భారత్‌లో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగాయని వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ తాజా నివేదికలో పేర్కొంది. దేశంలోని బిలియనీర్ సంపదలో దాదాపు 90 శాతం అగ్రకులాల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు తేలింది.
'ట్యాక్స్ జస్టిస్ అండ్ వెల్త్ రీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా' పేరుతో రూపొందించిన ఈ నివేదికలో సంపద పంపిణీకి సంబంధించిన అంశాలను వివరించారు. దేశంలోని బిలియనీర్ల సంపదలో 88.4 శాతం అగ్రకులాల మధ్య కేంద్రీకృతమై ఉందని నివేదిక డేటా వివరణాత్మక విశ్లేషణను అందిస్తోంది. అత్యంత అణగారిన వర్గాలలో షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీలు) సంపన్న భారతీయులలో ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం.
ఈ అసమానత బిలియనీర్ సంపదను మించి విస్తరించింది. 2018-19 ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వే (ఏఐడీఐఎస్) ప్రకారం జాతీయ సంపదలో అగ్రవర్ణాల వాటా దాదాపు 55 శాతం. సంపద యాజమాన్యంలోని ఈ స్పష్టమైన వ్యత్యాసం భారతదేశ కుల వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన ఆర్థిక అసమానతలను నొక్కిచెబుతోంది.
స్వాతంత్య్రానంతరం క్షీణించిన దేశ ఆదాయం, సంపద అసమానతలు 1980వ దశకంలో పెరగడం ప్రారంభమయ్యాయి. 2000వ దశకం నుంచి మరింత ఉచ్ఛ స్థాయికి పెరిగాయి. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సంపద కేంద్రీకరణ పరంగా అసమానతలు శిఖరాగ్రానికి పెరగడం గమనార్హం. ముఖ్యంగా టాప్ 1 శాతం జనాభా దేశంలోని మొత్తం సంపదలో 40 శాతానికి పైగా నియంత్రిస్తున్నారు. ఇది 1980లో ఉన్న 12.5 శాతం కంటే పెరిగింది. మొత్తం ప్రీట్యాక్స్ ఆదాయంలో 22.6 శాతం వీరు సంపాదిస్తున్నారు. ఇది 1980లో ఇది 7.3 శాతంగా ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment