
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr), ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు హైకోర్టు ఊరట దక్కింది. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దాఖలైన కేసును హైకోర్టు కొట్టివేసింది.
అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా బాణసంచా కాల్చి ప్రజలకు ఇబ్బంది కలిగించారంటూ ఫిర్యాదులందాయి. ఆ ఫిర్యాదులపై
కేటీఆర్,ముఠా గోపాల్‌పై ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని హైకోర్టులో బీఆర్‌ఎస్ నేతలు పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ కేసును కొట్టివేశారు.