ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే మృతిపై ఇరాన్ ఆధ్యాత్మిక నేత, సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. హనియే మృతికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. అయితే తాజాగా ఆయన ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలని ఇరాన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని ముగ్గురు ఇరానియన్ అధికారులు, రెవల్యూషనరీ గార్డ్స్‌లోని ఇద్దరు సభ్యులు నిర్ధారించినట్లు సమాచారం.
ఇప్పటికే ఇరాన్ సైనిక కమాండర్లు ఇజ్రాయెల్, హైఫా సరిసరాల్లో సైనిక లక్ష్యాలపై డ్రోన్లు, క్షిపణలతో దాడి చేయడానికి పరిశీలిస్తున్నాని ఇరాన్ అధికారలు పేర్కొన్నారు. అయితే పౌరులపై టార్గెట్ చేయకుండా సైనిక లక్ష్యాలపై దాడి చేయనున్నట్లు తెలిపారు. ఇరాన్ సైన్యం.. యెమెన్, సిరియా, ఇరాక్‌తో సహా మిత్రరాజ్యాల సైనిక బలగాలతో కలిసికట్టుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని పరిశీలిస్తోందని అధికారులు పేర్కొన్నారు.
హనియే మృతికి ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ బుధవారం బహిరంగంగా హెచ్చరించారు. అది తమ పవిత్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ‘‘మా ప్రియతమ అతిథిని మా నేలపైనే ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంది. తద్వారా తనకు తానే మరణశాసనం రాసుకుంది’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందన తీవ్రంగానే ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే అయతొల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌పై దాడికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్‌లో సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడికి ప్రతికారంగా ఇరాన్.. వందల కొద్దీ క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించి మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment