి సహకార రంగం 1.54 కోట్ల మందికి స్వయం ఉపాధి కల్పించగా, 2018 నాటికి ఇది 3 కోట్లకు విస్తరించింది. స్వయం ఉపాధికి కోపరేటివ్‌లు మూలస్తంభాలు. ఏటా 5–6 శాతం చొప్పున పెరిగినా 2030 నాటికి 5.6 కోట్ల మేర స్వయం ఉపాధి అవకాశాలు ఈ రంగంలో ఏర్పడనున్నాయి’’అని వివరించింది. 2030 నాటికి జీడీపీకి 3–5 శాతం వాటాను సమకూరుస్తుందని అంచనా వేసింది.ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కూడా కలిపి చూస్తే జీడీపీలో 10 శాతంగా ఉంటుందని తెలిపింది. సహకార రంగాన్ని ఆధునికీకరించడంతోపాటు విధానాల క్రమబద్ధీకరణ, సహకార ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు దిశగా 2021లోనే కేంద్ర సహకార శాఖ పలు చర్యలు ప్రకటించడం గమనార్హం. 29 కోట్ల సభ్యులతో 8.5 లక్షల కోపరేటివ్‌లు స్వయం ప్రతిపత్తి, ప్రజాస్వామ్యయుతంగా నడిచేందుకు వీలుగా వాటికి నిధుల సా యంఅందించి, సొం తంగా నిల దొక్కుకునేలా చూడాలని నివేదిక సూచించింది. -
భారత్‌లో 5జీ జోరు.. 6జీ సేవల ప్రారంభం అప్పుడే..
టెలికం రంగంలో భారత్‌లో 5జీ కొత్త పుంతలు తొక్కుతోంది. 2030 నాటికి 5జీ చందాదార్ల సంఖ్య మూడురెట్లు దూసుకెళ్లి 97 కోట్లకు చేరుతుందని నెట్వర్కింగ్, టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం ఎరిక్సన్ రూపొందించిన కంజ్యూమర్ల్యాబ్ రిసర్చ్ నివేదిక వెల్లడించింది. ఆ సమయానికి మొత్తం మొబైల్ కస్టమర్లలో 5జీ యూజర్ల వాటా ఏకంగా 74 శాతానికి ఎగబాకుతుందని తెలిపింది.ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం 2024 చివరి నాటికి భారత్‌లో 5జీ సబ్స్క్రిప్షన్లు 27 కోట్లు నమోదు కావొచ్చని అంచనా. ఇది దేశంలోని మొత్తం మొబైల్ కస్టమర్లలో 23 శాతం. ఇక అంతర్జాతీయంగా 5జీ చందాదార్ల సంఖ్య ఈ ఏడాది చివరికల్లా దాదాపు 230 కోట్లుగా ఉంటుంది. ఇది మొత్తం గ్లోబల్ మొబైల్ సబ్స్క్రిప్షన్లలో 25 శాతానికి సమానం. అలాగే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 630 కోట్ల మంది 5జీ మొబైల్ సేవలను వినియోగిస్తారని నివేదిక అంచనా వేస్తోంది. 2027 నాటికి 4జీని దాటి.. 5జీ వినియోగదార్ల సంఖ్య 2027లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4జీ సబ్స్క్రిప్షన్లను అధిగమిస్తాయని అంచనా. మొదటిసారిగా 6జీ సేవలు 2030లో ప్రారంభం కావొచ్చు. భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మెరుగైన పనితీరు కోసం వీడియో కాలింగ్, స్ట్రీమింగ్, ఆన్లైన్ చెల్లింపులకు అదనంగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 5జీ వినియోగదార్లలో ఆరుగురిలో ఒకరు తమ ప్రస్తుత నెలవారీ మొబైల్ ఖర్చులో 20 శాతం ఎక్కువ చెల్లించడానికి రెడీగా ఉన్నారని ఎరిక్సన్ ఆగ్నేయాసియా, భారత్ నెట్వర్క్ సొల్యూషన్స్ హెడ్ ఉమాంగ్ జిందాల్ తెలిపారు.జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ) అప్లికేషన్లు 5జీ పనితీరును నడిపించే కీలక సాధనాలుగా ఉద్భవించాయి. జెన్ ఏఐ యాప్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో పెరుగుతుంది. భారత్‌లోని 5జీ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లలో 67 శాతం మంది వచ్చే ఐదేళ్లలో ప్రతీ వారం జెన్ ఏఐ యాప్‌లను ఉపయోగిస్తారని నివేదిక వివరించింది. -
పిల్లలకు వె'డర్'!
సాక్షి, అమరావతి: వాతావరణంలో తీవ్రంగా పెరుగుతున్న గాలి కాలుష్యంతోపాటు ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు పిల్లల జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యునిసెఫ్) వెల్లడించింది. మన దేశంలో 2050 నాటికి పిల్లల సంఖ్య 10.60 కోట్ల మేర తగ్గుతుందని హెచ్చరించింది. వాతావరణంలో మార్పుల వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలతోపాటు తక్కువ ఆదాయ వర్గాల జీవనోపాధులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. అదేవిధంగా వరదలు వంటి ప్రకృతి విపత్తుల ముప్పు కూడా పెరుగుతుందని పేర్కొంది. వీటివల్ల పిల్లల సంఖ్య తగ్గుతుందని, 2050 నాటికి దేశ జనాభాలో సుమారు 45.6 కోట్లు ఉండాల్సిన బాలలు... కేవలం 35 కోట్లు మాత్రమే ఉంటారని వివరించింది. అయినా 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉండే మొత్తం పిల్లల జనాభాలో భారతదేశ వాటా 15శాతం ఉంటుందని అంచనా వేసింది. యునిసెఫ్ ఫ్లాగ్షిప్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ చిల్డ్రన్–2024 నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది పిల్లలు ఉంటారని, వారిలో మూడో వంతు భారత్, చైనా, నైజీరియా, పాకిస్తాన్ దేశాల్లోనే ఉంటారని ప్రకటించింది. కొన్ని దేశాల్లో ప్రతి పది మందిలో ఒక్కరు కూడా పిల్లలు ఉండని ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2050–59 మధ్య పర్యావరణ సంక్షోభాలు మరింత ఎక్కువగా తలెత్తే అవకాశం ఉందని, ఇవి పిల్లల జనాభాపై అత్యంత తీవ్రంగా ప్రభావం చూపుతాయని యునిసెఫ్ ఆందోళన వ్యక్తంచేసింది.యునిసెఫ్ నివేదికలోని ముఖ్యాంశాలు..» ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం కలిగిన 28 దేశాల్లో కుటుంబ ఆదాయాల పరంగా పిల్లల జనాభాలో మార్పులను అంచనా వేశారు. 2000 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం పిల్లల జనాభాలో 11 శాతం మంది తక్కువ ఆదాయం కలిగిన 28 దేశాల్లోనే ఉండగా... 2024 నాటికి 23 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఉన్నత, మధ్యస్థ ఆదాయాలు కలిగిన దేశాల్లో పిల్లల జనాభా తగ్గింది.» ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల్లో 2000వ సంవత్సరంలో 24 కోట్ల మంది పిల్లలు ఉండగా, ఆ సంఖ్య 2050 నాటికి 54.40 కోట్లకు పెరుగుతుందని అంచనా. దిగువ మధ్య తరగతి ఆదాయ కుటుంబాల్లో 100.09 కోట్ల మంది ఉండగా, 2050 నాటికి స్పల్పంగా పెరిగి 118.70 కోట్లకు చేరుతుంది. » ఉన్నత, మధ్య ఆదాయ కుటుంబాల్లో 2000లో 65 కోట్ల మంది పిల్లల జనాభా ఉండగా, 2050 నాటికి ఆ సంఖ్య బాగా తగ్గి 38.70 కోట్లకు పరిమితమవుతుంది. ధనిక కుటుంబాల్లో 2000 నాటికి 24.40 కోట్ల మంది పిల్లల జనాభా ఉండగా, ఆ సంఖ్య 2050 నాటికి 21.60 కోట్లకు పరిమితమవుతుంది. » అదేవిధంగా పర్యావరణ సమస్యలను అధిగమించేందుకు 57 అంశాల అమలుపై 163 దేశాల్లో యునిసెఫ్ అధ్యయనం చేసి ప్రకటించిన చిల్డ్రన్ క్లెయిమెట్ రిస్క్ ఇండెక్స్‌లో భారత్ 26వ స్థానంలో ఉంది. -
ఐదేళ్ల వృద్ధి రేటు రయ్.. రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వృద్ధి రేటు 2018–19తో పోలిస్తే 2022–23లో పెరిగిందని.. బడ్జెట్ లోపల చేసిన అప్పులు, ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు నిబంధనలకు లోబడే ఉన్నాయని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. 2022–23 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది.2018–19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.8,73,721 కోట్ల నుంచి 2022–23లో రూ.13,17,728 కోట్లకు పెరిగి సగటు వార్షిక వృద్ధి రేటు 11.01 శాతంగా ఉందని కాగ్ స్పష్టం చేసింది. 2021–22 సంవత్సరంతో పోలిస్తే 2022–23లో జీఎస్డీపీలో 16.22 శాతం వృద్ధి నమోదైనట్టు కాగ్ వెల్లడించింది. ఈ కాలంలో పన్నుల ద్వారా ఆదాయం 9.25 శాతం, రాష్ట్ర సొంత పన్నుల ద్వారా ఆదాయం 9.93 శాతం మేర పెరిగాయి. రాష్ట్ర మొత్తం వ్యయం 2021–22లో రూ.1,77,647 కోట్ల నుంచి 2022–23లో రూ.2,10,272 కోట్లకు పెరగ్గా.. 18.35 శాతం పెరుగుదల నమోదు చేసింది. తప్పనిసరి వ్యయం రూ.15,451 కోట్లు పెరగడం, స్థానిక సంస్ధలకు ఇచ్చే ఆరి్థక సహాయం రూ.14,208 కోట్లు పెరగడం, రూ.8,315 కోట్లు మేర సబ్సిడీలు పెరగడం రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణాలుగా కాగ్ తెలిపింది. వార్షిక రాబడులూ పెరిగాయ్ 2018–19 నుంచి 2022–23 వరకు రెవెన్యూ రాబడులు సగటు వార్షిక వృద్ధి రేటు 8.91 శాతం పెరిగినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. రెవెన్యూ రాబడుల్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ వాటా 2018–19లో 16.97 శాతం ఉండగా.. 2022–23లో 22.01 శాతానికి పెరిగింది. 2018–19లో సబ్సిడీ వ్యయం రూ.2,352 కోట్ల నుంచి 2022–23లో రూ.23,004 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఈ కాలంలో మొత్తం సబ్సిడీల్లో 43 శాతం నుంచి 88 శాతం వరకు విద్యుత్ రాయితీలే గణనీయంగా ఉన్నాయని పేర్కొంది. 2022–23లో ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.30 శాతం పరిమితికి గాను 3.30 శాతం ఉందని, ద్రవ్యలోటు 4.50 శాతం పరిమితికి గాను 3.98 శాత ఉందని, రాష్ట్ర బకాయిల పరిమితి జీఎస్డీపీలో 36.30 శాతం పరిమితికి గాను 32.17 శాతం ఉందని కాగ్ వివరించింది. గ్యారెంటీల పరిమితి 180 శాతానికి గాను ఇచ్చిన హామీలు 92.24 శాతంగా ఉందని కాగ్ పేర్కొంది. బడ్జెటేతర రుణాల బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం బకాయిలు జీఎస్డీపీలో 41.89 శాతంగా ఉందని తెలిపింది. తలసరి జీడీపీ భారీగా పెరుగుదల 2018–19లో తలసరి జీడీపీ రూ.1,70,180 ఉండగా.. 2022–23లో రూ.2,48,258కి పెరిగిందని కాగ్ వెల్లడించింది. 2022–23 నాటికి చెల్లించాల్సిన ప్రజా రుణం రూ.3,56,455 కోట్లు అని పేర్కొంది. ఈ మొత్తం బకాయిలు ఎఫ్ఆర్బీఎం చట్టంలో నిర్దేశించిన లక్ష్యాలకు లోబడే ఉన్నప్పటికీ బడ్జెటేతర రుణాలను, పెండింగ్బిల్లులు తీసుకుంటే లక్ష్యాల కన్నా బకాయిలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.2023 మార్చి నాటికి ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రూ.1,28,048 బడ్జెటేతర రుణాలను సేకరించినట్టు కాగ్ పేర్కొంది. తప్పనిసరి ఖర్చులు పెరిగిపోతున్నాయని కాగ్ తెలిపింది. ప్రధానంగా జీతాలు, వేతనాలు, పెన్షన్లు, స్థానిక సంస్థలకు నగదు బదిలీలు, వడ్డీ చెల్లింపు ఐదేళ్లలో భారీగా పెరిగినట్టు కాగ్ పేర్కొంది. పీఆర్సీ అమలు చేయడంతో ఉద్యోగుల వేతనాల చెల్లింపులు పెరిగాయని కాగ్ స్పష్టం చేసింది. -
‘రియల్’ ఆస్తులే టాప్!
దేశంలోని మొత్తం కుటుంబాల ఆస్తుల్లో సగం శాతానికి పైగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటు ఇళ్లరూపంలోనే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.ఈ మేరకు అమెరికాలో ప్రముఖ పెట్టుబడి సంస్థగా పేరున్న జెఫరీస్తో పాటు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాగణాంకాల ఆధారంగా వాణిజ్య వార్తా కథనాలు మాత్రమే ప్రసారం చేసే ప్రముఖ టీవీ ఛానల్ నివేదిక స్పష్టంచేస్తోంది. ఈ నివేదిక ప్రకారం ఇండియాలోని కుటుంబాల అన్ని రకాల ఆస్తుల మొత్తం విలువ 11.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. (రూ.పదికోట్ల కోట్లు) ఈ ఆస్తులు ఏ రంగాల్లో ఉన్నాయో పరిశీలించిన ఆ టీవీ ఛానల్ .. సగానికి పైగా అనగా 50.7 శాతం వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటుఇళ్ల రూపంలోనే ఉన్నాయని గుర్తించింది. – సాక్షి, అమరావతిపీఎఫ్లో కన్నా ఇన్సూరెన్స్లోనే పెట్టుబడులు అధికంవృద్ధాప్యంలో ఆర్థిక అవసరాలకు ఉపయోగపడే ప్రావిడెంట్ పెన్షన్ ఫండ్స్‌లో పెట్టుబడులు కన్నా మన దేశంలోని కుటుంబాలు అత్యధిక మొత్తం ఇన్సూరెన్స్ పాలసీల రూపంలోనే పెట్టిన పెట్టుబడులే అధికమని ఆ గణాంకాలు మరో ఆశ్చర్యకరమైన అంశాన్ని వెలుగులో తీసుకొచ్చాయి. దేశీయ కుటుంబాలు కలిగి ఉన్న మొత్తం ఆస్తుల్లో 5.8 శాతం మేర ప్రావిడెంట్ పెన్షన్ ఫండ్స్ రూపంలో ఉండగా, ఇన్సూరెన్స్ పాలసీల రూపంలో 5.9 శాతం మేర ఆస్తులున్నాయి. మన దేశ మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన బంగారం.. దేశీయ మొత్తం ఆస్తుల్లో రెండో అతి పెద్ద స్థానంలో 15.5 శాతం మేర ఉండడం గమనార్హం. -
ఉన్నత విద్యలో యువతుల హవా
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో యువతులు ఆధిపత్యం సాధిస్తున్నారు. దేశంలో తొలిసారిగా యువకుల కంటే యువతుల అధిక సంఖ్యలో ఉన్నత విద్యా కోర్సుల్లో చేరుతున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో చేరికలను సూచించే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో 2017–18 నుంచి యువకులను యువతులు అధిగవిుంచారు. యువకుల జీఈఆర్ 28.4శాతం ఉండగా.. యువతుల జీఈఆర్ 28.5శాతంగా నమోదైంది. 2017–22 మధ్య ఐదేళ్లలో ఉన్నత విద్యా రంగంలో వచ్చిన విశేష మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కనబరుస్తోందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)–డెలాయిట్ సంయుక్త అధ్యయన నివేదిక–2024 వెల్లడించింది. సీఐఐ–డెలాయిట్ సంయుక్తంగా 2017–22 మధ్య కాలంలో దేశ ఉన్నత విద్యా రంగం తీరుతెన్నులను విశ్లేషించాయి.ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ....» దేశంలో ఉన్నత విద్యను అందించే కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2017లో దేశంలో 39,050 కాలేజీలు ఉండగా 2022 నాటికి 42,825కు పెరిగాయి.» ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాన్ని సూచించే ‘గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో(జీఈఆర్) చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. 2017–18లో జీఈఆర్ 24.6శాతం ఉండగా... 2021–22 నాటికి 28.4శాతానికి పెరగడం విశేషం.» ఉన్నత విద్యా సంస్థల్లో యువతుల జీఈఆర్ కూడా పెరగడం సానుకూల పరిణామం. యువతుల జీఈఆర్ 2017–18లో 25.6శాతం ఉండగా 2021–22నాటికి 28.5శాతానికి పెరిగింది. » ఉన్నత విద్యా సంస్థల్లో యువకుల జీఈఆర్ 2017–18లో 24.6శాతం ఉండగా, 2021–22నాటికి 28.4 శాతానికి చేరింది. ఈ ఐదేళ్లలోను యువతుల జీఈఆర్ అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.» ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి కూడా క్రమంగా తగ్గుతోంది. ఐదేళ్లలో ఉన్నత విద్యా రంగంలో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడంతో ఇది సాధ్యపడింది. 2017–18లో 25 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండగా... 2021–22 నాటికి 23 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉన్నారు. » ఇక దేశంలో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. 2017–18లో దేశంలో మొత్తం 1,61,412 మంది పీహెచ్డీ కోర్సుల్లో చేరారు. 2021–22లో ఏకంగా 2,12,522 మంది పీహెడ్డీ కోసం ఎన్రోల్ చేసుకోవడం విశేషం. » పోస్టు గ్రాడ్యూయేట్ కోర్సుల్లో 2017–18లో 29.40 లక్షల మంది విద్యార్థులు చేరగా... 2021–22 విద్యా సంవత్సరంలో 37.50 లక్షల మంది విద్యార్థులు చేరారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2017–18లో 2.64 కోట్ల మంది విద్యార్థులు చేరగా, 2021–22 విద్యా సంవత్సరంలో 3.07కోట్ల మంది ప్రవేశంపొందారు. -
ఆ రంగంలో హైదరాబాద్ టాప్: ఆ తరువాతే అన్నీ..
భారతదేశంలో విభిన్న రంగాల్లో (ఆర్థిక పరిస్థితులు, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, పాలన) వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాల జాబితాను నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్, ఆర్థిక రంగంలో బెంగళూరు, పాలన, మౌలిక సదుపాయాలలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నాయి.➤రియల్ ఎస్టేట్ విభాగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత బెంగళూరు, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై ఉన్నాయి. హైదరాబాద్‌లో అపార్ట్మెంట్లకు, ఇతర స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. గతంలో పోలిస్తే ఇక్కడ ధరలు కూడా 11 శాతం పెరిగాయి.➤ఆర్థిక పరిస్థితుల పరంగా బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ ఉన్నాయి. అత్యధిక శ్రామిక శక్తి కలిగిన నగరాల్లో బెంగళూరు టాప్‌లో ఉంది. బెంగళూరులో వ్యాపార కార్యకలాపాలు అధికంగా జరుగుతాయి.➤భౌతిక మౌలిక సదుపాయాల విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ రెండో స్థానంలోనూ.. ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై ఉన్నాయి. భారతదేశపు అతిపెద్ద మెట్రో నెట్వర్క్ కలిగి ఢిల్లీ మెట్రో రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 68 లక్షల కంటే ఎక్కువే.➤ఇక చివరిగా పాలన విషయానికి వస్తే.. ఈ విభాగంలో కూడా ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై ఉన్నాయి. ఢిల్లీ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్ వంటి ఢిల్లీ ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, మెరుగైన పబ్లిక్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. -
2019–24 ఐదేళ్ల సమర్థపాలనలోమున్సిపాలిటీల సర్వతోముఖాభివృద్ధి
సాక్షి, అమరావతి: సమర్థమైన పాలన వ్యవస్థల ద్వారా గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు సర్వతోముఖాభివృద్ధి దిశగా దూసుకెళ్లిందని ఆర్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఆర్థిక స్వయం ప్రతిపత్తి, పౌరసేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని, కార్పొరేషన్ల బడ్జెట్లో రెవెన్యూ మిగులు సాధించాయని నివేదిక స్పష్టం చేసింది. 2019–2024 వరకు దేశంలోని రాష్ట్రాల్లో 232 మున్సిపల్ కార్పొరేషన్ల ఆరి్థక స్థితిగతులపై ఆర్బీఐ అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేసింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ మొత్తం వ్యయంలో 50 శాతానికిపైగా ఆస్తుల కల్పన (మూలధన)కు వ్యయం చేసినట్లు నివేదిక పేర్కొంది. అలాగే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ల మొత్తం వ్యయంలో ఆస్తుల కల్పన వ్యయం 50 శాతం కన్నా ఎక్కువగానే ఉందని నివేదిక వివరించింది. కేపిటల్ వాల్యూ విధానంలో పన్ను మార్కెట్ శాతం అంచనాతో ఆస్తి విలువను ప్రాథమికంగా నిర్ధారించడంతో పాటు ఏటా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తోందని, ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో అమలు చేస్తున్నారని తెలిపింది. అలాగే ఐదేళ్లు రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ల మూలధన రాబడులు, వ్యయం కూడా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థికంగా స్వయంప్రతిపత్తి సాధించడంతో పట్టణ మౌలిక సదుపాయాలు బాగా పెరిగాయని తెలిపింది. ఆస్తి పన్నుల వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధించిన రాష్ట్రాల మున్సిపల్ కార్పొరేషన్లలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 2019–20 నుంచి 2023–24 మధ్య రెవెన్యూ వసూళ్లలో ఆస్తి పన్నుల వసూళ్లు పెరిగాయని నివేదిక పేర్కొంది. రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ల్లో మూల ఆదాయాలను, పన్నేతర ఆదాయాలను గణనీయంగా పెంచుకున్నాయని, దీంతో నీటి సరఫరా సేవలు, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ అధిక నాణ్యతతో నిర్వహిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. -
చదువుల 'రుణ' రంగం!
సాక్షి, అమరావతి: దేశంలో ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలు పెరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. 2023 నాటికి విద్యా రుణాలు రూ.90 వేల కోట్లకు చేరుకున్నాయి. 2023–24లో దేశీయ బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రూ.36,448 కోట్ల మేర విద్యా రుణాలను పంపిణీ చేశాయి. 5,50,993 మంది విద్యార్థులు విద్యా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. » గత దశాబ్ద కాలంగా విదేశీ విద్య కోసం రుణాలపై ఆధారపడుతున్న విద్యార్థుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. 2012–13లో వీరి సంఖ్య 22,200 కాగా 2020లో ఏకంగా 69,898కి చేరుకుంది. అయితే కేంద్ర విద్యాశాఖ 2022 నివేదిక ప్రకారం ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నాలుగు శాతం మాత్రమే రుణాల ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణ, కర్నాటక, పంజాబ్, మహారాష్ట్రలో విద్యా రుణాలకు అధిక డిమాండ్ నెలకొంది. »రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు రుణాలకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. 2022లో దాదాపు 7.70 లక్షల మంది భారతీయ విద్యార్థులు అంతర్జాతీయ విద్యను ఎంచుకున్నారు. వరంలా ‘పీఎం విద్యాలక్ష్మీ’నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మీ పథకం ద్వారా పూర్తి స్థాయిలో ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పూచీకత్తు రహిత, హామీ రహిత రుణాన్ని అందిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్ ప్రకారం 860 విద్యా సంస్థల్లోని సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. » పీఎం విద్యాలక్ష్మీ పథకం కింద ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కలిగిన ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు రూ.7.5 లక్షల వరకు రుణం పొందవచ్చు. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు ఇప్పటి వరకు ప్రభుత్వ స్కాలర్‌షిలు, వడ్డీ రాయితీలు పొందకపోతే వారికి రూ.10 లక్షల వరకు రుణం అందుతుంది. మారటోరియం కాలంలో 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులను అభ్యసించే విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. పీఎం విద్యాలక్ష్మీ కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో విద్యా రుణం మంజూరవుతుంది. -
నవజంట కలల పంట..థాయ్‌లాండ్!
సాక్షి, అమరావతి : ఇంతకాలం బ్యాచిలర్స్ డెస్టినేషన్‌గా పేరొందిన థాయిలాండ్ ఇప్పుడు పెళ్లయిన కొత్త జంటలకు హానీమూన్ స్పాట్‌గా మారింది. ఇప్పటి వరకు హానీమూన్ డెస్టినీగా ఉన్న మాల్దీవుల కంటే అత్యధికంగా థాయ్‌లాండ్‌కు వెళ్లినట్టు మేక్ మై ట్రిప్ హానీమూన్–2024 నివేదిక వెల్లడించింది. గడిచిన ఏడాది కాలం(అక్టోబర్ 23 నుంచి సెప్టెంబర్–24)లో కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్ కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లినట్టు పేర్కొంది. ఈ ఏడాదిలో థాయ్‌లాండ్ కు వెళ్లిన కొత్త జంటల్లో 5.2 శాతం వృద్ధి నమోదయితే.. అదే సమయంలో మాల్దీవుల బుకింగ్స్ 16.2 శాతం పడిపోయినట్లు పేర్కొంది. మాల్దీవుల పర్యాటక మంత్రి ఇండియన్ బీచ్‌లను కించపరుస్తూ మాట్లాడటం, ఆ తర్వాత బ్యాన్ మాల్దీవ్స్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం జరగడమే దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. థాయ్‌లాండ్, మాల్దీవుల తర్వాత ఇండోనేషియా, మారిషస్, వియత్నాంలకు ఎక్కువ మంది జంటలు వెళుతున్నట్టు నివేదిక పేర్కొంది. ఇండియా నుంచి అత్యధికంగా వెళ్లే ఐదు దేశాల్లో ఒక్క మాల్దీవులు తప్ప మిగిలిన నాలుగు దేశాలు వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ప్రస్తుత యువత హానీమూన్ కోసం దగ్గర ప్రాంతాలనే కాకుండా ఎక్కువ రోజులు గడిపేలా సుదీర్ఘ ప్రాంతాలైన జపాన్, స్కాండినేవియా, యునైటెడ్ స్టేట్స్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది జపాన్ బుకింగ్స్‌లో ఏకంగా 388 శాతం వృద్ధి నమోదైంది. కేరళను అధిగమించిన అండమాన్ ఇక దేశీయంగా చూస్తే కొత్త జంటలు అండమాన్ నికోబార్ దీవుల్లో గడపడానికి ఇష్టపడుతున్నారు. తొలిసారిగా హానీమూన్ ప్యాకేజీల్లో కేరళను అధిగమించి అండమాన్ ముందుకొచ్చినట్టు నివేదిక పేర్కొంది. అండమాన్‌లో నీలి రంగు సముద్రంతో బీచ్‌లు పరిశుభ్రంగా ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే అండమాన్ బుకింగ్స్‌లో 6.9 శాతం వృద్ధి నమోదైంది. అండమాన్, కేరళ తర్వాత కశ్మీర్, గోవా, హిమాచల్ ప్రదేశ్లు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కొత్తగా హనీమూన్ పర్యాటక ప్రాంతాలుగా ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలు ఎదుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. అస్సలు తగ్గడం లేదు.. హనీమూన్ ఖర్చు విషయంలో యువత వెనుకాడటం లేదు. హానీమూన్ ప్యాకేజీల్లో అత్యధికంగా ఫోర్స్టార్, ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోనే బస చేసేందుకే ఇష్టపడుతున్నారట. గతేడాది మొత్తం జంటల్లో 68 శాతం మంది స్టార్ హోటల్స్‌లోనే బస చేయడమే కాకుండా, సగటు ఖర్చులో 13 శాతం వృద్ధి నమోదైంది. కేవలం ఒక ఊరు, ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రెండు మూడు ప్రాంతాలు తిరగడానికి జంటలు ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. అంతర్జాతీయంగా రెండు మూడు దేశాలకు వెళ్లే వారి సంఖ్య 32 శాతం నుంచి 47 శాతానికి పెరిగితే, దేశంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ నగరాలను సందర్శించే జంటల సంఖ్య 35 శాతం నుంచి 39 శాతానికి పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. -
కొత్తగా 27.3 లక్షల టెక్ జాబ్స్.. సాఫ్ట్వేర్ కంపెనీ నివేదిక
ముంబై: వర్ధమాన సాంకేతికతల తోడ్పాటుతో కొత్తగా కోట్ల సంఖ్యలో కొలువులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో 2023లో 42.37 కోట్లుగా ఉన్న వర్కర్ల సంఖ్య 2028 నాటికి 45.76 కోట్లకు పెరగనుంది. వెరసి అయిదేళ్ల వ్యవధిలో వర్కర్ల సంఖ్య 3.38 కోట్ల స్థాయిలో వృద్ధి చెందనుంది. వినూత్న టెక్నాలజీల దన్నుతో కీలక రంగాల్లో కొత్తగా 27.3 లక్షల టెక్ కొలువులు రానున్నాయి.అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీ సర్వీస్‌నౌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఆర్థిక, సాంకేతిక పరివర్తన కారణంగా తయారీ రంగంలో 15 లక్షలు, విద్యారంగంలో 8.4 లక్షలు, ఆరోగ్య సంరక్షణ రంగంలో 80 లక్షల మేర ఉద్యోగాలు పెరగనున్నాయి. అధునాతన నైపుణ్యాలు అవసరమయ్యే హై–వేల్యూ ఉద్యోగాల కల్పనలో కృత్రిమ మేథ కీలక పాత్ర పోషించనుంది.ఇదీ చదవండి: ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?జనరేటివ్ ఏఐ విభాగం పురోగమించే కొద్దీ ఏఐ సిస్టమ్స్ ఇంజినీర్లు, ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్లు, ప్లాట్‌ఫాం ఓనర్లకు గణనీయంగా ప్రయోజనం చేకూరనుంది. రిటైల్ ప్రొఫెషనల్స్ మెరుగైన అవకాశాలు దక్కించుకునేందుకు సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్, డేటా ఇంజినీరింగ్ వంటి విభాగాలకు సంబంధించి తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. -
ఏఐని ఎక్కువగా వాడుతున్నది మనమే..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచమంతా వేగంగా విస్తరిస్తోంది. దీన్ని అందిపుచ్చుకోవడంలో భారత్.. ప్రపంచం కంటే ముందుంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) తాజా పరిశోధన ప్రకారం.. 30 శాతం భారతీయ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను వినియోగిస్తూ విలువను పెంచుతున్నాయి.బీసీజీ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 26 శాతం కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగిస్తున్నాయి. ఫిన్‌టెక్, సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ రంగాలు తమ కార్యకలాపాలలో ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. కొన్నేళ్ల పెట్టుబడి, నియామకం, పైలట్ ప్రాజెక్ట్‌ల తర్వాత ఇప్పుడు సీఈవోలు ఈ సాంకేతికత నుండి స్పష్టమైన రాబడి కోసం ప్రయత్నిస్తున్నారని నివేదిక పేర్కొంది. అదే సమయంలో దాని పూర్తి విలువను పొందడం కష్టంగా ఉందని వివరించింది.పరిశ్రమల అంతటా ఏఐ ప్రోగ్రామ్‌లు విస్తృతంగా అమలు చేస్తున్నప్పటికీ, బీసీజీ తాజా పరిశోధన ప్రకారం, కేవలం 26 శాతం కంపెనీలు మాత్రమే ఇంకా కాన్సెప్ట్‌ను దాటి ముందుకు వెళ్లడానికి, స్పష్టమైన విలువను ఉత్పత్తి చేయడానికి అవసరమైన సామర్థ్యాలను అభివృద్ధి చేశాయి.ఆసియా, యూరప్ ఉత్తర అమెరికాలోని 59 దేశాలలో విస్తరించి ఉన్న 20 రంగాలకు చెందిన పది ప్రధాన పరిశ్రమలలో 1,000 మంది చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సర్వే ఆధారంగా బీసీజీ ఈ నివేదికను రూపొందించింది. -
గుండెల్లో గుబులు పుట్టిస్తున్న సైబర్ దాడులు
మోసాలకు ఫుల్స్టాప్ అనేదే ఉండదు. రోజుకో కొత్తరకం మోసం, వంచన వెలుగుచూస్తూనే ఉంటాయి. దొంగతనాలు, బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ మోసం, సైబర్ నేరాలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజల నుంచి బడా అధిపతుల వరకు అందరిని మోసగాళ్లు దోచుకుంటూనే ఉన్నారు.తాజాగా దేశంలో సైబర్ దాడులు కూడా పెచ్చుమీరుతున్నాయి. నెట్వర్క్ సాధనాలు, కంప్యూటర్ సిస్టమ్, సర్వర్లు వంటి డిజిటల్ పరికారలకు చెందిన డేటాను దొంగిలించమే సైబర్ అటాక్. తమ తమ ప్రయోజనాల కోసం డేటాను దొంగిలించి, నాశనం చేయడం, మార్చడం వంటివి చేస్తుంటారు సైబర్ నేరగాళ్లు.అయితే రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ దాడుల కారణంగా దేశ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు కలుగుతోంది. దేశంలో 2033 నాటికి సైబర్‌టాక్‌లు 1 ట్రిలియన్కు పెరుగుతాయని PRAHAR అనే ఎన్జీవో అంచనా వేసింది. అదే 2047 నాటికి 17 ట్రిలియన్లకు చేరుకోవచ్చని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు పెరుగుతున్న హోదా, ఖ్యాతి కారణంగా దాడులు కూడా పెరిగే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. ఈ మేరకు ప్రహార్ ‘ది ఇన్విజిబుల్ హ్యాండ్’ పేరుతో నివేదికను న్యూఢిల్లీలో నేడు ఆవిష్కరించింది.దీని ప్రకారం.. సైబర్‌టాక్‌లు లేదా సైబర్‌వార్‌ఫేర్ వంటివి భారత్‌కు వ్యతిరేకంగా ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన ముప్పుగా తయారయ్యింది. సోషల్ మీడియా వాడకం, గేమింగ్, బెట్టింగ్ వంటివి ఆధునాతన సబైర్ మానిప్యులేషన్‌కు దారి తీస్తుంది., దేశంపై దాడులకు సాధనాలుగా మారుతున్నాయిసైబర్టాక్లు లేదా సైబర్‌వార్‌ఫేర్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన ముప్పు. సైబర్‌స్పేస్ అనేది కొత్త యుద్దభూమి. దీనిపై భారత్ దాడికి దిగాల్సిందే. అధునాతన సాంకేతిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం మెరుగుదల, డిజిటల్ యాప్‌లు, ప్లాట్‌ఫారమ్‌లను వైట్‌లిస్ట్ చేయడం, పౌరులకు అవగాహన కల్పించడం వంటివి ఎంతో అవసరం. పెరుగుతున్న సైబర్ దాడులు దేశంలో బలమైన సమగ్ర సైబర్ రక్షణ విధానం రూపొందించి, దాని అమలు చేసే ఆవశ్యకతను తెలియజేస్తుంది.ప్రపంచవ్యాప్తంగా సైబర్‌టాక్‌లు 2024 మొదటి నెలలో 76% పెరిగాయి. బర్నేరగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. దిని సైబర్ భద్రతా చర్యల అవసరాన్ని నొక్కి చెబుతుంది. గతేదాడి దేశం 79 మిలియన్లకు పైగా సైబర్ అటాక్‌లను ఎదుర్కొంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పోలిస్తే మూడో స్థానంలో ఉంది. ఇక గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 15% పెరుగుదలను గుర్తించింది. 2024 500 మిలియన్లకు పైగా అటాక్‌కు కనిపించాయి. 2024 రెండవ త్రైమాసికంలో సైబర్‌టాక్‌లు 46% పెరిగాయి.2024 మొదటి నాలుగు నెలల్లో, సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి భారతీయులు రూ. 1,750 కోట్లకు పైగా కోల్పోయారు. ఈ విషయం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో 740,000 ఫిర్యాదుల ద్వారా వెల్లడైంది. బంగ్లాదేశ్ శ్రీలంక వంటి పొరుగు దేశాలలో ఇటీవలి రాజకీయ తిరుగుబాట్లు పరిణాల్లోనూ సైబర్ నేరస్థుల పాత్ర ఉండవచ్చనే సందేహాలను లేవనెత్తుతున్నాయి. సైబర్టాక్లపై నేషనల్ కన్వీనర్ & ప్రహార్ ప్రెసిడెంట్ అభయ్ మిశ్రా తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేశారు. ‘“సైబర్‌టాక్‌లు రెండు రకాలు. మొదటిది ఆర్థిక లాభం సిస్టమ్‌లలోని దుర్బలత్వాన్ని ఉపయోగించుకునే సాంప్రదాయ హ్యాకర్లు. రెండవది పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. బలవంతం, బెదిరింపుల ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడానికి వారిని రిక్రూట్ చేస్తుంది. అక్రమ బెట్టింగ్ యాప్‌లలో ఇటువంటి వ్యూహాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ వ్యూహం బంగ్లాదేశ్‌లో మోహరించిన విధానాలను కూడా పోలి ఉంటుంది, ఇక్కడ సాధారణ పౌరులను అస్థిరపరిచే సాధనాలుగా మార్చుతారు. ప్రభుత్వ సంస్థలను లోపల నుంిచి అణగదొక్కారు. భారత భద్రతా సంస్థలు అటువంటి అవకాశాల ప్రాబల్యాన్ని క్షుణ్ణంగా పరిశోధించాలి’ అని తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో అక్రమ ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ ఉంది. ఈ విదేశీ యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్‌లు, భారతదేశ నిబంధనలకు వెలుపల ప్రత్యేకంగా యువతను డబ్బు కోసం లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తున్నాయి మరియు అదే డబ్బును తిరిగి దేశంలోకి మళ్లించి ఇబ్బందులను రేకెత్తిస్తాయి. అక్రమ ఆన్లైన్ జూదం, జూదగాళ్ల వల్ల కలిగే నష్టాలు రూ.1 లక్ష కోట్లుదాటవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. చట్టవిరుద్ధమైన ఆఫ్‌షోర్ బెట్టింగ్ అప్లికేషన్ల ద్వారా జరిగే లావాదేవీలు సంవత్సరానికి రూ2 లక్షల కోట్ల (సుమారు USD 24 బిలియన్లు) వరకు చేరుకుంటాయని తెలిపింది.అయితే జాతీయ భద్రత పేరుతో గేమింగ్, ఆన్లైన్ జూదం ప్లాట్‌ఫామ్స్‌ను మూసివేయాలి. అలాగే దేశంలో ఆన్లైన్ సంస్థలను పరిమితులు విధించాలనిసూచించింది. చట్టవిరుద్ధమైన ప్లాట్‌ఫారమ్‌ల బారిన పడకుండా యువతను నిరోధించాలని తెలిపింది . -
ఖర్చులు పెరుగుతున్నాయి!
సాక్షి, అమరావతి: దేశంలో జనాలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చే కొత్త అవసరాలకు పెట్టే ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయని కేంద్ర ఎన్ఎస్ఎస్ సర్వే రిపోర్టు నివేదిక వెల్లడించింది. రోజు రోజుకీ కొత్త కొత్త అలవాట్లకు ఆకర్షించబడడమే ఇందుకు కారణమని తెలిపింది. ఇంటిల్లపాది తిండి సహా పిల్లల చదువులు, దుస్తులు, కొత్త వస్తువుల కొనుగోలు, కారు, మోటర్ సైకిల్ వాహనాలు, వైద్య ఖర్చులు.. ఇలా ఒక్కో కుటుంబం ప్రతి నెలా పెట్టే మొత్తం ఖర్చులో గ్రామాల్లో అయితే 7.6 శాతం మేర ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే కొత్త ఖర్చులకే వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఈ తరహా ఖర్చులు సరాసరి 8.6 శాతం మేర ఉంటున్నాయి. కేంద్ర గణాంకాల శాఖ 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య దేశవ్యాప్తంగా కుటుంబాల వారీగా వినియోగ ఖర్చులపై నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వే నివేదికను ఈ ఏడాది ఆగస్టులో కేంద్రం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 8,723 గ్రామాల్లో 1,55,014 కుటుంబాల నుంచి, పట్టణ ప్రాంతాల్లో 6,115 మున్సిపల్ వార్డుల్లో 1,06,732 కుటుంబాల నుంచి వివరాలు సేకరించినట్లు కేంద్రం ఆ నివేదికలో వివరించింది.దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో పెట్టే మొత్తం ఖర్చులో 2009–10లో కేవలం 3.5 శాతం మాత్రమే ఈ తరహా కొత్తగా పుట్టుకొచ్చే ఖర్చులకు వినియోగించిన పరిస్థితి ఉండగా.. 2022–23 నాటికి ఆ తరహా ఖర్చులు రెట్టింపు స్థాయికి పెరిగి 7.6 శాతానికి చేరుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనూ 2009–10లో 5.6 శాతంగా ఉన్న ఈ తరహా కొత్తగా పుట్టుకొచ్చే ఖర్చులు 2022–23 నాటికి 8.6 శాతానికి పెరిగాయి.దేశ సగటు కంటే ఏపీలో వినియోగ స్థాయి ఎక్కువ.. సర్వే నివేదిక ప్రకారం మన ఆంధ్రప్రదేశ్‌లో సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,871 చొప్పున, పట్టణ ప్రాంతాల్లో రూ. 6,782 చొప్పున ఖర్చు పెడుతున్నారు. గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో సగటు సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో పెట్టే ఖర్చులు దేశ సగటుతో పోల్చితే దేశమంతటా పట్టణ ప్రాంత వ్యక్తుల సరాసరి వినియోగ స్థాయిలో గ్రామీణ ప్రాంత వ్యక్తుల వినియోగ స్థాయి సగం మేర ఉండగా... మన రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలకు కాస్త దగ్గరగానే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వినియోగ స్థాయి ఉండడం గమనార్హం. దేశమంతటా గ్రామీణ ప్రాంత వ్యక్తుల 30 రోజుల వినియోగస్థాయి కంటే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత వ్యక్తుల వినియోగస్థాయి రూ.1,098 అదనంగా ఉండగా, అదే పట్టణ ప్రాంతాల్లో దేశ సగటు, రాష్ట్ర సగటు వ్యత్యాసం కేవలం రూ. 324గా ఉంది. » దేశంలో మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంత ప్రజల వినియోగస్థాయిలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కన్నా మన రాష్ట్రం గ్రామీణ ప్రజల వినియోగస్థాయి అధికంగా ఉంది. » ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో వ్యక్తి 30 రోజుల సరాసరి తమ మొత్తం ఖర్చులో గ్రామీణ ప్రాంతాల్లో 44.13 శాతం చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 38.58 చొప్పున రకరకాల తిండి అవసరాలకు ఖర్చు పెడుతున్నారు. » రాష్ట్రంలో అప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే కొత్త అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి 7.83 శాతం , పట్టణ ప్రాంతాల్లో 8.37 శాతం చొప్పున ఖర్చు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువే..దేశమంతటా పట్టణ ప్రాంతాల్లో సరాసరిన ఒక్కో వ్యక్తి తిండి అవసరాలకు 39.17 శాతం, తిండేతర అవసరాలకు 60.83 శాతం ఖర్చు పెడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో తిండి అవసరాలకు 46.38 శాతం , తిండేతర అవసరాలకు 53.62 శాతం ఖర్చు పెడుతున్నారు.దేశమంతటా ఒక్కో వ్యక్తి సరాసరి 30 రోజుల్లో పెట్టే మొత్తం ఖర్చులో గ్రామీణ ప్రాంతాల్లో రూ.285 చొప్పున, పట్టణ ప్రాంతాల్లో రూ.383 చొప్పున కొత్తగా పుట్టుకొచ్చే అలవాట్లకే ఖర్చు పెడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ సర్వే నివేదిక ప్రకారం.. దేశంలో ఒక్కో వ్యక్తి సరాసరిన 30 రోజుల వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో తిండి, సంబంధిత ఖర్చులకు రూ. 2,529 చొప్పున, ఇతర అవసరాలకు రూ.3,929 చొప్పున మొత్తం రూ. 6,458 ఖర్చు పెడుతున్నట్లు నిర్ధారించారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి సరాసరిన తిండి సంబంధిత అవసరాలకు రూ.1,749 చొప్పున, ఇతర అవసరాలకు రూ.2,023 చొప్పున ఒక్కొక్కరు మొత్తం రూ. 3,773 ఖర్చు పెడుతున్నారు. -
అంతరించిపోతున్న వన్యప్రాణులు
వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్–2024లో అర్ధ శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణుల జాతులు కనుమరుగైనట్లు పేర్కొంది. అడవుల నరికివేత, జంతువుల అక్రమ రవాణా, మానవ కార్యకలాపాలతో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని వెల్లడించింది.అడవుల నరికివేత, జంతువుల అక్రమ రవాణా, మానవ కార్యకలాపాలతో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్–2024లో అర్ధ శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణుల జాతులు కనుమరుగైనట్టు పేర్కొంది. 1970 నుంచి 2020 మధ్య కాలంలో సగటు జాతుల్లో 73శాతం తగ్గుదలను గుర్తించింది. అత్యధికంగా మంచి నీటిలో జీవించే జాతులు ఎక్కువ ప్రమాదానికి (85శాతం) అంతరించిపోయినట్టు స్పష్టం చేసింది. భూ సంబంధ జాతుల్లో 69శాతం, సముద్ర జాతుల్లో 56 శాతంగా ఉంది. ఇలా వన్యప్రాణులు అంతరించపోవడం 022(69శాతం)తో పోలిస్తే ఈ ఏడాది నాలుగు శాతం పెరగడం గమనార్హం. ఈ క్రమంలోనే జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ అందించిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్‌లో 1970–2020 నుంచి 35వేలకుపైగా వన్యప్రాణుల జాతులు, 5,495 జాతుల ఉభయ చరాలు, పక్షులు, చేపలు, క్షీరదాలు, సరీసృపాలు అంతరించిపోయాయి. – సాక్షి, అమరావతిఅమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లోనే ఎక్కువరెండువేల చెట్లు, 800 జంతుజాతులకు నిలయమైన అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వేట కారణంగా పెద్ద పండ్లను తినే జంతువులను కోల్పోవడంతో, పెద్ద విత్తనాల వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. పగడపు దిబ్బల వంటి అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థల్లో కొన్నింటిని కోల్పోవడం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతోందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. సముద్ర జీవ వైవిధ్యం, తీర ప్రాంత రక్షణలకు పగడపు దిబ్బలు అవసరమని అభిప్రాయపడింది. గ్రీన్ ల్యాండ్, వెస్ట్ అంటార్కిటిక్‌లో మంచు పలకలు కరగడంతో పెద్ద ఎత్తున మీథేన్, కార్బన్ ఉద్గారాలు పెరిగేందుకు కారణమవుతోందని తెలిపింది.భారత్‌లో రాబందులు భారతదేశంలో మూడు రాబందు జాతులు అంతరించపోవడం నివేదిక ప్రమాదంగా భావిస్తోంది. గడిచిన రెండు దశాబ్దాల్లోనే వైట్–రంప్డ్ వల్చర్ (తెల్ల రాబందు) 67శాతం, ఇండియన్ రాబందు 48శాతం, స్లెండర్–బిల్డ్ రాబందు (హిమాలయన్ రాబందు) 89 శాతం అంతరించినట్టు నివేదిక పేర్కొంది. వీటిని రక్షించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి పరిరక్షణ చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తోంది. దేశంలో వన్యప్రాణులు అంతరించిపోతున్నా, కొన్ని ప్రాంతాల్లోని జీవజాతులను రక్షించడం, పునరుద్ధరించడంలో ప్రభుత్వ కార్యక్రమాలు చురుగ్గా ఉన్నట్టు నివేదిక చెబుతోంది.అడవి పులులకు నిలయంగా భారత్ భారత్ ప్రపంచ వ్యాప్తంగా అడవి పులుల అత్యధిక జనాభాకు నిలయంగా ఉంది. ఆల్–ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 అంచనా ప్రకారం 3,682 పులులు ఉన్నట్టు తే ల్చింది. అలాగే మొట్టమొదటి మంచు చిరుత జనాభా అంచనానూ ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో 718 మంచు చిరుతలను గుర్తించింది. ఆహార భద్రత ముప్పు జీవవైవిధ్య నష్టం, వాతావరణ సవాళ్ల కారణంగా 73.5 కోట్ల మంది ప్రజలు ప్రతి రాత్రి ఆకలితో పడుకుంటున్నారు. 90 శాతానికి పైగా పంట రకాలు కనుమరుగయ్యాయి. కేవలం 10 పంటలు (బార్లీ, సరుగుడు, మొక్కజొన్న, ఆయిల్ పామ్, వరి, జొన్న, సోయాబీన్, చెరకు, గోధుమలు, రాప్సీడ్) ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 83శాతం ఆహారాన్ని అందిస్తున్నాయి. మత్స్య సంపద నుంచి సంవత్సరానికి సుమారు 9 కోట్ల టన్నుల సీఫుడ్ అందుతోంది. ఇది 300 కోట్ల మందికి పైగా ప్రజలకు అవసరం. అయితే 37.7శాతం అధికంగా చేపలు పట్టడం వల్ల చేపల జనాభా క్షీణత, పగడపు దిబ్బలు దెబ్బతింటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1970–2020 వరకు వివిధ దేశాల్లో అంతరించిన వన్యప్రాణులు, ఉభయచరాలు, పక్షులు, చేపలు, క్షీరదాల జాబితా..» లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో95%» ఆఫ్రికాలో 76%» ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో60%» యూరప్‌లో మధ్యస్తంగా మధ్య ఆసియాలో 35%» ఉత్తర అమెరికాలో39% -
మన ఫిల్టర్ కాఫీకి ప్రపంచం ఫిదా
ఫిల్టర్ కాఫీ ఆ పేరు వింటేనే.. ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలేస్తుంది. ఉదయం నిద్ర లేవగానే వేడివేడిగా.. ఘుమఘుమలాడే ఫిల్టర్ కాఫీ తాగితే.. కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. ఉదయించే సూర్యుడితో పాటే.. ఒక కప్పు ఫిల్టర్ కాఫీ గొంతులో పడితే మనకు మరో కొత్త ప్రపంచం కనిపిస్తుంది. ఎక్కడలేని హుషారు కలిగిస్తుంది. కాఫీలో ఎన్నో రకాలున్నప్పటికీ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్ కాఫీనే. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో ఎంతో పేరొందిన ఈ ఫిల్టర్ కాఫీ ప్రపంచంలోనే ‘ది బెస్ట్’గా నిలిచింది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫాం ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన ప్రపంచ టాప్ కాఫీల జాబితాలో మన ‘ఫిల్టర్ కాఫీ’ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్్క భారత్‌లోకి ఎలా వచ్చిందంటే..? దీని మూలం ఆఫ్రికా. అక్కడి నుంచి ‘యెమెన్‌కు’ తీసుకువచ్చి పెంచడం మొదలుపెట్టారు. విత్తనాలు అమ్మడం, వేరే దేశాలకు ఇవ్వడం అక్కడ నిషిద్ధం. మక్కా వెళ్లిన సూఫీ సెయింట్ బాబా అక్కడి నుంచి రహస్యంగా ఏడు కాఫీ గింజలను తీసుకొచ్చి కర్ణాటకలోని చిక్మగలూర్ కొండల్లో నాటినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే ‘టీ’కి ప్రత్యామ్నాయంగా బ్రిటీష్ వాళ్లు కాఫీ అమ్మకాలను, పంటను ప్రోత్సహించారని.. దీంతో కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు విస్తరించిందని పేర్కొంటున్నారు. టాప్–10 జాబితాలో ఉన్న వివిధ దేశాల కాఫీలు1. క్యూబన్ ఎ్రస్పెస్సో (క్యూబా) 2. ఫిల్టర్ కాఫీ (భారత్) 3. ఎ్రస్పెస్సో ఫ్రెడ్డో (గ్రీస్) 4. ఫ్రెడ్డో క్యాపుచినో (గ్రీస్) 5. క్యాపుచినో (ఇటలీ) 6. ఫ్రాప్పే కాఫీ (గ్రీస్) 7. రిస్ట్రోట్టో (ఇటలీ) 8. వియత్నమీస్ ఐస్డ్ కాఫీ (వియత్నాం) 9. ఎస్ప్రెస్సో (ఇటలీ) 10. టర్కిష్ కాఫీ ( టర్కీ) ప్రయోజనాలు ఫిల్టర్ కాఫీని మితంగా తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నివేదిక వెల్లడించింది. అలాగే మూడ్ బూస్టర్‌గా మారి.. ఏకాగ్రత, చురుకుదనం, మానసిక స్పష్టతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. టైప్–2 డయాబెటిస్ రిస్‌్కను తగ్గిస్తుందని, కాలేయానికి రక్షణ కల్పిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. కెఫిన్ వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నాయి.అధికమైతే అనర్థమే!ఏదైనా అతిగా చేస్తే అనర్థమే. కొందరు రోజుకు ఆరేడుసార్లు ఫిల్టర్ కాఫీ తాగేస్తుంటారు. ఇలా ఫిల్టర్ కాఫీ కూడా అతిగా తాగితే పలు సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులోని కెఫిన్ రక్తపోటును, హార్ట్‌రేట్, యాంగ్జైటీని పెంచుతుందని.. నిద్ర సమస్యలను కలుగజేస్తుందని హెచ్చరిస్తున్నారు. గర్భిణులు, చిన్నపిల్లలు దీనికి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. రోజుకు మూడు కప్పులకు మించి తాగొద్దని సూచిస్తున్నారు. -
భారీగా పెరిగిన వెహికల్ సేల్స్: ఎస్ఐఏఎమ్ రిపోర్ట్
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) సెప్టెంబర్ 2024లో ఆటో పరిశ్రమ విక్రయాల సంఖ్యను విడుదల చేసింది. గత నెలలో వెహికల్ సేల్స్ 24,62,431 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ అమ్మకాలు సెప్టెంబర్ 2023 కంటే 12.6 శాతం ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి.సెప్టెంబర్ 2024లో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 3,56,752 యూనిట్లు. 2023లో ఇదే నెలలో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 3,61,717 యూనిట్లు. 2023 సెప్టెంబర్ నెల కంటే కూడా 2024 సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కొంత మందగించాయి.సెప్టెంబర్ 2024లో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 20,25,993 యూనిట్లు. కాగా ఇదే నెల 2023లో టూ వీలర్ సేల్స్ 17,49,794 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే గత నెలలో టూ వీలర్ సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయని తెలుస్తోంది.ఇదీ చదవండి: రూ.9 చెల్లిస్తే.. రూ.25000 ప్రయోజనం: ఫోన్‌పేలో కొత్త ప్లాన్వాహనాల అమ్మకాలను గురించి ఎస్ఐఏఎమ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. మొత్తం భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కొంత ఊపందుకుంది. టూ వీలర్, త్రీ వీలర్ సేల్స్ వరుసగా 12.6 శాతం, 6.6 శాతం వృద్ధి చెందాయి. అయితే ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు మాత్రం కొంత క్షీణతను నమోదు చేశాయని పేర్కొన్నారు. -
తమిళనాడుకు భారీ వర్ష సూచన.. మిగిలిన రాష్ట్రాల్లో..
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.తమిళనాడుతో అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5-6 రోజులలో దక్షిణ కర్ణాటక, కేరళలోనూ భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబరు 14 నుంచి 16వ తేదీ మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.గడచిన 24 గంటల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. తూర్పు రాజస్థాన్‌లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. సంచోర్ (జలోర్)లో గరిష్టంగా 25 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఢిల్లీలో మేఘావృతమై గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: దేవర గట్టు కర్రల సమరంలో పారిన నెత్తురు.. 100మందికి పైగా భక్తులకి గాయాలు -
భారత ఆహారమే బెస్ట్
సాక్షి, అమరావతి: ప్రతి దేశంలో విభిన్న ఆహార అలవాట్లు, పద్ధతులు ఉంటాయి. వాటిలో ఏ దేశ ఆహారం, పద్ధతులు ఉత్తమమైనవి అంటే.. కచ్చితంగా భారత దేశానివేనని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. మానవుల ఆరోగ్యంతోపాటు, భూమిపై కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడటంలోనూ భారత ఆహార (ఇండియన్ ఫుడ్ ప్లేట్) పద్ధతులు, సాగు విధానాలే భేషైనవని తేల్చి చెబుతున్నాయి. కొన్ని దేశాల ఆహారం మొత్తం భూమండలానికే డేంజర్ అని కూడా ఆ సంస్థలు లెక్కలు కట్టి మరీ చెబుతున్నాయి. ఆరోగ్యం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో భారత ఆహారం కీలక పాత్ర పోషిస్తోందని స్విట్జర్లాండ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రపంచ వన్యప్రాణి ఫౌండేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) కూడా తన లివింగ్ ప్లానెట్ పరిశోధనలో తాజాగా వెల్లడించింది. ఎక్కువ శాకాహారం, తక్కువ మాంసాహారం ఉండే భారత విధానం అత్యుత్తమమైనదని తెలిపింది. తక్కువ రసాయన ఎరువులతో ఆరోగ్యకరమైన భారత దేశ సాగు విధానం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని వెల్లడించింది.ఈ పంటల ఉత్పత్తి విధానాన్ని అన్ని దేశాలు అనుసరిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపింది. తద్వారా 2050 నాటికి పర్యావరణ కాలుష్యానికి చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించింది. భారత్ తర్వాత ఇండొనేసియా, చైనాలో ఆహార పద్ధతులు భేషైనవని పేర్కొంది. అమెరికా, అర్జెంటీనా, ఆ్రస్టేలియా వంటి దేశాల ఆహార పద్ధతులు ప్రపంచానికి, పర్యావరణానికి ప్రమాదకరమని చెబుతోంది. తృణధాన్యాలతో ఎంతో మేలు భారతదేశ సంప్రదాయ ఆహారంలో తృణ ధాన్యాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. ప్రజల ఆరోగ్యం, వాతావరణ పరిరక్షణకు తృణ ధాన్యాలు (మిల్లెట్లు) మేలైనవని చెప్పింది. ఉత్తర భారత దేశంలో తృణ ధాన్యాలు, గోధుమ ఆధారిత రోటీలు, అప్పుడప్పుడు మాంసం వంటకాలు, దక్షిణాదిలో ప్రధానంగా అన్నం, ఇడ్లీ, దోస వంటి బియ్యం ఆధారిత ఆహారం, పశ్చిమ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో రకరకాల చేపలతో పాటు జొన్న, సజ్జలు, రాగి, గోధుమలు వంటి పురాతన మిల్లెట్లతో అధిక ప్రయోజనాలు కలుగుతున్నాయని పేర్కొంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కొవ్వు, చక్కెర పదార్థాల వినియోగం పెరగడం వల్ల స్తూలకాయులు పెరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. తక్కువ భూమి వినియోగించాలి.. మేలైన పంటల సాగు ద్వారా వ్యవసాయ భూమిని గణనీయంగా తగ్గించవచ్చని ఆ నివేదిక తెలిపింది. ఇందుకు కూడా భారత విధానాలే ఉత్తమమైనవని తెలిపింది. భారత విధానాలను ఇతర దేశాలు అనుసరిస్తే 2050 నాటికి ప్రపంచ ఆహార ఉత్పత్తికి ఒక భూమి (ఎర్త్)లో 0.84 కంటే తక్కువ అవసరం ఉంటుందని వివరించింది. ఇతర దేశాల్లోని విధానాలే పాటిస్తే మన భూగ్రహం సరిపోదని, ఒకటి కంటే ఎక్కువే అవసరమవుతాయని హెచ్చరించింది. ఉదాహరణకు అర్జెంటీనా ఆహార పద్ధతులను అవలంభిస్తే ఆహార ఉత్పత్తులకు ఏడు భూగ్రహాలు కూడా సరిపోవని వివరించింది. పప్పులు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత ఆహారం, మాంసానికి ప్రత్యామ్నాయంగా అధిక పోషక విలువలు ఉండే ఆల్గే (నీటిలో పెరిగే మొక్కలు) వినియోగించాలని కోరుతోంది. -
పునరుత్పాదక రంగంలో ఉపాధి పరుగులు
ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఈ రంగంలో 2023 సంవత్సరంలో దాదాపు 10,18,800 (1.02 మిలియన్ల) ఉద్యోగాల కల్పన జరిగింది. ఈ విషయాన్ని ఇటీవల అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఆర్‌ఈఎన్‌ఏ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో 2022లో 4.9 మిలియన్ల మందికి ఉద్యోగాలు లభించాయి. ఆ సంఖ్య అనూహ్యంగా 2023లో 16.2 మిలియన్లకు పెరిగింది. మన దేశంలో 2022లో 2,82,200 మందికి కొలువులు వచ్చాయి. 2023లో ఈ సంఖ్య భారీగా పెరిగి దాదాపు 10,18,800కు చేరింది. ఒక్క చైనా మినహా ప్రపంచ దేశాలన్నింటి కంటే మన దేశమే ఈ విషయంలో పురోగమనంలో ఉంది. మొత్తం ఉద్యోగాల్లో దాదాపు 40శాతం మంది మహిళలు ఉండటం విశేషం. – సాక్షి, అమరావతి -
‘ఫ్రీ హోల్డ్’ అన్నీ సక్రమమే!
మహారాణిపేట (విశాఖ): పేదల భూములు కాజేశారంటూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు చేసిన ప్రకటనలు అవాస్తవాలు అని తేలిపోయింది. ఆసైన్డ్ భూములు, డీ పట్టా భూములకు హక్కులు కల్పించేందుకు చేపట్టిన ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని డిప్యూటీ కలెక్టర్ల కమిటీ నిగ్గు తేల్చింది. ఇదే నివేదికను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపించింది. భూములపై విచారణకు వెళ్లిన డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు అక్కడ పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. ముందుగా వీరికి చెప్పి పంపిన పద్ధతి వేరు, గ్రామంలోకి వెళ్లిన తర్వాత పరిస్థితి వేరుగా కనిపించింది. గ్రామంలో అడుగడుగునా విచారణ చేసిన డిప్యూటీ కలెక్టర్ల బృందానికి అక్రమాలు జరిగినట్టు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు. దీంతో డిప్యూటీ కలెక్టర్లు అయోమయంలో పడ్డారు. బెడిసికొట్టిన గోబెల్స్ ప్రచారం ఫ్రీ హోల్డ్ పేరిట పేదల భూములను బలవంతంగా లాక్కున్నారని చేసిన గోబెల్స్ ప్రచారం కమిటీ విచారణతో బెడిసికొట్టినట్టు అయ్యింది. అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎంతో హడావుడిగా ఫ్రీ హోల్డ్ భూములకు సర్టిఫికెట్ల జారీకి బ్రేకులు వేసి, రిజి్రస్టేషన్ల ప్రక్రియ నిలుపుదల చేశారు. అంతేకాకుండా ఈ భూముల కొనుగోలు, ఇతర లావాదేవీలపై విచారణ చేయాలని నిర్ణయించి విచారణ కమిటీలను నియమించారు. మొత్తం నాలుగు మండలాల్లో జరిగిన ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల జారీపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విచారణ ముమ్మరంగా కొనసాగింది. ఒక్కో మండలానికి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి చేత విచారణ చేపట్టారు. వీరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, అవకతవకలపై ప్రశ్నించారు. భూముల కోసం ఎవరైనా ఇబ్బందులు పెట్టారా? అని అడిగారు. ఎక్కడా ఫిర్యాదులు రాలేదు. గ్రామ సభలో చెప్పలేకపోతే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి చెప్పవచ్చని డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు చెప్పడం విశేషం. అయినా ఎవరూ ముందుకు రాలేదు. వచ్చిన ఫిర్యాదుల్లో లీగల్ హెయిర్ (కుటుంబ సభ్యులు) అయిన తమకు డబ్బులు ఇవ్వకుండా తీసుకున్నారని, ఈ భూముల్లో తమకూ వాటా ఉందని, న్యాయం చేయాలనే ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్లు తలలు పట్టుకున్నారు. పేదల భూములకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం హక్కులు పేదల భూములకు హక్కులు కల్పించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. డీ పట్టా భూములకు హక్కులు కల్పిస్తూ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు జీవో 596 జారీ చేసింది. 2002 సంవత్సరానికి ముందు మంజూరు చేసిన డీ పట్టా భూములకు హక్కులు కల్పించడమే జీవో ముఖ్య ఉద్దేశం. హక్కులతో పాటు రిజిస్ట్రేషన్లు చేసి పేదలకు అందించేందుకు అప్పట్లో శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జీవనాధారం కోసం భూమి క్రయ, విక్రయాలకు అవకాశం కల్పించారు. 609 ఎకరాలు ఫ్రీ హోల్డ్ ఈ జీవో ప్రకారం జిల్లాలో 609 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. వీటిలో 190 ఎకరాలకు రిజి్రస్టేషన్లు పూర్తి చేశారు. అయితే ఈ ప్రక్రియపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎన్నికలకు ముందు తీవ్ర ఆరోపణలు చేశారు. పేదల భూముల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హడావుడిగా ఫ్రీ హోల్డ్ ప్రక్రియను నిలిపివేసింది. స్వయంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఈ భూములను పరిశీలించి వెళ్లారు. తాజాగా డిప్యూటీ కలెక్టర్ల కమిటీ కూడా ఫ్రీ హోల్డ్, రిజి్రస్టేషన్ చేసిన భూముల రికార్డులతో పాటు యజమానులను కలిసి విచారించారు. ఇందులో ఆనందపురం మండలంలో 407.77 ఎకరాలు, పద్మనాభంలో 129.60 ఎకరాలు, పెందుర్తిలో 20.04 ఎకరాలు, భీమిలిలో 52.51 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో ఎటువంటి అవకతవకలు, అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ కాలేదు. దీంతో కమిటీ ఇదే విషయాన్ని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది. -
ఎన్పీఏలు తగ్గుతున్నాయ్ కానీ..
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 2.5 శాతానికి మెరుగుపడుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. అయితే, వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్, బ్యాంకింగ్ మైక్రోఫైనాన్స్ (ఎంఎఫ్ఐ) రుణాల వంటి ఎటువంటి హామీ లేని (అన్సెక్యూర్డ్) రుణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా విభాగాల్లో బ్యాంకింగ్ రుణాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. » 2023–24 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదయ్యింది. 2024–25లో ఈ రేటును 6.8 శాతంగా అంచనా వేయడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రుణ వృద్ధి రేటు కూడా ఇదే సంవత్సరాల్లో 16 శాతం నుంచి 14 శాతానికి తగ్గే అవకాశం ఉంది. అయితే గడచిన దశాబ్ద కాలంలో 14 శాతం రుణ వృద్ధి రేటు అతిపెద్ద మూడవ వేగవంతమైన పురోగతి రేటు. » వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్, బ్యాంకింగ్ మైక్రోఫైనాన్స్ (ఎంఎఫ్ఐ) రుణాల వంటి అన్సెక్యూర్డ్ రుణాలకు అధిక రిస్క్ వెయిటేజ్ ఇవ్వాలన్న రెగ్యులేటరీ నిబంధనలతో ఇప్పటికే బ్యాంకింగ్ వీటిపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. » స్థూల ఎన్పీఏలు గతంలో బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఎదురుదెబ్బలకు కారణమయ్యాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన పురోగతి కనబడింది. 2023–24లో ఈ రేటు 2.8 శాతం ఉంటే, 2024–25లో 2.5 శాతానికి తగ్గడం సానుకూల పరిణామం. » అన్సెక్యూర్డ్ రుణాలను తీసుకుంటే స్థూల ఎన్పీఏలు 2023–24లో 1.5 శాతం ఉంటే, 2024–25లో ఈ రేటు 2 శాతానికి చేరే అవకాశం ఉంది. » 30 రోజుల పాటు చెల్లించని రుణాలను ఇంకా స్థూల ఎన్పీఏలుగా గుర్తించబడనప్పటికీ, ఇవి కూడా కలుపుకుంటే వీటి తీవ్రత 2.1 శాతం నుంచి 2.5 శాతానికి పెరుగుతుంది. » 2023–24లో సూక్ష్మ రుణ సంస్థల రుణ వ్యయాలు 2 శాతం ఉంటే, 2024–25లో ఇవి 3.5 శాతానికి పెరగనున్నాయి. కార్పొరేట్ ‘క్రెడిట్ ఫ్రొఫైల్’కు ఎకానమీ వృద్ధి బాసట ఇదిలాఉండగా, అధిక ఆర్థిక వృద్ధి రేటు... 2024–25 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారత్ కార్పొరేట్ క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరిచినట్లు క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. మున్ముందు మరింత మెరుగుపడుతుందన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది. దాదాపు 7,000 కంపెనీలను రేటింగ్ ఇచ్చే క్రిసిల్ రేటింగ్స్... ఈ విషయంలో ఒక నివేదిక విడుదల చేస్తూ, క్రెడిట్ ప్రొఫైల్ పెరుగుదల నిష్పత్తి 2023 అక్టోబర్– 2024 మార్చి మధ్య 1.79 రెట్లు ఉండగా, ఏప్రిల్–సెప్టెంబర్‌లో ఇది 2.75 రెట్లు మెరుగుపడినట్లు తెలిపింది. గత ఆరు నెలల్లో 506 కంపెనీల రేటింగ్లను అప్‌గ్రేడ్ చేయగా, 184 డౌన్గ్రేడ్లు ఉన్నాయని వివరించింది. సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి దీనిపై మాట్లాడుతూ, భారత్ కార్పొరేట్ రంగంపై క్రిసిల్కు సానుకూల క్రెడిట్ అవుట్‌లుక్ ఉందని తెలిపింది. ప్రభుత్వ మౌలిక సదుపాయాల పెట్టుబడులు, ప్రైవేట్ వినియోగం ఎకానమీ పురోగతికి దారితీసే అంశాలని పేర్కొంది. 2024 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వ్యవధిలో (ప్రథమార్థంలో) 38 శాతానికి పైగా రేటింగ్ అప్గ్రేడ్లు మౌలిక సదుపాయాలు లేదా సంబంధిత రంగాలకు చెందినవేనని తెలిపింది. -
రాష్ట్రంలో మూడేళ్లుగా చలి తక్కువే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లుగా అత్యంత చలి రోజులు నమోదు కాలేదు. అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా గత ఐదేళ్లతో పోలిస్తే 2023లోనే నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో సంవత్సరాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజులు, అత్యధిక చలి నమోదైన రోజుల వివరాలను కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక–2024 వెల్లడించింది.2014లో సగటున మూడ్రోజులు మాత్రమే అత్యంత చలి నమోదైందని, 2018లో సగటున ఏనిమిది రోజులు అత్యంత చలి నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2019లో కేవలం ఒకరోజు మాత్రమే అత్యంత చలి నమోదైతే.. 2020లో ఆరు రోజులపాటు అత్యంత చలి నమోదైంది. అదే 2021 నుంచి 2023 వరకు ఒక్కరోజు కూడా అత్యంత చలి నమోదు కాలేదుఇక 2023లో దేశంలో ఢిల్లీ, హరియాణ, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అత్యధిక చలి రోజులు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. 2023లో ఢిల్లీలో అత్యధికంగా సగటున ఐదు రోజులు అత్యంత చలి రోజులు నమోదైంది. వరుసగా రెండ్రోజులు 45 డిగ్రీలుంటే హీట్ వేవ్..ఎక్కడైనా రెండ్రోజులపాటు గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే హీట్‌వేవ్ పరిస్థితులుగా పరిగణిస్తారు. రాష్ట్రంలో 2016 మే 2న ప్రకాశం జిల్లా వెలిగండ్లలో అత్యధికంగా 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, 2017 మే 17న ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 31 2018లో నెల్లూరు జిల్లా మర్రిపాడు, డిచ్చిపల్లిలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2019 మే 26న కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2020 మేలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2021 మేలో ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 45.9 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఇక 2022లో అత్యధికంగా తిరుపతిలో 45.9 డిగ్రీలు, 2023లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం గ్రామీణ ప్రాంతంలో 2023 మే 16న అత్యథికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.అత్యధిక ఉష్ణోగ్రతల తీరూతెన్ను ఇలా..ఇక రాష్ట్రంలో 2014లో సగటున 16 రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఆ తరువాత 2023లోనే సగటున 15 రోజుల పాటు ఇవి నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2023లో దేశంలోకెల్లా బిహార్‌లో 18 రోజులపాటు అత్యధిక వేడి రోజులు నమోదయ్యాయి. ఆ తరువాత ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛతీస్‌గఢ్ తమిళనాడు రాష్ట్రాలున్నాయని నివేదిక పేర్కొంది. -
తిరుమలకు చంద్రబాబు కళంకం తెచ్చారు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం పవిత్రమైన తిరుమలకు కళంకం తెచ్చారని హైందవ, పౌర సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ జరిగిందంటూ నిందలు మోపిన చంద్రబాబు తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో తిరుమల లడ్డూ వివాదంపై ఆచార్య రామానుజ సమితి రూపొందించిన సత్యశోధన నివేదిక విడుదల చేశారు. నెయ్యి కల్తీ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని, చంద్రబాబు ప్రభుత్వం గుజరాత్ ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్ పైనే అనుమానాలు ఉన్నాయని ఈ నివేదికలో తేల్చారు. ఎంతో కీలకమైన ఈ అంశంలో నెయ్యి శాంపిల్స్ ఒకే ల్యాబ్‌కు పంపడం, పంపే ముందు టీటీడీ ఈవో ఎన్డీడీబీ ప్రతినిధులతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తోందని నివేదికలో పేర్కొన్నారు. ఎవరూ చేయనంత అపచారమిదిఈ సందర్భంగా ఆచార్య రామానుజ సంక్షేమ సమితి చైర్మన్ డీఎస్ఎన్వీ ప్రసాదబాబు మాట్లాడుతూ.. తిరుమల చరిత్రలో ఎవరూ చేయనంత అపచారం సీఎం చంద్రబాబు చేశారన్నారు. శ్రీవారి ప్రసాదానికి కళంకం ఆపాదించారని మండిపడ్డారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఈవో శ్యామలరావును దుష్ట్రతయంగా అభివర్ణించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఆ వివాదంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు కూడా పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల పరువు మంటగలిపారుగీతా విజన్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పొక్కులూరి సుబ్బారావు మాట్లాడుతూ.. తమ అధ్యయనంలో నెయ్యి శాంపిల్స్‌లో జంతువుల కొవ్వు కలిసినట్టు ఆధారాలు లభించలేదన్నారు. ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీం పవన్‌కళ్యాణ్ ఆరోపణలు చేసి తిరుమల పరువు మంటగలిపారని మండిపడ్డారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు క్షుద్ర రాజకీయాలను చూసి క్షుద్ర దేవతలు కూడా సిగ్గుపడతారన్నారు.లడ్డూ వివాదంలో చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారని, ఫలితంగా తిరుమల పవిత్రతకు భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన పాలనలో పగ ప్రతీకారాలకే ప్రాధాన్యమిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతో తన ప్రతి వైఫల్యాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లడ్డూ విషయంలో చంద్రబాబు, ఈవో శ్యామలరావు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి అడ్డంగా దొరికిపోయారన్నారు. సుప్రీం వ్యాఖ్యలు చెప్పు దెబ్బలాంటివిఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ బి.ఆశోక్‌కుమార్ మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు, పవన్, ఈవో శ్యామలరావుకు చెప్పు దెబ్బలాంటివన్నారు. నీతి, నిజాయితీ ఉన్న నాయకులు ఎవరైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు రాజీనామా చేసి ఉండేవారన్నారు. పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఓవరాక్షన్ చేస్తున్నారని, దాని కారణంగా సనాతన ధర్మం నవ్వుల పాలవుతోందని ఎద్దేవా చేశారు. సత్యశోధన నివేదికను పరిశీలిస్తే లడ్డూ ప్రసాదం విషయంలో కుట్రకోణం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో సామాజిక కార్యకర్త వంగ శోభన్‌బాబు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలకు ఏమైంది?
న్యూఢిల్లీ: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో 11 శాతం మేర క్షీణించాయి. మొత్తం 1.07 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 1,20,290 యూనిట్లుగా ఉన్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది.కొత్త ఆవిష్కరణలు తక్కువగా ఉండడం, అదే సమయంలో ఇళ్ల ధరలు సగటున 23 శాతం పెరగడం అమ్మకాల క్షీణతకు కారణాలుగా పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో అమ్మకాలు ఏకంగా 22 శాతం తగ్గి 12,735 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 16,375 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. పట్టణాల వారీగా.. » పుణెలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 17 శాతం తక్కువగా 19,050 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. » ఢిల్లీ ఎన్సీఆర్లో అమ్మకాలు 15,570 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాల కంటే 2% తక్కువ. » బెంగళూరులో ఇళ్ల విక్రయాలు 8 శాతం క్షీణించి 15,025 యూనిట్లుగా ఉన్నాయి. » కోల్‌కతా పట్టణంలో 25 తక్కువగా 3,980 యూనిట్ల విక్రయాలు జరిగాయి. » చెన్నైలో 4,510 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,945 యూనిట్ల కంటే 9% తగ్గాయి. హైదరాబాద్‌లో ధరల పెరుగుదల అధికం ఏడు ప్రముఖ పట్టణాల్లో హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరల పెరుగుదల అధికంగా 32 శాతం మేర నమోదైంది. ‘‘నిర్మాణంలోకి వినియోగించే ఉత్పత్తుల ధరలు పెరగడం, అమ్మకాల్లోనూ గణనీయమైన వృద్ధితో.. ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు మొత్తం మీద 23 శాతం మేర పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.6,800 నుంచి రూ.8,390కు పెరిగింది’’అని అనరాక్ నివేదిక తెలిపింది. పండుగల కాలంలో డిమాండ్ ‘‘అన్ని ప్రముఖ పట్టణాల్లోనూ ఇళ్ల అమ్మకాలు క్షీణించాయి. టాప్–7 పట్టణాల్లో నూతన ఇళ్ల యూనిట్ల సరఫరా జూలై–సెపె్టంబర్ మధ్య 19 శాతం తగ్గి 93,750 యూనిట్లుగానే ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 1,16,220 కొత్త యూనిట్ల సరఫరా నమోదైంది. ఆవిష్కరణల కంటే విక్రయాలు ఎక్కువగా ఉండడం.. డిమాండ్–సరఫరా సమీకరణం బలంగా ఉండడాన్ని సూచిస్తోంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. అధిక ధరలకు తోడు, వర్షాకాలం కావడం విక్రయాలు తగ్గడం వెనుక ఉన్న అంశాలుగా పేర్కొన్నారు. -
'వృద్ధి'ల్లుతోంది
సాక్షి, అమరావతి: ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలో జనాభా వృద్ధి తగ్గుతోంది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ జనాభా వృద్ధి పెరుగుతోంది. 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే 2024లో పలు రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదలను విశ్లేషిస్తూ ఎస్బీఐ రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలతో పోల్చితే 2024 అంచనాల మేరకు తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనాభా వృద్ధి క్షీణించిందని నివేదిక తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో 2011లో జనాభా వృద్ధి 15% ఉండగా 2024 అంచనాల మేరకు జనాభా వృద్ధి 12 శాతానికి తగ్గిపోయిందని పేర్కొంది.ఉత్తరాది రాష్ట్రాల్లో 2011 లెక్కల ప్రకారం జనాభా వృద్ధి 27 శాతం ఉండగా 2024 అంచనాల మేరకు అది 29 శాతానికి పెరిగిందని వెల్లడించింది. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఏపీ రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య తక్కువగా పెరుగుతోందని వెల్లడించింది. ఏపీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 50 లక్షలు ఉండగా ఇది మొత్తం జనాభాలో 10.1%గా ఉంది. 2024 అంచనాల మేరకు వృద్ధుల జనాభా 70 లక్షలకు పెరిగింది. ఇది మొత్తం జనాభాలో 12.4%గా ఉంది. అంటే 2011–24 నాటికి వృద్ధుల సంఖ్య 2.3% పెరిగింది. 2011 జనాభాతో పోల్చి చూస్తే 2024 అంచనాల మేరకు కేరళలో 16.5 శాతం, తమిళనాడు 13.6 శాతం, హిమాచల్ ప్రదేశ్ 13.1 శాతం, పంజాబ్ 12.6 శాతం వృద్ధులు పెరిగారు. అతి తక్కువగా వృద్ధుల జనాభా 2024 అంచనా మేరకు బిహార్‌లో 7.7 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 8.1 శాతం, అసోంలో 8.2 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
ఉద్యోగులపై ఏఐ ఎఫెక్ట్!.. గ్రేట్ లెర్నింగ్ రిపోర్ట్
ప్రముఖ గ్లోబల్ ఎడ్టెక్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్ ‘అప్‌స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2024-25’ మూడవ ఎడిషన్‌ను విడుదల చేసింది. భారతదేశంలోని నిపుణులను ప్రభావితం చేసే కీలక విషయాలను తెలుసుకోవడానికి ప్రధాన రంగాల్లోని 1000 మంది ద్వారా ఈ డేటా సేకరించారు. ఈ నివేదిక లక్ష్యం ఏమిటంటే.. ఉద్యోగులపైన ప్రభావం చూపే విషయాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా.. వ్యక్తులు లేదా వ్యాపారాలకు సహాయం చేయడం.నివేదిక ప్రకారం.. హైదరాబాద్‌లోని 74 శాతం మందిపై టెక్నాలజీ, ఏఐ వంటివి ప్రభావితం చేస్తున్నాయని తెలిసింది. నగరంలోని 85 శాతం మంది తమ భవిష్యత్తును మెరుగు పరుచుకోవడంలో ఇవి ఎంతగానే ఉపయోగపడుతున్నాయని స్పష్టమైంది. కొంతమంది తమ ఉద్యోగాలపై కూడా నమ్మకాన్ని కోల్పోయారు.ప్రస్తుత టెక్నాలజీని ఎదుర్కోవడానికి, నైపుణ్యాలను పెంచుకోవడానికి హైదరాబాద్‌లోని 86 శాతం మంది పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు.గత ఏడాది చాలామంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కు ప్రాధాన్యతనిస్తూ డిజిటల్ మార్కెటింగ్‌ను అనుసరించారు. ఈ ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు.ఇదీ చదవండి: దయచూపని సీఈఓ.. ఎక్స్పీరియన్స్ లెటర్ అడిగితే..ఈ నివేదికపై గ్రేట్ లెర్నింగ్ కో ఫౌండర్ హరి కృష్ణన్ నాయర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం నుంచి ఆర్థిక పరిస్థితులు కొంత మందగించాయి. అంతే కాకుండా భౌగోళిక పరిస్థితి కూడా వ్యాపారాలను కొంత దెబ్బతీశాయని అన్నారు. ఈ తరుణంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి టెక్నాలజీని అలవరచుకోవాలి, దానికి అనుగుణంగా సాగిపోవాలని అన్నారు. -
సివిల్ సప్లైస్‌లో కంత్రీ ప్లాన్
సాక్షి, అమరావతి: పౌరసరఫరాల సంస్థలో బదిలీల పర్వం ఉద్యోగుల్లో చిచ్చురేపుతోంది. బదిలీల ప్రక్రియ కోసం సంస్థ నియమించిన ఫోర్ మెన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి.. మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పేర్లకు పట్టం కట్టడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీవోలను, ఉద్యోగుల వినతులు, మానవీయ కోణాలను పట్టించుకోకుండా ఇష్టానుసారం బదిలీలు చేశారంటూ మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఐదేళ్లు ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు చేపట్టింది. వీరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ ఉద్యోగుల నుంచి రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తులు ఆహా్వనించింది. ఇవన్నీ కేవలం ప్రక్రియలో భాగంగా చేపట్టారే తప్ప.. క్షేత్ర స్థాయిలో విస్మరించారు. వాస్తవానికి ఫోర్‌మెన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి 20 మందికి పైగా ఉద్యోగుల బదిలీకి సిఫారసు చేస్తే ఆదివారం మధ్యాహ్నం నాటికి ఆ మేరకు అధికారులు నివేదిక రూపొందించారు. తీరా సాయంత్రానికి మంత్రి కార్యాలయం నుంచి మరో జాబితా వచ్చింది. అందులో పేర్కొన్న వ్యక్తులకు మాత్రమే బదిలీ చేయాలని సాక్షాత్తూ మంత్రి హుకుం జారీ చేయడం.. ఎండీ వారిని బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయి. చేతులు మారిన ముడుపులు? పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయంలో పని చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఏకంగా తొమ్మిది మందిని ప్రధాన కార్యాలయంలో నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో తప్పనిసరి బదిలీలు లేనివారు, రిక్వెస్టు కూడా పెట్టుకోని వారు ఉండటం గమనార్హం. ఇక్కడే మొత్తం బదిలీల్లో తెనాలి, విజయవాడలోని ప్రముఖ హోటళ్ల వేదికగా భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిస్తున్నాయి. డీఎం పోస్టుకు డిమాండ్ ఉన్నచోట రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు, మిగిలిన జిల్లాల్లో రూ.10 లక్షలకు పైగా రేట్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆరోపణలున్నా పట్టించుకోలేదు విజయనగరం జిల్లా డీఎం తప్పనిసరిగా బదిలీ కావాల్సి రావడంతో ఆమెను ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. అదే ఉద్యోగిని తిరిగి వెనక్కి పంపించే ఉద్దేశంతో అక్కడి పోస్టును వేకెంట్‌గా చూపించి వదిలేసినట్టు తెలుస్తోంది. కర్నూలులో డీఎంగా పనిచేస్తున్న ఉద్యోగిని రిక్వెస్ట్ పెట్టుకోకుండానే ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆమెపై హైదరాబాద్‌లో పని చేస్తున్నప్పటి నుంచి వివిధ ఆరోపణలతో చార్జెస్ నమోదయ్యాయి. ఇదే మాదిరిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిధుల దురి్వనియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని, రెండేళ్లు ఉద్యోగంలో చెప్పాపెట్టకుండా మాయమైన మరో ఉద్యోగిని సైతం ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. దీనిపై పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్‌ను వివరణ కోరగా.. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేశామన్నారు. బదిలీల్లో ఎవరి సిఫారసులు తావివ్వలేదన్నారు. రొటేషన్ పద్ధతిలో ఫీల్డ్‌లోని ఉద్యోగులను ప్రధాన కార్యాలయానికి, ఇక్కడి ఉద్యోగులను ఫీల్డ్‌కు పంపించామన్నారు. భారీ దోపిడీకి కుట్ర! ఉద్యోగుల బదిలీలను అడ్డం పెట్టుకుని భారీ దోపిడీకి కుట్ర పన్నారనే ఆరోపణలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. అక్టోబర్ నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రారంభిస్తుండటం, డిసెంబర్, జనవరిలో పండుగలు ఉండటంతో పౌరసరఫరాల సంస్థలో భారీఎత్తున నిత్యావసర సరుకులకు టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారీగా కాంట్రాక్టులు ఉంటాయి. ఈ సందర్భంలో సదరు కాంట్రాక్టర్లను లొంగదీసుకుంటే భారీగా కమీషన్లు కొట్టేయొచ్చనే కుట్రకు బీజం వేశారు. అంటే అకౌంట్స్, ఫైనాన్స్, టెండర్ల వంటి కీలక పోస్టులు మంత్రికి అనుకూలమైన వ్యక్తులు ఉంటే వారి ద్వారా భారీగా కమీషన్లు దండుకునే ప్రణాళికలో భాగంగానే మొత్తం బదిలీల ప్రక్రియ నడిచినట్టు తెలుస్తోంది. అందుకే ప్రధాన కార్యాలయంలో మంత్రి చెప్పిన వారికి కీలక పోస్టింగ్‌లు కట్టబెట్టనున్నారు. వీరి సహాయంతో నెలావారీ వసూళ్లు మంత్రి కార్యాలయానికి నేరుగా చేరిపోయేలా స్కెచ్ వేసినట్టు సమాచారం. అందుకే కొంత మంది ఉద్యోగులపై గతంలో చార్జెస్ నమోదైనప్పటికీ అవి తేలకుండా తిరిగి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వడంపై దోపిడీ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. -
అతి వినియోగం అనర్థమే
యాంటీ బయాటిక్స్ అతి వినియోగం కొంపముంచుతోంది. దగ్గు, జలుబు, ఇలా ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగి పోయింది. దీంతో వ్యాధి కారక సూక్ష్మజీవులు రోగనిరోధక శక్తిపెంచుకుని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)తీవ్ర సమస్యగా మారుతోంది. ఫలితంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ), బ్లడ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు సాధారణ యాంటీ బయోటిక్ మందులతో చికిత్సలు కష్టతరంగా మారాయని ఐసీఎంఆర్ చెబుతోంది. ఐసీఎంఆర్‌కు చెందినఏఎంఆర్ రీసెర్చ్, సర్వైలెన్స్ నెట్వర్క్ విభాగం ఇటీవల 2023 నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. 2023 జనవరి నుంచి డిసెంబర్ మధ్య దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 99,492 నమూనాలను విశ్లేషించి, ఆ ఫలితాల ఆధారంగా నివేదికను విడుదల చేశారు. 20 శాతం తక్కువ ప్రభావంవిశ్లేషించిన నమూనాల్లో 22,182 రక్తం, 20,026 యూరిన్, 19,360 అంటు వ్యాధులు, 17, 902 లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మిగిలినవి ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు చెందినవి. కాగా సెఫోటాక్సిమ్, సెప్టాజిడిమ్, సిప్రోఫ్లా్లక్సాసిన్, లెవోఫ్లాక్సాసిన్ వంటి కీలక యాంటీ బయాటిక్స్ బ్యాక్టీరియాతో కలిగే ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో 20 శాతం తక్కువ ప్రభావాన్ని చూపినట్టు నిర్ధారించారు. ఉదాహరణకు పైపెరాసిలిన్–టాజోబాక్టమ్ ప్రభావం 2017లో 56.8 శాతం ఉండగా 2023లో 42.4 శాతానికి తగ్గింది. గ్యాస్ట్రోఎంటరైటిస్కు కారణమయ్యే సాల్మొనెల్లా టైఫీ వంటి బ్యాక్టీరియా ఫ్లూరోక్వినోలోన్ ఔషధానికి 95 శాతానికిపైగా నిరోధకతను పెంచుకుందని స్పష్టమైంది. మూత్రనాళ, ఇతర ఇన్ఫెక్షన్లలో చికిత్స కోసం వినియోగించే అమికాసిన్ ప్రభావం 2017లో 79.2 శాతం ఉండగా, 2023లో 68.2 శాతానికి పడిపోయింది. ఏఎంఆర్ ముప్పు నుంచి బయటపడటానికి తక్షణ చర్యలు అవసరమని ఈ నివేదిక నొక్కి చెప్పింది. యాంటీ బయాటిక్స్ విక్రయాలు, వినియోగంపై కఠినమైన నిబంధనలు ఉండాలని వెల్లడించింది. వ్యవసాయరంగంలోనూ యాంటీ బయాటిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టాలని స్పష్టం చేసింది. ఏటా 10 లక్షల మంది మృతి యాంటీ బయాటిక్స్ అపరిమిత వినియోగం కారణంగా వ్యాధులు సోకిననప్పుడు చికిత్సల్లో అవి పని చేయక ప్రపంచంలో ఏటా 10 లక్షల మందికిపైగా మృత్యువాతపడుతున్నారు. 1990–2021 మధ్య ఈ మరణాలు సంభవించినట్టు జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాన్సెట్‌లో ప్రచురించిన స్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. రాబోయే 25 ఏళ్లలో నాలుగు కోట్ల మంది మృత్యువాత పడే ప్రమాదం ఉన్నట్టు అంచనా వేసింది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో 2025–2050 మధ్య యాంటీ బయాటిక్స్‌కు లొంగని వ్యాధులతో 1.18 కోట్ల మరణాలు సంభవిస్తాయని పేర్కొంది. మానవాళి ఎదుర్కొంటున్న 10 అతిపెద్ద ఆరోగ్య సవాళ్లలో ఏఎంఆర్ ఒకటని డబ్ల్యూహెచ్‌వో సైతం ఇప్పటికే పలు మార్లు హెచ్చరించిందని గుర్తు చేసింది.- సాక్షి, అమరావతి -
పోలీస్ వ్యవస్థపై పెరుగుతున్న నమ్మకం
ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతా అంశాలపై అమెరికాకు చెందిన గాలప్ సంస్థ తన వార్షిక నివేదికలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఒక దశాబ్దకాలం క్రితం కంటే.. నేడు ఎంతో సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. 👉గ్లోబల్ సేఫ్టీ ట్రెండ్లను అనుసంచి.. 2023లో ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది పెద్దలు రాత్రిపూట ఒంటరిగా నడవడం సురక్షితంగా భావించారు. ఆసియా, పసిఫిక్, పశ్చిమ ఐరోపా దేశాలలోని 75 శాతం మంది భద్రత విషయంలో ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఉత్తర ఆఫ్రికాలో 74 శాతం మంది ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.👉యురేషియా ప్రాంతానికి చెందిన 20,063 మంది ఈ సర్వేలో పాల్గొనగా, ఇక్కడ భద్రత విషయంలో 34 శాతం పాయింట్ల మెరుగుదల కనిపించింది. దీంతో యూరేషియా భద్రత విషయంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని చెప్పుకోవచ్చు. 👉ఇక భద్రతపై ఆందోళన కలిగించే ప్రాంతాల విషయానికొస్తే ఉప సహారా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్లు అత్యల్ప భద్రతను కలిగి ఉన్నాయని తేలింది. 👉పోలీసులపై నమ్మకం విషయానికొస్తే 2023లో ప్రపంచవ్యాప్తంగా 71 శాతం మంది ప్రజలు స్థానిక పోలీసులపై నమ్మకాన్ని కలిగివున్నట్లు తెలిపారు. ఇది దశాబ్ధకాలంతో పోలిస్తే 62 శాతానికి పెరిగింది. కాగా ఈక్వెడార్ భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 👉2023లో కేవలం 27శాతం ఈక్వెడారియన్లు మాత్రమే రాత్రిపూట ఒంటరిగా నడవడం సురక్షితమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.👉ఇజ్రాయెల్‌లో సంఘర్షణల ప్రభావం భద్రతా లేమిని స్పష్టంగా చూపింది. హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌లో భద్రతతో ఉన్నామనే భావన అక్కడి వారిలో మరింతగా క్షీణించింది. 2022లో ఈ అంశం 82 పాయింట్లుగా ఉండగా, ఇప్పుడది 68 శాతానికి పడిపోయింది.ఇది కూడా చదవండి: కమలా హారీస్ ఆఫీసుపై కాల్పులు -
కరెంటుకు కవచం
మన దేశంలో పవర్ గ్రిడ్లకు సైబర్ దాడుల నుంచి ముప్పు పొంచి ఉంది. కొంత కాలం క్రితం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పవర్ గ్రిడ్ పనితీరులో అంతరాయాలను గుర్తించిన నిపుణులు.. దీనికి సైబర్ దాడి కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో పవర్ ఐలాండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం కేంద్రం నిర్ణయించింది. కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ (సీఎస్ఐఆర్టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ సంస్థల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. ఇటువంటి నిర్ణయాలకు చట్ట బద్ధత కల్పిస్తూ సీఈఏ తాజాగా విద్యుత్ రంగంలో సైబర్ సెక్యూరిటీపై కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, ప్రసార సంస్థల్లో చేపట్టాల్సిన చర్యలపై డ్రాఫ్ట్ నివేదికను తయారు చేసింది. సెపె్టంబర్ 10 వరకూ ఈ ‘డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్’పై దేశవ్యాప్తంగా ఎవరైనా అభ్యంతరాలు, అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం కల్పించింది. –సాక్షి, అమరావతిఇవీ నిబంధనలు..మన దేశంలో నార్త్రన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నింటినీ ‘ఒన్ నేషన్.. ఒన్ గ్రిడ్’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ గ్రిడ్ల కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి పవర్ ఐల్యాండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని సీఈఏ ప్రతిపాదించింది. పవర్ ఐల్యాండ్ సిస్టమ్ అనేది విద్యుత్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. గ్రిడ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరుచేయడాన్ని పవర్ ఐల్యాండ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. అదే విధంగా రాష్ట్ర విద్యుత్ రంగంలో కచి్చతంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఐఎస్ఓ)ను నియమించాలి. ఆ ఆఫీసర్ భారత పౌరసత్వం కలిగి ఉండాలి. వారు సంస్థ ఉన్నతాధికారికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. అలాగే ప్రతి విద్యుత్ సంస్థ సైబర్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్ (సీసీఎంపీ)ని అభివృద్ధి చేసుకోవాలి. విద్యుత్ రంగంలోని కంప్యూటర్లలో సాఫ్ట్వేర్లు హ్యాకింగ్‌కు గురికాకుండా అడ్వాన్స్ ఫైర్‌వాల్స్, డిటెక్షన్ సిస్టమ్ (డీఎస్), ప్రివెన్షన్ సిస్టమ్ (పీఎస్)ను తయారు చేయాలి. ట్రస్టెడ్ వెండర్ సిస్టమ్‌ను కూడా కచ్చితంగా పెట్టుకోవాలి. ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా మాల్వేర్ కంప్యూటర్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. వీటన్నిటిపైనా ఐటీ, టెక్నాలజీ విభాగాల్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి.అప్పట్లోనే ఏపీ చేయూత..కేవలం పవర్ గ్రిడ్లే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు కూడా అంతర్గత సమాచార రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన ఆవశ్యత ఉందనే విషయాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. గత ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్ర ఇంధనశాఖ అనుసరించిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది. దీంతో భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ).. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్‌కో జీఐఎస్ మోడల్‌ను తీసుకుంది. సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ లైన్లు, ఫిజికల్ పొజిషన్ ఎలా ఉందనేది ఈ జీఐఎస్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా గ్రిడ్ భద్రతకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. -
పట్టణాలతో సమానంగా గ్రామాలు
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ముఖ్యంగా గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో గ్రామీణ ప్రజల జీవన విధానం మెరుగుపడింది. దీంతో రాష్ట్రంలో వినియోగదారుల వ్యయంలో పట్టణాలు, గ్రామాల ప్రజల మధ్య అంతరం తగ్గిపోతోంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు పెరగడంతో అభివృద్ధిలో కూడా అంతరం తరిగిపోయి పట్టణాలతో గ్రామాలు పోటీపడుతున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయం మధ్య అంతరాలను, అసమానతలను ఎస్బీఐ నివేదిక విశ్లేíÙంచింది. గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో తేడా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఈ విషయంలో దేశంలో ఏపీ ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిపింది.దీనివల్ల రాష్ట్రంలో గ్రామీణ, పట్టణాల మధ్య అసమానతలు భారీగా తగ్గినట్లు పేర్కొంది. దేశంలో 2009–10లో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య తలసరి వ్యయం వ్యత్యాసం 88.2 శాతం ఉండగా 2022–23 నాటికి 71.2 శాతానికి తగ్గినట్లు తెలిపింది. 2029–30 నాటికి ఇది 65.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. – సాక్షి, అమరావతి దేవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.6,459 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 3,773 ఉన్నట్లు వివరించింది. రాష్ట్రంలో 2022–23 నాటికి పట్టణాలు, గ్రామాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం 39.3 శాతమేనని తెలిపింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ. రూ. 6,782 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 4,870 ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న దిగువ, మధ్య తరగతి జనాభా ఆదాయాలు మెరుగుపడటం వల్ల నెలవారీ తలసరి వ్యయంలో అంతరాలు భారీగా తగ్గినట్లు పేర్కొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద లబి్ధదారులకు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడంతో జీవన విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని నివేదిక వివరించింది. గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడం వల్ల కూడా గ్రామీణ ప్రజల ఆదాయం పెరగడంతో పాటు నెలవారీ తలసరి వ్యయం పెరుగుతోందని తెలిపింది. దీంతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయని నివేదిక పేర్కొంది. రైతుల ఆదాయాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం వల్ల కూడా గ్రామీణ జీవనం గణనీయంగా మెరుగుపడినట్లు నివేదిక తెలిపింది. 2011–12తో పోల్చి చూస్తే 2022–23లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏపీలో అసమానతలు గణనీయంగా తగ్గినట్లు నివేదిక పేర్కొంది. అదే ఛత్తీస్‌గఢ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అసమానతలు పెరిగినట్లు నివేదిక తెలిపింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఒడిశా, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసమనాతలు పెరగ్గా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అసమానతలు తగ్గినట్లు నివేదిక పేర్కొంది. -
అత్యధికుల జీవితం అప్పులతో సరి
సాక్షి, అమరావతి: భారతీయుల్లో ఎక్కువ మంది ఎడాపెడా అప్పులు చేసేస్తున్నారా. అవునంటోంది కేర్ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ. మనవాళ్లు పొదుపు చేయడం కంటే.. అప్పులు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేస్తోంది. భారతీయులకు పొదుపు కంటే రెండు రెట్లు అధికంగా అప్పులు ఉన్నట్టు కేర్ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత అప్పులు ఈ స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తున్నా.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇవి ప్రమాదకర స్థాయిలో లేవని పేర్కొంది. దేశ జీడీపీలో వ్యక్తిగత అప్పులు ఏకంగా 38 శాతానికి చేరాయి. ప్రస్తుతం దేశ జీడీపీ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.173.82 లక్షల కోట్లుగా అంచనా వేస్తుంటే.. అందులో 38 శాతం అంటే సుమారు రూ.66 లక్షల కోట్లకు సమానమైన అప్పులు మనవాళ్లు చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలైన బ్రెజిల్ జీడీపీలో వ్యక్తిగత అప్పులు 35 శాతం, దక్షిణాఫ్రికాలో 34 శాతానికే పరిమితమైనట్టు కేర్ఎడ్జ్ తన నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో మన దేశంలో వ్యక్తిగత పొదుపు జీడీపీలో 24 శాతానికే అంటే రూ.42 లక్షల కోట్లకే పరిమిత మైంది.అప్పులతో ‘రియల్’ పరుగులుమొత్తం వ్యక్తిగత అప్పుల్లో 50 శాతం గృహరుణాలే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు రుణాలు తీసుకుంటుండడం వ్యక్తిగత అప్పులు భారీగా పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది. అప్పు తీసుకుని ఖర్చు చేయకుండా సంపద సృష్టించుకోవడం కోసం వ్యయం చేస్తుండటాన్ని ఆహ్వానించింది. అప్పు తీసుకుని విలాసాలకు ఖర్చు చేయకుండా ఇల్లు, రియల్ ఎస్టేట్ వంటి సంపద సృష్టికి విని యోగంచడం సంతోషం కలిగించే విషయంగా పేర్కొంది. దేశంలో పొదుపు ఆలోచనలో భారీ మార్పు వచ్చిందని, బ్యాంకు డిపాజిట్లు వంటి వాటికంటే స్థిరాస్తుల్లో అధికంగా ఇన్వెస్ట్ చేయ డానికి మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అప్పులు విలాసాలకు విని యోగిస్తారని, కానీ.. భారత దేశంలో అప్పులను సంపద సృష్టికి వినియోగిస్తుండటంతో జీడీపీలో వ్యక్తిగత అప్పులు 38 శాతానికి చేరినా అది ప్ర మాదకర స్థాయి కాదని వెల్లడించింది. ఈ అప్పు లు నియంత్రించే స్థాయిలోనే ఉన్నట్టు పేర్కొంది. ఇతర అప్పులు వస్తే క్రెడిట్ కార్డు వంటి అన్ సెక్యూర్డ్ రుణాలు భారీగా పెరుగు తున్నట్టు హె చ్చరించింది. ఇదే సమయంలో వ్యక్తిగత ఆదా యం వృద్ధి చెందాల్సి ఉంటుందని పేర్కొంది. -
NDDB పరీక్ష నివేదికను వక్రీకరించబోయి అడ్డంగా దొరికిన టీడీపీ
-
ఉపాధి ఓకే.. నైపుణ్యాలేవి..?
సాక్షి, అమరావతి: దేశంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఉపాధికి తగిన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. ఇంజనీరింగ్ రంగంలో గ్లోబల్ పవర్‌హౌస్‌గా భారతదేశం కీర్తి గడిస్తున్నా.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగడం లేదు. పారిశ్రామిక, ఐటీ సంస్థల డిమాండ్ తీర్చడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సాధించలేకపోతున్నారు. ఏటా దేశంలో 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు డిగ్రీ పట్టాలు తీసుకుని బయటకు వెళ్తుంటే.. వారిలో కొందరికే ఉపాధి దొరుకుతోంది. ఈ క్రమంలోనే దేశంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్యకు, ఉపాధికి మధ్య గణనీయమైన అంతరం కొనసాగుతోంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రోగ్రామ్‌ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, నాణ్యమైన విద్య లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. లాభాపేక్షతో కూడిన యాజమాన్యాలు, నైపుణ్య విద్య లేకపోవడం, రోట్–లెర్నింగ్ పద్ధతులపై దృష్టి పెట్టడం, అధ్యాపకుల కొరత ఉన్నత విద్యను వేధిస్తున్న ప్రధాన సమస్యలుగా మారాయి. నైపుణ్య లేమికి కారణాలివీ..» పాత సిలబస్‌తోనే పాఠాలు: కోర్సు కంటెంట్ ఉపాధి తర్వాత ఉద్యోగ పరిశ్రమలో వాస్తవికతకు సహాయపడేలా ఉండటం లేదు. మార్కెట్‌కు ఏది అవసరమో భారతీయ విద్య అందించలేకపోతోంది. » నాణ్యమైన అధ్యాపకుల కొరత: భారతదేశంలో 33వేల కంటే ఎక్కువ కళాశాలలు ఇంజనీరింగ్ డిగ్రీలు మంజూరు చేస్తున్నాయి. ఈ విద్యాసంస్థలన్నిటికీ నాణ్యమైన ఉపాధ్యాయులు లేరు. బహుళజాతి కంపెనీలు, చిన్న ఇంజనీరింగ్ కంపెనీల్లో వడపోత తర్వాత అధ్యాపకుల ఎంపిక జరుగుతోంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో మాదిరిగా కాకుండా భారతీయ అధ్యాపకులు తెలివైన విద్యార్థులను సృష్టించే నైపుణ్యాలను అందించలేకపోతున్నారు. విద్యావంతులైన ఇంజనీర్లు ఉపాధ్యాయ వృత్తిలో అభిరుచితో కాకుండా జీవనోపాధి కోసమే చేరుతున్నారు. » ఆవిష్కరణలు, పరిశోధన లేకపోవడం: విద్యార్థులు తమను తాము నిరూపించుకునేందుకు, ఆలోచించడానికి తగినంతగా ప్రేరణ లభించడం లేదు. » తప్పు విద్యా విధానం: సెమిస్టర్ విధానంతో నిరంతరం విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టడానికే పరిమితమై మూల్యాంకన ప్రక్రియపైన, నిరంతర అభ్యాసంపైన ఆసక్తి చూపడం లేదు. వారు మంచి గ్రేడ్లను మాత్రమే కోరుకుంటున్నారు. » నైపుణ్యం–ఆధారిత విద్య లేకపోవడం: నైపుణ్యం ఆధారిత విద్య ఉండటం లేదు. ఇంజనీరింగ్ విద్యార్థులు వాస్తవ ప్రపంచంలో ఎదుర్కొనే సమస్యల ఆధారంగా శిక్షణ పొందటం లేదు. » సరైన ఆంగ్ల నైపుణ్యాలు లేకపోవడం: ఇంగ్లిష్ కమ్యూనికేటివ్ నైపుణ్యాలు లేకపోవడం, విశ్లేషణాత్మక, పరిమాణాత్మక నైపుణ్యాలు నిరుద్యోగానికి కారణం అవుతున్నాయి. అంతర్జాతీయ కస్టమర్లతో కమ్యూనికేట్ చేయాల్సిన ఐటీ ఉద్యోగులకు ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రస్తుత ఉద్యోగ పరిశ్రమలో సాఫ్ట్ స్కిల్స్ చాలా ముఖ్యమైనవిగా మారాయి. అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్ అనివార్యంఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి వృత్తిపరమైన శిక్షణతోనే సాంకేతిక విద్యను జత చేయాలని టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. తద్వారా యువ ఇంజనీర్లు తొలిరోజు నుంచీ పరిశ్రమల్లో పని చేయడానికి సిద్ధంగా ఉంటారని చెబుతోంది. అందుకే అప్రెంటిస్ షిప్, ఇంటర్న్‌షిప్ అనివార్యంగా చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వాస్తవానికి కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేసుకున్న తర్వాత శిక్షణ కోసం వారిపై ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తున్నాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లోని సమస్యలతో పాటు ఇంగ్లిష్ భాషకు సంబంధించిన సమస్యలు ఉద్యోగానికి అడ్డంకిగా మారుతున్నాయి. ఇక్కడ టైర్–1 నగరాల నుంచి వచ్చే విద్యార్థులతో పోలిస్తే టైర్–2 నగరాల నుంచి వచ్చిన విద్యార్థులకు తక్కువ ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. టైర్–2 నగరాల్లోని విద్యార్థులకు 24 శాతం తక్కువ ఉద్యోగ అవకాశాలతో పాటు జీతంలోనూ చాలా వ్యత్యాసం ఉంటోంది. 15 లక్షల్లో 10 శాతం మందికే ఉద్యోగాలుప్రముఖ రిక్రూటింగ్ కంపెనీ టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్íÙప్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకొస్తుంటే.. వారిలో కేవలం 10 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయని పేర్కొంది. దేశంలో ఇంజనీరింగ్ రంగంలో 60 శాతం కంటే ఎక్కువగా ఉద్యోగావకాశాలు ఉంటే.. వాటిలో 45 శాతం మందికి పైగా పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. వాస్తవానికి పరిశ్రమలు సైబర్ సెక్యూరిటీ, ఐటీ, రో»ొటిక్స్, డేటా సైన్స్ వంటి డొమైన్లలో నైపుణ్యాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాయి. దీనికితోడు కృత్రిమ మేధ (ఏఐ)తో పోటీపడి పని చేయాల్సిన పరిస్థితుల్లో విద్యార్థులు సంప్రదాయ విద్య ఒక్కటే నేర్చుకుంటే సరిపోదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే రెండు మూడేళ్లలో ‘ఏఐ’, కట్టెడ్జ్ సాంకేతికతలో అధునాతన నైపుణ్యాలు కలిగిన సుమారు 10 లక్షల మంది ఇంజనీర్లు అవసరమని ప్రభుత్వేతర ట్రేడ్ సంస్థ ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్–సర్వీస్ కంపెనీస్’ (నాస్కామ్) అంచనా వేసింది. డిజిటల్ ప్రతిభలో డిమాండ్–సరఫరా అంతరం ప్రస్తుతం 25 శాతం నుంచి 2028 నాటికి 30 శాతానికి పెరుగుతుందని అభిప్రాయపడింది. ఏఐ, ఆటోమేషన్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో వస్తున్న మార్పులు సైతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు సాధించడంలో సవాల్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
వెంటాడుతున్న ఆర్థిక అనిశ్చితి భయాలు..
సాక్షి, హైదరాబాద్: భారతీయులను ‘ఆర్థిక అనిశ్చితి’భయాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులతోనే కాకుండా రాబోయే ఐదేళ్లలో చోటుచేసుకోబోయే అనూహ్య పరిస్థితులపై కూడా వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే ఐదేళ్లలో భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత వాతావరణం కొనసాగొచ్చన్న అభిప్రాయంతో మెజారిటీ భారతీయులు ఉన్నారు. ఇదే సమయంలో భారత్‌తో సహా దాదాపుగా అన్ని ప్రపంచ దేశాల్లోని ప్రజలను ఆర్థిక అనిశ్చితి భయపెడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికరంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుండగా...రాబోయే ఐదేళ్లలోనూ ఇదే స్థితి కొనసాగుతుందా? పరిస్థితులు మరింత దిగజారుతాయా అన్న ఆందోళన వివిధ వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. కుటుంబ ఖర్చులు, పిల్లల చదువుల వ్యయం, వైద్యఖర్చులు, తదితరాల పెరుగుదలతో వచ్చే ఐదేళ్లలో మనదేశంతో పాటు వివిధ దేశాల్లో ఆర్థిక అస్థిరత, నిలకడలేని వాతావరణం కొనసాగుతుందని 88 శాతం భారతీయులు భావిస్తున్నారు. ఈ అనిశ్చితితో పాటు ఉద్యోగాలు, అప్పులు, రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలు కూడా తమ జీవితాలతో ముడిపడిన ఆర్థిక అంశాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని వారు అంచనా వేస్తున్నారు. ఆర్థిక అనిశ్చితితో తమకు వచ్చే ఆదాయంలో హెచ్చుతగ్గులు, అప్పులు, ఊహించని ఖర్చుల పెరుగుదలతో మానసిక ఒత్తిళ్లు, ఆందోళన వంటి వాటికి దారితీస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆర్థిక అనిశ్చితి, దానిని ప్రభావితం చేసే అంశాలు తదితరాలపై తాజాగా ‘అనిశి్చత్ ఇండెక్స్’నివేదికను ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7,978 మంది వ్యక్తుల (5,320 మంది వేతన జీవులు, 2,658 మంది బిజినెస్ ప్రొఫెషనల్స్) నుంచి సేకరించిన సమాచారం, వివరాల మేరకు ఈ నివేదికను సిద్ధం చేశారు. ఈ సర్వే ముఖ్యాంశాలు ఇవీ... » భారతీయులకు పెరుగుతున్న ఖర్చులే అతి పెద్ద అనిశ్చితి.. » కుటుంబ ఖర్చుల పెరుగుదలతో ఇబ్బంది పడొచ్చని భావిస్తున్నవారు 77 శాతం మంది » ఆరోగ్యం, జీవితంలో అనిశ్చితి, అప్పుడు, ఊహించని ఖర్చులు రావొచ్చునని అంచనా వేస్తున్నవారు 71 శాతం మంది » ఆర్థిక అనిశ్చితి ఎదురుకావొచ్చుననే భావనలో 67 శాతం » రాజకీయ అనిశి్చతితో ఇబ్బందులు ఎదురుకావొచ్చుననే అభిప్రాయంతో ఉన్న వారు 65 శాతం » చేస్తున్న ఉద్యోగాల్లో మార్పుచేర్పుల అనిశ్చితి ఏర్పడొచ్చునంటున్న వారు 64 శాతం » వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావంతో అనిశ్చితి ఉండొచ్చుననే భావనతో 62 శాతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడొచ్చా అన్న దానిపై ఏమన్నారంటే... » 88 శాతం మంది వచ్చే 5 ఏళ్లలో భారత్‌తో సహా ప్రపంచదేశాల్లో ఆర్థిక అనిశ్చితి నెలకొనవచ్చుననే భావనతో ఉన్నారు. » 10 శాతం మంది ఈ అనిశ్చితి తక్కువస్ధాయిలో ఉండొచ్చునని నమ్ముతున్నారు. » 2 శాతం మందికి ఇది అతి స్వల్పంగా లేదా అసలు ఉండకపోవచ్చుననే అభిప్రాయం ఈ అనిశ్చితిని అధిగమించేందుకు ‘ఫైనాన్షి యల్ ప్లానింగ్’ఏ మేరకు తోడ్పడుతుంది ? » ఆర్థిక ప్రణాళికల సాయంతో ఈ అనిశ్చితిని తగ్గించవచ్చునని నమ్ముతున్నవారు 46 శాతం మంది » ఈ విషయంలో ‘ఫైనాన్షియల్ ప్లానింగ్’ను గట్టిగా సమరి్థస్తున్నవారు 37 శాతం » ఈ ప్లానింగ్ పట్ల పెద్దగా మేలు జరగదని భావిస్తున్నవారు 13 శాతం » దీనిని పూర్తిస్థాయిలో నిరాకరిస్తున్న వారు 4 శాతం మంది అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆర్థిక సురక్షితలు ఉపయోగపడతాయి? » 77 శాతం మంది ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ పాలసీ అతిపెద్ద ఆర్థిక సురక్షితగా భావిస్తున్నారు. » 49 శాతం రాబోయే రోజుల్లో ఏవైనా ఆర్థికపరమైన సవాళ్లు వస్తే ఎదుర్కునేందుకు ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వాటిలో కొంత మొత్తం జమచేశామని చెబుతున్నారు. » 46 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్/ స్టాక్స్‌లలో పెట్టుబడి పెట్టినట్టుగా వెల్లడించారు. » 42 శాతం మంది పెన్షన్ వచ్చే ఉద్యోగం ఉందని, తాము ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపారం లాభదాయకంగా ఉన్నట్టుగా తెలిపారు. » 6 శాతం మంది మాత్రం తాము ఎలాంటి ఆర్థిక సురక్షితలను సిద్ధం చేసుకోలేదని పేర్కొన్నారు. ‘ఫైనాన్షియల్ ప్లానింగ్’ను సమీక్షిస్తుంటారా ? » 37 శాతం మంది తమకు తాముగా ఇలాంటి సమీక్షలు చేయడం లేదు. తమ తరఫున సీఏలు, ఫైనాన్షియల్ అడ్వయిజర్లు తమ బాధ్యతను తీసుకుంటున్నట్టు తెలిపారు. » 22 శాతం మంది ఏడాదికి ఒకసారి లేదా అంతకంటే తక్కువ కాలంలో సమీక్షిస్తామన్నారు. » 15 శాతం మంది 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తామని చెప్పారు. » 14 శాతం మంది 6 నెలలకు, 14 శాతం నెలకు ఒకసారి ఈ పనిచేస్తామన్నారు. భవిష్యత్‌లో చోటుచేసుకునే పరిణామాల్లో ఏ అంశం అధిక ఆందోళనకు కారణమవుతోంది? » 64 శాతం మంది ఉద్యోగ, వృత్తిపరంగా ఎదురయ్యే ఒడిదుడుకులు, పురోగతిపైనే అని వెల్లడి. » 61 శాతం దీర్ఘకాలిక ఆర్థిక పరమైన లక్ష్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయంటున్నారు.» 58 శాతం మంది తమ/కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపైనే ఎక్కువ ఆందోళన ఉన్నట్టుగా తెలిపారు. » 39 శాతం మంది కుటుంబసభ్యులు/ స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు ఏ రకంగా ఉంటాయనే దానిపై సందిగ్ధతతో ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఇదీ అధ్యయనం... ఆర్థిక అనిశి్చతితో తలెత్తే పరిస్థితులు, ఇబ్బందులను ఎదుర్కునేందుకు వివిధవర్గాల ప్రజలు తమ తమ ప్రాధాన్యతలను ఎప్పటికప్పుడు మార్చుకోవడంతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను పునర్ నిర్దేశించుకోవడానికి కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తున్నట్టుగా ఈ నివేదికలో వెల్లడైంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సురక్షిత స్థితికి చేరేందుకు అవసరమైన మార్గాల అన్వేషణ, అప్పులను తెలివిగా నిర్వహించడం, పెట్టే ఖర్చులను జాగ్రత్తగా వ్యయం చేయడం, డబ్బు పొదుపు వంటి వాటికి ప్రజలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టుగా పేర్కొంది. రాబోయే రోజుల్లో ఎదురయ్యే ఆర్థిక అనిశ్చితిని అధిగమించేందుకు వివిధ రంగాలకు చెందినవారు అనుసరించే ప్రణాళికలు, ముందస్తు ఆలోచనలను బట్టి చూస్తే... ఇన్సూరెన్స్ పాలసీలు 77 శాతం మంది, ఫిక్స్డ్ డిపాజిట్లు 49 శాతం, మ్యూచువల్ ఫండ్స్/స్టాక్స్‌లో 46 శాతం, పెన్షన్‌పై ధీమా/సజావుగా సాగుతున్న వ్యాపారాలున్న వారు 42 శాతం, ఎలాంటి ఆర్థిక రక్షణ ప్రణాళికలున్చేయనివారు 6 శాతం ఉన్నట్టు ఆదిత్య బిర్లా స¯న్లైఫ్ నివేదిక తెలిపింది. -
పల్లె చిన్నబోతోంది
సాక్షి, అమరావతి: దేశంలోని గ్రామాల్లో జనాభా తగ్గిపోతుంటే.. పట్నాల్లో జనాభా మాత్రం వేగంగా పెరుగుతోంది. గత పుష్కర కాలంలో దేశంలో పల్లె జనాభా 4.1 శాతం తగ్గిపోయింది. 2011 జనాభా లెక్కలతో పోల్చితే 2023 జూలై నాటికి అంచనా వేసిన జనాభా లెక్కల మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ జనాభా తగ్గిపోయి పట్టణాల్లో జనాభా పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2011 తర్వాత కేరళలో పల్లె జనాభా ఏకంగా 28.3 శాతం తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో గత 12 సంవత్సరాల్లో గ్రామీణ జనాభా 7.1 శాతం మేర తగ్గింది. 2023 జూలై నాటికి అంచనా లెక్కల ప్రకారం బీహార్ మొత్తం జనాభాలో 87.7 శాతం గ్రామాల్లోనే ఉంది. అస్సాంలో 84.4 శాతం, ఒడిశాలో 81.1 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 75.9 శాతం, రాజస్థాన్‌లో 73.3 శాతం జనాభా గ్రామాల్లోనే ఉంది. పట్టణీకరణ పెరగడంతో పాటు ఉద్యోగావకాశాలకు గ్రామాలను వదిలి ప్రజలు పట్టణాలకు తరలి వెళ్తుండటంతో పల్లె జనాభా తగ్గిపోయి పట్టణ జనాభా పెరుగుతోంది.ఇవీ లెక్కలు..» 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం జనాభాలో గ్రామాల్లో ఉన్న వారు 68.9 శాతం » 2023 జూలై నాటికి అంచనా మేరకు మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా 64.8 శాతం» 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళలో మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా 52.3 శాతం» 2023 జూలై నాటికి అంచనా మేరకు కేరళ గ్రామీణ జనాభా 24.0 శాతం» 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో 70.4 శాతం గ్రామాల్లో ఉంటే.. 2023 జూలై నాటికి అంచనా వేసిన లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా 63.3 శాతానికి తగ్గింది » 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే 2023 జూలై అంచనా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ జనాభా 10,76,389 తగ్గింది. » ఇదే సమయంలో పట్టణ జనాభా 49,06,590 పెరిగింది » 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జనాభా 4,93,86,799 ఉండగా ఇందులో గ్రామీణ జనాభా 3,47,76,389, పట్టణ జనాభా 1,46,10,410 ఉంది» 2023 జూలై నాటికి అంచనాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జనాభా 5,32,17,000 ఉండగా ఇందులో గ్రామీణ జనాభా 3,37,00,000, పట్టణ జనాభా 1,95,17,000 ఉంది -
ఉద్యోగాలు.. ఉద్వేగాలు
సాక్షి, హైదరాబాద్: భారతీయ ఉద్యోగులు తమ పని ప్రదేశాలు, రోజువారీ జీవనాన్ని గడిపే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగుల్లో అత్యధికులు తమ జీవితం సాగుతున్న తీరు పట్ల అంత సంతోషంగా లేరని తెలుస్తోంది. దక్షిణాసియాలోనే రెండో అతి పెద్దసంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది. మనదేశంలోని ఉద్యోగుల స్థితిగతులు, ఇతర అంశాల గురించి లోతుగా పరిశీలించినప్పుడు.. వారి ఉద్యోగ జీవితం మానసికంగా, భావోద్వేగాలపరంగా, సామాజిక అంశాలపరంగా అంతగా సంతోషంగా, సంతృప్తికరంగా సాగడం లేదని స్పష్టమవుతోంది. దేశంలోని 86 శాతం మంది ఉద్యోగులు ఇబ్బందులు లేదా కష్టాల్లో (స్ట్రగులింగ్ ఆర్ సఫరింగ్) సాగుతున్నట్టుగా గ్యాలప్ స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ వర్క్‌ఫోర్స్–2024 వార్షిక నివేదిక తెలిపింది. మొత్తం ఉద్యోగుల్లో 14 శాతం మంది మాత్రమే తాము అన్నివిధాలుగా పురోగతి సాధిస్తూ సంతృప్తిగా, పూర్తి ఆశావహ దృక్పథంతో ముందుకు అడుగువేస్తున్నట్టుగా ఈ అధ్యయనం తెలియజేసింది. దక్షిణాసియాలోనే రెండో పెద్ద వర్క్‌ఫోర్స్‌గా ఉన్న మన దేశంలోని ఉద్యోగుల పరిస్థితులపై రూపొందించిన ఈ నివేదికలో భాగంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల మానసికస్థితి, వారి శ్రేయస్సు, అభ్యున్నతి ఎలా ఉందనే అంశంపై ఈ సంస్థ అంచనా వేసింది. ప్రధానంగా గ్యాలప్ కేటగిరీల వారీగా జీవన మూల్యాంకన సూచీ (లైఫ్ ఎవల్యువేషన్ ఇండెక్స్)..సంతృప్తి–పురోగతి (త్రైవింగ్), కష్టాలు ఎదుర్కోవడం (స్ట్రగులింగ్), బాధ–కుంగుబాటు (సఫరింగ్) మూడు గ్రూపులుగా ఉద్యోగులను వర్గీకరించింది. పరిశీలన ఇలా... ఉద్యోగులు తాము సాగిస్తున్న జీవనం, భవిష్యత్ ఆలోచనల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారా లేదా ? ప్రస్తుతం తామున్న పరిస్థితిపై సంతృప్తి, ఆశావహ దృక్పథం, ఇతర ధోరణులకు అనుగుణంగా పది పాయింట్లకు గాను ఏడు ఆపై స్థాయి లో పాయింట్లు సాధించే వారిని ‘త్రైవింగ్’ (సంతృప్తితో) కేటగిరీలోని వారిగా ఈ సంస్థ లెక్కించింది. ఉద్యోగులు గడుపుతున్న జీవితం పట్ల అభద్రతాభావంతో అగమ్యగోచరంగా లేదా ప్రతికూలతతో ఉన్న వారిని, రోజువారీ ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని ‘స్ట్రగులింగ్’గా పరిగణించింది. ఇక ‘సఫరింగ్’గ్రూపులో ఉన్న వారిని...వ్యక్తులుగా వారు ప్రస్తుత జీవనం, భవిష్యత్ అనేవి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా భావిస్తున్న వారిగా, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక, శారీరకంగా, భావోద్వేగపరంగా బాధ అనుభవిస్తున్న వారిగా వర్గీకరించింది. ‘స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ వర్క్‌ఫోర్స్’నివేదికలో ఇంకా ఏముందంటే..» ప్రతీరోజు భావోద్వేగపరంగా ఎదురవుతున్న అనుభవాలు, మనస్థితిని బట్టి 35 శాతం మంది భారతీయులు రోజూ కోపం, ఆగ్రహానికి లోనవుతున్నారు. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం. » భారత్‌లో రోజువారీ ఒత్తిళ్లు అనేవి అత్యల్పంగా ఉన్నట్టు తేలింది. దక్షిణాసియా ప్రాంతంలో చూస్తే..శ్రీలంకలో ఇది 62 శాతంగా, అఫ్గానిస్తాన్‌లో 58 శాతంగా, భారత్‌లో 32 శాతంగా ఉంది. » దక్షిణాసియాలో..గడిచిన ముందు రోజు పట్ల ఒంటరితనం (29 శాతం), ఆగ్రహం, కోపం (34 శాతం), విచారం (42 శాతం) బారిన ఉద్యోగులు పడినట్టు స్పష్టమైంది. » దక్షిణాసియాలో 48 శాతం మంది ప్రస్తుత సమయంలో ఉద్యోగాలు పొందడానికి సరైనదనే భావనలో ఉన్నారు » అదే భారత్ విషయానికొస్తే...57 శాతం మంది అదే అభిప్రాయంతో ఉన్నారు. » ప్రాంతీయంగా చూస్తే...తాము ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగాలు విడిచిపెట్టి కొత్త వాటిని కోరుకుంటున్నవారు 58 శాతం కాగా,.. భారత్‌లో మాత్రం 52 శాతంగా ఉన్నారు .గ్యాలప్ స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ వర్క్‌ఫోర్స్ అంటే... ప్రపంచవ్యాప్తంగా 80 ఏళ్లుగా వివిధ కంపెనీలు, సంస్థలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలపై అధ్యయనం చేసి, అవసరమైన విశ్లేషణలు అందిస్తూ ఆయా సమస్యలను అధిగమించేందుకు ‘గ్యాలప్’సంస్థ కృషి చేస్తోంది. ఉద్యోగులు, వినియోగదారులు, విద్యార్థులు, పౌరుల వైఖరులు, వారి ప్రవర్తన తీరుతెన్నులపై ఈ సంస్థ పూర్తి అవగాహన కలిగి ఉండడంతో, ఈ వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను సరిగ్గా ఎత్తిచూపగలుగుతోంది. వారి మనస్థితి, సంతృప్తి, ఇబ్బందులు, విచారం వంటి వాటిని అంచనా వేయగలుగుతోంది. -
టాపర్ల ఎంపిక.. ఐఐటీ బాంబే..
సాక్షి, అమరావతి: జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లకు ఐఐటీ బాంబే (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బాంబే)అగ్రగామి ఎంపికగా కొనసాగుతోంది. ఈ ఏడాది టాప్–10 జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులంతా ఐఐటీ–బాంబేలోనే ప్రవేశాలు పొందారు. మొదటి 25 ర్యాంకుల్లో 24 మంది, 50 ర్యాంకుల్లో 47 మంది, 1000లోపు ర్యాంకుల్లో 246 మంది ఐఐటీ–బాంబే నుంచే ఇంజనీర్లుగా ఎదిగేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్ విద్య, పరిశోధన రంగంలో అగ్రగామిగా ఐఐటీ బాంబే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుకే.. 2018లో కేంద్ర ప్రభుత్వం దీనికి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ హోదాను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా జాతీయ సాంకేతిక విద్యను విస్తరించడంలో భాగంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐఐటీ మద్రాస్ ‘జేఈఈ అడ్వాన్స్డ్–2024’ నివేదికను విడుదల చేసింది. అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ, జోసా కౌన్సెలింగ్‌లో కీలకంగా వ్యవహరించిన (జేఈఈ అడ్వాన్స్డ్ ఆర్గనైజింగ్ చైర్పర్సన్–2) ఆచార్య అన్నాబత్తుల రత్నకుమార్ ఏపీకి చెందిన వ్యక్తి కావడం విశేషం. 2024–25 విద్యా సంవత్సరానికి 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించగా.. 1.80 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇందులో 17,695 మంది 23 ఐఐటీల్లో సీట్లు సాధించారు. వీరిలో భారతీయ పౌరసత్వ మూలాలున్న 88 మంది, ఇద్దరు విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు. బాంబే తర్వాత ఢిల్లీనే.. దేశంలోని 23 ఐఐటీల్లో ఐఐటీ బాంబే తర్వాత టాప్ ర్యాంకర్ల ఫేవరెట్ ఎంపికగా ఐఐటీ–ఢిల్లీ మారింది. ఇందులో టాప్–50 ర్యాంకర్లలో ఇద్దరు, టాప్–100లో 23 మంది, టాప్–200లో 50 మంది, టాప్–500లో 109, టాప్–1000లో 204 మంది ప్రవేశాలు పొందారు. ఆ తర్వాత తొలి వెయ్యి ర్యాంకుల్లో ఐఐటీ మద్రాస్‌లో 128 మంది, ఐఐటీ కాన్పూర్‌లో 117 మంది, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 82 మంది, ఐఐటీ గౌహతిలో 69 మంది, ఐఐటీ రూరీ్కలో 55 మంది, ఐఐటీ హైదరాబాద్‌లో 41 మంది, ఐఐటీ వారణాసిలో 23 మంది, ఐఐటీ ఇండోర్‌లో ఐదుగురు, ఐఐటీ గాం«దీనగర్‌లో ఒకరు ప్రవేశాలు పొందారు. మహిళా విద్యార్థులప్రవేశాలు ఇలా.. గడచిన నాలుగేళ్లతో పోలిస్తే ఐఐటీల్లో సీట్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. 2024–25 ప్రవేశాల్లో 23 ఐఐటీల్లో సూపర్ న్యూమరరీ సీట్లు 3,566 ఉండగా.. మొత్తం సీట్లు 17,760కు చేరాయి. వీటిలో 17,695 సీట్లు భర్తీ చేశారు. వీటిలో సుమారు 80 శాతం ప్రవేశాలు పురుషులే పొందుతున్నారు. ఏటా ఐఐటీల్లో ప్రవేశాలు పొందుతున్న మహిళలు మాత్రం కేవలం 3 వేల వరకు మాత్రమే ఉంటున్నారు. గడచిన ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 73 మంది మాత్రమే అధికంగా ప్రవేశాలు తీసుకున్నారు. ఐఐటీలో అత్యధికంగా ఖరగ్‌పూర్‌లో 363, వారణాసిలో 301, బాంబేలో 278, రూర్కీలో 275, ఢిల్లీలో 246, కాన్పూర్‌లో 248, మద్రాస్‌లో 231 మందితో పాటు హైదరాబాద్‌లో 120, తిరుపతిలో 50 మంది మహిళలు ప్రవేశాలు పొందారు. తెలియకుంటే.. మిన్నకుంటే మేలు! జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో విద్యార్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాము కలలుకన్న ఐఐటీల్లో సీట్లు సాధించేందుకు ప్రతి మార్కును లెక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మైనస్ మార్కులు ఉండటంతో తెలియని ప్రశ్నల జోలికి వెళ్లడం లేదు. ఇలా పేపర్–1 గణితంలో 7వ ప్రశ్నను 80.31 శాతం మంది విడిచిపెట్టేశారు. ఇలా ప్రశ్నలు1, 3, 4, 5, 14, 17కు సుమారు 60 శాతానికిపైగా విద్యార్థులు సమాధానాలు రాయలేదు. ఫిజిక్స్‌లో 7వ ప్రశ్నకు అత్యధికంగా 82.32 శాతం మంది సమాధానం ఇవ్వలేదు. ఇలా 2, 3, 6, 16 ప్రశ్నలు 60 శాతానికిపైగా దూరంగా ఉన్నారు. కెమిస్ట్రీలో చాలావరకు జవాబు రాయడానికి ప్రయత్ని0చినట్టు తెలుస్తోంది. ఇలానే పేపర్–2లో గణితంలో 5వ ప్రశ్నకు అత్యధికంగా 71.11 శాతం మంది, ఫిజిక్స్‌లో 7వ ప్రశ్నకు 72.27 శాతం మంది జవాబు రాయలేదు. మొత్తంగా చూస్తే రెండు పేపర్లలో ఏ ఒక్క ప్రశ్నకు కూడా నూరు శాతం మంది జవాబు పెట్టకపోవడం గమనార్హం. -
‘అన్సారీకి విషమివ్వలేదు.. గుండెపోటుతోనే మృతి’
బండా: ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతిపై తలెత్తుతున్న అనుమానాలకు ఎట్టకేలకు తెరపడింది. అన్సారీ మృతిపై మెజిస్టీరియల్ విచారణ ముగిసింది. జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఈ విచారణ నివేదికను సమర్పించారు. ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందినట్లు మెజిస్టీరియల్ విచారణలో వెల్లడయ్యింది.ముఖ్తార్ అన్సారీ మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపధ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన విచారణ చేపట్టారు. దర్యాప్తు నివేదిక వచ్చిన దరిమిలా ముఖ్తార్ అన్సారీ కుటుంబ సభ్యులకు దీనికి సంబంధించిన వివరాలు పంపారు. అయితే దీనిపై వారి వైపు నుండి ఎటువంటి స్పందన రాలేదు. ముఖ్తార్ కుటుంబానికి పంపిన నోటీసులో ఆయన మృతిపై ఉన్న అభ్యంతరాలు లేదా సాక్ష్యాలను సమర్పించడానికి కొంత గడువు ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యులెవరూ ఇంతవరకూ స్పందించలేదు. విచారణ నివేదికను 10 రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించారు.గతంలో జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం మార్చి 28న క్షీణించింది. దీంతో జైలు నిర్వాహకులు అతన్ని బండా మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. నాడు ఆసుపత్రి విడుదల చేసిన వైద్య నివేదికలో అతని మరణానికి కారణం గుండెపోటు అని పేర్కొంది. అయితే ముఖ్తార్ కుటుంబ సభ్యులు, ప్రతిపక్షాలు ముక్తార్‌కు స్లో పాయిజన్ ఇచ్చారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో బండా జిల్లా మేజిస్ట్రేట్ ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.ఇది కూడా చదవండి: Uttar Pradesh: మెట్రో స్టేషన్ వద్ద కాల్పులు.. యువకుని మృతి -
జగన్ పాలనలో తలసరి ఆదాయం భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం వెంటాడినా.. నవరత్నాల పథకాలతో ప్రజలకు అండగా నిలిచి రాష్ట్ర ఆదాయం పెరగడానికి నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశేష కృషి చేసింది. దాని ఫలితంగా ఐదేళ్ల జగన్ పాలనా కాలంలో రాష్ట్ర తలసరి ఆదాయం భారీగా పెరిగింది. ఈ విషయం 2023–24 దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాలతో ఆర్బీఐ హ్యాండ్ బుక్‌లో స్పష్టమైంది. శుక్రవారం విడుదలైన ఆ హ్యాండ్ బుక్‌లో గత పది సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పెరుగుదల వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. గతంలో చంద్రబాబు ఐదేళ్ల పాలన కన్నా వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలోనే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా పెరిగినట్లు ఆర్బీఐ పేర్కొంది. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు చంద్రబాబు పాలనలో తలసరి ఆదాయం రూ. 60,128 మాత్రమే పెరిగింది. అదే 2019–20 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు వైఎస్ జగన్ పాలనలో తలసరి ఆదాయం రూ. 88,448 పెరిగిందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. చంద్రబాబు పాలనను తలదన్నేలాగతంలో చంద్రబాబు ఐదేళ్ల పాలన కాలాన్ని తలదన్నేలా.. వైఎస్ జగన్ పాలన కాలంలో ప్రతి ఏడాది కూడా జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల నమోదైంది. 2019–20లో దేశ జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 1,52,504 ఉండగా.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 2,14,951కు చేరింది. ఇదే సమయంలో 2019–20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,60,341 ఉండగా 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి అది రూ. 2,42,479కు చేరింది. జీవన ప్రమాణాలు పెరిగిన ఫలితంగా.. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయనడానికి, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనడానికి తలసరి ఆదాయం కొలమానంగా నిలుస్తుంది. రాష్ట్రం లేదా ప్రాంతం మొత్తం ఆదాయాన్ని అక్కడి జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. రాష్ట్ర జనాభా ఆర్థిక శ్రేయస్సును తలసరి ఆదాయం సూచిస్తుంది. తలసరి ఆదాయం పెరిగింది అంటే ప్రజలు వస్తువులు, సేవలపై ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బును కలిగి ఉన్నట్లు అర్థం. ఏదైనా రాష్ట్రం లేదా ప్రాంతం అభివృద్ధికి కొలమానం కూడా తలసరి ఆదాయం పెరుగుదలే. కోవిడ్ సమయంలో వ్యవసాయంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే వివిధ వర్గాల ఆదాయ మార్గాలను పెంచేందుకు, ఆయా రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తగిన వాతావరణాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం కల్పించింది. ప్రజల చేతుల్లోకి డబ్బులు చేరవేస్తేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదును బదిలీ చేసింది. ఫలితంగా రాష్ట్ర తలసరి ఆదాయంలో భారీగా పెరుగుదల నమోదైంది. అంతే కాకుండా గత ఐదేళ్లలో దేశ జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది. కోవిడ్ లాంటి సంక్షోభాలు లేకపోయినా చంద్రబాబు 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల తక్కువగానే ఉంది. -
ఆయిల్ పామ్ కింగ్ ఏపీ
సాక్షి, అమరావతి: ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉంది. దేశంలో ఆయిల్ పామ్ సాగు వృద్ధికి ఏపీ దిక్సూచిగా నిలిచిందని నూనె గింజల ఉత్పత్తి రాష్ట్రాలపై నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, హరియాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర.. ఈతొమ్మిది రాష్ట్రాలే దేశం మొత్తం నూనె గింజల విస్తీర్ణం, ఉత్పత్తిలో 90 శాతం పైగా దోహదం చేస్తున్నాయని నివేదిక తెలిపింది. ఈ రాష్ట్రాల్లో నూనె గింజల సాగు, ఉత్పత్తిపై మరింత దృష్టి సారించడం ద్వారా స్వయం సమృద్ధి సాధించాల్సిందిగా నీతి ఆయోగ్ నివేదిక సూచించింది. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆధిపత్యం చెలాయిస్తున్నాయని తెలిపింది. దేశంలో మొత్తం ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం 3,70,028 హెక్టార్లలో ఉండగా ఇందులో ఏపీలోనే అత్యధికంగా 1,84,640 హెక్టార్లలో ఉందని వివరించింది. ముడి పామాయిల్ ఉత్పత్తిలో కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని నివేదిక తెలిపింది. దేశంలో ముడి పామాయిల్ ఉత్పత్తి 3,60,729 టన్నులుండగా అందులో ఏపీలోనే అత్యధికంగా ముడి పామాయిల్ ఉత్పత్తి 2,95,075 టన్నులు ఉందని, ఆ తరువాత స్థానాల్లో తెలంగాణ, కర్ణాటక, మిజోరంలు ఉన్నాయని చెప్పింది.ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలిమిగతా రాష్ట్రాల్లో కూడా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్ నివేదిక సూచించింది. దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతులను తగ్గించేందుకు ఎడిబుల్ ఆయిల్ మిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపింది. నూనె గింజలు సాగు, ఉత్పత్తి మరింత విస్తరింప చేసేలా వ్యూహాలను, రోడ్ మ్యాప్‌లను అమలు చేయాలని నివేదిక సూచించింది. ఈ రంగంలో ఆత్మనిర్భర భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొంది. -
ప్రస్తుతానికి రూ. 5,438 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో సంభవించిన నష్టం విలువ రూ.5,438 కోట్లుగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పూర్తిస్థాయి అంచనా ప్రక్రియ కొనసాగుతోందని, ఇంకా నష్టం లెక్కలు తీస్తున్నామని వివరించింది. ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు వేగంగా సాగేందుకు, బాధితులందరికీ సాయం అందేందుకు వీలుగా మార్గదర్శకాలను సులభతరం చేయాలని కోరింది.రాష్ట్రంలో వరదల ప్రభావాన్ని అంచనా వేసేందుకు కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం హైదరాబాద్‌కు వచ్చింది. తొలుత వరద నష్టంపై సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించింది. అనంతరం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రంలో వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు.వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు అందిన తర్వాత, తక్కువ సమయంలోనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని... వేగంగా తీసుకున్న చర్యలతో ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామని సీఎస్ ఈ సందర్భంగా చెప్పారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు నిరంతరం పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. పునరావాస కార్యక్రమాల కోసం నిధులను వెంటనే విడుదల చేశామన్నారు. ప్రత్యేక బృందాల ఏర్పాటుకు సహకరించండి అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్తో సమానంగా రాష్ట్రంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని కేంద్ర బృందానికి సీఎస్ వివరించారు. ఈ బృందాలకు శిక్షణ, ఇతర సౌకర్యాల కల్పనలో కేంద్రం సహకరించాలని కోరారు. భారీ వర్షాల సమయంలో ఎయిర్ రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణకు సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో 332 హెక్టార్ల విస్తీర్ణంలో పెద్ద సంఖ్యలో చెట్లు కూలిపోయిన అంశాన్ని కేంద్ర బృందానికి వివరించారు. దీంతో చెట్లు కూలిన ఘటనకు మూలకారణాన్ని తెలుసుకునేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని సీఎస్‌కు కేంద్ర బృందం సూచించింది. ఇక వరదల కారణంగా సంభవించిన నష్టాలు, ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర బృందానికి రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్‌కుమార్ వివరించారు. సమావేశం అనంతరం క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు కేంద్ర బృందం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు వెళ్లింది. వరద నష్టంపై అమిత్ షాకు శివరాజ్‌సింగ్ ప్రాథమిక నివేదికసాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అందించారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత జిల్లాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో అమిత్ షాతో భేటీ అయి.. తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టానికి సంబంధించిన అంశాలను వివరించారు. అనంతరం ఈ వివరాలను ‘ఎక్స్’వేదికగా వెల్లడించారు. కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయి నివేదికను సమర్పిస్తాయని తెలిపారు. -
ఎన్డీఎస్ఏ తుది నివేదిక త్వరగా తెప్పించండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నుంచి త్వరగా తుది నివేదిక తెప్పించుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో బరాజ్‌లకు నిర్వహించాల్సిన పరీక్షలు పూర్తి చేసి, వాటికి సంబంధించిన నివేదికలను నిపుణుల కమిటీకి అందజేయాలన్నారు. నీటిపారుదల శాఖపై బుధవారం ఆయన జలసౌధలో సమీక్షించారు. సమ్మక్క బరాజ్ నిర్మాణంతో ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడనున్న ముంపు విషయంలో ఆ రాష్ట్రం నుంచి ఎన్ఓసీని సత్వరంగా రాబట్టుకోవాలని ఆదేశించారు. ముంపునకు గురయ్యే భూములకు సంబంధించి పరిహారం చెల్లింపు విషయంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చ లు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు. సమ్మ క్క బరాజ్ డీపీఆర్‌కు అనుమతుల విషయంలో Üడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. భూసేకరణను 2025 మార్చిలోగా పూర్తిచేయాలని చెప్పారు. ఆనకట్టు, కాల్వల భద్రతను పర్యవేక్షించేందుకు 1,800 మంది లష్కర్ల నియామకాలను సత్వరమే పూర్తి చేయాలన్నారు. దీనిపై నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పందిస్తూ ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు. దీంతో మంత్రి ఉత్తమ్ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావుతో అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడి అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు పంపించిన విజ్ఞాపనలను సత్వరంగా పరిష్కరించి, జవాబు పంపించాలన్నారు. ఆనకట్టు, కాల్వల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
ఏ చెట్లు.. ఎన్ని కూలాయి?
సాక్షి, హైదరాబాద్/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలడంపై అటవీశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా.. రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం (204కుపైగా హెక్టార్లు)లో దాదాపు 70వేల చెట్లకు నష్టం జరిగినట్టుగా ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇందులో నల్లమద్ది, ఏరుమద్ది, తెల్లమద్ది, గుప్పెన, తునికి, టేకు, ఎగిశా, నేరేడు, మారేడు. గుంపెన, బొజ్జ, బూరుగ తదితర 50, 60 రకాల చెట్లు ఉన్నట్టుగా వెల్లడించినట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లో అంచనా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపనున్నట్టు తెలిసింది. కూలిపోయిన వాటిలో 50 నుంచి 70 ఏళ్లపైబడినవి భారీ వృక్షాల నుంచి ఐదు, పదేళ్ల వయసున్న చిన్న చెట్ల దాకా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయిలో చెట్ల లెక్కలు తీస్తూ.. ములుగు జిల్లా మేడారం అడవుల్లో కూలిన చెట్ల లెక్కింపులో అధికారులు నిమగ్నమయ్యారు. 30 హెక్టార్లకు ఒక బృందం చొప్పున పది బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 20 మంది సిబ్బంది ఉన్నారు. వారు పూర్తిగా నేలకూలిన, సగానికి విరిగిన, కొమ్మలు విరిగిన చెట్లతోపాటు బాగున్నవాటిని కూడా గుర్తించి.. వాటి కొలతలు నమోదు చేస్తున్నారు. ఏయే రకాల చెట్లు ఎన్ని ఉన్నాయి, కూలినవి ఎన్ని అనేదీ లెక్కతీస్తున్నారు. రెండు రోజుల్లో సవివర నివేదికను సిద్ధం చేసి అటవీశాఖకు అందించనున్నట్టు తెలిసింది. కారణమేమిటనే దానిపై ఆరా.. కేవలం గంట, అరగంటలోనే అంత పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలడానికి కారణాలపై.. వాతావరణశాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ)లను అటవీశాఖ సంప్రదించింది. మెట్రోలాజికల్, శాటిలైట్ డేటాలను విశ్లేషించి.. అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది గుర్తించేందుకు ప్రయత్నించనున్నారు. మరోవైపు గురువారం అరణ్యభవన్ నుంచి జిల్లా అటవీ అధికారులతో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు తరహాలో రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ఎక్కడైనా చెట్లకు నష్టం జరిగిందా అన్నది పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేస్తున్నాం..సుడిగాలుల కారణంగా అటవీ ప్రాంతానికి, చెట్లకు జరిగిన నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం. దెబ్బతిన్న చోట అటవీ పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. ములుగులో అంత బీభత్సం జరగడానికి కారణాలు, ఇతర అంశాలపై లోతైన అధ్యయనం నిర్వహిస్తాం. – ఏలూసింగ్ మేరూ, పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) -
వరద నష్టంపై వివరాలివ్వరా?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో భారీవర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన తీవ్ర నష్టానికి సంబంధించిన వివరాలు అందజేయకపోవడంపై కేంద్ర హోంశాఖ.. రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రకృతి వైపరీత్యాల రోజువారీ పరిస్థితిపై నివేదిక పంపేలా రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం (ఎస్ఈఓసీ)లోని అధికారులను ఆదేశించాలని సీఎస్ శాంతికుమారికి కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ మేరకు తాజాగా సీఎస్‌కు కేంద్ర హోంశాఖలోని విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ ఆశిష్‌గవాయ్ లేఖ రాశారు. ఎస్ఈఓసీ నుంచి అందిన సమాచారం ప్రకారం.. తెలంగాణ ఎస్ఈఓసీ నుంచి టెలిఫోన్ ద్వారా ఇటీవల కేంద్ర హోంశాఖకు అందిన సమాచారం ప్రకారం.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రొటోకాల్ ప్రకారం కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూమ్‌కు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా వరదలకు సంబంధించి తాజా నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పడవలు, రక్షించే పరికరాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 7 బృందాలను మోహరించిందన్నారు. వీటితోపాటు రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ కోసం వాయుసేనకు చెందిన 2 హెలికాప్టర్లను అందుబాటులో ఉంచామని పేర్కొంది.నిధులివ్వాలంటే నివేదిక పంపాలి...» 2024–25 సంవత్సరానికిగాను రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ నిర్వహణ కోసం రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి రూ.1345.15 కోట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ నివేదించిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్డీఆర్ఎఫ్ కింద కేంద్ర వాటాను విడుదల చేసేందుకు అవసరమైన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సమర్పించలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. » 2022–23 సంవత్సరానికిగాను ఎస్డీఆర్ఎఫ్కు చెందిన 2వ విడత కేంద్ర వాటా కింద రూ.188.80 కోట్లు.. 2023 జూలై 10న తెలంగాణకు విడుదలయ్యాయని కేంద్రం తెలిపింది. 2023–24కు సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ కేంద్ర వాటా రెండు వాయిదాలను ఒక్కొక్కటి రూ.198 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చి 13న, మార్చి 28న విడుదల చేశామని చెప్పింది. » 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ కేంద్ర వాటా మొదటి విడత మొత్తం రూ.208.40 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా విడుదల చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ 1 తర్వాత ఈ రూ.208.40 కోట్లు విడు దల కావాల్సి ఉన్నా, ఈ నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభ్యర్థన చేయలేదని లేదా ముందుగా విడుదల చేసిన నిధులు, యుటిలైజేషన్ సర్టిఫికెట్ మొదలైన వాటి జమకు సంబంధించిన సమాచారం సమర్పించలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అందువల్ల ఎస్డీఆర్ఎఫ్ నిధుల విడుదల కోసం నిర్ణీత ప్రొఫార్మాలో అవసరమైన సమాచారం/యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఆ తర్వాతే 2024–25కు సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ కేంద్ర వాటా మొదటి విడత నిధులు విడుదల చేస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. -
తెలుగు కుబేరులు! (ఫొటోలు)
-
ముందు కెరీర్..తర్వాతే పిల్లలు!
ఇల్లు.. పెళ్లి.. పిల్లలు.. ఇది నిన్నటితరం భారతీయ మహిళల మాట.. ఉన్నత చదువు.. కెరీర్.. పెళ్లి.. కెరీర్లో స్థిరత్వం.. ఆ తర్వాతే పిల్లలు.. ఇదీ నేటి భారతీయ మహిళల దృక్కోణంలో వచ్చిన మార్పు.. అవును.. పిల్లలకు జన్మనిచ్చే విషయంలో భారత మహిళల దృక్పథం మారుతోంది. ముందు ఉన్నత చదువును అభ్యసించడం, మంచి ఉద్యోగం సాధించి కెరీర్‌ను మొదలుపెట్టడం, ఆ తర్వాత దాంపత్య బంధంతో ఒక్కటి కావడం, కెరీర్లో స్థిరత్వం ఇవన్నీ సమకూరాకే సంతానం కనడానికి మొగ్గుచూపుతున్నారు. కెరీర్లో ఉన్నత స్థాయికి చేరే వరకు పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. ఈ మేరకు 2016 తర్వాత నుంచి భారత మహిళల దృక్పథంలో గణనీయ మార్పులు వచ్చాయని కేంద్ర గణాంకాలు – కార్యక్రమాల అమలు శాఖ తాజా నివేదిక వెల్లడించింది. ‘భారతదేశంలో మహిళలు, పురుషులు– 2023’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో దేశంలో జనాభా పెరుగుదల, పురుషులు–మహిళల నిష్పత్తి, సంతానం విషయంలో మహిళల దృక్పథం తదితర అంశాలపై కీలక విషయాలను పొందుపరిచింది. అందులోని ప్రధాన అంశాలు ఇవీ.. – సాక్షి, అమరావతి2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లు దేశ జనాభా 2036 నాటికి ఏకంగా 152.2 కోట్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళల జనాభా నిష్పత్తి క్రమంగా మెరుగుపడుతోంది. 2011లో దేశంలో ప్రతి వేయిమంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా... 2036 నాటికి 952కు పెరుగుతారని అంచనా. 2011లో దేశ జనాభాలో మహిళలు 48.5 శాతం ఉండగా 2036 నాటికి 48.8 శాతానికి పెరగనున్నారు.మారుతున్న ‘వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు’ భారతదేశంలో ‘వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు’ (ఏజ్ స్పెసిఫిక్ ఫెర్టిలిటీ రేట్) గణనీయంగా మారుతోంది. 20 – 24 ఏళ్లు, 25 – 29 ఏళ్లు, 30– 34 ఏళ్లు, 35– 39 ఏళ్లు.. ఇలా ఐదేళ్లు ఒక్కో కేటగిరీగా వర్గీకరించారు. ఒక్కో కేటగిరీలో ప్రతి వేయి మంది మహిళలు ఏడాదిలో ఎంతమంది బిడ్డలకు జన్మనిస్తారో దాన్ని వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు అని అంటారు. మహిళల నిర్ణయానికి కారణాలివే» కెరీర్లో స్థిరపడ్డాక నిర్దేశిత లక్ష్యాలు సాధించేవరకు బిడ్డలను కనేందుకు మహిళలు ఇష్టపడటం లేదు. బిడ్డలను కంటే కెరీర్‌పై తగినంత శ్రద్ధ చూపించలేమని, అలాగే వారికి కావాల్సినంత సమయం కేటాయించలేమనే భావనతో ఉన్నారు. అందుకే 20 నుంచి 29 ఏళ్ల మధ్యలో కెరీర్లో స్థిరపడ్డాకే బిడ్డలను కనాలని భావిస్తున్న మహిళల శాతం పెరుగుతోంది. దీంతో ఆ కేటగిరీల్లో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. » ఇక కెరీర్లో స్థిరపడ్డాక బిడ్డలను కంటున్న మహిళల శాతం పెరుగుతోంది. దేశంలో 35 నుంచి 39 ఏళ్ల కేటగిరీలో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం. 2011– 2015 మధ్య 35 నుంచి 39 ఏళ్ల కేటగిరీలో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు 32 ఉండగా... 2016– 2020లో అది 35కు పెరిగింది. » ఇక 18 ఏళ్ల లోపే బిడ్డలను కంటున్న వారిలో అక్షరాస్యులు, నిరక్షరాస్యుల మధ్య వ్యత్యాసం ఉంది. 2016–2020లో నిరక్షరాస్యుల్లో 18 ఏళ్ల లోపు వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు 39గా ఉండగా... అక్షరాస్యుల్లో ఆ రేటు 11కే పరిమితమైంది. తగ్గుతున్న ప్రసూతి మరణాలు.. ప్రసూతి మరణాలను తగ్గించడంలో భారతదేశం నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తోంది. 2030 నాటికి దేశంలో ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాలను 70కు తగ్గించాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ క్రమంలో 2018–20 నాటికి ప్రసూతి మరణాలను 97కు తగ్గించారు. 2030 నాటికి కంటే ముందుగానే లక్ష్యాన్ని సాధించగలమని ప్రభుత్వం పూర్తి ధీమాతో ఉంది. ఇక దేశంలో శిశు మరణా లు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రతి వేయి కాన్పులకు శిశు మరణాల రేటు 2015లో 43గా ఉండగా.. 2020నాటికి 32కు తగ్గింది. -
విద్యా కుసుమాలు.. వాడిపోతున్నాయి
పరీక్ష పాసవ్వలేదనో, అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, ప్రేమవిఫలమైందనో.. మరో కారణంగానో చిన్న వయసులోనే జీవితాల్ని చాలిస్తున్న విద్యార్థులు ఆత్యహత్యలు మనసుల్ని పట్టి కుదిపేస్తుంటాయి. కదా.. తాజాగా ఒక అధ్యయనం ఈ తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. భారతదేశంలో జనభా వృద్దిరేటు కన్న విద్యార్థులు ఆత్యహత్యలే ఎక్కువ అని తేలింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ఆధారంగా, ఇంటర్నేషనల్ కెరీర్ అండ్ కాలేజ్ కౌన్సెలింగ్ (IC3) కాన్ఫరెన్స్ ,ఎక్స్పో 2024లో బుధవారం సమర్పించిన "విద్యార్థుల ఆత్మహత్యలు: భారత్‌ను వణికిస్తున్న మహమ్మారి(ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా)" నివేదికలో ఈ విషయాలు వెల్లడైనాయి.ఈ నివేదిక ప్రకారం మొత్తం ఆత్మహత్యల సంఖ్య సంవత్సరానికి 2 శాతం పెరిగింది. 2021- 2022 మధ్య విద్యార్థుల బలవన్మరణాలు 4 శాతం పెరిగాయి. విద్యార్థుల ఆత్మహత్య కేసులు తక్కువగా నమోదయ్యే అవకాశ ఉన్న నేపథ్యంలో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. అంతేకాదు ఇది మొత్తం ఆత్మహత్యల ట్రెండ్‌ను కూడా ఇది అధిగమించింది. గత దశాబ్దంలో, 0-24 సంవత్సరాల వయస్సున్న జనాభా 582 మిలియన్ల నుండి 581 మిలియన్లకు తగ్గగా, విద్యార్థుల ఆత్మహత్యలు 6,654 నుండి 13,044కి పెరిగింది. ఆందోళనకరంగా విద్యార్థుల ఆత్మహత్యలు!దేశంలో జనాభా వృద్ధి, మొత్తం ఆత్మహత్యల రేట్ల కంటే, విద్యార్థి ఆత్మహత్యలే అధికంగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా వీరి ఆత్మహత్యల వార్షిక రేటు నాలుగు శాతం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు అనూహ్యంగా పెరిగాయని, పురుషుల ఆత్మహత్యలు 50 శాతం, మహిళల ఆత్మహత్యలు 61 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో 53 శాతం మగ విద్యార్థులే. అయితే, 2021-22 మధ్య, మగ విద్యార్థుల ఆత్మహత్యలు 6 శాతం తగ్గాయి. కానీ ఇదే సమయంలో ఆడపిల్లల ఆత్మహత్యలు 7 శాతం పెరగడం గమనార్హం.మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో అత్యధిక విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్న రాష్ట్రాలుగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇది జాతీయ మొత్తంలో మూడింట ఒక వంతు. దక్షిణాది రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు సమిష్టిగా 29 శాతం వాటా కలిగి ఉన్నాయి. కోటా లాంటి కోచింగ్ కేంద్రాల హబ్ రాజస్థాన్ రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. అంతేకాదు కేసులు నమోదైన దాని ప్రకారం గుర్తించిన డేటా మాత్రమేననని, నమోదు కానీ కేసుల సంఖ్య కలిస్తే వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చనే ఆందోళన వ్యక్తం చేసింది. 2017 మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఆత్మహత్యాయత్నాలను నేరరహితం చేసినప్పటికీ రిపోర్టింగ్ పద్ధతులను ప్రభావితం చేస్తూనే ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో రిపోర్టింగ్ తక్కువగా ఉంటుందని నివేదిక తెలిపింది. విద్యార్థి ఆత్మహత్యలకు కారణాలు- నివారణ మార్గాలుఆర్థిక, సామాజిక ఒత్తిళ్ల ప్రభావం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ర్యాంకుల్లో రేసులో వముందుండాలనే విషయంలో తల్లిదండ్రులు ,సమాజం నుండి తీవ్రమైన పోటీ, భారీ అంచనాలు విద్యార్థులలో అధిక ఒత్తిడికి, ఆందోళనకు కారణమవుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు: డిప్రెషన్, ఆందోళన, ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులు విద్యార్థుల ఒత్తడికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. అయితే విద్యార్థుల మానసిక ఆందోళనలో అండగా నిలిచి, తగిన సహాయం, కౌన్సెలింగ్ సదుపాయాలు విద్యాసంస్థల్లో లేకపోవడం దురదృష్టం. ఆత్మహత్య ఆలోచనలు అడ్డుకుని, ఆరోగ్య, కెరీర్ కౌన్సెలింగ్ అందించడం ,అవగాహన కల్పించడం చాలా అవసరం.కుటుంబ సమస్యలు, వివాదాలు, తల్లిదండ్రుల ఘర్షణలు,కుటుంబ సభ్యులనుంచి తగిన ఆప్యాయత, ఆసరా లేకపోవడంతో నిరాశతో కుంగిపోతున్న విద్యార్థులు. అందుకే వారికి మేమున్నామనే భరోసా కల్పించాలి. సమస్యలతో బాధపడుతున్నవారికి మానసిక ఆరోగ్య నిపుణులు లేదా విశ్వసనీయ వ్యక్తులద్వారా కౌన్సెలింగ్ ఇప్పించడం ముఖ్యం. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యకు ప్రయత్నించడం మరియు సహాయం చేయడం నేరం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
తగ్గిన కాలుష్యం.. పెరిగిన ఆయుర్దాయం!
న్యూఢిల్లీ: భారత్‌లో 2022 ఏడాదిలో గాలిలో సూక్ష్మ ధూళికణాల గాఢత 19.3 శాతం తగ్గడంతో వాయునాణ్యత స్వల్పంగా మెరుగుపడిందని అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఈపీఐసీ) ప్రకటించింది. ఈ మేరకు రూపొందించిన ‘వాయు నాణ్యతా జీవన సూచీ–2024’నివేదికను ఈపీఐసీ తాజాగా వెల్లడించింది. అయితే ఇప్పటికీ భారత్‌లో వాయుకాలుష్యం అధికంగా ఉందని, తగ్గించుకోకపోతే ప్రజల ఆయుర్దాయం తగ్గక తప్పదని హెచ్చరించింది. గాలిలో ఘనపు మీటర్‌కు 5 మైక్రోగ్రాముల మేరకే 2.5స్థాయి సూక్ష్మధూళి కణాలుండాలి. అంతకుమించి ఉండి, ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాలను అందుకోలేకపోతే భారత్‌లో ప్రజల ఆయుర్దాయం 3.6 ఏళ్లు తగ్గే ప్రమాదముందని నివేదిక హెచ్చరించింది. 2022లో 2.5స్థాయి సూక్ష్మధూళి కణాలు తగ్గడానికి అక్కడి వాతావరణ పరిస్థితులు, ఉష్ణ పరిస్థితులు కారణమని నివేదిక విశ్లేషించింది. పశి్చమబెంగాల్, జార్ఖండ్‌లలో ఈ వాయు కాలుష్య తగ్గుదల కనిపించింది. ‘‘భారత్ అంతటా వాయుకాలుష్యం తగ్గితే ఢిల్లీలో ప్రజల ఆయుర్దాయం 7.8 ఏళ్లు పెరగొచ్చు. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను అందుకోలేకపోతే మాత్రం ఢిల్లీ ప్రజల ఆయుర్దాయం 11.9 ఏళ్లు తగ్గవచ్చు. కాలుష్యం ఇలాగే కొనసాగినా, భారత్ నిర్దేశించుకున్న 2.5 స్థాయి వాయు నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయినా 8.5 ఏళ్లు క్షీణిస్తుంది’’ అని నివేదిక పేర్కొనడం విశేషం. పశి్చమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో వాయునాణ్యత పెరిగితే అక్కడి వారి ఆయుర్దాయం 3.6 ఏళ్లు ఎక్కువ అవుతుందని నివేదిక పేర్కొంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లో వాయకాలుష్యం అధికంగా ఉంటే 2.9 ఏళ్ల ఆయుర్దాయం తగ్గనుంది. నగరాల సమీప జిల్లాలతో పోలిస్తే దూరంగా ఉన్న జిల్లాల్లో 2017తో పోలిస్తే 2022లో కాలుష్యం 18.8 శాతం తగ్గింది. దీంతో 44.67 కోట్ల మంది ఆయుర్దాయం 10.8 నెలలు పెరిగింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత్ వినూత్న విధానాలను అవలంబిస్తోందని నివేదిక పేర్కొంది. 2019లో గుజరాత్ తొలిసారిగా వీటిని అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సూరత్‌లో కాలుష్యం 20–30 శాతం తగ్గింది. నివాసప్రాంతాల్లో కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు, వంటచెరకు వాడకం తగ్గించడానికి కేంద్రం ప్రధాన్‌మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలుచేస్తుండటాన్ని నివేదిక ప్రస్తావించింది. -
యూఎస్.. మనదే జోష్
భారతీయ అమెరికన్లు...టెక్నాలజీ ప్రపంచం రూపురేఖలు మారుస్తున్నారు..వైద్యుల రూపంలో ప్రాణాలు కాపాడుతున్నారు..విద్యావేత్తలుగా భావితరాలను తీర్చిదిద్దుతున్నారు..కళాకారులుగా సాంస్కృతిక రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు..మేధావులుగా జ్ఞానాన్ని పంచుతున్నారు..శాస్త్రవేత్తలుగా విశ్వం రహస్యాలను ఛేదిస్తున్నారు.. పట్టుదల.. నైపుణ్యం.. వైవిధ్యతల కలబోతగా అమెరికన్ సమాజాన్ని సమృద్ధం చేస్తున్నారు. ఈ విజయాలు, గాథలు.. అమెరికా పురోగతి, సమైక్యతల్లో భారతీయ అమెరికన్ల పాత్రకు తార్కాణాలు!!’’.. ఇది భారతీయుల గురించి మనకు మనం చెప్పుకుంటున్న గొప్పలు కాదు.. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కన్సల్టింగ్ సంస్థ బీసీజీ గ్లోబల్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించిన అచ్చమైన వాస్తవం.దశాబ్దాల క్రితం ఉపాధి కోసం, సంపాదన కోసం ఖండాలు దాటి అగ్రరాజ్యం అమెరికాలో అడుగిడిన భారతీయులు అక్కడి సమాజంతో మమేకమైపోయారు. భారత్‌లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంటే.. అమెరికాలో మాత్రం మనవాళ్లు ఐదో వంతు మంది ఇప్పటికీ తాతముత్తాతల ఇళ్లలోనే ఉంటున్నారు. సంపాదించే ప్రతి డాలర్లో కొంత దాచుకునే ప్రయత్నం, పిల్లలకు మంచి చదువులు చెప్పించడం వంటివి కూడా మన భారతీయ అలవాట్లే. అంతేకాదు.. ప్రతి భారతీయ అమెరికన్ తన కోసం, తన కుటుంబం బాగు కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ.. అక్కడి సమాజానికి, ఆ దేశ పురోగతి మొత్తానికి కూడా ఉపయోగపడుతుండటం విశేషం. దీనిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం..భారతీయ అమెరికన్లు అమెరికా సమా జానికి, ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన స్థాయి లో సేవలు అందిస్తున్నారు. వలస వచ్చి ఒక దేశంలో బతకడమే కష్టమనుకునే పరిస్థితుల్లో.. భారతీయులు అక్కడి సమాజంతో మమేకం అవడమే కాకుండా టెక్నాలజీ, వైద్యం, విద్య, వ్యాపారాల్లో రాణించి అమెరికన్లకూ మేలు చేయగలుగుతున్నారు. సుమారు 30 కోట్ల జనాభా ఉన్న ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)’లో భారతీయుల సంఖ్య యాభై లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే అక్కడి జనాభాలో సుమారు రెండు శాతం. కానీ ఆ దేశంలోని 60% హోటళ్లు, సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు ఇతర వ్యాపా రాలలో వీరికి భాగస్వామ్యం ఉంది. కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. వందల కోట్ల డాలర్ల విలువైన స్టార్టప్ కంపెనీలు స్థాపించగలిగారు. టాప్ టెక్నాలజీ కంపెనీల సీఈవోల నుంచి ట్రక్ డ్రైవర్ల దాకా ఎన్నో ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. అమెరికా స్థానికుల కంటే సగటు భారతీయ అమెరికన్ కుటుంబం రెట్టింపు వార్షికాదాయాన్ని కలిగి ఉందంటేనే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది.చదువే పెట్టుబడిగా..భారతీయ అమెరికన్లు తమ పిల్లలకు మంచి విద్య అందించేందుకు కృషి చేస్తున్నారు. కనీసం 70శాతం మంది బ్యాచిలర్స్ డిగ్రీ వరకూ చదువుకుంటున్నారు. 2007 నుంచి 2023 ఏప్రిల్ మధ్య 16 లక్షల మంది గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. భారతీయ అమెరికన్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు 40 శాతం ఉంటే.. అమెరికా స్థానికులలో ఇది కేవలం 13 శాతమే కావడం గమనార్హం. భారతీయ అమెరికన్లు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ రంగాల కోర్సులు చేస్తున్నారు. బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఉండటం భారతీయ అమెరికన్ కుటుంబాల్లోని భావితరాలకు మరో వరం అని చెప్పవచ్చు. ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలు 34 సార్లు జరిగితే అందులో 28సార్లు ఇండియన్ అమె రికన్లే విజేతలుగా నిలిచారు.మంచి చదువు, నైపుణ్యాలతో.. మనవాళ్లు ఏ రంగంలో స్థిర పడ్డా బాగా రాణించగలుగుతున్నారు. జీతా లు మెరుగ్గా ఉంటున్నాయి. భారతీయ అమెరికన్ కుటుంబం సగటు వార్షికా దాయం 1,23,700 డాలర్లు (కోటి రూపా యలకుపైనే) ఉంది. అమెరికా స్థానిక కుటుంబాలతో పోలిస్తే ఇది సుమారు రెట్టింపు కావడం గమనార్హం.330కోట్ల డాలర్లుఅమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్నభారతీయ విద్యార్థులు పెడుతున్న ఖర్చులు, చెల్లిస్తున్న ఫీజులు కలిపి సుమారు 330 కోట్ల డాలర్లు ఉంటాయని అంచనా. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ సొమ్ము కూడా కీలకమే.విద్యారంగం పైనా మన ముద్రభారతీయ అమెరికన్లు అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తు న్నారు. అగ్రరాజ్యంలో విద్యారంగంపై తమదైన ముద్ర వేస్తున్నారు. డాక్టర్ నీలి బెండపూడి పెన్‌స్టేట్ యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించగా.. ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూని వర్సిటీకి చెందిన ‘డోయిర్ స్కూల్ ఆఫ్ సస్టెయిన బిలిటీ తొలి డీన్‌గా అరుణ్ మజుందార్ పనిచేస్తు న్నారు. శుభ్ర సురేశ్ కార్నెగీ మెలన్ యూనివర్సిటీ అధ్యక్షులుగా ఉండగా.. యూనివర్సిటీ అఫ్ కాలిఫో ర్నియా చాన్సలర్‌గా ప్రదీప్ ఖోస్లా వ్యవహరిస్తున్నారు. ఇదే యూనివర్సిటీ బర్క్లీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ డీన్‌గా ఎస్.శంకర శాస్త్రి ఉన్నారు. అంతేకాదు మరెన్నో వర్సిటీల్లో భారతీయ అమెరికన్లు అధ్యాపకులుగా పనిచేస్తు న్నారు. ఒక అంచనా ప్రకారం అమెరికాలోని యూనివర్సిటీలు, కాలేజీలన్నింటిలో కలిపి సుమారు 22 వేల మంది భారతీయ అమెరికన్ అధ్యాపకులు ఉన్నారు. మొత్తం అధ్యాపకుల్లో మనవాళ్ల వాటా 2.6 శాతం. సిలికాన్ వ్యాలీలోని హార్వర్డ్ లా స్కూల్, కార్నెగీ మెలన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ సభ్యు డిగా వివేక్ వాధ్వా సేవలందిస్తుండగా.. ఆన్లైన్ విద్య విప్లవానికి నాంది పలికిన ‘ఎడ్ఎక్స్’ కంపెనీ సీఈవో, ఎంఐటీ అధ్యాపకుడు అనంత్ అగర్వాల్ కూడా భారతీయ అమెరికనే.ఆర్థిక ఇంధనంఅమెరికా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2023లో 27.36 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో భార తీయ అమెరికన్ల వాటా సుమారు లక్ష కోట్ల డాలర్లు. ఖర్చు పెట్టగల స్థోమత, పన్నుల చెల్లింపు, వ్యాపారాల ద్వారా ఇంత మొత్తాన్ని అమెరికా ఆర్థిక వ్యవస్థకు జోడించగలుగుతున్నారు మనవాళ్లు. ఏటా భారతీయ అమెరికన్లు చెల్లించే పన్నులు 30,000 కోట్ల డాలర్లుగా అంచనా.భారతీయ అమెరికన్లు అక్కడ ఏర్పాటు చేసిన హోటళ్ల ద్వారా వచ్చే ఆదాయం 70,000 కోట్ల డాలర్లు. భారతీయ అమెరికన్లు రోజువారీ సరుకులు మొదలు.. వినోద, విహారాల దాకా ఏటా పెడుతున్న ఖర్చు 37,000 కోట్ల డాలర్ల నుంచి 46,000 కోట్ల డాలర్ల వరకూ ఉంటుంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వానికి అందే సేల్స్ ట్యాక్స్, ఇతర పన్నుల రూపంలో భారీగానే ఆదాయం సమకూరుతోంది.పరిశోధనలు, పేటెంట్లతోనూ..యూనివర్సిటీలు, కాలేజీల పాలన, బోధన మాత్రమే కాకుండా.. పరిశోధనల ద్వారా కూడా భారతీయ అమెరికన్లు విద్యా వ్యవస్థలో భాగమవుతున్నారు. అమెరికాలో 2023లో ప్రచురితమైన పరిశోధన వ్యాసాలన్నింటిలో భారతీయ సంతతి పరిశోధకుల భాగస్వామ్యం 13 శాతానికిపైగా ఉండటం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. అలాగే పది శాతం పేటెంట్లు కూడా మనవాళ్ల పేరుతోనే జారీ అవుతున్నాయి. పరిశోధనలకు అందించే ఎన్ఐహెచ్ గ్రాంట్లలోనూ భారతీయ అమెరికన్ల వాటా 11 శాతం కంటే ఎక్కువే.విస్తరిస్తున్న వ్యాపార సామ్రాజ్యంగూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ శాంతను నారాయణన్.. మనం తరచూ ఈ పేర్లువింటుంటాం. ప్రపంచంలోనే టాప్ కంపెనీలను నడుపుతున్న భారతీయ అమెరికన్లు వారు. అంతేకాదు అమెరికాలో భారతీయులు సృష్టించిన వ్యాపార సామ్రాజ్యం చాలా పెద్దది. ప్రపంచం గతిని మార్చేసిన సిలికాన్ వ్యాలీ టెక్ కంపెనీల్లో 15.5 శాతం భారతీయ సంతతి వాళ్లు ఏర్పాటు చేసినవే. టెక్ కంపెనీలే కాదు.. ప్రతి వీధి చివర ఒక సూపర్ మార్కెట్, లేదంటే హోటల్ నడుపుతున్నది మనవాళ్లే. అమెరికా మొత్తమ్మీద ఉన్న హోటళ్లలో 60శాతం భారతీయులవే.ఉద్యోగ కల్పనకు ఇతోధిక తోడ్పాటుగూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి 16 పెద్ద కంపెనీలను నడిపిస్తున్న భారతీయ అమెరికన్లు.. ఉద్యోగ కల్పన విషయంలోనూ ముందున్నారు. ఈ కంపెనీల్లో సుమారు 27 లక్షల మంది అమెరికన్లు ఉద్యోగం చేస్తున్నారు. వంద కోట్ల డాలర్లకుపైగా విలువైన యూనికార్న్ కంపెనీలు అమెరికాలో 648 వరకూ ఉంటే.. అందులో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసినవే 72. వీటి మొత్తం విలువ 195 బిలియన్ డాలర్లు. సుమారు 55,000 మంది ఉపాధి పొందుతున్నారు. మరోవైపు అమెరికాలోని హోటళ్లలో 60శాతం భారతీయ అమెరికన్లవే. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తోందని అంచనా. అంటే భారతీయ అమెరికన్లు 24 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు లెక్క. చిన్న దుకాణాలు, సూపర్ మార్కెట్ల ద్వారా మరో 3.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మొత్తంగా భారతీయ అమెరికన్లు కోటి మంది జీవనానికి సాయపడుతున్నట్టు అంచనా.స్టార్టప్‌ల స్థాపనలోనూ..సోషల్ నెట్వర్కింగ్ అనగానే ట్విట్టర్, ఫేస్బుక్ వంటివి గుర్తుకొస్తాయి. అలా కాకుండా ఆడియో ద్వారా కూడా సోషల్ ప్లాట్‌ఫామ్ నడపవచ్చని నిరూపించారు భారతీయ అమెరికన్ రోహన్ సేథ్. ‘క్లబ్‌హౌస్’ పేరుతో ఆయన అభివృద్ధి చేసిన అప్లికేషన్ ఇప్పుడు పాపులర్. షేర్ల వ్యాపారం చేసే రాబిన్‌హుడ్, ఇంటికే సరుకులు తీసుకొచ్చిన ‘ఇన్‌స్టాకార్ట్’ వంటి స్టార్టప్‌లు భారతీయ అమెరికన్ల బుర్రల్లోంచి పుట్టుకొచ్చినవే.టాప్ భారతీయ అమెరికన్లు వీరే..జయ్ చౌధురి సీఈవో, జెడ్ స్కేలర్ (సైబర్ సెక్యూరిటీ రంగంలో అగ్రగామి సంస్థ)వినోద్ ఖోస్లా సన్ మైక్రో సిస్టమ్స్సహ వ్యవస్థాపకుడు, ఖోస్లా వెంచర్స్ అధినేతరొమేశ్ టి.వాధ్వానీ సింఫనీ టెక్నాలజీగ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవోరాకేశ్ గంగ్వాల్ ఇండిగో విమానాల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడుఅనిల్ భుస్రీక్లౌడ్ ఆధారిత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘వర్క్‌డే’ సహ వ్యవస్థాపకుడునీరజ్ షా ఇంటి సామన్లు అమ్మే ఈ–కామర్స్ కంపెనీ వేఫెయిర్ సీఈవో, సహ వ్యవస్థాపకుడుబైజూ భట్ కమీషన్ లేకుండా ట్రేడింగ్ సౌకర్యం అందించే కంపెనీ రాబిన్ హుడ్ వ్యవస్థాపకుడురోహన్ సేథ్ఆడియో ఆధారిత సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్ ‘క్లబ్‌హౌస్’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు. -శాన్ఫ్రాన్సిస్కో నుంచి కంచర్ల యాదగిరిరెడ్డి -
ఆ ఆత్రమే అగ్గిరాజేసింది
విశాఖ సిటీ: ఎసైన్షియా అడ్వాన్స్›డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరిగిన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ పరిశీలనలో అనేక విస్మయకర విషయాలు వెలుగుచూసినట్లు తెలిసింది. కొత్త డ్రగ్ ఉత్పత్తిని వేగంగా ప్రారంభించాలన్న ఆత్రంలో ట్రయల్ రన్ నిర్వహించకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వంటివే ఈ భారీ ప్రమాదానికి కారణమన్న విషయాన్ని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.ప్రమాద కారణాలతో పాటు కంపెనీలో 6 లోటు పాట్లను హైలెవల్ కమిటీ గుర్తించినట్లు తెలిసింది. అత్యవసర ద్వారాలు, భవనానికి బాహ్య కారిడార్లు లేకపోవడం, ప్రీ స్టార్టప్ తనిఖీలు చేయకపోవడం, విద్యుత్ వైరింగ్ బహిరంగంగా ఉండడం, రసాయనం లీక్ అయిన వెంటనే దాన్ని నిలువరించకపోవడం వంటి కారణాలను నివేదికలో పొందుపరిచింది. ముందస్తు తనిఖీలు నిల్ ఎసైన్షియాలో కొత్త డ్రగ్ ఉతి్పత్తిని ఇటీవలే ప్రారంభించింది. వాస్తవానికి ఏ డ్రగ్ ఉత్పత్తి చేయాలన్నా ముందు తప్పనిసరిగా ట్రయల్ రన్ నిర్వహించాలి. ఈ ప్రక్రియలో అన్నీ సజావుగా ఉన్నట్లు నిర్థారించుకున్నాకే ఉత్పత్తిని ప్రారంభించాలి. సదరు కంపెనీ యాజమాన్యం మాత్రం ముందస్తు తనిఖీలు లేకుండానే, వేగంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు ఉపక్రమించింది. ఫలితంగానే ఈ ప్రక్రియలో నెలకొన్న అనేక లోటుపాట్లను గుర్తించలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఉన్నత స్థాయి కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. గతంలోనూ ఇదే వైఖరి ఈ కంపెనీ గతంలో కూడా ఇదే తరహాలో వ్యవహరించినట్లు కమిటీ పరిశీలనలో గుర్తించింది. ప్రీ స్టార్టప్ తనిఖీలు లేకుండానే భారీ స్థాయిలో డ్రగ్ ఉత్పత్తిని చేపడుతున్నట్లు వెల్లడైంది. అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో కంపెనీలో వరుసగా అదే తరహాలో ఔషధాల ఉత్పత్తి ప్రక్రియను నిర్వహిస్తోంది.తాజాగా అదే విధానాన్ని కొనసాగించగా.. మిౖథెల్ టెర్ట్ బ్యూటిల్ ఎథర్(ఎంటీబీఈ) రసాయనం లీకై గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎంసీసీ ప్యానల్ మీద పడడంతో భారీ ప్రమాదం సంభవించింది. 17 మంది మృత్యువాత పడ్డారు. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్న ఉన్నత స్థాయి కమిటీ ఇదే అంశాలపై నివేదిక తయారు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. -
కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్.. నెక్ట్స్ టార్గెట్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ సమర్పించింది. 10 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్‌రెడ్డి కట్టడాలు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్‌రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలను కూల్చివేసినట్లు హైడ్రా రిపోర్ట్‌లో వెల్లడించింది. మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్నగర్, గాజుల రామారం, అమీర్‌పేట్‌లో అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేసినట్లు హైడ్రా పేర్కొంది.నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. నందినగర్‌లో ఎకరం స్థలాన్ని, లోటస్‌పాండ్‌లో పార్కు కాంపౌండ్ వాల్‌ను కబ్జాదారుల నుంచి హైడ్రా కాపాడింది.మనసురాబాద్ సహారా ఎస్టేట్‌లో కబ్జాలు కూల్చివేతఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా కూల్చివేతమిథాలీ నగర్లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రాబీజేఆర్ నగర్లో నాలా కబ్జా నుంచి కాపాడిన హైడ్రాగాజులరామారం మహాదేవ్ నగరంలో రెండంతస్తుల భవనం కూల్చివేతగాజుల రామారావు భూదేవి హిల్స్‌లో చెరువు ఆక్రమణలను చేసిన బోనాలు కూల్చివేతబంజారా హిల్స్‌లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేతచింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసిన హైడ్రానందగిరి హిల్స్‌లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేతనందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు నమోదుకాగా, హైదరాబాద్‌లో ‘హైడ్రా’ చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోందని భావిస్తున్న ప్రభుత్వం.. ఈ తరహా వ్యవస్థలను ఇతర నగరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి. అవకాశమున్న చోటఆక్రమణలను తొలగించడం, కొత్తగా కబ్జాలు జరగకుండా కాపాడేలా చర్యలు చేపట్టనున్నట్టు వివరించాయి.ఇందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ఎక్కడ చెరువుల ఆక్రమణలు జరిగినట్టు గుర్తించినా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలంటూ శనివారం ఓ వీడియో విడుదల చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ గౌతం తదితరులు రాష్ట్రంలోని ఇతర నగరాల్లోని పరిస్థితిపై సమీక్ష కూడా జరిపినట్టు తెలిసింది. త్వరలోనే ఇతర నగరాల్లో ‘హైడ్రా’తరహా వ్యవస్థల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. -
వైఎస్ జగన్ ఘనత.. 2022–23లో ఏపీలో తగ్గిన పేదరికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం, రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధి మెరుగుపడింది. తద్వారా వారి పేదరికం జాతీయ స్థాయి కన్నా తక్కువగా నమోదైంది. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 2022–23 నాటికి పేదరికం నిష్పత్తిని ఈ నివేదిక విశ్లేషించింది. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో పేదరికం 7.10 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.62 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఐదు శాతం కన్నా దిగువున ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 4.40 శాతం ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా పేదరికం తగ్గినట్లు ఈ నివేదిక పేర్కొంది. దీనికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను నిర్మించడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడమని స్పష్టం చేసింది. వీటి ద్వారా గ్రామీణ జీవనోపాధిని గణనీయంగా మెరుగు పరచిందని నివేదిక తెలిపింది. ప్రభుత్వాలు అమలు చేసిన కార్యక్రమాలతో పేదరికం తగ్గడంతో పాటు గ్రామీణ, పట్టణ పేదల జీవనోపాధి మెరుగుపడిందని నివేదిక స్పష్టం చేసింది. అలాగే జాతీయ స్థాయిని మించి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పేదరికం ఉందని పేర్కొంది. -
Kolkata Doctor Case: క్రైం సీన్‌నే మార్చేశారు
న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి, వైద్య కళాశాలలో వైద్యురాలి హత్యాచారోదంతంపై తమ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్టు సీబీఐ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘‘ఈ పాశవిక చర్యను కప్పిపుచ్చి ఆత్మహత్యగా చిత్రించేందుకు స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రయతి్నంచారు. అందులో భాగంగా మేం దర్యాప్తు బాధ్యతలు స్వీకరించే నాటికి ఏకంగా క్రైం సీన్‌నే సమూలంగా మార్చేశారు.ఈ కారణంగా దర్యాప్తు తమకో పెను సవాలుగా మారింది’’ అంటూ నివేదించింది. ‘‘తొలుత వైద్యురాలి ఆరోగ్యం బాగా లేదంటూ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వాళ్లు ఆస్పత్రికి చేరుకున్నాక ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. హతురాలి అంత్యక్రియలు పూర్తయ్యాక తీరుబడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’’ అని పేర్కొంది. ‘అంతేకాదు, ఆగస్టు 9న ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఆస్పత్రి వైద్యులు ఫోన్ చేసి వైద్యురాలు అపస్మారక స్థితిలో ఉందని సమాచారమిచ్చారు. నిజానికి ఆమె అప్పటికే చనిపోయింది’’ అని తెలిపింది. ప్రిన్సిపల్ వెనక ఎవరున్నట్టు: సీజేఐ కోల్‌కతా దారుణాన్ని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించడం తెలిసిందే. ధర్మాసనం ఆదేశం మేరకు ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన అంశాలతో దర్యాప్తు పురోగతిపై గురువారం సీబీఐ స్థాయీ నివేదిక సమరి్పంచింది. బెంగాల్ సర్కారు కూడా ఓ నివేదిక సమరి్పంచింది. ఈ కేసులో కోల్‌కతా పోలీసుల దర్యాప్తు అత్యంత లోపభూయిష్టమంటూ జస్టిస్ పార్డీవాలా ఈ సందర్భంగా మండిపడ్డారు. ‘‘సాయంత్రం 6.10 నుంచి 7.10 మధ్య పోస్టుమార్టం జరిపారు. అంటే అది అసహజ మరణమని అప్పటికే రూఢీ అయినట్టే. కానీ అర్ధరాత్రి కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం చాలా ఆశ్చర్యకరం.గత 30 ఏళ్లలో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు’’ అంటూ ఆయన తూర్పారబట్టారు. అర్ధరాత్రి పోస్టుమార్టం తర్వాత గానీ క్రైం సీన్‌ను పోలీసులు అ«దీనంలోకి తీసుకోలేదంటూ సీజేఐ ఆక్షేపించారు. అసహజ మరణమని పొద్దున్నే తేలినా ఎందుకంత ఆలస్యం చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ దాఖలులో కోల్‌కతా పోలీసుల అసాధారణ జాప్యం అత్యంత తీవ్రమైన అంశమంటూ దుయ్యబట్టారు. ‘‘14 గంటలు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడమా?! ఘోరం గురించి ఉదయమే తెలిసినా, సాయంత్రానికల్లా పోస్టుమార్టం చేసినా రాత్రి 11.30 దాకా పోలీసులకు సమాచారమే ఇవ్వలేదు. నిజానికి విషయం తెలియగానే నేరుగా ఆస్పత్రికి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చూడటం ప్రిన్సిపల్ కనీస బాధ్యత.ఈ విషయంలో ఆయన ఎందుకు జాప్యం చేసినట్టు? అసలాయన ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు? దాని వెనక కారణాలేమిటి? విమర్శల తీవ్రతకు ఎట్టకేలకు ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకపోగా ఆయన్ను సింపుల్‌గా మరో వైద్య కాలేజీకి బదిలీ చేసింది’’ అంటూ సీజేఐ ఆక్షేపించారు. దీనంతటినీ ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి తొలి ఎంట్రీ నమోదు చేసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు తమ ఎదుట హాజరై ఎంట్రీ నమోదు సమయం తదితర వివరాలన్నింటినీ నేరుగా వెల్లడించాలని ఆదేశించారు.ఈ ఉదంతాన్ని రాజకీయం చేయొద్దని పారీ్టలకు సీజేఐ సూచించారు. హతురాలి జననాంగంలో 150 జీఎం పరిమాణంలో వీర్యం ఉందన్న సీబీఐ తరఫు న్యాయవాది వాదనను తప్పుబట్టారు. సోషల్ మీడియా వార్తల ఆధారంగా వాదనలు విని్పంచొద్దంటూ మందలించారు. గ్యాంగ్ రేప్ జరగలేదని, ఇది కేవలం ఒక్కరి పనేనని ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తులో తేలిందని, డీఎన్ఏ నివేదిక కూడా దీన్నే ధ్రువీకరిస్తోందని సీబీఐ పేర్కొన్నట్టు సమాచారం!మెహతా వర్సెస్ సిబల్పశి్చమ బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఆయనకు, సీబీఐ తరఫున వాదనలు విన్పించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు మధ్య సాగిన వాడీ వేడి వాదనలు కోర్టు హాలును వేడెక్కించాయి. ఎఫ్ఐఆర్ దాఖలులో చోటుచేసుకున్న లోటుపాట్లను తాను వివరిస్తుంటే సిబల్ హేళనగా నవ్వుతున్నారంటూ ఒక దశలో మెహతా తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘ఒక అమాయకురాలు అత్యంత హృదయ విదారక పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయింది. కనీసం నవ్వకుండా ఉండటం సంస్కారం’’ అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేశారు.వైద్యులు పట్టుబట్టినందుకే వీడియో జరిగిన దారుణం గురించి తెలిసినా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఘోష్ వెంటనే ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటూ సొలిసిటర్ జనరల్ మెహతా తప్పుబట్టారు. హతురాలి తండ్రి ఎంతగా డిమాండ్ చేసినా అంత్యక్రియల అనంతరం రాత్రి 11.45 గంటలకు గానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం చాలా దారుణమని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘పోస్టుమార్టాన్ని వీడియో తీయాల్సిందేనని వైద్యురాలి సహచరులు, సీనియర్ డాక్టర్లు పట్టుబట్టారు. లేదంటే ఆ ఆధారాలు కూడా మిగిలేవి కాదు’’ అన్నారు. వీటిని సిబల్ ఖండించారు. సీబీఐ నివేదికను బురదజల్లే యత్నంగా అభివర్ణించగా మెహతా తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిజాలను కప్పిపెట్టేందుకు చల్లిన బురదను తొలగించేందుకే సీబీఐ ప్రయతి్నస్తోందన్నారు.నేనూ ధర్మాసుపత్రిలో నేలపై పడుకున్నా: సీజేఐ వైద్యుల సమస్యల గురించి ప్రస్తావిస్తూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి తన కుటుంబీకుల్లో ఒకరికి చికిత్స సందర్భంగా స్వయంగా ధర్మాసుపత్రిలో నేలపై పడుకున్నానని చెప్పారు. వైద్యులు దారుణమైన పరిస్థితుల నడుమ పని చేస్తున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వాళ్లకు కనీస మౌలిక వసతులు కూడా అందుబాటులో లేవు. 36 గంటలు, అంతకుమించి నిరంతరాయంగా పని చేయాల్సి వస్తోంది. ఇది అత్యంత అమానవీయం.అంతసేపు పని చేసి పూర్తిగా అలసిపోయిన స్థితిలో ఎవరన్నా వేధించినా అడ్డుకుని స్వీయరక్షణ చేసుకునే స్థితిలో కూడా ఉండరు! ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయని వైద్యులు దయచేసి అర్థం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు. న్యాయం, ఔషధాలు అందడంలో జాప్యం జరగరాదన్నారు. సమ్మె విరమించి విధులకు వెళ్లాల్సిందిగా వైద్యులను మరోసారి అభ్యర్థించారు. ఆందోళనల్లో పాల్గొన్నందుకు ఆస్పత్రి వర్గాలు తమను వేధిస్తున్నాయని నాగ్‌పూర్ ఎయిమ్స్ వైద్యులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాంతో వైద్యుల శాంతియుత నిరసనలపై బలప్రయోగానికి దిగొద్దని, విధుల్లో చేరాక ప్రతీకార చర్యలేవీ తీసుకోవద్దని సీజేఐ ఆదేశించారు.సలహాల కోసం పోర్టల్‘‘దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం కేంద్ర, రాష్ట్రాలు వారం లోపు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో, డీజీపీలతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సంప్రదింపులు జరపాలి’’ అంటూ సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. ‘‘వైద్యుల భద్రత తదితరాలపై సలహాల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలి. సలహాలు, సూచనలను నేషనల్ టాస్‌్కఫోర్స్ పరిగణనలోకి తీసుకుని వైద్యుల భద్రతపై నేషనల్ ప్రొటోకాల్‌ను రూపొందించాలి’’ అంటూ పలు నిర్దేశాలు జారీ చేశారు. విచారణను సెపె్టంబర్ 5కు వాయిదా వేశారు.మాజీ ప్రిన్సిపల్‌కు లై డిటెక్టర్ టెస్టు మరో నలుగురు వైద్యులకు కూడావైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో హతురాలి సహచరులైన నలుగురు వైద్యులకు కూడా లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు గురు వారం అనుమతి జారీ చేసింది. మరోవైపు అమానుషంగా ప్రవర్తించడం ఘోష్‌కు అలవాటని ఆయన ఇరుగుపొరుగు చెబుతున్నారు. సిజేరియన్ అయిన రెండు వారాలకే భార్యను ఆయన దారుణంగా కొట్టారంటూ 12 ఏళ్ల నాటి ఉదంతాన్ని గుర్తు చేస్తూ వారు చెప్పుకొచ్చారు.రేప్‌కు కఠిన చట్టాలు తెండిమోదీకి మమతా బెనర్జీ లేఖకోల్కతా: మానభంగానికి పాల్పడేవారికి అతి తీవ్రమైన శిక్షలను విధించేలా కేంద్రం కఠిన చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేస్తూ పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో పీటీ ట్రైనీ డాక్టర్ పాశవిక హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఈ లేఖను సంధించారు. ‘దేవవ్యాప్తంగా ప్రతిరోజూ రేప్‌లు జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి ప్రతిరోజూ భారత్‌లో 90 రేప్‌లు జరుగుతున్నాయి. వీటిలో చాలాకేసుల్లో బాధితులు హత్యకు గురవుతున్నారు. ఈ పరంపర భీతి గొల్పుతోంది. దేశం, సమాజం విశ్వాసాన్ని, అంతరాత్మను కుదిపేస్తోంది. ఈ ఘోరాలకు ముగింపు పలకడం మన విధి. అప్పుడే మహిళలు సురక్షితంగా, భద్రంగా ఉన్నామని భావిస్తారు. ఇలాంటి ఆందోళకరమైన, సున్నితమైన అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి. అత్యంత కఠినమైన కేంద్ర చట్టాన్ని తేవాలి. రేపిస్టులకు అతి తీవ్రమైన శిక్షలు విధించాలి’ అని మమత లేఖలో కోరారు.రేప్ కేసుల విచారణ వేగంగా జరగాలంటే ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరగాలంటే కేసు విచారణ 15 రోజుల్లోగా పూర్తి కావాలని మమత అన్నారు. వైద్యురాలి హత్యాచారం కేసులో మమత సర్కారు వ్యవహరించిన శైలిని సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మమత తీవ్ర విమర్శలను, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. డాక్టర్ల సమ్మె విరమణ ప్రకటించిన ఫైమాన్యూఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై ఆందోళనకు దిగిన డాక్టర్లు 11 రోజులుగా తాము చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు నుంచి సానుకూల ఆదేశాలు రావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) వెల్లడించింది. డాక్టర్లు సమ్మె విరమించాలని, తిరిగి విధులకు హాజరయ్యే వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలుండవి సుప్రీంకోర్టు గురువారం హామీ ఇచి్చంది. ’భారత ప్రధాన న్యాయమూర్తి నుంచి సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమించాలని నిర్ణయించాం.ఆసుపత్రుల్లో భద్రత పెంచడం, డాక్టర్లకు రక్షణపై మా వినతులను సుప్రీంకోర్టు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నాం. ఐక్యతతో చట్టపరంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని ఫైమా ‘ఎక్స్’లో వెల్లడించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు ఎయిమ్స్ ఢిల్లీ, ఆర్ఎంఎల్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ, ఇందిరాగాంధీ హాస్పిటల్ రెసిడెంట్ డాక్టర్స్ సమ్మెను విరమిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. బెంగాల్లో మాత్రం సమ్మె విరమించేది లేదని వైద్యులు, వైద్య సిబ్బంది ప్రకటించారు. -
స్వల్ప వేతన జీవులే సింహభాగం!
సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగుల జీతాలు అరకొరగానే ఉంటున్నాయని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. దేశంలో నెల జీతం మీద ఆధారపడుతున్న వారిలో దాదాపు 68 శాతం మంది నెలకు రూ.20 వేల లోపు జీతగాళ్లేనని కూడా తెలిపింది. కేంద్ర గణాంక శాఖ ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) తాజా నివేదిక దేశవ్యాప్తంగా నిరుద్యోగిత పెరుగుతోందని కూడా పేర్కొంది. ఉద్యోగుల జీతాలపై కీలక అంశాలను వెల్లడించింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత రంగాల్లో కలిపి దేశం మొత్తం మీద 8.50 కోట్ల మంది నెల జీతం మీద ఆధారపడి జీవిస్తున్నారని ఆ నివేదిక తెలిపింది. దేశంలో నెలకు రూ.70 వేలకు పైగా జీతం తీసుకుంటున్నవారు కేవలం 2.6 శాతం మందే ఉన్నారంది. అలాగే, దేశంలో నిరుద్యోగిత క్రమంగా పెరుగుతోందని పీఎల్ఎఫ్ఎస్ నివేదిక తెలిపింది. దేశంలో 27 రంగాల్లో ఉద్యోగ కల్పన పరిస్థితులను విశ్లేషించి నివేదిక వెల్లడించింది. ఆ ప్రకారం 2022–23 కంటే 2023–24లో దేశంలో 4.66 కోట్ల మంది నిరుద్యోగులు పెరిగారు. 2022–23లో దేశంలో 59.67 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా... 2023–24లో 64.33 కోట్లకు చేరారు. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 1 శాతం తగ్గగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నిరుద్యోగిత 3శాతం పెరిగింది. -
చంద్రబాబు తప్పిదం వల్లే.. వాల్ ఢమాల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అవగాహనా రాహిత్యం, అస్తవ్యస్థ పనులు మరోసారి బహిర్గతమయ్యాయి. పోలవరం డయాఫ్రమ్ వాల్ ధ్వంసం కావడానికి, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి ముమ్మాటికీ చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సాక్షిగా నిర్ధారణ అయింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారని ఆక్షేపించింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు 1,006 మీటర్లు.. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారని పేర్కొంది. అయితే నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకపోవడంతో 2017, 2018లో గోదావరి ప్రవాహం డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించిందని గుర్తు చేసింది. ఆ ప్రభావం డయాఫ్రమ్‌వాల్‌పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వరద ఉద్ధృతికి డయాఫ్రమ్ వాల్లో ఐదు చోట్ల 693 మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బ తిందని స్పష్టం చేస్తూ ఈనెల 12న కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక అందచేసింది. గతేడాది ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిర్వహించిన అధ్యయనంలో నాలుగు చోట్ల 485 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌వాల్ దెబ్బ తిన్నట్లు తేల్చగా తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరో 208 మీటర్ల మేర అధికంగా దెబ్బ తిన్నట్లు తేల్చడం గమనార్హం. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సలహాలు, సూచనలు అందించేందుకు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో(యూఎస్ఏ), రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్ (కెనడా)లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. జూన్ 29–జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన ఈ బృందం గత నెల 7న ప్రాథమిక నివేదిక అందచేసింది. పూర్తి నివేదికను ఈనెల 12న సీడబ్ల్యూసీకి సమర్పించింది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ..క్రమబద్ధంగా పనులు» గాడి తప్పిన పోలవరం పనులను 2019 తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చక్కదిద్దింది. 2020లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌పై వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేసింది. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉంది. » ఎగువ కాఫర్ డ్యామ్‌ను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి 2021 జూన్‌లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించింది.» దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్‌లలో ఇసుక నింపి పూడ్చింది. 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నాయి. 2018లో జెట్ గ్రౌటింగ్ వాల్ సామర్థ్యాన్ని పరీక్షించకుండా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టడం వల్లే సీపేజీ (లీకేజీ) అధికంగా ఉంది.వాస్తవాలకు దర్పణంప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాఫర్ డ్యామ్‌లు నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్ మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యామ్ పనులను పూర్తి చేస్తారు. కానీ.. పోలవరం ప్రాజెక్టులో మాత్రం చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌వాల్ కోతకు గురై దెబ్బతింది.ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. ఈ పాపం చంద్రబాబుదేనని సాగునీటిరంగ నిపుణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేయగా తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా అదే అంశాన్ని పునరుద్ఘాటించడం గమనార్హం. ప్రణాళికారాహిత్యం వల్లే..» పోలవరం జలాశయం పనులను 2016 డిసెంబర్లో ప్రారంభించారు. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల కోసం కొండ తవ్వకం పనులకు సమాంతరంగా ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ పనులు ప్రారంభించారు. 2017 జూలైలో వరదలు ప్రారంభమయ్యే సమయానికి ఎడమ వైపు నుంచి 1,006 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్‌ను పూర్తి చేశారు. 2017 జూలై తర్వాత వచ్చిన వరద డయాఫ్రమ్‌వాల్ మీదుగానే ప్రవహించింది. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ నాటికి మిగిలిన 390.6 మీటర్ల పొడవున గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేశారు. 2018లోనూ వరద ప్రవాహం డయాఫ్రమ్‌వాల్ మీదుగానే ప్రవహించింది. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల 2018 నాటికే డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది.» 2017లో వరద ప్రవాహం ముగిశాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పునాది జెట్ గ్రౌటింగ్ వాల్లను 2018 జూన్ నాటికి పూర్తి చేశారు. కానీ ప్రవాహ ప్రభావం పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో 2018లో గోదావరి వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతింది. 20 మీటర్ల లోతుతో నిర్మించిన జెట్ గ్రౌటింగ్ వాల్ పటిష్టంగా ఉందో లేదో తెలుసుకోకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను 2018 డిసెంబర్లో ప్రారంభించి.. 2019 మార్చి నాటికి పూర్తి చేయలేక ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల గోదావరి కుచించుకుపోయి వాటి మధ్య ప్రవహించాల్సి ఉంటుంది. దీనివల్ల వరద ఉద్ధృతి పెరుగుతుంది. ఆ ప్రభావం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంపై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. దాంతో 2019లో గోదావరి ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో 30 మీటర్ల లోతు వరకూ ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుంది. డయాఫ్రమ్‌వాల్ పూర్తిగా దెబ్బతింది. దిగువ కాఫర్ డ్యామ్ కూడా కోతకు గురైంది. జగన్ సర్కారు పనులపై కమిటీ సంతృప్తి» పోలవరం పనులను 2019 నుంచి గాడిలో పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం» వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్ శరవేగంగా పూర్తి» ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహం స్పిల్‌వే మీదుగా మళ్లింపు» దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతంలో జియో బ్యాగ్‌లు ఇసుకతో నింపి పూడ్చివేత» 2023 ఫిబ్రవరికి దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి» స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నట్లు నిపుణుల కమిటీ సంతృప్తి » గతంలో జెట్ గ్రౌటింగ్ గోడలో లోపాల వల్లే ఎగువ కాఫర్ డ్యామ్‌లో లీకేజీ ఒకే సీజన్లో.. కొత్త డయాఫ్రమ్‌వాల్ » 2024 నవంబర్ 1 నుంచి 2025 జూలై 31లోగా పూర్తి చేయాలి » పాత డయాఫ్రమ్వాల్కి ఎగువన సమాంతరంగా కొత్తది నిర్మించాలి » కేంద్ర జలసంఘానికి అంతర్జాతీయ నిపుణుల నివేదిక సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అంతర్జాతీయ నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు చేసింది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్వాల్కి ఎగువన కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని ప్రతిపాదించింది. డయాఫ్రమ్ వాల్ పనులను వరదలు తగ్గాక అంటే 2024 నవంబర్ 1న ప్రారంభించి 2025 జూలై 31లోగా పూర్తి చేసేలా నిరంతరాయంగా చేయాలని స్పష్టం చేసింది. ఒకే సీజన్లో డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ కీలక సిఫార్సులివీ...»గోదావరి వరదల ఉద్ధృతికి గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ 693 మీటర్ల పొడవున దెబ్బతింది. మరమ్మతులు చేసినా అది పూర్తి సామర్థ్యం మేరకు పని చేస్తుందో లేదో చెప్పలేం. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా కొత్త డయాఫ్రమ్వాల్ని నిర్మించడమే శ్రేయస్కరం.» ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నాయి. పునాది జెట్ గ్రౌటింగ్ వాల్లో లోపాల వల్లే ఎగువ కాఫర్ డ్యామ్‌లో సీపేజీ అధికంగా ఉంది. దీన్ని అరికట్టడానికి ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఎగువన నది మధ్యలో ఫిల్టర్లు ఏర్పాటు చేయాలి. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన సీపేజీ నీటి మట్టం సముద్ర మట్టానికి 3 మీటర్ల లోపే ఉండాలి. ఆ మేరకు దిగువ కాఫర్ డ్యామ్‌లో ఏర్పాటు చేసిన గ్రావిటీ స్లూయిజ్‌ల ద్వారా సీపేజీ నీటిని బయటకు పంపాలి. గ్రావిటీ ద్వారా పంపడానికి సాధ్యం కాని నీటిని ఎత్తిపోయాలి. ఈ పనులను తక్షణమే ప్రారంభించాలి.» నవంబర్ 1 నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించడానికి వీలుగా ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ఇసుక తిన్నెలను యధాస్థితికి తెచ్చేలా వైబ్రో కాంపాక్షన్ పనులను పూర్తి చేయాలి. సముద్ర మట్టానికి 3 మీటర్ల ఎత్తు వరకూ ఈ పనులను అక్టోబర్‌లోగా పూర్తి చేయాలి. » కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.. గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, పనులు చేపట్టడంపై వర్క్ షాప్ నిర్వహించాలి.» 2024లో వరదలు తగ్గి పనులు ప్రారంభించడానికి ముందే పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ వర్క్ షాప్ నిర్వహించాలి. సీడబ్ల్యూïÜ, పీపీఏ, జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతిని«దులు పాల్గొనే ఈ వర్క్ షాప్‌నకు అంతర్జాతీయ నిపుణులు కూడా హాజరవుతారు. -
అంతా అబద్ధం
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడాశాఖ ఒలింపిక్స్ లక్ష్యంగా ఒక్కో క్రీడాకారుడిపై చేసిన ఖర్చుపై నివేదికను విడుదల చేస్తుంది. అయితే మహిళా డబుల్స్ స్టార్ షట్లర్ అశ్విని పొన్నప్పపై ఆ శాఖ విడుదల చేసిన వ్యయ నివేదికపై ఆమె మండిపడింది. అత్తెసరు, అరకొర సాయం తప్ప అవసరమైన వ్యక్తిగత కోచ్‌నే ఇవ్వలేదని... అలాంటపుడు ఏకంగా రూ. కోటిన్నర తనపై ఖర్చు చేసినట్లు ఎలా చెబుతారని కేంద్ర క్రీడా శాఖ నిర్వాకంపై అసంతృప్తి వెలిబుచ్చింది. ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్’ (టాప్స్) కింద రూ. 4.5 లక్షలు, అలాగే వార్షిక శిక్షణ, టోర్నీల్లో పాల్గొనడం (ఏసీటీసీ) కోసం రూ. 1 కోటి 48.04 లక్షలను అశ్వినిపై ఖర్చు చేసినట్లుగా ‘సాయ్’ వ్యయ నివేదికలో పేర్కొంది. దీనిపై స్పందించిన షట్లర్ ‘ఇది చూసి నేనైతే తేరుకోలేనంత షాక్‌కు గురయ్యాను. నాకు ఆర్థిక సాయం అందలేదనే చింత లేదు కానీ అంత మొత్తం నాకు కేటాయించారనే తప్పుడు నివేదిక ఇవ్వడం ఏంటి. నిజంగా చెబుతున్నా. ‘సాయ్’... క్రీడా శాఖ నివేదికలో వివరించినట్లుగా నేనెలాంటి నిధులు అందుకోలేదు. జాతీయ శిక్షణ విషయానికొస్తే... రూ. కోటిన్నర నిధుల్ని మొత్తం శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులపై ఖర్చు పెట్టారు. అంతేతప్ప నా ఒక్కరికే అంత మొత్తం ఇవ్వనేలేదు. ఇంకా చెప్పాలంటే నాకు వ్యక్తిగత కోచే లేడు. క్రీడా శాఖ నియమించనూ లేదు. నా వ్యక్తిగత ట్రెయినర్‌ను సొంతడబ్బులతో నేనే ఏర్పాటు చేసుకున్నా. ఇలా చెబుతున్నది నిజం తెలియాలనే తప్పా నాకు డబ్బులు ఇవ్వాలని కానేకాదు. 2023 నవంబర్ వరకు కూడా నా సొంత ఖర్చులతోనే శిక్షణ తీసుకున్నా, పోటీల్లో పాల్గొన్నా... ఆ తర్వాతే టాప్స్‌కు ఎంపికయ్యా’ అని 34 ఏళ్ల అశ్విని వివరించింది. మేటి డబుల్స్ షట్లర్‌గా ఎదిగిన అశ్విని కామన్వెల్త్ క్రీడల్లో 2010లో స్వర్ణం, 2014లో రజతం, 2018లో కాంస్యం గెలిచింది. 2011 ప్రపంచ చాంపియన్‌షిలో గుత్తా జ్వాలతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. జ్వాలతోనే కలిసి 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్‌లలో డబుల్స్‌లో పోటీపడింది. పారిస్ ఒలింపిక్స్‌లో తనీషాతో కలిసి బరిలోకి దిగిన అశ్విని గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. -
మనం.. ‘పొదుపు’లో ఘనం
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు పొదుపు,, క్రెడిట్ లింకేజి విషయంలోనూ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం, వాటి పనితీరుపై 2023–24 వార్షిక నివేదికను శనివారం నాబార్డు విడుదల చేసింది. దేశంలోని ఈ సంఘాల పొదుపు ఆంధ్ర ప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. అంతకుముందు నాలుగేళ్లు కూడా ఏపీనే అగ్రగామిగా నిలిచింది. స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు, సున్నా వడ్డీ వంటి ప్రోత్సాహకాలతోనే ఇలా ఉత్తమ పనితీరు కనబరిచినట్లు నివేదిక స్పష్టంచేసింది. – సాక్షి, అమరావతి నిజానికి.. గతంలో చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైన పొదుపు సంఘాలను వైఎస్ జగన్ సర్కారు గత ఐదేళ్లుగా గాడిన పెట్టడమే కాకుండా దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరిచే స్థాయికి తీసుకెళ్లింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి పొదుపు సంఘాల సొమ్ము (2023–24 మార్చి నాటికి) రూ.65,089.15 కోట్లు అయితే.. ఇందులో దక్షిణాది రాష్ట్రాల పొదుపు రూ.29,409.06 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని సంఘాల పొదుపు దేశంలోనే అత్యధికంగా రూ.17,292.16 కోట్లుగా ఉందని నివేదక వెల్లడించింది. అంటే దేశంలో మన రాష్ట్ర వాటా 26.56 శాతంగా ఉంది. సగటు పొదుపు ఏపీలోనే అత్యధికం.. 2023–24లో దేశంలోని మహిళా సంఘాల సగటు పొదుపులో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని నాబార్డు నివేదిక స్పష్టంచేసింది. ఇక్కడ ఒక్కో సంఘం సగటు పొదుపు రూ.1,57,321లుగా ఉంది. బ్యాంకులు కూడా ఏపీ పొదుపు సంఘాలకే అత్యధికంగా రుణాలు మంజూరు చేస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని నివేదిక తెలిపింది. రాష్ట్రాల వారీగా చూస్తే.. 2023–24లో బ్యాంకుల రుణాల పంపిణీలో రూ.59,777 కోట్లతో ఏపీ మొదటి స్థానంలో ఉండగా కర్ణాటక రూ.25,253 కోట్లతో రెండో స్థానంలో, తెలంగాణ రూ.20,932 కోట్లతో మూడో స్థానంలో.. పశ్చిమ బెంగాల్ రూ.20,671 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఒక్కో పొదుపు సంఘం సగటు రుణ పంపిణీలోకూడా ఏపీ రూ.8.8 లక్షలతో అగ్రస్థానంలో ఉందని, ఆ తరువాత కేరళ రూ.7.7 లక్షలు, తమిళనాడు రూ.6.7 లక్షలతో ఉన్నాయి. సున్నా వడ్డీతో సంఘాలు బలోపేతం ఇదిలా ఉంటే.. సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సున్నావడ్డీ (వడ్డీలేని రుణాలు) రుణాలను అమలుచేసిందని కూడా నివేదిక పేర్కొంది. ఫలితంగా.. పొదుపు సంఘాలు బలోపేతం కావడమే కాక గ్రామీణ కుటీర పరిశ్రమలు పరిపుష్టి సాధించాయని తెలిపింది. అంతేకాక.. 2014లో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసంచేయడంతో స్వయం సహాయక సంఘాలు అప్పుల్లో కూరుకుపోవడమే కాకుండా సంఘాల నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇవి గణనీయంగా తగ్గాయి. 2014–19 మ«ద్య బాబు హయాంలో 5.86 శాతంగా ఉన్న నిరర్థక ఆస్తులు 2023–24 నాటికి అవి 0.31 శాతమేనని నివేదిక తెలిపింది.మన ‘పరపతి’ కూడా పెరిగింది.. ఇక 2014–2019 మధ్య చంద్రబాబు చేసిన దగాకు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల పరపతి పూర్తిగా దిగజారిపోయింది. అప్పట్లో చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన రుణమాఫీ మాటలు నమ్మి వీరు నిలువునా మోసపోయారు. ఆయన అధికారం చేపట్టగానే ప్లేటు ఫిరాయించి రుణమాఫీ చేయబోనని అడ్డం తిరగడంతో పొదుపు సంఘాల అప్పులు పెరిగిపోవడంతో రుణాల మంజూరుకు బ్యాంకులు వెనుకాడాయి. దీంతో.. సంఘాలు సీ, డీ గ్రేడ్లకు పడిపోయాయి. మరోవైపు.. 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల తేదీ నాటికి ఉన్న అప్పులు రూ.25,570.79 కోట్లను నాలుగు విడతల్లో సంఘాలకు చెల్లించారు. అంతేకాక.. బాబు ఎగ్గొట్టిన సున్నావడ్డీని జగన్ సర్కారు పునరుద్ధరించి దీనికింద రూ.4,969.04 కోట్లను పొదుపు అక్క చెల్లెమ్మలకు చెల్లించారు. దీంతో రాష్ట్రంలో పొదుపు సంఘాల పరపతి అమాంతం పెరిగింది. ఆసరా, సున్నా వడ్డీతో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరగడంతో ఇప్పుడు దేశంలోనే అత్యధిక క్రెడిట్ లింకేజీ గల పొదుపు సంఘాలుగా మనవి నిలిచాయి. బాబు హయాంలో (2014–19) పొదుపు సంఘాల క్రెడిట్ లింకేజీ 43.6 శాతం ఉంటే ఇప్పుడు 89 శాతంగా ఉంది. దీంతో గత ఐదేళ్లుగా రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాల మంజూరు పెరుగుతూనే ఉన్నాయి. -
ఏపీ.. ఆ నాలుగేళ్లలో హ్యాపీ
దేశానికి ఆహార ధాన్యాలను అందించడంలో గడచిన ఐదేళ్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసిన మన రాష్ట్రం వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ అదే ఒరవడి కొనసాగించింది. తద్వారా స్థిరమైన, సమ్మిళిత వృద్ధివైపు దూసుకెళ్లిందని వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ– 2024 నివేదిక స్పష్టం చేసింది.వ్యవసాయ అనుబంధ రంగాలైన పండ్లు, కూరగాయలు, చేపలు, పశు సంపద ఉత్పత్తుల్లో గడచిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ అనుంబంధ రంగాల ఉత్పత్తుల పెరుగుదలపై ఆ శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది.మత్స్య ఉత్పత్తుల్లో నంబర్–1 2011–12 స్ధిర ధరల ఆధారంగా గడచిన నాలుగేళ్లలో చేపల ఉత్పత్తులు, విలువ పెరుగుదలల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్–1 స్థానంలో నిలిచిందని ఆ నివేదిక స్పష్టం చేసింది. 2019–20 నుంచి 2022–23 వరకు నాలుగేళ్లలో చేపల ఉత్పత్తితో పాటు విలువ కూడా భారీగా పెరుగుతూ వచ్చిందని నివేదిక పేర్కొంది. 2019–20 సంవత్సరంలో స్ధిర ధరల ఆధారంగా రూ.58,700 కోట్ల విలువ చేసే చేపల ఉత్పత్తి జరగ్గా.. 2022–23లో రూ.79,900 కోట్లకు పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. స్ధిర ధరల ఆధారంగా 2022–23లో దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌లో చేపలు, ఆక్వా ఉత్పత్తుల వాటా 40.9 శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది. ఆ తరువాత స్థానంలో పశ్చిమ బెంగాల్లో 14.4 శాతం ఉండగా, ఒడిశాలో 4.9 శాతం, బీహార్‌లో 4.5 శాతం, అస్సాంలో 4.1 శాతం ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో కలిపి 31.1 శాతం వాటా ఉందని వెల్లడించింది. పశు ఉత్పత్తిలోనూ టాప్ పశు సంపద అంటే పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తుల విలువ ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లుగా పెరుగుతూనే ఉందని నివేదిక వెల్లడించింది. 2019–20లో స్ధిర ధరల ఆధారంగా పశు సంపద ఉత్పత్తుల విలువ రూ.54,200 కోట్లు ఉండగా.. 2022–23లో రూ.64,000 కోట్లకు పెరిగింది. తద్వారా దేశంలో ఏపీ దిగువ నుంచి నాలుగో స్థానానికి ఎగబాకిందని స్పష్టం చేసింది. స్థిర ధరల ఆధారంగా 2022–23లో దేశవ్యాప్తంగా చూస్తే.. ఏపీలో పశు సంపద ఉత్పత్తుల వాటా 7.8 శాతంగా ఉంది. రాజస్థాన్‌లో 12.5 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 12.3 శాతం, తమిళనాడులో 9.1 శాతం, మహారాష్ట్రలో 7.3 శాతం వాటా ఉండగా.. మిగతా అన్ని రాష్ట్రాల్లో కలిపి 50.9 శాతం వాటా ఉందని నివేదిక పేర్కొంది.ఉద్యాన పంటల్లోనూ.. పండ్లు, కూరగాయల ఉత్పత్తి విలువ పెరుగుదలలో గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఐదో స్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తుల విలువ స్దిర ధరల ఆధారంగా ఏపీలో 2019–20లో రూ.35,500 కోట్లు ఉండగా.. 2022–23లో రూ.35,800 కోట్లకు పెరిగింది. స్థిర ధరల ఆధారంగా 2022–23లో దేశం మొత్తంలో ఏపీలో పండ్లు కూరగాయల ఉత్పత్తుల వాటా 8.2 శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది. పశ్చిమబెంగాల్లో 11.4 శాతం, మధ్యప్రదేశ్‌లో 10.9 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 10.5 శాతం, మహారాష్ట్రలో 8.9 శాతం వాటా ఉండగా.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కలిపి 49.2 శాతం వాటా ఉందని నివేదిక వివరించింది. -
ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ ఆదేశాలు!
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే మృతిపై ఇరాన్ ఆధ్యాత్మిక నేత, సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. హనియే మృతికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. అయితే తాజాగా ఆయన ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలని ఇరాన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని ముగ్గురు ఇరానియన్ అధికారులు, రెవల్యూషనరీ గార్డ్స్‌లోని ఇద్దరు సభ్యులు నిర్ధారించినట్లు సమాచారం. ఇప్పటికే ఇరాన్ సైనిక కమాండర్లు ఇజ్రాయెల్, హైఫా సరిసరాల్లో సైనిక లక్ష్యాలపై డ్రోన్లు, క్షిపణలతో దాడి చేయడానికి పరిశీలిస్తున్నాని ఇరాన్ అధికారలు పేర్కొన్నారు. అయితే పౌరులపై టార్గెట్ చేయకుండా సైనిక లక్ష్యాలపై దాడి చేయనున్నట్లు తెలిపారు. ఇరాన్ సైన్యం.. యెమెన్, సిరియా, ఇరాక్‌తో సహా మిత్రరాజ్యాల సైనిక బలగాలతో కలిసికట్టుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని పరిశీలిస్తోందని అధికారులు పేర్కొన్నారు.హనియే మృతికి ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ బుధవారం బహిరంగంగా హెచ్చరించారు. అది తమ పవిత్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ‘‘మా ప్రియతమ అతిథిని మా నేలపైనే ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంది. తద్వారా తనకు తానే మరణశాసనం రాసుకుంది’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందన తీవ్రంగానే ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే అయతొల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌పై దాడికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడికి ప్రతికారంగా ఇరాన్.. వందల కొద్దీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించి మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. -
నాడు వ్యూవర్స్.. నేడు క్రియేటర్స్: యూట్యూబ్ రిపోర్ట్
యూట్యూబ్ కొన్నేళ్లుగా ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. ఏ సమాచారం కావాలన్నా, ఏం సందేహం వచ్చినా అన్నింటికీ అదే సమాధానం అయిపోయింది. ఒకప్పుడు వీడియోలు చూడటానికే పరిమితమైన యూజర్లు క్రమంగా తామూ వీడియాలు చేస్తూ తమను తాము ప్రదర్శించుకోవడానికి యూట్యూబ్‌ను అద్భుతమైన వేదికగా మార్చుకున్నారు.యూట్యూబ్‌లో ఏదైనా కంటెంట్‌ను అభిమానిస్తూ ఫాలో అయ్యే ఫ్యాన్స్ ధోరణిలో ఇటీవల చాలా మార్పు వచ్చింది. ఏడాది కాలంగా భారతీయ యూజర్లలో వచ్చిన మార్పులపై యూట్యూబ్ ఓ నివేదికను విడుదల చేసింది. యూట్యూబ్ కల్చర్ అండ్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం.. భారతీయ జెన్ జెడ్ (14-24 సంవత్సరాల వయసువారు)లో 91% మంది గత సంవత్సరంలో ఫ్యాన్ సంబంధిత కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. 93% మంది తమకు ఇష్టమైన అంశాలను అనుసరించడానికి వారానికోసారైనా యూట్యూబ్‌ను ఉపయోగించారు.ముంబైలో జరిగిన యూట్యూబ్ ఫ్యాన్‌ఫెస్ట్ 10వ వార్షికోత్సవం సందర్భంగా స్మిత్గీగర్తో కలిసి రూపొందించిన ఈ నివేదికను యూట్యూబ్ విడుదల చేసింది. ఇంకా ఈ రిపోర్ట్ మరికొన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించింది. భారతీయ జెన్ జెడ్‌లో 83% మంది తమను తాము క్రియేటర్లుగా ప్రదర్శించుకున్నారు. 87% మంది వివిధ స్థాయిలలో ఎవరో ఒకరికి, ఏదో ఒక దానికి ఫ్యాన్‌గా నిమగ్నమయ్యారు. అంటే లైక్, కామెంట్ వంటివి చేశారన్నమాట. -
వైఎస్ జగన్ హయాంలో.. పరిమితంగానే ఏపీ అప్పులు
రాష్ట్రంలో గత వైఎస్ జగన్ సర్కారు ఇబ్బడిముబ్బడిగా అప్పులచేసిందంటూ చంద్రబాబు బ్యాచ్ చేస్తున్న ప్రచారం అంతా అవాస్తవమని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. ఆరి్థక సంఘం సిఫార్సుల కన్నా ఆంధ్రప్రదేశ్ వరుసగా 2022, 2023 సంవత్సరాల్లో పరిమతి కన్నా తక్కువ అప్పులుచేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. గత మంగళవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024–25 కేంద్ర బడ్జెట్ విశ్లేషణాత్మక నివేదికలో ఎస్బీఐ ఈ విషయాన్ని పేర్కొంది. వివిధ రాష్ట్రాల అప్పులు, తప్పనిసరి వ్యయాలు, సాధికారతతో కూడిన సంక్షేమ పథకాల వ్యయం, తలసరి ఆదాయాలతో కూడిన అంశాలను విశ్లే షిస్తూ ఎస్బీఐ ఈ నివేదికను విడుదల చేసింది. – సాక్షి, అమరావతి పరిమితి కన్నా 1.4 శాతం తక్కువగా.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు కన్నా ఏపీ వరుసగా 2022, 2023 సంవత్సరాల్లో తక్కువగా అప్పులు చేసిందని.. అదే హిమాచల్‌ప్రదేశ్, బిహార్, పంజాబ్ రాష్ట్రాలు 2023లో 15వ ఆరి్థక సంఘం సిఫార్సులు కన్నా ఎక్కువగా అప్పుచేసినట్లు నివేదిక తెలిపింది. ఈ సిఫార్సులతో పాటు విద్యుత్ సంస్కరణలు అమలుచేస్తున్న ఏపీకి 2022లో జీఎస్డీపీలో 4.5 శాతం మేర అప్పుచేయడానికి అనుమతి ఉందని.. అయితే 3.1 శాతమే నికర అప్పుచేసింది. అంటే.. పరిమితి కన్నా 1.4 శాతం మేర తక్కువగా అప్పుచేసినట్లు ఎస్బీఐ నివేదిక పేర్కొంది. ఇక 2023లో జీఎస్డీపీలో 4 శాతం అప్పు చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ ఏపీ 3.5 శాతమే నికర అప్పుచేసిందని, అంటే పరిమితి కన్నా 0.5 శాతం తక్కువగా అప్పుచేసిందని నివేదిక పేర్కొంది. జాతీయ సగటు కంటే తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ తప్పనిసరి వ్యయాలైన పెన్షన్, వడ్డీ చెల్లింపులు, పరిపాలనపరమైన వ్యయాలు బిహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశి్చమ బెంగాల్ రాజస్థాన్ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, హరియాణాల్లో పెన్షన్లు, వడ్డీలు, పరిపాలనపరమైన తప్పనిసరి వ్యయం తక్కువగా ఉందని తెలిపింది. అంతేకాక.. ఏపీ తలసరి సగటు ఆదాయం జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని, ఈ పరిణామం అత్యంత అనుకూలమైనదిగా నివేదిక వ్యాఖ్యానించింది. దేశాభివృద్ధికి జగన్ పథకాలు దోహదం.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు సంక్షేమానికి గణనీయంగా వ్యయంచేసి సంక్షేమ రాష్ట్రాలుగా మార్చారని నివేదిక అభిప్రాయపడింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరోగ్యం, విద్యతో అనుసంధానం చేసే సంక్షేమ పథకాలను అమలుచేసిందని, అలాగే.. మహిళలు, పిల్లల విద్య, మహిళల ఆరోగ్యంతో కూడిన పథకాలను అమలుచేసిందని పేర్కొంది. మహిళా సాధికారిత సాధించడమే లక్షంగా పథకాలను అమలుచేశారని, ఇవన్నీ దీర్ఘకాలంలో ఫలితాలను సాధించడంతో పాటు దేశాభివృద్ధికి దోహదపడతాయని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, పొదుపు సంఘాలకు వైఎస్సార్ సున్నావడ్డీ అమలు పథకాలు ఈ కోవలేకే వస్తాయని నివేదిక వ్యాఖ్యానించింది. -
పేరెంట్స్ విషయంలోనూ పూజా ఖేద్కర్ అబద్ధం!
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ విషయంలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. తన తల్లిదండ్రులు విడిపోయారని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె వెల్లడించారు. అయితే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. అది నిజం కాదని తేల్చారు. పలు వివాదాల్లో చిక్కుకున్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ తల్లిదండ్రుల వైవాహిక స్థితి గురించి తెలియజేయాలని పూణే పోలీసులను కేంద్రం ఆదేశించింది. యూపీఎస్సీ పరీక్షలో ఓబీసీ నాన్-క్రీమీ లేయర్‌ను పూజా వినియోగించుకుంది. ఇందుకోసం ఆమె తన తల్లిదండ్రులు విడిపోయారనే కారణాన్ని జత చేసింది. అయితే ఆమె ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన నేపధ్యంలో ఆమె తల్లిదండ్రుల వైవాహిక స్థితిపై కేంద్రం నివేదికను కోరింది.ఈ నేపథ్యంలో.. పూజా ఖేద్కర్ తల్లిదండ్రుల వైవాహిక స్థితికి సంబంధించి పూణె పోలీసులు తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పూజా తల్లిదండ్రులైన దిలీప్, మనోరమా ఖేడ్కర్లు చట్టబద్ధంగా విడిపోయారని, అయినప్పటికీ వారిద్దరూ కలిసే ఉంటున్నారని ఆ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. పూజా ఖేద్కర్ ఢిల్లీలోని వివిధ అకాడమీలలో తన మాక్ ఇంటర్వ్యూలలో తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని, తాను తండ్రికి దూరంగా తన తల్లితో ఉంటున్నందున తన కుటుంబ ఆదాయం సున్నా అని ఆమె పేర్కొన్నారు. అయితే దిలీప్.. మనోరమ ఖేడ్కర్ 2009లో పూణేలోని ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2010, జూన్ 25న వారు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ బన్నర్ ప్రాంతంలోని నివాసంలో కలిసే ఉంటున్నారు. కుటుంబ ఫంక్షన్లకు కలిసే హాజరవుతున్నారని దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దిలీప్ ఖేద్కర్ సమర్పించిన అఫిడవిట్లో మనోరమను తన భార్యగా పేర్కొనడం కొసమెరుపు. -
ఈ వీడియోలు యమా టేస్టీ..
సాక్షి, అమరావతి : జేక్ డ్రయాన్, ఆండ్రియా, చెయ్సింగ్, సారా టాడ్, బెరిల్ షెరెషెవ్స్కీ.. వీరంతా ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. జేక్ డ్రయాన్ది ఇంగ్లండ్ అయితే.. ఆండ్రియా ఒక జర్మన్.. సారా టాడ్ ఒక ఆస్ట్రేలియన్.. బెరిల్ షెరెòÙవ్స్కీది న్యూయార్క్. వీరందరిలో ఒక సారూప్యత ఉంది. రకరకాల భారతీయ వంటకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ఈ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు. ఇలా వారు ఇన్‌స్ట్రాగాం రీల్స్, యూట్యూబ్ షాట్స్ ద్వారా సోషల్ మీడియా వేదికపై లక్షలకొద్దీ ఫాలొవర్లను సంపాదించుకుని ఘుమఘుమలాడే మన దేశీయ రుచులకు ఎక్కడలేని ప్రాచుర్యం కల్పిపస్తున్నారు. యూట్యూబ్ వంటల వీడియోల్లో ఇటీవల కాలంలో కొత్త ఒరవడి మొదలైంది. కేవలం మన దేశానికి పరిమితమై ఉండే, లేదంటే ఇక్కడే కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండే చాలారకాల వంటలపై మన దేశంతో ఏ సంబంధంలేని విదేశీయులు కొందరు రూపొందిస్తున్న వీడియోలు లక్షల మంది భారతీయులు మెచ్చుకునేలా ఉంటున్నాయి. ఫుడ్ బ్లాగర్ అయిన జేక్ డ్రయాన్ తనకు తానుగా దక్షిణాది భారతీయులకు అత్యంత ప్రియమైన సాంబారు–ఇడ్లీ వండుతూ చేసిన వీడియోను 25 లక్షల మంది వీక్షించారు. కేవలం ఇన్స్టాలోనే దాదాపు 18 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న డ్రయాన్ మన దేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన 17 రాష్ట్రాలకు చెందిన వంటకాలపై వీడియోలు చేశారు. ఇతను మన దేశాన్ని ఎప్పుడూ సందర్శించనప్పటికీ మనవాళ్ల ఆసక్తి, అభిరుచుల నాడి పట్టుకుని పసందైన వీడియోలు చేస్తున్నారు. బిహార్‌లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన ‘సత్తు కా పరంత’.. రాజస్థాన్ ‘దాల్ బాటి చుర్మా’ వీడియోలకు నెట్టింట అత్యంత ఆదరణ దక్కింది. అలాగే, జర్మనీకి చెందిన అండ్రియా మన దేశంలోని పంజాబ్ యువకుడిని పెళ్లి చేసుకుంది. దాంతో భారతీయ వంటకాలపై ఆమెకు ఆసక్తి పెరిగింది. అలా ఆండ్రియా రూపొందించిన భారతీయ వంటల వీడియోలకు సోషల్ మీడియా ఇన్‌స్ట్రాగాంలో ఆమెకు 1.69 లక్షల మంది ఫాలోవర్లును తెచి్చపెట్టింది. అంతేకాదు.. ఆ్రస్టేలియాకు చెందిన సారా టాడ్, న్యూయార్క్‌లో నివాసం ఉండే బెరిల్ షెరెషెవ్స్కీ లాంటి విదేశీయుల భారతీయ వంటల వీడియోలు మన దేశంలో యమా క్రేజ్ పొందాయి. ఉపాధి అవకాశాల్లోనూ అదరహో.. ఇక మన దేశంలో అత్యధిక మంది ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిపస్తున్న రెండో అతిపెద్ద రంగంగా కూడా ఆహార రంగం ప్రగతి సాధించిందని ఆరి్థక నిఫుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రంగంలో ఏటా 85 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు తెచ్చి పెడుతుండగా, 2028 నాటికి ఏటా కోటికి మందికి దక్కే అవకాశం ఉందని అంచనా. ది ఇండియా ఫుడ్ సర్వీవస్ రిపోర్టు–2024 ప్రకారం..ప్రస్తుతం దేశంలో ఏటా ఆహార రంగ వ్యాపారం రూ.5.69 లక్షల కోట్లు 2028 నాటికి చేరుకునే మొత్తంరూ.7.76 లక్షల కోట్లు ప్రస్తుతం ఈ రంగంలో ఏటా ఉపాధి అవకాశాలు 85 లక్షలమందికి 2028 నాటికి ఉపాధికోటి మందికి 2028 నాటికి ఈ రంగం వ్యాపార లావాదేవీల్లో సంఘటిత రంగంవాటా 53 %ఆహార రంగం వ్యాపార లావాదేవీల్లో అసంఘటిత రంగం వాటా56.7 %వంటలపైనే ఏటా రూ.5.69 లక్షల కోట్ల వ్యాపారం.. ఇలా యూట్యూబ్‌లో వంటల వీడియోలు చూస్తూ నచి్చన వంటలను చేసుకుని తినడమే కాదు.. అప్పుడప్పుడూ ఇంటిల్లిపాదీ రెస్టారెంట్లకు వెళ్లి అక్కడి రుచులను ఆస్వాదించే సంస్కృతి కూడా బాగా పెరిగిపోయింది. పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు, విజయవాడ, విశాఖపట్నంతోపాటు ఓ మోస్తరు పట్టణాల్లో సైతం పుట్టగొడుగుల్లా వెలుస్తున్న రెస్టారెంట్లు వీకెండ్స్, సెలవు రోజుల్లో కిక్కిరిసిపోయి ఉంటున్నాయంటే ఫుడ్ బిజినెస్‌కు ఏ స్థాయిలో ఆదరణలో ఉందో తెలుస్తుంది. నిజానికి.. ఆరి్థకవేత్తలు చెబుతున్న గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం మన దేశంలో ఏటా రూ.5.69 లక్షల కోట్ల మేర వ్యాపారం ఈ ఆహార రంగంలో జరుగుతోంది. ఇంకోవైపు.. దేశంలో అన్ని వ్యాపార రంగాల్లో కొనసాగుతున్న వృద్ధి కంటే ఒక్క ఆహార రంగంలోని వ్యాపార వృద్ధే అధికంగా ఉన్నట్లు వారంటున్నారు. ది ఇండియా ఫుడ్ సర్వీస్ రిపోర్టు–2024 ప్రకారం.. దేశ ఆహార రంగంలో ఏటా రూ.5.69 లక్షల కోట్ల మేర వ్యాపారం కొనసాగుతుండగా, 2028 నాటికి అది ఏకంగా రూ.7.76 లక్షల కోట్లకు చేరుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తల పెట్టుబడులు.. ఇలా.. ఈ రంగంపై భారీ వృద్ధి అంచనాలు ఉండడంతో బడా పారిశ్రామిక వ్యాపారవేత్తలు సైతం ఈ రంగంపై కన్నేసి కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని ఆహార రంగం వ్యాపార లావాదేవీల్లో 56.7 శాతం మేర అసంఘటిత రంగంలోని చిన్న హోటళ్ల ద్వారా సాగుతుండగా, 2028 నాటికి ఈ లావాదేవీలు 47 శాతానికి పరిమితమై ప్రభుత్వం వద్ద గుర్తింపు పొందిన సంఘటిత రంగం ద్వారా 53 శాతం లావాదేవీలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. -
యూపీలో బీజేపీకి తగ్గిన సీట్లు.. ఆరు కారణాలు ఇవే!
లక్నో: లోక్ సభ ఎన్నికల్లో తమకు కుంచుకోటగా భావించిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. గత లోక్ సభ ఎన్నికలతో పోల్చితే గణనీయంగా సీట్లు తగ్గాయి. అయితే లోక్ సభ ఎన్నికల్లో వైఫల్యానికి గల కారణాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం హైకమాండ్‌కు నివేదికి సమార్పించింది. ఈసారిగా ఓటమి, సీట్లు తగ్గుదలకు గల కారణాలను అందులో వివరించారు. ఈ నివేదికను అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు ముఖ్యంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీట్లు ఆమేథీ, అయోధ్యల్లో మొత్తంగా సుమారు 40 వేల కార్యకర్తలు అభిప్రాయలతో తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఆశించి సీట్ల రాకపోవడానికి ఈ నివేదిక ఆరు ప్రధానమైన కారణాలను వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పార్టీ ఎమ్మెల్యేలకు పవర్ లేకపోవటం. ప్రభుత్వం అధికారుల చేతిలో అధికారంలో ఉండటంతో పార్టీ కార్యకర్తల తీవ్రంగా అవమానంగా భావించారు. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయలేకపోయాయని ఓ సీనియర్ నేత పేర్కొన్నారు.రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో సుమారు 15 సార్లు పేపర్ల లీక్ అయ్యాయి. దీన్ని ప్రతిపక్షలు ప్రజల్లో తీసుకువెళ్లటంలో విజయం సాధించారు. దీంతో బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మారు.ప్రభుత్వంలో పెద్దస్థాయిలో పోస్టులను కాంట్రాక్టుల ఉద్యోగులతో భర్తీ చేయిటంలో ప్రతిపక్షాల ఆరోపణలు మరింత బలం చేకూరి ప్రజలు ఆందోళనకు గురయ్యారు.కూర్మీ, మౌర్య సామాజిక వర్గాలు ఓట్లు ఈసారి బీజేపీ పడలేదు. దీంతో పాటు దళిత ఓటర్లను కూడా బీజేపీ తమవైపు తిప్పుకోలేకపోయింది. బీఎస్పీతో ఓటు బ్యాంక్ ఉన్న దళితులను తమవైపుకోని కాంగ్రెస్ ఓటుషేర్‌ను పెంచుకుంది.ఎన్నికలకు ముందుగానే బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో కార్యకర్తలు సైతం ఎన్నికల ప్రచారంలో నిర్లక్ష్యం వహించారు. పలు దశల్లో పోలింగ్ జరగటంతో కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గుతూ వచ్చింది.రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర నాయకులే వ్యాఖ్యలు చేయటంతో వాటిని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లారు. బీజేపీ నేతలు వ్యాఖ్యలను ప్రజలు సీరియస్‌గా తీసుకోని ప్రతిపక్షాలవైపు మొగ్గుచూపారు.బీజేపీ 370 సీట్ల నినాదంతో ఎన్నికల బరిలోకి దిగగా.. 240 సీట్లకు పరిమితమైంది. దీంతో మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ అధికారంలో వచ్చి మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లకు గతంలో 62 సీట్ల నుంచి 33 స్థానాలుకు తగ్గిపోయింది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఏకంగా 37 సీట్లను గెలుచుకుంది. దీనిపై ఇటీవల యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరీ, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి పార్టీ ఓటమిపై చర్చలు జరిపారు. -
హత్రాస్ ఘటనపై 850 పేజీల సిట్ రిపోర్టు
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ తొక్కిసలాట కేసులో సిట్ నివేదిక వెలువడింది. యూపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సిట్ ఈ కేసుపై విచారణ జరిపింది. తాజాగా సిట్ ఈ నివేదికను హోం శాఖకు అందజేసింది. బాధ్యులందరి పేర్లు ఈ నివేదికలో ఉన్నాయి.ఈ కేసులో 128 మందితో జరిపిన సంభాషణల ఆధారంగా సిట్ అధికారులు ఈ నివేదికను రూపొందించారు. ఇందులో సత్సంగంలో ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదానికి ఎవరు కారకులనేది వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ నివేదిక గోప్యంగా ఉంచారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు సీఎం ఆదేశించనున్నారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నివేదికపై సీనియర్ అధికారులతో చర్చించనున్నారు. ఏడీజీ ఏడీజీ అనుపమ కులశ్రేష్ఠ, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ చైత్ర వి ఈ నివేదికను రూపొందించారు. సిట్ రూపొందించిన ఈ నివేదిక 850 పేజీలు ఉన్నట్లు సమాచారం.ఇటీవల హత్రాస్‌లో బాబా సాకార్ హరి అలియాస్ భోలే బాబా సత్సంగం సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. భోలే బాబా పాదాలను పూజించేందుకు భక్తులు ఒక చోట గుమిగూడిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కేసులో ఆర్గనైజింగ్ కమిటీతో సంబంధం కలిగినవారిని అరెస్టు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో బాబా పేరు లేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఘటనాస్థలికి వెళ్లారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. -
కరణ్ జోహార్ ఫేస్ చేసిన బాడీ డిస్మోర్ఫియా అంటే..?ఎందువల్ల వస్తుంది?
మనిషికి ఆత్మనూన్యతకు మించిన ప్రమాదకరమైన జబ్బు మరొకటి లేదు. కొందరూ దీన్ని అధిగమించేలా తమ సామర్థ్యం, తెలివితేటలతో ఆకర్షిస్తారు. కానీ చాలామంది చింతిస్తూ కూర్చొండిపోతారు. తమలోని లోపాలనే పెద్దవిగా చూసుకుని బాధపడితుంటారు. నిజానికి వాటిని ఇతరులు కూడా గుర్తించకపోవచ్చు. కానీ వీళ్లు మాత్రం తాము అందరికంటే విభిన్నంగా, అసహ్యంగా ఉన్నానే భావనలో ఉండిపోతారు. ఇలాంటి ఆత్మనూన్యతకు సంబంధించిన రుగ్మతను ఎదుర్కొన్నాడు బాలీవుడ్ సినీ నిర్మాత కరణ్ జోహార్. అతడు ఎదుర్కొన్న పరిస్థితిని వైద్య పరిభాషలో ఏమంటారంటే..కరణ్ జోహర్ ఎదుర్కొన్న పరిస్థితిని బాడీ డిస్మోర్ఫియా అంటారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్లు నలుగురిలోకి రావడానికి ఇష్టపడరు. తమ రూపాన్ని పదే పదే అద్దంలో చూసుకుని కుంగిపోతుంటారు. అందంగా ఉండేందుకు మంచి ప్రయత్నాలు కూడా చేస్తారు. అయినప్పటికీ ఏదో లోపం ఉందనుకుంటూ బాధపడిపోతుంటారు. ఇక్కడ కరణ్ జోహార్ కూడా ఇలానే ప్రవర్తించేవాడు. ఇతరులు ఎవ్వరూ తన శరీరాన్ని గమనించకూడదనుకునేవాడట. దీని నుంచి బయటపడేందుకు అతడు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఏంటీ బాడీ డిస్మోర్ఫియా? అందుకు గల కారణాలు గురించి సవివరంగా చూద్దాం.బాడీ డిస్మోర్ఫియా అంటే ఏమిటి?నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్ లేదా బీడీడీ అనేది ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి. ఇక్కడ ఒక వ్యక్తి శరీరాకృతి తీరులోని లోపాల గురించి చింతిస్తూ ఎక్కువ సమయం గడుపుతుంటాడు. ఈలోపాలు ఎదుటివాళ్లకు కనిపించవు లేదా గుర్తించబవు. ఇది ముఖ్యంగా టీనేజర్లు, యువకులలో సాధారణమని వైద్యులు చెబుతున్నారు. ఇది పురుషులు, మహిళలు ఇద్దరిని ప్రభావితం చేస్తుందట. అంతేగాదు పెద్దలలో 2.4% మందిని ప్రభావితం చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువగా యుక్తవయసు, వయోజన వయసులో ఈ విధమైన భావన మొదలవుతుందని చెబుతున్నారు. చాలా వరకు ఈ విధమైన పరిస్థితి 18 ఏళ్ల కంటే ముందునుంచి వారిలో చిన్నగా వారిపై వారికి అభద్రతా భావం కలగడం మొదలవ్వుతుందని తెలిపారు వైద్యులు.ఈ వ్యాధి సంకేతాలు, లక్షణాలు..శరీరంలో లోపాల గురించి ఆలోచిస్తూ ఎక్కువ సమయం గడపడం, ఇతరులకు అది ముఖ్యమైనది కాదని లేదా గనించనప్పటికీ.రూపాన్ని పదేపదే చూసుకుంటూ ఒత్తిడికి గురవ్వుతుండటంహెయిర్స్టైల్, బట్టల మార్పు వంటివి తరుచుగా మర్చేయడంతరుచుగా సెల్ఫీలు తీసుకోవడం, శరీరంలోని కొన్ని ప్రాంతాను దాచేయత్నం చేయడంవారి శరీరం లేదా స్వరూపంలో నచ్చని దాన్నే ఇతరులు తదేకంగా చూస్తున్నారని లేదా ఎగతాళి చేస్తున్నారని భావించడంతమ శరీరంపై అసహ్యం లేదా సిగ్గుతో కుంగిపోవడంవస్త్రాధారణకు సరిపోనని భావించడంఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మాత్రం స్నేహితులు, కుటుంబ సభ్యలుతో గడపడం, వంటివి చేస్తే స్వీయ హాని లేదా ఆత్మహత్య వంటి ఆలోచనల నుంచి బయటపడగలుగుతారు. ఎందువల్ల అంటే..జెనిటిక్ సమస్యతల్లిదండ్రులు లేదా తోబుట్టువులు ఈ పరిస్థితితో బాధపడుతుంటే..మెదడు నిర్మాణం, రసాయనిక చర్యలు, కార్యాచరణ వ్యత్యాసాలుబాల్యంలో నిర్లక్ష్యానికి గురవ్వడంపరిణామాలు..బాడీ డిస్మోర్ఫియాతో బాధపడుతున్న వారికి మానసిక ఆరోగ్యో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఆందోళన రుగ్మతలుడిప్రెషన్, ఒత్తిడితినే రుగ్మతలుఅబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ.(చదవండి: రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?) -
‘ఇంట్లో ఏం తింటాం.. బయటికెళ్దాం’.. ఆసక్తికర నివేదిక
దేశంలో ప్రజల ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ఈటింగ్ అవుట్, ఫుడ్ డెలివరీలకు సంబంధించిన భారతదేశపు ఫుడ్ సర్వీస్ మార్కెట్‌పై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ బైన్ సంయుక్తంగా ఓ అధ్యయనాన్ని నిర్వహించాయి. ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.దేశపు ఆహార సేవల మార్కెట్ వచ్చే ఏడేళ్లలో ఏటా 10–12% వృద్ధి చెందుతుందని, ఇది 2030 నాటికి రూ. 9–10 లక్షల కోట్లకు చేరుతుందని స్విగ్గీ-బైన్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 5.5 లక్షల కోట్లుగా ఉందని, ఏడాది ప్రాతిపదికన ఇప్పటి వరకు ఉన్న 8–9% వృద్ధితో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుందని నివేదిక పేర్కొంది. అంటే ఈ మార్కెట్లో ఉన్న కస్టమర్ బేస్ ప్రస్తుతం ఉన్న 33 కోట్ల నుంచి 2030 నాటికి 45 కోట్లకు చేరుతుంది.వేగంగా పెరుగుతున్న ఆన్లైన్ ఫుడ్ డెలివరీమొత్తం మార్కెట్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వృద్ధి గణనీయంగా పెరిగింది. 2019-2023 మధ్య కాలంలో ఇది 8% నుంచి 12%కి పెరిగింది. ఇది 18% రెట్టింపు వార్షిక వృద్ధి రేటుతో దాదాపు రూ. 2 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. 2030 నాటికి మొత్తం ఫుడ్ సర్వీస్ మార్కెట్లో 20% ఉన్న ‘ఈటింగ్ అవుట్’ కంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు వేగంగా పెరుగుతున్నాయి.స్థూల ఆర్థిక పరిస్థితుల్లో వస్తున్న మార్పులను ఈ నివేదిక ఉదహరించింది. వేగవంతమైన పట్టణీకరణ, జెనరేషన్ జెడ్ అంటే పాతికేళ్లలోపు యువత కొనుగోలు శక్తి పెరుగుదలతో సహా, బయటి ఫుడ్ తినే ప్రవృత్తి ఉన్నాయి. నెలకు సగటున ఐదుసార్లు బయట తినే భారతీయులు ఎక్కువగా బయటే తినే అమెరికా, చైనా వంటి దేశాలను అనుసరిస్తున్నారని నివేదిక పేర్కొంది. -
25 కోట్ల కుటుంబాలకు ఐటీసీ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఐటీసీ ఉత్పత్తులు దేశంలోని 25 కోట్లకు పైగా కుటుంబాలు వినియోగిస్తున్నాయి. తమ ఉత్పత్తులపై కస్టమర్ల వార్షిక వ్యయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 12 శాతం పెరిగి రూ.32,500 కోట్లకు చేరినట్టు ఐటీసీ ప్రకటించింది. కస్టమర్లు ఐటీసీ ఉత్పత్తుల కొనుగోలుకు వెచి్చంచే మొత్తం ఆధారంగా వార్షిక వ్యయాలను ఐటీసీ లెక్కిస్తుంటుంది. 25కు పైగా ప్రపంచస్థాయి భారత బ్రాండ్లు ఎఫ్ఎంసీజీలో భాగంగా ఉన్నాయని, ఇవన్నీ సొంతంగా అభివృద్ధి చేసినవేనని ఐటీసీ తన వార్షిక నివేదికలో తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఐటీసీ ఉత్పత్తులపై కస్టమర్ల వ్యయం రూ.29,000 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 23 కోట్లకు ఐటీసీ ఉత్పత్తులు చేరువ కాగా, గత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు కోట్ల కుటుంబాలకు చేరుకున్నట్టు సంస్థ తెలిపింది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ కింద బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, అగర్బత్తీలు, అగ్గిపెట్టెలు ఉన్నాయి. గడిచిన కొన్నేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు ఐటీసీ తెలిపింది. బ్రాండెడ్ గోధుమ పిండిలో ఆశీర్వాద్ అగ్రస్థానంలో ఉందని.. స్నాక్స్‌లో బింగో, క్రీమ్ బిస్కెట్లలో సన్‌ఫీస్ట్ ముందంజలో ఉన్నట్టు వివరించింది. అలాగే నోట్బుక్లలో క్లాస్మేట్, నూడుల్స్‌లో ఇప్పీ, బాడీవాష్లో ఫియామా, అగర్‌బత్తీల్లో మంగళ్‌దీప్ బ్రాండ్లు బలంగా ఉన్నట్టు తెలిపింది. సవాళ్లతో కూడిన వాతావారణంలో, తీవ్ర పోటీ పరిస్థితుల మధ్య కంపెనీ ఎఫ్ఎంసీజీ వ్యాపారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమ సగటు కంటే మెరుగ్గా ఉన్నట్టు వెల్లడించింది. వినియోగం పుంజుకుంటుంది.. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2024–25) అధిక వృద్ధి పథాన్ని కొనసాగిస్తుందని ఐటీసీ విశ్వాసం వ్యక్తం చేసింది. స్థిరమైన పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం పుంజుకోవడాన్ని గుర్తు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం కోలుకుంటున్నందున ఇవన్నీ సమీప కాలంలో వినియోగ డిమాండ్‌కు ఊతమిస్తాయని అంచనా వేసింది. సాధారణ వర్షపాతంతో రబీ సాగు మంచిగా ఉండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది. ‘‘భౌతిక, డిజిటల్ వసతుల విస్తరణకు, తయారీ రంగం పోటీతత్వాన్ని ఇతోధికం చేసేందుకు, ప్రత్యక్ష/పరోక్ష, ఆర్థిక రంగ సంస్కరణలు, వ్యాపార సులభతర నిర్వహణకు కేంద్ర సర్కారు తీసుకున్న చర్యలు రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థను బలంగా ముందుకు నడిపిస్తాయని ఐటీసీ తన నివేదికలో అంచనా వేసింది. ‘‘మూలధన వ్యయాల పెంపు, మౌలిక వసతులపై దృష్టి సారించడం దేశీయ తయారీని నడిపిస్తాయి. వ్యవసాయ సంబంధిత పథకాలు రైతులకు మేలు చేస్తాయి. తద్వారా గ్రామీణ వినియోగ డిమాండ్ పుంజుకుంటుంది. ఇది పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను ఇతోధికం చేస్తుంది’’ అని అంచనా వేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు చర్యలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానత చర్యలు వ్యవసాయరంగ పోటీతత్వాన్ని బలోపేతం చేసేందుకు కీలకమని అభిప్రాయపడింది. -
అమెరికా మత స్వేచ్ఛ రిపోర్టు.. రిజెక్ట్ చేసిన భారత్
న్యూఢిల్లీ: అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ రిపోర్టు 2023 పూర్తిగా పక్షపాతవైఖరితో కూడినదని భారత్ విమర్శించింది. ఈ నివేదికను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ శుక్రవారం(జూన్28) ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. భారత్‌లో సామాజిక కూర్పును అర్థం చేసుకోకుండా కేవలం ఓట్‌బ్యాంకు పాలిటిక్స్ ఆధారంగా తయారు చేసిన నివేదికలా అది కనిపిస్తోందన్నారు. ‘రిపోర్టులో చాలా పొరపాట్లున్నాయి. ఎంపిక చేసుకున్న అంశాలను వారికి కావల్సిన చోట కావల్సినట్లుగా అన్వయించుకున్నారు. పక్షపాత వైఖరితో తయారు చేశారు. రాజ్యాంగ నిబంధనలను చట్టాలకు కూడా తమకు కావల్సినట్లుగా భాష్యం చెప్పారు’అని జైస్వాల్ తెలిపారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరు కొనసాగిస్తోంది. జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. జూన్ క్వార్టర్లో హైదరాబాద్ మార్కెట్లో 15,085 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడుపోయిన ఇళ్లు 13,565 యూనిట్లతో పోల్చి చూస్తే 11 శాతం వృద్ధి కనిపించింది. కానీ, ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికం అమ్మకాలు 19,660 యూనిట్లతో పోల్చి చూసినప్పుడు 23 శాతం క్షీణత నెలకొంది. ఇక దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చినప్పుడు 5 శాతం పెరిగి 1,20,340 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో విక్రయాలు 1,30,170 యూనిట్లతో పోల్చిచూస్తే 8 శాతం తగ్గాయి. ‘‘క్రితం త్రైమాసికంలో అధిక విక్రయాల బేస్ ఏర్పడినప్పడు తర్వాతి త్రైమాసికంలో అమ్మకాలు తగ్గడం సాధారణమే. అంతేకాదు ఈ స్థాయిలో విక్రయాలు తగ్గడానికి గడిచిన ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిపోయిన ప్రాపర్టీ ధరల ప్రభావం కూడా కారణమే. దీంతో కొంత మంది ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గేలా చేసింది’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు పెరగ్గా, చెన్నై, కోల్‌కతాలో తగ్గాయి. మార్చి త్రైమాసికంతో పోల్చిచూస్తే ఒక్క ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోనే అమ్మకాలు అధికంగా నమోదయ్యాయి.పట్టణాల వారీగా.. » ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో జూన్ త్రైమాసికంలో 16,550 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు ఒక శాతం పెరగ్గా, మార్చి త్రైమాసికం నుంచి ఆరు శాతం వృద్ధి చెందాయి. » ఎంఎంఆర్‌లో 9 శాతం వృద్ధితో 41,540 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. » బెంగళూరులో 16,360 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే 9 శాతం అధికంగా నమోదయ్యాయి. » పుణె మార్కెట్లోనూ 2 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 21,145 యూనిట్లుగా ఉన్నాయి. » చెన్నైలో 5,020 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికం గణాంకాలతో పోల్చి చూస్తే 9 శాతం తక్కువ. » కోల్‌కతాలో 20 క్షీణతతో ఇళ్ల అమ్మకాలు 4,640 యూనిట్లకు పరిమితమయ్యాయి.ఆల్‌టైమ్ గరిష్టానికి డిమాండ్ ఇళ్లకు డిమాండ్ అసాధారణ స్థాయిలో ఉన్నట్టు డీఎల్ఎఫ్ హోమ్స్ జాయింట్ ఎండీ, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాశ్ ఓహ్రి తెలిపారు. ముఖ్యంగా కరోనా తర్వాత గడిచిన రెండేళ్లలో డిమాండ్ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరినట్టు చెప్పారు. ‘‘ఇంటి యాజమాన్యం విషయంలో ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన నిర్మాణాత్మక మార్పు ఇది. ఒక స్థలాన్ని కలిగి ఉండడం పట్ల విలువ ఇంతకముందెన్నడూ లేని స్థాయికి చేరింది. ఇల్లు వినియోగానికే కాకుండా, ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా అవతరించింది. ముఖ్యంగా లగ్జరీ ఇళ్లపై రాబడులు పెట్టుబడుల డిమాండ్‌ను పెంచింది’’అని ఆకాశ్ ఓహ్రి వివరించారు. -
ధని‘కుల’ దేశం.. 85 శాతం బిలియనీర్లు వాళ్లే!!
భారత్‌లో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగాయని వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ తాజా నివేదికలో పేర్కొంది. దేశంలోని బిలియనీర్ సంపదలో దాదాపు 90 శాతం అగ్రకులాల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు తేలింది.'ట్యాక్స్ జస్టిస్ అండ్ వెల్త్ రీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా' పేరుతో రూపొందించిన ఈ నివేదికలో సంపద పంపిణీకి సంబంధించిన అంశాలను వివరించారు. దేశంలోని బిలియనీర్ల సంపదలో 88.4 శాతం అగ్రకులాల మధ్య కేంద్రీకృతమై ఉందని నివేదిక డేటా వివరణాత్మక విశ్లేషణను అందిస్తోంది. అత్యంత అణగారిన వర్గాలలో షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీలు) సంపన్న భారతీయులలో ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం.ఈ అసమానత బిలియనీర్ సంపదను మించి విస్తరించింది. 2018-19 ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే (ఏఐడీఐఎస్) ప్రకారం జాతీయ సంపదలో అగ్రవర్ణాల వాటా దాదాపు 55 శాతం. సంపద యాజమాన్యంలోని ఈ స్పష్టమైన వ్యత్యాసం భారతదేశ కుల వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన ఆర్థిక అసమానతలను నొక్కిచెబుతోంది.స్వాతంత్య్రానంతరం క్షీణించిన దేశ ఆదాయం, సంపద అసమానతలు 1980వ దశకంలో పెరగడం ప్రారంభమయ్యాయి. 2000వ దశకం నుంచి మరింత ఉచ్ఛ స్థాయికి పెరిగాయి. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సంపద కేంద్రీకరణ పరంగా అసమానతలు శిఖరాగ్రానికి పెరగడం గమనార్హం. ముఖ్యంగా టాప్ 1 శాతం జనాభా దేశంలోని మొత్తం సంపదలో 40 శాతానికి పైగా నియంత్రిస్తున్నారు. ఇది 1980లో ఉన్న 12.5 శాతం కంటే పెరిగింది. మొత్తం ప్రీట్యాక్స్ ఆదాయంలో 22.6 శాతం వీరు సంపాదిస్తున్నారు. ఇది 1980లో ఇది 7.3 శాతంగా ఉండేది. -
గిరిజన మహిళల ఆరోగ్యంపై నివేదిక
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల మహిళల సమస్యలపై 2024–2025 యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జాతీయ మహిళా కమిషన్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమహిళా కమిషన్ నివేదిక సమర్పించింది. మహిళల సంక్షేమం, భద్రత, ప్రభుత్వ విధానాలు, మహిళా కమిషన్ల కార్యాచరణపై జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హరియాణలో నిర్వహించిన రెండ్రోజుల జాతీయస్థాయి సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల నుంచి మహిళా కమిషన్ చైర్ పర్సన్లు, సభ్యులు హాజరైన ఈ జాతీయస్థాయి సమావేశంలో ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి నివేదికను సమర్పించారు.ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంత మహిళల హక్కులు, అక్షరాస్యత, ఆరోగ్యం, ఆర్ధిక, సామాజిక అవగాహన కార్యక్రమాలు, అనాదిగా కొనసాగుతున్న అనాగరిక ఆచార పద్ధతులపై పలు అంశాలను ఆ నివేదికలో వివరించారు. వెంకటలక్ష్మి మాట్లాడుతూ వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని మాతంగి, బసివిని, జోగిని వంటి అనాగరిక ఆచారాలతో తలెత్తే సమస్యలే పెద్ద సవాల్‌గా మారాయన్నారు. ఈ నివేదికపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ స్పందిస్తూ ఒక్క ఏపీలోనే కాకుండా అన్ని రాష్ట్రాల గిరిజన ప్రాంతాల్లో మహిళా కమిషన్ల సందర్శనతో పాటు అక్కడ మహిళా సమస్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇందుకు జాతీయ మహిళా కమిషన్ తరఫున కొంత నిధిని కేటాయించి రాష్ట్ర కమిషన్లతో ఉమ్మడి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేస్తామని తీర్మానం చేశారు. పనిప్రాంతం (వర్క్‌ప్లేస్)లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం–2013 కింద ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని చైర్పర్సన్ రేఖా శర్మ అన్ని రాష్ట్రాల మహిళా కమిషన్ల చైర్ పర్సన్లకు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. కమిషన్ కార్యదర్శి విద్యాపురపు వసంత బాల పాల్గొన్నారు. -
ఎగిరిపోతున్న సంపన్నులు! ఎక్కువగా ఆ దేశానికే..
భారత్ నుంచి ఏటా వేల సంఖ్యలో మిలియనీర్లు విదేశాలకు తరలిపోతున్నారు. ఈ ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్‌ను వీడే అవకాశం ఉందని, వీరిలో ఎక్కువ మంది యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారని అంతర్జాతీయ పెట్టుబడుల వలస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్టనర్స్ తాజా నివేదిక వెల్లడించింది.గత ఏడాది ఇదే నివేదిక ప్రకారం 5,100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ మిలియనీర్ల వలసల విషయంలో చైనా, యూకే తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉంటుందని అంచనా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఇప్పుడు చైనాను అధిగమించగా, భారతీయ నికర మిలియనీర్లు చైనా కంటే 30 శాతం కంటే తక్కువ.కొత్త మిలియనీర్లుభారత్ ప్రతి సంవత్సరం వేలాది మంది మిలియనీర్లను కోల్పోతున్నప్పటికీ దానికంటే ఎక్కువ సంఖ్యలో కొత్త సంపన్నులను తయారు చేస్తూనే ఉందని నివేదిక పేర్కొంది. గత దశాబ్దంలో దేశంలో 85 శాతం సంపద పెరిగినట్లు వెల్లడించింది. ఇలా వెళ్తున్న మిలియనీర్లలో చాలా మంది భారత్‌లో వ్యాపార ప్రయోజనాలు, ఇళ్లను కలిగి ఉన్నారని నివేదిక ఎత్తి చూపింది. ఇది కొనసాగుతున్న ఆర్థిక సంబంధాలను సూచిస్తుంది.2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,28,000 మంది మిలియనీర్లు వలసలు వెళ్తారని భావిస్తున్నారు. వీరికి యూఏఈ, యూఎస్ఏ ఇష్టమైన గమ్యస్థానాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. భద్రత, ఆర్థిక పరిగణనలు, పన్ను ప్రయోజనాలు, పదవీ విరమణ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అనుకూలమైన జీవనశైలి, పిల్లలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, మొత్తం జీవన నాణ్యతతో సహా వివిధ కారణాల వల్ల సంపన్న కుటుంబాలు వలస వెళ్తున్నాయి. -
రాష్ట్రంలో ‘రబీ’ నష్టం రూ. 320 కోట్లు
అనంతపురం అగ్రికల్చర్/కర్నూలు(అగ్రికల్చర్): గత రబీ సీజన్ (2023–24)లో కరువు పరిస్థితుల కారణంగా గత ప్రభుత్వం ఆరు జిల్లాల పరిధిలో ప్రకటించిన 87 కరువు మండలాల్లో రూ. 320 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రకృతి విపత్తుల విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఆరి్థకసాయం అందజేయాలంటూ.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ)కు సమగ్ర కరువు నివేదిక అందజేశారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో రాష్ట్రస్థాయిలో రబీ నష్టంపై సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ నేతృత్వంలో ఈ సమీక్ష జరిగింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ రితే‹Ùచౌహాన్ నేతృత్వంలో ఆరుగురు కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. మరో నలుగురితో కూడిన కేంద్ర బృందం నెల్లూరు నుంచి వర్చువల్ పద్ధతిలో సమీక్షలో పాల్గొన్నారు. అలాగే ఆర్.కూర్మనాథ్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.నాగరాజు, గ్రౌండ్ వాటర్ ఏడీ విశ్వేశ్వరరావు, జేడీఏ జగ్గారావు, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీరు ఎం.బ్రహ్మాజీ, పశుశాఖ జేడీ జెడ్.ఈశ్వర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ కమిషనర్ శివప్రసాద్‌తో కూడిన రాష్ట్ర స్థాయి బృందం సభ్యులు కూడా సమీక్షకు హాజరయ్యారు. 24 రకాల పంటలకు దెబ్బ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో గత రబీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర బృందానికి రాష్ట్ర, జిల్లా అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 14 మండలాలు, శ్రీసత్యసాయి జిల్లాలో ఒకటి, కర్నూలు జిల్లాలో 18, నంద్యాలలో 13, ప్రకాశంలో 31, నెల్లూరులో 10... మొత్తంగా ఆరు జిల్లాల పరిధిలో 87 మండలాలు కరువు జాబితాలో ప్రకటించినట్లు తెలిపారు. ఆరు జిల్లాల పరిధిలో 2.53 లక్షల హెక్టార్లలో 24 రకాల పంటలు దెబ్బతినడంతో రూ.1,207 కోట్లు విలువ చేసే 2.93 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు కోల్పోయినట్లు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం ఒక్కో రైతుకు రెండు హెక్టార్లకు ఆరి్థకసాయం అందించడానికి వీలుగా 2.38 లక్షల మంది రైతులకు రూ. 228.03 కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ రూపంలో అందించాలని కోరారు. పంటనష్టం కాకుండా ఉద్యానశాఖ, పశుశాఖ, ఉపాధిహామీ, గ్రామీణ, పట్టణ తాగునీటి సరఫరా తదితర వాటికి మరో రూ. 91.74 కోట్లు... మొత్తంగా రూ.319.77 కోట్లు కరువు సాయం అందించాలని కోరుతూ సమగ్ర కరువు నివేదికను కేంద్ర బృందానికి అందించారు. ఇక్కడే ఆరు జిల్లాల పరిధిలో జరిగిన పంటనష్టం గురించి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనంతరం ఒక బృందం శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు, మరొక బృందం కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనకు వెళ్లాయి.నగరడోణ, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణంతోనే కరువు నివారణ కర్నూలు జిల్లాలో కరువును శాశ్వతంగా నిర్మూలించాలంటే ప్రధానంగా నగరడోణ రిజర్వాయర్, వేదవతినదిపై ప్రాజెక్టు నిర్మించాలని, ఈ మేరకు కేంద్రానికి నివేదించాలని రైతులు, రైతు సంఘాల నేతలు ఐఎంసీటీ ప్రతినిధులను కోరారు. కేంద్ర బృందం బుధవారం కర్నూలు కలెక్టరేట్లో రబీ కరువును ప్రతిబింబించే ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. శనగ, జొన్న రైతులతో ముఖాముఖి మాట్లాడి కరువు తీవ్రతను తెలుసుకున్నారు. 2023–24 ఖరీఫ్, రబీల్లో వివిధ పంటల్లో పెట్టిన పెట్టుబడుల్లో 25 శాతం కూడా దక్కలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి పంటల బీమా పరిహారం చెల్లించాలని కోరారు. గురువారం జిల్లాల్లో కరువు పరిశీలన తర్వాత అన్ని బృందాలు విజయవాడ చేరుకుంటాయని అధికారులు తెలిపారు. -
నో లెర్నింగ్.. నో అప్డేట్
సాక్షి, హైదరాబాద్: చేసే పనిలో అప్డేట్ కావాలంటే...తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. కొత్త విషయాలను నిరంతరం నేర్చుకోవాలి. కానీ తొంభైశాతం మంది భారత వృత్తి నిపుణులు అందుకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడం లేదు. కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత కమిట్మెంట్లు, బిజీ వర్క్‌షెడ్యూళ్లు తదితర కారణాలతో వెనుకడుగు వేస్తున్నట్టు స్పష్టమైంది. తాము పనిచేస్తున్న సంస్థలు, కంపెనీల యాజమాన్యాలు వివిధ రూపాల్లో నైపుణ్యాలు పెంచేందుకు సానుకూల దృక్పథంతోనే ఉన్నా, దీనికి సంబంధించి తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడంలో దేశంలోని దాదాపు 80 శాతందాకా వృత్తి నిపుణులు విఫలమవుతున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇతర రూపాల్లోని ప్రతిబంధకాలు అధిగమించి కొత్తవి నేర్చుకునే విషయంలో అత్యధికుల అనాసక్తి కనబరుస్తున్నారు. 2030 సంవత్సరం నాటికల్లా ప్రపంచస్థాయిలోనే కాకుండా భారత్‌లోనూ ప్రస్తుతమున్న ఉద్యోగాలు, బాధ్యతలు, విధుల స్వరూపం 64 శాతం మేర మారిపోయే అవకాశాలున్నాయని నిపుణులు, కంపెనీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృత్తినిపుణులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను తప్పనిసరిగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త విషయాలు నేర్చుకోవడం, చేసే పని పద్ధతులు, విధానాల్లో మార్పులపై అధిక దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా నెట్వర్కింగ్ సంస్థ ‘లింక్డ్ ఇన్’ విడుదల చేసిన నివేదికలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. వెనుకబాటుకు కారణాలు.. వృత్తి నిపుణులు కొత్త విషయాలు నేర్చుకోవడం, నైపుణ్యాలు పెంచుకోవడంలో వెనుకబాటుకు పలు కారణాలు నివేదికలో పొందుపరిచారు. 34 శాతం మంది కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగతంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు 29 శాతం మంది చేస్తున్న పనిలో బిజీ వర్క్ షెడ్యూ ల్26 శాతం మంది నేర్చుకునేందుకు వనరులు, విధానాలు లెక్కకు మించి ఉండడంతో ఏదీ తేల్చుకోలేకపోవడంఈ పరిస్థితిని అధిగమించాలంటే ‘లౌడ్ లెర్నింగ్’» పని ప్రదేశాల్లో లేదా ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో అక్కడే మౌఖికంగా లేదా ఇతర కొత్త విషయాలను అర్థమయ్యేలా చేయగలిగితే అధిక ప్రయోజనం ఉంటుందన్నారు. » తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ విధానం తమకు ఉపయోగపడుతుందని 81 శాతం మంది చెప్పారు. » ఈ విధానంలో నిమగ్నమై కొత్త విషయాలను నేర్చుకుంటున్నవారు 64 శాతం ఉన్నట్టుగా నివేదిక చెబుతోంది.» ‘లౌడ్ లెర్నింగ్’లో భాగంగా తమ టీమ్ సభ్యుల నుంచి మెళకువలు నేర్చుకోవచ్చునని 40 శాతం మంది చెప్పగా, 35 శాతంమంది తాము నేర్చుకునే విషయాలకు సంబంధించి టీమ్ సభ్యులకు వివరించడం ద్వారా అంటున్నారు. » అనుభవజ్ఞులైన వృత్తినిపుణుల గైడెన్స్‌లో నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా 28 శాతం మంది తమ కెరీర్లో ముందుకెళ్లేందుకు దోహదపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. » నైపుణ్యాల మెరుగుదలతో కొత్త వృత్తుల్లో అవకాశాలు లభిస్తాయని 27 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. » తమతో పనిచేస్తున్న వృత్తినిపుణులు, ఉద్యోగుల అనుభవసారం, ఆయా అంశాలపై వారికున్న విషయ దృష్టిని గ్రహించడం ద్వారా ప్రయోజనం చేకూరుతోందంటున్న 26 శాతం మంది చెప్పారు. -
Budget 2024: పన్నుల తగ్గింపు యోచనలో ప్రభుత్వం!
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొన్ని వర్గాల ప్రజలకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక నివేదికలో తెలిపింది.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఆర్థిక సంవత్సరానికి పూర్తి కేంద్ర బడ్జెట్‌ను వచ్చే జులై నెలలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను రేట్లను ప్రకటించే అవకాశం ఉంది. వ్యక్తిగత పన్ను తగ్గింపు వల్ల ఆర్థిక వ్యవస్థలో వినియోగం పెరుగుతుందని, మధ్యతరగతికి పొదుపు పెరుగుతుందని నివేదిక పేర్కొంది.వార్షికాదాయం రూ.15 లక్షలు కంటే ఎక్కువ పొందేవారు పన్ను ఉపశమనం పొందే కేటగిరీలో ఉన్నారని, అత్యధిక పన్ను పరిమితి ఆదాయం ఎంత ఉండాలన్నది ఇంకా నిర్ణయించలేదని నివేదిక తెలిపింది. రూ.10 లక్షల వార్షికాదాయానికి ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని, పాత పన్ను విధానంలో అత్యధికంగా 30 శాతం పన్ను విధించే ఆదాయానికి కొత్త పరిమితిపై చర్చిస్తున్నట్లు నివేదిక తెలిపింది.2020లో ప్రారంభించిన పన్ను విధానంలో ప్రభుత్వం మార్పులు చేయవచ్చు. దీని ప్రకారం.. రూ .15 లక్షల వరకు వార్షిక ఆదాయంపై 5 శాతం నుంచి 20 శాతం పన్ను, రూ .15 లక్షలకు పైగా ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నారు. ఒక వ్యక్తి ఆదాయం రూ .3 లక్షల నుంచి రూ .15 లక్షలకు ఐదు రెట్లు పెరిగినప్పుడు ఆదాయపు పన్ను రేటు మాత్రం ఆరు రెట్లు పెరుగుతుంది. ఇది చాలా తీవ్రమైనదంటూ నివేదిక పేర్కొంది. -
వృద్ధాప్యం బరువై.. ఆదరణ కరువై..
సాక్షి, హైదరాబాద్: పండుటాకులకు ఎంత కష్టం.. జీవనయానం ఎంత దయనీయం.. మలిసంధ్య వేళ వెలుగురేఖల్లేక అంధకారం అలముకుంది. వృద్ధాప్యం బరువైంది.. ఆదరణ కరువైంది. వృద్ధులను నిరాదరణ, నిర్లక్ష్యం ఆవరించాయి. అనువైన జీవనం కోసం ఎక్కువ శాతం మంది వృద్ధులు సంరక్షకులపై ఆధారపడాల్సి వస్తోందని హెల్ప్‌ఏజ్ ఇండియా నివేదిక వెల్లడించింది. హెల్ప్ ఏజ్ ఇండియా ఈ ఏడాది జాతీయ నివేదిక విడుదల చేసింది. పది రాష్ట్రాల్లో 20 ముఖ్యమైన టైర్ 1, 2 నగరాల్లో 5,169 వృద్ధులు, 1,333 వృద్ధుల సంరక్షకులు, కుటుంబసభ్యులపై అధ్యయనం చేసింది. ఈ సర్వేలో భాగంగా పలు కీలక ఆరి్థక, ఆరోగ్య, ప్రాథమిక సంరక్షణ విషయాలు వెలుగుచూశాయి. ప్రతి ముగ్గురు వృద్ధుల్లో ఒకరు ఆరి్థక సమస్యల్లో ఉన్నారు. వృద్ధుల్లో ఎలాంటి ఆదాయంలేని పురుషులు 27 శాతం, మహిళలు 38 శాతం ఉన్నారు. 32 శాతం వృద్ధులు రూ.50 వేల కంటే తక్కువ వార్షిక ఆదా యం కలిగి ఉన్నారు. 29 శాతం వృద్ధులు మా త్రమే సామాజిక భద్రతా పథకాలైన వృద్ధాప్య పెన్షన్/కాంట్రిబ్యూటరీ పెన్షన్/ప్రావిడెంట్ ఫండ్లను పొందుతున్నారని సర్వే వెల్లడించింది. నిరక్షరాస్యులైన వృద్ధులు (40 శాతం) ఎలాంటి ఆదాయ వనరులు లేక అవస్థలు పడుతున్నారు. 54 శాతం మందికి వ్యాధులు 52 శాతం వృద్ధులు ఆరోగ్యపరంగా నిత్యం ఏదో ఒక ప్రాథమిక సవాలును ఎదుర్కొంటున్నారు. 54 శాతం మంది రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నారు. 31 శాతం మంది వృద్ధులు మాత్రమే ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్, ఈఎస్ఐ–సీజీహెచ్ఎస్ వంటి ఆరోగ్య బీమాలను కలిగి ఉంగా, 3 శాతం మంది మాత్రమే కమర్షియల్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లు నివేదించారు. ఆరోగ్య బీమా లేకపోవడానికి ప్రధాన కారణాలుగా అవగాహన లేకపోవడం(32%), ఆరి్థక స్థోమత లేకపోవడం (24%), దాని అవసరం లేకపోవడం (12%) అని గుర్తించారు. 1.5 శాతం మంది మాత్రమే టెలీ–హెల్త్ సేవలను ఉపయోగించారు. 79 శాతం మంది వృద్ధులు ప్రభుత్వ ఆసుపత్రులు/క్లినిక్‌లు/పీహెచ్‌సీలను సందర్శించారు. 80 ఏళ్లు పైబడిన 47 శాతం మందికి ఆసుపత్రులకు వెళ్లడానికి వ్యక్తిగత ఆదాయం లేక అవస్థలను ఎదుర్కొంటున్నారని హెల్ప్‌ఏజ్ ఇండియా పాలసీ రీసెర్చ్ అండ్ అడ్వకేసీ హెడ్ అనుపమ దత్తా వెల్లడించారు. నిరక్షరాస్యులపట్ల నిర్లక్ష్యం వృద్ధులు నిర్లక్ష్యానికి గురికావడంలో కుమారులు 42 శాతం, కోడళ్లు 28 శాతం కారణంగా ఉన్నారు. నిర్లక్ష్యం ఎదుర్కొన్నవారిలో అత్యధికులు నిరక్షరాస్యులు కాగా, వృద్ధుల ఆదాయం తగ్గడంతో వారిపై నిర్లక్ష్యం పెరిగిందని 73 శాతం బాధితులు నివేదించారు. ఈ బాధితులు (94 శాతం మంది) కనీసం ఒక దీర్ఘకాలిక వ్యాధికి గురికావడం వల్ల కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారని వెల్లడైంది. నిర్లక్ష్యానికి గురైన బాధితులు.. వారిని దూషించడం, కొట్టడం వంటి చర్యలను తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేయగా, పరిష్కారం లభించలేదని కుమిలిపోతున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు చాలా అత్యల్పమని హెల్ప్‌ఏజ్ ఇండియా సీఈఓ రోహిత్ ప్రసాద్ పేర్కొన్నారు. మంచాన పడినప్పుడువృద్ధుల సంరక్షణలో కుటుంబసభ్యులు ప్రాథమిక పాత్ర పోషించారని సర్వే తెలిపింది. వృద్ధులు మంచాన పడినప్పుడు వారి జీవిత భాగస్వామి లేదా పిల్లలు చూసుకున్నారని, 68 శాతం మంది సంరక్షకులు వారికి బాసటగా నిలిచామని తెలిపారు. సగటున వారంలో దాదాపు 20 గంటలు వారి సేవలకే అంకితం చేశామని సంరక్షకులు తెలిపారు. అయితే సంరక్షణలో భాగంగా 10 శాతం మంది మాత్రమే సమీపంలో వృద్ధాశ్రమం, డే కేర్ సెంటర్లు, పాలియేటివ్ కేర్(ఉపశమన సేవలు) వినియోగించుకున్నారని వెల్లడైంది. జెరియాట్రిక్ హెల్త్‌కేర్ సౌకర్యాలను 15 శాతం మంది మాత్రమే అందించారు. -
అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్!.. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో సహా వచ్చే మూడేళ్లలో 6.7 శాతం స్థిరమైన వృద్ధిని నమోదు చేయడం ద్వారా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇండియా ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని వరల్డ్ బ్యాంకు మంగళవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది.భారత్ 2023-24 ఆర్థిక సంవత్సరం వృద్ధి 8.2 శాతానికి చేరుకుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. ఇది జనవరిలో నిపుణులు అంచనా వేసినదానికంటే 1.9 శాతం ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. 2025-26లో 2.7 శాతానికి చేరుకునే ముందు 2024లో వృద్ధి 2.6 శాతం వద్ద స్థిరంగా ఉంటుందని పేర్కొంది.భారతదేశంలో ప్రాంతీయ వృద్ధి కూడా గణనీయంగా పెరుగుతోంది. బంగ్లాదేశ్‌లో వృద్ధి పటిష్టంగా ఉంటుంది. అయితే పాకిస్తాన్, శ్రీలంకలు నెమ్మదిగా బలపడే సూచనలు ఉన్నాయి. ఇండియా మాత్రమే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని వెల్లడించింది.వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం, ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల ప్రైవేట్ వినియోగ వృద్ధి ప్రయోజనం పొందుతుందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. జేడీపీకి సంబంధించి ప్రస్తుత వ్యయాన్ని తగ్గించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ వినియోగం నెమ్మదిగా మాత్రమే పెరుగుతుందని అంచనా వేశారు.ప్రపంచ ద్రవ్యోల్బణం 2024లో 3.5 శాతం.. 2025లో 2.9 శాతానికి మధ్యస్థంగా ఉంటుందని అంచనా వేశారు. ఈ క్షీణత కేవలం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత వేగంగా పుంజుకుంటుందని.. అయితే కేంద్ర బ్యాంకులు పాలసీ వడ్డీ రేట్లను తగ్గించడంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. -
2030 నాటికి జాబ్ మార్కెట్ షేక్.. కలవరపెడుతున్న రిపోర్ట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చే దశాబ్దంలో జాబ్ మార్కెట్లో గణనీయమైన మార్పులకు కారణమవుతుంది. మెకిన్సే నివేదిక ప్రకారం.. 2030 నాటికి సుమారు 1.2 కోట్ల వృత్తిపరమైన పరివర్తనలకు దారితీస్తుంది. ఇది కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కనిపించిన ఉద్యోగ మార్పులతో పోల్చదగిన వేగం.మెకిన్సే సీనియర్ పార్ట్నర్, దాని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ క్వైలిన్ ఎలిన్‌గ్రుడ్ ఇటీవల జరిగిన మీడియా డే సందర్భంగా ఈ విషయాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పురోగతి కారణంగా కొన్ని రంగాలు ముఖ్యంగా హెల్త్ కేర్, స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) రంగాలు వృద్ధిని చవిచూస్తాయని భావిస్తున్నారు.ప్రభావితమయ్యే రంగాలు ఇవే..ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావిత ఉద్యోగ మార్పులు ప్రధానంగా నాలుగు ప్రధాన విభాగాలలో కేంద్రీకృతమై ఉంటాయి. అవి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్, కస్టమర్ సర్వీస్ అండ్ సేల్స్, ఫుడ్ సర్వీస్ అండ్ ప్రొడక్షన్, మ్యాన్యుఫ్యాక్చరింగ్. ఈ విభాగాల్లో పునరావృత పనులు, డేటా కలెక్షన్, ప్రాథమిక డేటా ప్రాసెసింగ్ నిర్వహించే వారిపై మార్పు ప్రభావం ఉంటుందని ఎల్లిన్గ్రుడ్ పేర్కొన్నారు. ఈ విధులు ఆటోమేషన్‌కు ప్రధాన లక్ష్యమని, వీటిని ఏఐ సమర్థవంతంగా నిర్వహించగలదని ఆమె చెబుతున్నారు. 2030 నాటికి డిమాండ్ తగ్గుతున్న ఉద్యోగాల్లోని సుమారు 1.18 కోట్ల మంది కొత్త పనులకు మారాల్సి ఉంటుందని మెకిన్సే నివేదిక అంచనా వేసింది.ఈ మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఎలిన్‌గ్రుడ్ ఎత్తిచూపారు. అభివృద్ధి చెందుతున్న జాబ్ ల్యాండ్ స్కేప్ గురించి తెలుసుకోవడం, ఆటోమేషన్ కు తక్కువ అవకాశం ఉన్న నైపుణ్యాలను పెంపొందించుకోవడం వ్యక్తులకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మానవ సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను యంత్రాలు భర్తీ చేయలేవు. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆమె సూచిస్తున్నారు. -
రుచిగా ఉంటే తినేయడమే!
సాక్షి, అమరావతి: భారతీయుల ఆహార అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ప్రపంచానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేసిన వేద భూమి.. అనారోగ్యకర వంటకాల వైపు పరుగులు పెడుతోంది. దేశంలో 38 శాతం మంది వేయించిన, ప్రాసెస్ చేసిన పదార్థాలను అధికంగా ఆరగించేస్తున్నారు. కేవలం 28 శాతం మంది మాత్రమే ఆరోగ్యకరమైన పిండి ప్రధాన ఆహారం, కూరగాయలు, పండు, పప్పు, గింజ, మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. దేశ జనాభాలో 16.6 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్పీఆర్ఐ) తాజాగా ప్రపంచ దేశాల్లోని ఆహార అలవాట్లపై సర్వే చేసి విడుదల చేసిన ‘గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్టు–2024’ పేర్కొంది. భారతదేశంలో ఆహారపు అలవాట్లపై ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహారంతో పోలిస్తే అనారోగ్యకరమైన ఆహార వినియోగంలో గణనీయమైన పెరుగుదల నమోదైందని పేర్కొంది. కూరగాయలు, పండ్లు, ఇతర సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే వారితో పోలిస్తే భారతదేశంలో ఎక్కువ మంది ఉప్పు లేదా వేయించిన స్నాక్స్ వంటి అనారోగ్యకరమైన ఆహారాన్నే ఇష్టపడుతున్నారని ప్రకటించింది. ప్రపంచంలో పెరుగుతున్న పోషకాహార లోపం చాలా దేశాలు రెట్టింపు పోషకాహార లోప భారాన్ని ఎదుర్కొంటున్నాయని గ్లోబల్ ఫుడ్ పాలసీ నివేదిక నొక్కి చెప్పింది. ఆఫ్రికా, దక్షిణాసియాలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని.. రెండు బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలపై చేసిన పరిశోధన ద్వారా అంచనా వేసింది. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో సగానికి పైగా, వయోజన మహిళల్లో మూడింట రెండొంతుల మంది సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నట్టు ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తేల్చింది. భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దక్షిణాసియా దేశాల్లో పోషకాహార లోపంతో అధిక బరువు, ఊబకాయంతో పాటు సంబంధిత నాన్ కమ్యూనల్ డిసీజెస్ (ఎన్సీడీ) ప్రాబల్యం పెరుగుతున్నట్టు వెల్లడించింది. దక్షిణాసియాలో సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు ఖరీదైనవి కాగా.. ధాన్యాలు, కొవ్వులు, నూనె, చక్కెర, స్వీట్ అండ్ సాల్ట్ ఉండే చిరుతిళ్లు చౌకగా లభిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. దాంతో ప్రజలు ఈ తరహా ఆహార వినియోగంపై మక్కువ చూపుతున్నట్టు తేల్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల ప్రకారం ప్యాకేజ్డ్ ఫుడ్‌పై అందించిన సమాచారం కూడా ప్రజలు పట్టించుకోవడం లేదని హెచ్చరించింది. సంస్థ అందించిన 17 ఆహార మార్గదర్శకాలలో సమాచారం, ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక చేయడానికి ఆహార లేబుల్స్‌పై సమాచారాన్ని చదవమని ఐసీఎంఆర్ వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు, అ్రల్టా–ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగాన్ని తగ్గించాలని కూడా సూచించింది. రోజువారీగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే సమీప భవిష్యత్‌లో అనారోగ్య భారతదేశాన్ని చూడాల్సి ఉంటుందని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో హెచ్చరించింది. నాలుగేళ్లలో ప్యాకేజ్డ్ ఫుడ్ వినియోగం రెట్టింపు నిత్యం తీసుకుంటున్న ఆహారంలో అధిక కేలరీలు గలవి, తక్కువ పోషకాలు గలవి ఎక్కువగా ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా కూరగాయలు, ఇతర సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాల వినియోగం తగ్గిపోతున్నట్టు కూడా హెచ్చరించింది. భారతదేశం, ఇతర దక్షిణాసియా దేశాల్లో ప్రాసెస్ చేసిన ఆహారాలు (చాక్లెట్లు, చక్కెర మిఠాయిలు, ఉప్పగా ఉండే స్నాక్స్, పానీయాలు, రెడీమేడ్ ఫుడ్) వినియోగం పెరుగుతోంది. ఆహార బడ్జెట్లో ఎక్కువ భాగం ప్యాకేజ్డ్ పాలు, స్నాక్స్ రెడీమేడ్ ఫుడ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తేల్చింది. భారతదేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు పెరుగుతున్నట్టు నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పెద్దవారిలో అధిక బరువు పెరుగుదల 2006లో 12.9 శాతం నుంచి 2016 నాటికి 16.4 శాతానికి పెరిగింది. పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది పోషకాహార లోపంతో బాధపడే వారు 2011లో 15.4 శాతం ఉంటే.. 2021 నాటికి 16.6 శాతానికి పెరిగింది. జనాభాలో దాదాపు 17 శాతం మందికి జీవించేందుకు అవసరమైన ఆహారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటికి దూరంగా ఉంటున్నవారు ఆహారం, గృహావసరాల కోసం చేస్తున్న వార్షిక ఖర్చు 2015లో రూ.619 బిలియన్స్ ఉంటే, 2019లో అది రూ.820 బిలియన్లకు పెరిగింది. అంటే నాలుగేళ్లలో రూ.201 బిలియన్ల మేర పెరిగింది. అలాగే గృహ ఆహార బడ్జెట్లో ప్యాకేజ్డ్ (అత్యధికంగా ప్రాసెస్ చేసిన, అత్యధిక క్యాలరీలు ఉండేవి) ఆహార పదార్థాల వాటా 6.5 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. అంటే నాలుగేళ్లలో దాదాపు రెండింతలు పెరిగింది. సంపన్న కుటుంబాలు తమ ఆహార బడ్జెట్లో ఎక్కువ భాగం ప్రాసెస్ ఫుడ్‌పైనే ఖర్చు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. -
విదేశాలకే వి‘హారం’
సాక్షి, అమరావతి: భారతీయులు విదేశీయానాల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. 2019తో పోలిస్తే జపాన్‌లో 53 శాతం, అమెరికాలో 59 శాతం, వియత్నాంలో 248 శాతం భారతీయ ప్రయాణికులు రాకపోకలు పెరగడం విశేషం. మాస్టర్ కార్డ్ ఎకనామిక్స్ ఇన్స్టిట్యూట్ ‘బ్రేకింగ్ బౌండరీస్’ పేరుతో తాజా ట్రావెల్ ట్రెండ్స్‌ను విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులు అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఆదాయాన్ని మెరుగు పరచుకోవడంతో విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులు సంఖ్య ట్రావెల్, టూరిజం రంగానికి ఊతమిస్తోందని నివేదిక పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల మందికిపైగా మధ్య తరగతి ప్రజలు (ఏడాదికి రూ.12 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారు). దాదాపు 20 లక్షల మంది అధిక ఆదాయ ప్రజలు (ఏటా రూ.66 లక్షలు కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు) కూడా అంతర్జాతీయ ప్రయాణికుల జాబితాలో చేరతారని అంచనా వేసింది. విస్తరిస్తున్న విలాసవంతమైన ఆలోచనలు ఔట్ బౌండ్ ఇండియా ట్రావెల్ రంగాన్ని అసాధారణ వృద్ధిలోకి తీసుకెళ్తున్నాయని అభిప్రాయపడింది. తొలి త్రైమాసికంలో 10 కోట్ల మంది ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే సుమారు 10 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక దశాబ్దం కిందటి వరకు ఈ సంఖ్యలో ప్రయాణాలు చేయాలంటే ఏడాది సమయం పట్టేది. అంటే భారతీయుల్లో ఏ స్థాయిలో ప్రయాణాలు వృద్ధి చెందాయో నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి దేశీయ ప్రయాణాలు 21శాతం, విదేశీ ప్రయాణాలు 4 శాతం మేర పెరిగినట్టు గుర్తించింది. ఆమ్స్టర్డామ్, సింగపూర్, లండన్, ఫ్రాంక్‌ఫర్డ్, మెల్‌బోర్న్‌లు ఈ వేసవి (జూన్–ఆగస్టు)లో భారతీయ ప్రయాణికులు సందర్శించే ఐదు ట్రెండింగ్ గమ్యస్థానాలుగా నిలవడం విశేషం. 2019, 2020లో ఒక పర్యటన సగటు వ్యవధి నాలుగు రోజులుగా ఉంటే ఈ ఏడాది ఐదు రోజులకు పెరిగింది. పెరిగిన క్రూయిజ్ ప్రయాణాలు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యూరోపియన్ చాంపియన్íÙప్ కారణంగా 2024లో జర్మనీలోని మ్యూనిచ్ టాప్ ట్రెండింగ్ డెస్టినేషన్‌గా నిలిచింది. గత మార్చికి ముందు 12 నెలల్లో ప్రజలు అత్యధికంగా ప్రయాణించిన గమ్యస్థానంగా జపాన్ నిలిచింది. ముఖ్యంగా ఐదు మార్కెట్లలో నాలుగు యూరోపియన్ గమ్యస్థానాలు, టాప్ 10లో 50 శాతం ఆసియా–పసిఫిక్ గమ్యస్థానాలు ఉన్నాయి. గడిచిన ఏడాది అత్యధికంగా ప్రయాణికులను ఆకర్షించిన గమ్యస్థానాల్లో జపాన్, ఐర్లాండ్, రొమేనియా, ఇటలీ, స్పెయిన్, మలేషియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, యూఏఈ, ఇండోనేషియా నిలిచాయి. అయితే విదేశీ సందర్శకుల రికవరీలో అమెరికా 2019తో పోలిస్తే 6 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. హోటల్ పరిశ్రమలలో నిరంతరం ధరల పెరుగుదల కారణంగా క్రూయిజ్ ప్రయాణాలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్ క్రూయిజ్ ప్యాసింజర్ లావాదేవీల సంఖ్య 2019 కంటే దాదాపు 16 శాతం పెరిగాయి. -
వన సంపదకు పెద్ద ఆపద!
సాక్షి, అమరావతి: ప్రకృతికి మనిషి హాని తలపెడుతున్నాడు. తద్వారా తన ఉనికిని తానే దెబ్బతీసుకుంటున్నాడు. జంతుజాలాన్ని బతకనివ్వడం లేదు. మనిషి స్వార్థం వృక్షజాలాన్నీ వదలడం లేదు. తత్ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వృక్షజాలమూ బోసిపోతోంది. అక్రమ వ్యాపారుల దుశ్చర్యలకు పర్యావరణం సమతౌల్యాన్ని కోల్పోతోంది. 2015–2021 మధ్య కాలంలో 162 దేశాల్లో యథేచ్ఛగా జంతు, వృక్షజాతుల అక్రమ వాణిజ్యం జరిగినట్టు ఐక్యరాజ్య సమితి నివేదిక చెబుతోంది. దాదాపు 4 వేలకు పైగా జంతు, వృక్షజాతులు నిత్యం అక్రమ రవాణాలో పట్టుబడుతున్నట్టు ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్–2024లో పేర్కొంది. వీటిల్లో సుమారు 3,250 రకాలు అంతరించిపోతున్న జాతుల్లో ఉండటం కలవరపెడుతోంది. ఫ్యాషన్ ఉత్పత్తులు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువుల తయారీ, ఔషధాల కోసం చట్ట విరుద్ధంగా అడవుల్లోని జీవజాలాన్ని మట్టుబెడుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఖడ్గమృగం, దేవదారు వృక్షాలు అక్రమ వ్యాపారానికి ఎక్కువగా అంతరించిపోయినట్లు తేల్చింది. బ్లాక్ మార్కెట్లో ఖడ్గమృగం కొమ్ము 29 శాతం డిమాండ్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పాంగోలిన్ స్కేల్స్ 28 శాతం, ఏనుగు దంతాలు 15 శాతంగా ఉన్నాయి. అక్రమ రవాణాకు తెగటారిపోతున్న జంతు, వృక్షజాలం అక్రమ వ్యాపారానికి బలవుతున్న జంతు జాతుల్లో ఏనుగులు (6 శాతం), ఈల్స్ (5 శాతం), మొసళ్లు (5 శాతం), చిలుకలు, కాకాటూలు (2 శాతం), సింహాలు, పులుల వంటి ఇతర మాంసాహార జంతువులు (2 శాతం), తాబేళ్లు (2 శాతం), పాములు (2 శాతం), సీహార్స్ చేపలు (2 శాతం) ఉన్నాయి. అక్రమ రవాణాలో ధూపం, పరిమళ ద్రవ్యాలు, కలప, ఔషధాల వినియోగానికి దేవదారు, మహోగని, హోలీ వుడ్, గుయాకం వృక్ష జాతులు యథేచ్ఛగా నరికి వేస్తున్నారు. మార్కెట్లో వీటి వాటా 47 శాతంగా ఉంది. ఇంకా రోజ్‌వుడ్ 35 శాతం, ఔషధ మొక్కలు అగర్వుడ్ , రామిన్, యూకలిప్టస్ 13 శాతంగా ఉన్నాయి. సముద్ర జీవులకు ఆవాసాన్ని కల్పించడంతో పాటు తీరప్రాంతాన్ని కోత నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించే పగడపు దిబ్బలనూ అక్రమ వ్యాపారులు తొలిచేస్తున్నారు. అక్రమ రవాణాలో ఈ పగడాల వాటా 16 శాతంగా ఉంటోంది. గత దశాబ్దంలో ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ముల వేట తగ్గినట్టు నివేదిక చెబుతోంది. మార్కెట్లోనూ ధరలు క్షీణించినట్టు తెలిపింది. కరోనా కాలంగా చైనా మార్కెట్లు మూసివేయడంతో ఇది జరిగి ఉండవచ్చని భావిస్తోంది. దేశ సరిహద్దుల్లో అక్రమ రవాణా గుర్తింపు భారత్‌లోనూ విమానాశ్రయాలు, ఓడరేవులు, దేశ సరిహద్దు రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్లలో ఎక్కువగా వన్యప్రాణుల అక్రమ రవాణాను గుర్తించారు. స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్టు 2022–23 ప్రకారం 1,652 క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచర జాతులను స్వా«దీనం చేసుకున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పేర్కొంది. వీటిల్లో 40 శాతానికి పైగా అత్యంత ప్రమాదంలో ఉన్న జాతులుగా పేర్కొంది. సజీవంగా ఉన్న జంతువులు ముఖ్యంగా పెంపుడు జంతువులకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతున్నందుకు దేశంలో అక్రమ వ్యాపారం పెరిగినట్టు వన్య ప్రాణుల నేర నియంత్రణ నిపుణులు చెబుతున్నారు. -
AP: అంతా ప్రీ ప్లాన్డ్‌గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
సాక్షి, విజయవాడ: ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 150 పేజీల ప్రాథమిక నివేదికను సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి అందజేశారు. సిట్ ప్రాథమిక నివేదికలో పోలీసుల వైఫల్యాలు బయటపడ్డాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేపట్టింది. నాలుగు బృందాలుగా మూడు జిల్లాల్లో పర్యటించిన సిట్.. 33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలను పరిశీలించింది.ఈ అల్లర్లలో 1370 మంది నిందితులకు 124 మందినే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 639 మంది నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉందని సిట్ పేర్కొంది. 1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్.. దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది.రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్.. రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొంది. ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తించింది. దాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదిక పేర్కొంది.ఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకు కారణంగా సిట్ నివేదికలో వెల్లడించింది. పరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సూచించిన సిట్.. కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలని పేర్కొంది. సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించారు.