
ప్రతీకాత్మక చిత్రం
ప్రయాణికుల భద్రతే తనకు ముఖ్యమని భావించిన ఆయన.. ఛాతీలో నొప్పిని ఓర్చుకుంటూ..
ఖమ్మం: జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ కన్నుమూశాడు. సత్తుపల్లి నుంచి ఖమ్మం బయల్దేరిన బస్సులో డ్రైవర్ శ్రీనివాసరావుకు ఛాతీలో నొప్పి వచ్చింది. అయితే ఆయన ఆలస్యం చేయలేదు.
ప్రయాణికులతో ఉన్న ఆ బస్సును వెంటనే పక్కకు ఆపారు. ఆపై దగ్గరిలోని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గుండెపోటుతోనే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావు స్వస్థలం వేంసూరు మండలం రామన్నపాలెంగా తెలుస్తోంది.