
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు.
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తిగా జరిగే వరకు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అందులో చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు విడుదల విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటన చేసింది. ఎస్సీలకు మరోసారి అన్యాయం జరుగుతుంది’’ అని లేఖలో మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
‘‘ఇంతకుముందు 11 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేయడం వలన మేము ఎన్ని పోస్టులు నష్టపోయామో మీకు తెలుసు. దయ చేసి ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు అన్ని పోటీ పరీక్షలను నిలిపివేయండి’’ అంటూ లేఖలో మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.